version
-
పుష్ప-2 రీ లోడ్ వర్షన్.. మేకర్స్ బిగ్ అప్డేట్
నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా ఏమాత్రం తగ్గట్లేదు. ఇప్పటికే రూ.1831 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించిన పుష్ప-2 మరో రెండు వేల కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో అమిర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దంగల్ వసూళ్లపై కన్నేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే దంగల్ రికార్డ్‌ను క్రాస్ చేయనుంది.మేకర్స్ బిగ్ ప్లాన్..పుష్ప-2 ఫ్యాన్స్‌కు ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. త్వరలోనే రీ లోడెడ్ వర్షన్ థియేటర్లలో విడుదల ప్రకటించారు. ఈనెల 17 నుంచి పుష్ప రీ లోడెడ్ థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దాదాపు 25 సెకన్ల పాటు ఉండే రీ లోడ్ వర్షన్ గ్లింప్స్ ప్రోమో రిలీజ్ చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి. దంగల్‌పైనే గురి..'పుష్ప 2' (Pushpa 2 The Rule) ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా సాధించిన భారతీయ చిత్రాల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. అదే టాలీవుడ్ సినిమా లిస్ట్‌లో అయితే ప్రథమ స్థానం. ఇండియన్ బాక్సాఫీస్ టాప్ కలెక్షన్ల పరంగా ఇప్పటి వరకు 'దంగల్' (రూ. 2,070 కోట్లు), 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సాధించి వరుస స్థానాల్లో ఉన్నాయి.అయితే ఇప్పటికే పుష్ప2 (Pushpa 2: The Rule) ప్రపంచవ్యాప్తంగా రూ.1831 కోట్లు (గ్రాస్) రాబట్టి కలెక్షన్స్ పరంగా రెండో స్థానంలో చేరిపోయింది. మరో రూ. 200 కోట్ల కలెక్షన్స్ వస్తే దంగల్ (Dangal) రికార్డ్ బద్దలవుతుంది. ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప2 నిలుస్తుంది. ఇప్పటి వరకు దంగల్ రికార్డ్‌ను ఏ మూవీ అధిగమించలేకపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టే ఛాన్స్ పుష్ప-2 మాత్రమే ఉంది.హిందీలో భారీ రికార్డులు..అల్లు అర్జున్ పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది. కేృవలం 32 రోజుల్లోనే భారతీయసినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికే 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. జనవరి 17 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ వస్తుందని చెప్పడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో అయితే గతంలో ఎప్పుడు లేని రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో పాన్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది.ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ రికార్డ్..పుష్ప-2 విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు నుంచే వసూళ్ల సునామీ సృష్టించింది. పుష్పరాజ్ కలెక్షన్స్ చూసి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు. తొలి రోజు నుంచే ఇండియాలో ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయికగా నటించంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతమందించారు. మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ మరోసారి అభిమానులను మెప్పించారు. #Pushpa2Reloaded storms into theatres on JAN 17th! 🔥Here’s the GLIMPSE to ignite your excitement! ❤️🔥Telugu - https://t.co/5N7M2xgZTU#Pushpa2 #WildFirePushpa #Pushpa2TheRule pic.twitter.com/4M4KcZYmL2— Mythri Movie Makers (@MythriOfficial) January 12, 2025 -
అల్లు అర్జున్ పుష్ప-2.. ఆడియన్స్‌కు గుడ్ న్యూస్!
అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.అయితే తాజాగా బన్నీ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది పుష్ప టీమ్. పుష్ప-2 3డీ వర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయం కేవలం హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని థియేటర్లలో 3డీ వర్షన్ తీసుకొస్తామని ప్రకటించింది. ఇంకేందుక ఆలస్యం.. 3డీ వర్షన్లో పుష్ప-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. Add another dimension to the WILDFIRE on the big screens 🤩Watch #Pushpa2TheRule (Telugu) in 3D at select screens in Hyderabad. It is going be an epic experience 😎Many more 3D shows being added all across the country.Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/UHK4TLknCk— Pushpa (@PushpaMovie) December 15, 2024 -
పుష్ప-2 మూవీ.. విడుదలకు ముందు బిగ్ షాక్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్. -
'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్ పోలీస్.. అది కూడా మరాఠీ వెర్షన్లో
Pune Police Sings Pushpa Srivalli Song In Marathi Version: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్ అంతకుమించి రెస్పాన్స్ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాగా హైలెట్ అయిన పాటల్లో 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్ ఒకటి. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్ రాసి స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ట్రాఫిక్ పోలీస్ పేరు అతీశ్ ఖరాడే. వృత్తిపరంగా అతీశ్ ట్రాఫిక్ పోలీస్ అయినా తనలో మంచి గాయకున్నాడని ఈ సాంగ్ చూస్తే అర్థమవుతుంది. ఓవైపు విధులు నిర్వర్తిస్తూ మరోవైపు గాయకుడిగా తానేంటో నిరూపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన హిట్ సాంగ్స్‌ను పాడుతూ తన ఏకే పోలీస్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రీవల్లి పాటను మరాఠీ వెర్షన్లో పాడి సూపర్‌గా ఆకట్టుకుంటున్నాడు. ఇదీ చదవండి: 'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు -
వోల్వో ‘వీ90 క్రాస్ కంట్రీ’ కొత్త వెర్షన్
ధర రూ. 60 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘వోల్వో ఆటో ఇండియా’ తాజాగా తన క్రాస్ఓవర్ మోడల్ ‘వీ90 క్రాస్ కంట్రీ’లో కొత్త వెర్షన్‌ను బుధవారం భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.60 లక్షలు. ఇందులో ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్, 8 స్పీడ్ గేర్‌బాక్స్ సహా రాడార్ ఆధారిత భద్రతా ఫీచర్లైన లేన్ కీపింగ్–ఎయిడ్, ఫుల్ ఆటో–బ్రేకింగ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. -
కొత్తగా ముస్తాబైన ఆల్టో 800
న్యూఢిల్లీ: చవకగా, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న కారు అంటే అందరికీ గుర్తొచ్చేది ఆల్టో 800. ఇపుడు ఈ కారు కొత్తగా ముస్తాబై కారు ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. మరోసారి దాదాపు 3 లక్షల లోపు కారును అందుబాటులోకి తీసుకొస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అవును..ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో 800 అప్ గ్రేడేడ్ వెర్షన్ బుధవారం విడుదల చేసింది. ఆల్టో 800కు మెరుగులు దిద్దుతూ కొత్త వెర్షన్‌ని ఢిల్లీలో రిలీజ్ చేఇంది. దీని ప్రారంభ ధరను రూ.2.49 లక్షలుగా పేర్కొంది. ఈ కొత్త ఆల్టో 800 అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలచింది. దీంతోపాటుగా వెలుపలి భాగాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, కేబిన్‌లో మరింత స్థలాన్ని కేటాయించింది. పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లలో మొత్తం ఆరు రంగుల్లోఅందుబాటులో ఉంటుందని తెలిపింది. మేలైజీని 10 శాతం మెరుగుపర్చినట్టు పేర్కొంది. సీఎన్జీ ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) వేరియంట్ ధర (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.3.70 లక్షలు, ఎయిర్ బ్యాగ్ ఉన్న సీఎన్జీ కారును 3.76 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. 796సీసీ సామర్ధ్యంతో మూడు సిలెండర్ల ఉన్న పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ దీని ప్రత్యేకతలు. పెట్రోల్ మోడల్ లీటరుకి 24.7 కి.మీ. మైలేజ్ ఇవ్వనుండగా, సీఎన్జీ రకం లీటరుకి 33.44 కి.మీ.మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. భద్రతాపరంగా చూస్తే. కారు వినియోగదారుల సౌలభ్యంకోసం అధునాతన రూపొందించామని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్పి ఒక ప్రకటనలో తెలిపారు. మెరుగైన డ్రైవింగ్ కోసం అద్భుతమైన మైలేజీకోసం తమ ఇంజనీర్లు ఇంజిన్ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారన్నారు. కాగా గత 12 ఏళ్లుగా దేశంలో టాప్ సెల్లింగ్ మోడల్ ఆల్టో 800. సుమారు 30 లక్షల కార్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన ఏకైక మోడల్ ఆల్టో .