Maruti Jimny Deliveries: మారుతి సుజుకి ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 5 డోర్ జిమ్నీ డెలివరీలు అప్పుడే మొదలయ్యాయి. విడుదలకు ముందే 30వేల బుకింగ్స్ పొందిన ఈ SUV కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నివేదికల ప్రకారం.. ఈ డెలివరీ పంజాబ్ ప్రాంతంలో జరిగినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఇందులో గ్రానైట్ గ్రే కలర్ జిమ్నీ డెలివరీలను చూడవచ్చు. కంపెనీ ఈ కారుకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే దేశ వ్యాప్తంగా డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
వీడియోలో గమనించినట్లయితే మారుతి జిమ్నీ బుక్ చేసుకున్న కస్టమర్ ఫ్యామిలీ మొత్తం డీలర్‌షిప్‌లో కనిపిస్తారు. కారుని డెలివరీ చేసుకోవడానికంటే ముందు కేక్ కట్ చేయడం వంటివి కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే మోడల్ జిమ్నీ ఎండ్ జీటా వేరియంట్ అని తెలుస్తోంది. మారుతి జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).
డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడగానే చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇందులో నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ టైర్ వంటి వాటితో పాటు 195/80 సెక్షన్ టైర్‌లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవన్నీ మారుతి జిమ్నీ SUV ని మరింత హుందాగా చూపించడంలో సహాయపడతాయి.
మారుతి జిమ్నీ ఆటోమాటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి. ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి, ప్యాసింజర్ వైపు డ్యాష్‌బోర్డ్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్, ఫాక్స్ ఎక్స్‌పోజ్డ్ బోల్ట్‌లతో చాలా కఠినమైనదిగా కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ)
మారుతి సుజుకి ఈ కారుని కేవలం భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. కావున జిమ్నీ త్వరలోనే ఖండాంతరాలు దాటడానికి సిద్దమవుతోంది. ఈ ఆఫ్-రోడర్ 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment