పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.
మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.
ఎంజీ విండ్సర్ ఈవీ
సెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.
త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్‌లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.
బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్
బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్‌లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment