నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.
మేకర్స్ బిగ్ ప్లాన్..
పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.
దంగల్‌పైనే గురి..
'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.
అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.
హిందీలో భారీ రికార్డులు..
అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.
ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..
పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు.
#Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥
Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥
Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025
Comments
Please login to add a commentAdd a comment