కొత్తగా ముస్తాబైన ఆల్టో 800
న్యూఢిల్లీ: చవకగా, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న కారు అంటే అందరికీ గుర్తొచ్చేది ఆల్టో 800. ఇపుడు ఈ కారు కొత్తగా ముస్తాబై కారు ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. మరోసారి దాదాపు 3 లక్షల లోపు కారును అందుబాటులోకి తీసుకొస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అవును..ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో 800 అప్ గ్రేడేడ్ వెర్షన్ బుధవారం విడుదల చేసింది. ఆల్టో 800కు మెరుగులు దిద్దుతూ కొత్త వెర్షన్‌ని ఢిల్లీలో రిలీజ్ చేఇంది. దీని ప్రారంభ ధరను రూ.2.49 లక్షలుగా పేర్కొంది. ఈ కొత్త ఆల్టో 800 అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలచింది. దీంతోపాటుగా వెలుపలి భాగాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, కేబిన్‌లో మరింత స్థలాన్ని కేటాయించింది. పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లలో మొత్తం ఆరు రంగుల్లోఅందుబాటులో ఉంటుందని తెలిపింది. మేలైజీని 10 శాతం మెరుగుపర్చినట్టు పేర్కొంది.
సీఎన్‌జీ ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) వేరియంట్ ధర (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.3.70 లక్షలు, ఎయిర్ బ్యాగ్ ఉన్న సీఎన్జీ కారును 3.76 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. 796సీసీ సామర్ధ్యంతో మూడు సిలెండర్ల ఉన్న పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ దీని ప్రత్యేకతలు. పెట్రోల్ మోడల్ లీటరుకి 24.7 కి.మీ. మైలేజ్ ఇవ్వనుండగా, సీఎన్‌జీ రకం లీటరుకి 33.44 కి.మీ.మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. భద్రతాపరంగా చూస్తే. కారు వినియోగదారుల సౌలభ్యంకోసం అధునాతన రూపొందించామని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్పి ఒక ప్రకటనలో తెలిపారు. మెరుగైన డ్రైవింగ్ కోసం అద్భుతమైన మైలేజీకోసం తమ ఇంజనీర్లు ఇంజిన్ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారన్నారు.
కాగా గత 12 ఏళ్లుగా దేశంలో టాప్ సెల్లింగ్ మోడల్ ఆల్టో 800. సుమారు 30 లక్షల కార్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన ఏకైక మోడల్ ఆల్టో .