Pushpa: Pune Police Sings Srivalli Song In Marathi Version, Video Viral - Sakshi
Sakshi News home page

Pushpa Srivalli Song: 'శ్రీవల్లి' పాట పాడిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అది కూడా మరాఠీ వెర్షన్‌లో

Published Sat, Jan 15 2022 7:43 PM | Last Updated on Sun, Jan 16 2022 9:03 AM

Pune Police Sings Pushpa Srivalli Song In Marathi Version - Sakshi

Pune Police Sings Pushpa Srivalli Song In Marathi Version: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. అలాగే జనవరి 7న ఓటీటీలో రిలీజైన పుష్పరాజ్‌ అంతకుమించి రెస్పాన్స్‌ తెచ్చుకున్నాడు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచాడు. ఈ సినిమాలో బన్నీ యాక్టింగ్‌తో పాటు పాటలు కూడా బాగా హైలైట్‌ అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగ్‌లు, పాటలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే సెలబ్రిటీలు, అభిమానులు సినిమా డైలాగ్‌లు, కవర్‌ సాంగ్స్‌తో వీడియోలు రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో బాగా హైలెట్‌ అయిన పాటల్లో 'చూపే బంగారమాయేనా శ్రీవల్లి' సాంగ్‌ ఒకటి. ఈ పాటకు యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ వచ్చాయి. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ ట్రాఫిక్‌ పోలీస్‌ మరాఠీ భాషలో 'శ్రీవల్లి' పాటకు లిరిక్స్‌ రాసి స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ ట్రాఫిక్ పోలీస్‌ పేరు అతీశ్ ఖరాడే. వృత్తిపరంగా అతీశ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అయినా తనలో మంచి గాయకున్నాడని ఈ సాంగ్‌ చూస్తే అర్థమవుతుంది. ఓవైపు విధులు నిర్వర్తిస్తూ మరోవైపు గాయకుడిగా తానేంటో నిరూపిస్తున్నాడు. ఇటీవల విడుదలైన హిట్‌ సాంగ్స్‌ను పాడుతూ తన ఏకే పోలీస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రీవల్లి పాటను మరాఠీ వెర్షన్‌లో పాడి సూపర్‌గా ఆకట్టుకుంటున్నాడు. 



ఇదీ చదవండి:  'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్‌ ఫిదా.. జాన్వీ కపూర్‌ ప్రశంసలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement