2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ SUV భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకాకముందే 13,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. కంపెనీ గతంలో ఈ కారు డిజైన్, ఫీచర్స్ గురించి వెల్లడించింది, అయితే తాజాగా ఇప్పుడు మైలేజ్ గురించి ప్రస్తావించింది.
ఇంజిన్ ఆప్షన్స్:
మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందనుంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇవి రెండూ వరుసగా 88.5 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ & 98.6 బిహెచ్‌పి పవర్, 147.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ పొందుతాయి.
మైలేజ్:
మారుతి ఫ్రాంక్స్ 1.2 పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 21.79 కిలోమీటర్స్/లీటర్ మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో 1.0 టర్బో పెట్రోల్ మ్యాన్యువల్ 21.5 కిమీ/లీ & ఆటోమాటిక్ వేరియంట్ 20.01 కిమీ/లీ మైలేజ్ అందిస్తాయి.
(ఇదీ చదవండి: నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు)
డిజైన్ & ఫీచర్స్:
మారుతి ఫ్రాంక్స్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్ కలిగి, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ పొందుతాయి. సైడ్ ప్రొఫైల్ లో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక వైపు వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ కూడా ఉంటుంది.
ఈ కొత్త SUV ప్రీమియం డ్యూయల్-టోన్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
అంచనా ధరలు & లాంచ్ డేట్:
మారుతి ఫ్రాంక్స్ ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది రూ. 8 లక్షల ప్రారంభ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. ఈ SUV ఈ నెల చివరి నాటికి మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మార్కెట్లో సిట్రోయెన్ C3, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment