New Car Launches in India in April 2023 - Sakshi
Sakshi News home page

ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు - మారుతి ఫ్రాంక్స్ నుంచి ఎంజీ కామెట్ ఈవీ వరకు..

Published Sat, Apr 1 2023 7:32 PM | Last Updated on Sat, Apr 1 2023 8:09 PM

New car launches in april 2023 details - Sakshi

కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో..

మారుతి సుజుకి ఫ్రాంక్స్:
2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది.

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్:
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది.

ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్‌పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్‌పై స్పాయిలర్‌ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

లంబోర్ఘిని ఉరస్ ఎస్:
ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఎంజి కామెట్ ఈవీ:
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్‌లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement