refurbished
-
కొత్తగా మారిన పాత కార్లు..! (ఫొటోలు)
-
హెచ్‌పీ నుంచి రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: హెచ్‌పీ సంస్థ రీఫర్బిష్డ్ (మరమ్మతులు చేసి పునర్వినియోగానికి అనుకూలంగా మార్చిన) ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్టార్టప్‌లు, ఫ్రీలాన్సర్లు, విద్యార్థులు, సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థలకు అందుబాటు ధరలకే ల్యాప్‌టాప్‌లు అందించే లక్ష్యంతో వీటిని తీసుకొచి్చనట్టు తెలిపింది. హెచ్‌పీ ధ్రువీకృత భాగస్వాములు రీఫర్బిష్డ్ ల్యాప్‌టాప్‌లను రిటైల్ కస్టమర్లు, వ్యాపార సంస్థలకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. విక్రయానంతర సేవలను కూడా వారే అందిస్తారని తెలిపింది. -
పాత ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. బలమైన అంచనాలు.. దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. యాపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు. -
ఇండియా సిమెంట్స్ ఆధునీకరణ
చెన్నై: ప్రయివేట్ రంగ కంపెనీ ఇండియా సిమెంట్స్ పాత తయారీ ప్లాంట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తోంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ ఎన్.శ్రీనివాసన్ వెల్లడించారు. ఆధునీకరణ ప్రణాళికలకోసం రెండు అంతర్జాతీయ కన్సల్టెంట్ సంస్థలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం పాత సిమెంట్ ప్లాంట్ల సామర్థ్యాలను మెరుగుపరచేందుకు పూర్తిస్థాయిలో ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు 15–18 నెలల్లో రూ. 1,500–1,600 కోట్ల పెట్టుబడి వ్యయాల కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు. భూముల మానిటైజేషన్ ఇండియా సిమెంట్స్ చేతిలో 26,000 ఎకరాల భూమి ఉన్నదని, ల్యాండ్ బ్యాంక్‌ను మానిటైజ్ చేయడం ద్వారా నిధులను సమీకరించనున్నట్లు శ్రీనివాసన్ తెలియజేశారు. పాత ప్లాంట్ల ఆధునీకరణపై సలహాలకు క్రుప్ పాలిసియస్, ఎఫ్ఎల్ స్మిత్‌ను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని మల్కాపూర్, విష్ణుపురం ప్లాంట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభంకానున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తమిళానడులోని శంకరి, రాజస్తాన్‌లోని బన్సారాలోని ఆధునిక ప్లాంట్లను ఈ జాబితాలో చేర్చబోరని తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిలంకూర్, యర్రగుంట్ల, తమిళనాడులో శంకరనగర్, శంకరి, దలవాయ్లలోనూ కంపెనీకి సిమెంట్ తయారీ ప్లాంట్లున్నాయి. చెన్నై, మహారాష్ట్రలలో రెండు గ్రైండింగ్ యూనిట్లను సైతం కలిగి ఉంది. ఈ యూనిట్లు ఉమ్మడిగా మొత్తం 16 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్లాంట్లను రెండు దశాబ్దాల క్రితం సొంతం చేసుకుంది. క్యూ3లో రూ. 133 కోట్ల నికర లాభం ఇండియా సిమెంట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం భారీగా ఎగసి రూ. 133 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 16 కోట్లు మాత్రమే ఆర్జించింది. అనుబంధ సంస్థ స్ప్రింగ్‌వే మైనింగ్ ప్రయివేట్(ఎస్‌ఎంపీఎల్) విక్రయం ద్వారా నమోదైన ఆర్జన లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 10 శాతంపైగా వృద్ధితో రూ. 1,281 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 1,161 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,153 కోట్ల నుంచి రూ. 1,458 కోట్లకు పెరిగాయి. 2022 అక్టోబర్ 10న దాదాపు రూ. 477 కోట్లకు ఎస్‌ఎంపీఎల్ విక్రయాన్ని పూర్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఇండియా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలహీనపడి రూ. 191 వద్ద ముగిసింది. -
అయ్యో! టిమ్ కుక్..ఇక ఆ కథ ముగిసినట్టే!
న్యూఢిల్లీ: రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్‌హ్యాండ్ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్ చెక్ చెప్పింది. రిఫర్బిష్డ్ ఐఫోన్లను దిగుమతి చేసుకుని భారత్‌లో అమ్మేందుకు మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో భారత ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాదు ఇ-వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించిన ఆందోళనల కారణంగా సెకండ్‌హ్యాండ్ ఐఫోన్ల దిగుమతికి ఆపిల్ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిన నేపథ్యంలో ఇలాంటి ఐఫోన్లను విక్రయించే ప్రణాళికలను ఆపిల్ రద్దు చేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. (Tata Group: ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!) భారత్‌లో ఆపిల్ స్టోర్లు, సెకండ్‌హ్యాండ్ ఐఫోన్ల దిగుమతి విక్రయాల ద్వారా వినియోగదారులకు మరింత చేరువకావడంతోపాటు, ఇక్కడి అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విస్తరించాలనేది ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రణాళిక. ఈ క్రమంలో ఆపిల్ గత కొన్నేళ్లుగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను దిగుమతి,విక్రయాల అనుమతిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. తక్కువ ధరకే 'ప్రీ-ఓన్డ్, సర్టిఫైడ్ ఫోన్ల విక్రయం ద్వారా మార్కెట్ వాటాను విస్తరించుకునేందుక ప్రయత్నిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కథ ముగిసినట్టు తెలుస్తోంది. కానీ భారతదేశంలో స్థానిక తయారీపై ప్రదానంగా దృష్టి పెడుతోందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. అయితే ఈ వార్తలపై ఆపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ( Google Pixel 6a: ఫ్లిప్‌కార్ట్ సేల్, గూగుల్పిక్సెల్ ఫోన్‌పై భారీ తగ్గింపు) సెకండ్ హ్యాండ్ పరికరాల దిగుమతికి ఆపిల్‌ను అనుమతించడం అంటే ఇతర కంపెనీలు ఉపయోగించిన ఫోన్లను భారతదేశంలోకి డంపింగ్‌కు , తద్వారా భారీ ఇ-వ్యర్థాలకు దారితీయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తది అయినా, పాతదయినా ఐఫోన్ అప్‌గ్రేడ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్న నేపథ్యంలో పాత ఫోన్ విక్రయాలతో తన మార్కెట్ వాటాను విస్తరించాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుందని ఐడీసీ ప్రతినిధి నవకేందర్ సింగ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో స్థానికంగా గ్లోబల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ భాగస్వామ్యంతో ఐఫోన్లను తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాటా టాటా గ్రూపు విస్ట్రాన్‌తో చర్చలు జరపుతోంది. పరిశోధనా సంస్థ టెక్ఆర్క్ ప్రకారం, 2022లో దేశంలో దాదాపు 7 మిలియన్ల ఐఫోన్లు విక్రయించనుందని అంచనా. -
ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్..! రూ. 60 వేల విలువైన ఐఫోన్ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శాంసంగ్, గూగుల్, రెడ్మీ వంటి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిష్డ్ (Refurbished) స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరలకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ ధీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న పలు రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. యాపిల్ ఐఫోన్ 6ఎస్ రిఫర్బిష్డ్ గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ వేరియెంట్ కేవలం రూ. 10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 రిఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్ 7 రూ. 14,529 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 59, 999గా ఉంది. గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ 64జిబి ర్యామ్ గల రిఫర్బ్రిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ రూ. 13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పిక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ రూ. 10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి..లేకపోతే..! -
ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.30 వేల యాపిల్ ఐఫోన్ రూ.15 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్‌లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ సంస్థలకు చెందిన Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished యాపిల్ ఐఫోన్ గోల్డ్ కలర్ వేరియంట్ 64 జీబీ స్మార్ట్‌ఫోన్ కేవలం 10,899 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 7 Refurbished యాపిల్ ఐఫోన్ 7 128జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.15,499కు లభిస్తుంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్'ను కలిగి ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64 జీబీ ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డీ+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త.. వాటి లింక్ గడువు పొడిగింపు!) -
ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.50 వేల యాపిల్ ఐఫోన్ రూ.10 వేలకే..!
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ వంటి ప్రముఖ బ్రాండ్ల సెకండ్ హ్యాండ్ లేదా Refurbished స్మార్ట్ఫోన్లను ప్రత్యేక సేల్‌లో భాగంగా అమ్మకానికి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో మీకు నచ్చిన యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్మీ Refurbished స్మార్ట్ఫోన్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ప్రీమియం యాపిల్ ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఈ Refurbished స్మార్ట్ఫోన్లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్ఫోన్లు కొత్త మొబైల్స్ దీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ Refurbished గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ వేరియెంట్ కేవలం ₹10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది. యాపిల్ ఐఫోన్ 8 Refurbished యాపిల్ ఐఫోన్ 8 గోల్డ్ 64 జీబీ వేరియంట్ ₹17,999కు లభిస్తుంది. ఐఫోన్ 8లో 4.7 అంగుళాల డిస్ ప్లే, 12 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది ఏ11 బయోనిక్ ప్రాసెసర్ సహాయంతో పనిచేస్తుంది. Refurbished యాపిల్ ఐఫోన్ 7 ₹14,529కు అందుబాటులో ఉంది. ఇందులో ఏ10 ఫ్యూజన్ ప్రాసెసర్ ఉంది. గూగుల్ పీక్సెల్ 3 ఎక్స్ఎల్ 64జిబి ర్యామ్ గల సెకండ్ హ్యాండ్ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ ₹13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పీక్సెల్ 3ఏ కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ ₹10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది. (చదవండి: లబోదిబో! హైదరాబాద్‌లో ఇళ్లు అమ్ముడుపోని ప్రాంతాలివే!) -
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనేవారికి గుడ్‌న్యూస్..! డిస్కౌంట్స్‌తో పాటుగా ఇవి కూడా..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ రీకామర్స్ వ్యాపారంపై దృష్టిసారించింది. అందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ రీకామర్స్ సంస్థ యంత్రను కైవసం చేసుకుంది. యంత్రను కొనుగోలుచేసినట్లు ఫ్లిప్‌కార్ట్ జనవరి 13 న ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ డీల్ విలువను ఫ్లిప్‌కార్ట్ బహిర్గతం చేయలేదు. సమస్యలుంటే ఇకపై సులువు..! ఈ కొనుగోలుతో ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్, ఇతర గాడ్జెట్స్ కొనేవారికి ఎంతగానో ఉపయోగపడునుంది. ఫ్లిప్‌కార్ట్‌లోని కొనుగోలుచేసిన ఆయా స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా రిపేరింగ్ సమస్యలు తలెత్తితే యంత్ర ద్వారా సులువుగా పరిష్కారం కానుంది. దాంతో పాటుగా సదరు కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌ను యంత్రలో అమ్మేయడంతో మంచి డీల్‌ను అందించనుంది. రీకామర్స్లో యంత్ర ఫేమస్..! సెకండ్‌హ్యండ్ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో, ఆయా గాడ్జెట్స్ రిపేరింగ్ సర్వీసులను యంత్ర అందిస్తోంది. 2013లో జయంత్ ఝా, అంకిత్ సరాఫ్, అన్మోల్ గుప్తా యంత్రను స్ధాపించారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్స్ లాంటి సాంకేతిక ఉత్పత్తులను రిపేర్ చేసి విక్రయిస్తోంది. రిఫర్బ్రిష్డ్ అమ్మకాల్లో యంత్ర భారీ ఆదరణను పొందింది. చదవండి: స్విగ్గీ డెలివరీలు సరికొత్తగా..! ప్రణాళికలు సిద్ధం..! -
పాత వస్తువులు కొత్తగా.. ఫ్లిప్‌కార్ట్ న్యూ ప్లాట్‌ఫామ్
బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన అనంతరం.. పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్ అంతకముందు తాను దక్కించుకున్న ఈబే ఇండియాను మూసివేసింది. ఈబేను మూసివేసిన ఫ్లిప్‌కార్ట్.. రీఫర్బిష్డ్ గూడ్స్(పాతవాటినే మళ్లీ కొత్తగా మార్చిన వస్తువుల) కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరిచింది. అదే 2గుడ్. రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్లాట్‌ఫామ్. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో ఈ మార్కెట్ 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ ప్లాట్‌ఫామ్ తొలుత రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్ యాక్ససరీస్‌ను అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత హోమ్ అప్లియెన్స్‌కు కూడా దీన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్ లైవ్‌గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ 2గుడ్ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత 3 నెలల నుంచి 12 నెలల వారెంటీ ఇస్తుంది. మొబైల్ వెబ్ ద్వారా మాత్రమే తొలుత ఇది అందుబాటులో ఉంటుంది. కానీ తర్వాత తర్వాత డెస్క్‌టాప్ వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ యూజర్లకు కూడా చేరువ చేయాలని ఫ్లిప్‌కార్ట్ యోచిస్తోంది. ఈబే ఇండియాను మూసివేసే సమయంలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ గురించి ఆ కంపెనీ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ప్రస్తావించారు. ఈబే.ఇన్ నుంచి పలు విషయాలు బోధపడ్డాయని, అవే రీఫర్బిష్డ్ గూడ్స్ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌కు దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి ఈబే ఇండియా అధికారికంగా మూతపడింది. మార్కెట్ లీడర్‌గా.. ఫ్లిప్‌కార్ట్ మరింత షాపింగ్ అనుభవాన్ని అందించడానికే కృషిచేస్తుందన్నారు. రీఫర్బిష్డ్ గూడ్స్ మార్కెట్ విషయంలో ఉన్న నమ్మకపు లోపాన్ని తాము 2గుడ్ ద్వారా తొలగించనున్నామని పేర్కొన్నారు. సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేస్తామని కల్యాణ్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కమింగ్ బ్యాక్
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. బ్యాటరీ పేలుళ్లతో అమ్మకాలను నిలిపివేసిన రి ఫర్బిష్డ్ గెలాక్సీ నో్ట్ 7 అమ్మకాలను మొదలుపెట్టనున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఇతర రి ఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలతో కలిపి వీటిని కూడా విక్రయించనున్నట్టు తెలిపింది. అయితే పునరుద్ధరించిన ఈ స్మార్ట్ఫోన్లను ఎపుడు, ఏ యే దేశాల్లో విక్రయించాలనేది ఇంకా నిర్ణయించలేదని ఒక ప్రకటనలో తెలిపింది. లోకల్ డిమాండ్, రెగ్యులేటరీ అధికారులు, విక్రయదారులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మూడు మిలియన్ యూనిట్లను విక్రయించాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొంది. కాగా 2016 ఆగస్టులో లాంచ చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వైఫల్యం కారణంగా శాంసంగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ స్మార్ట్‌ఫోన లో అమర్చిన బ్యాటరీలు చార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయిన ఘటనలు నమోదు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు మిలియన్ల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. లిథియం అయాన్ బ్యాటరీ పేలుళ్ల కారణంగా 5.42 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. -
ఆ ఐఫోన్లు చవగ్గా..!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సెకండ్ హ్యాండ్ ఆపిల్ ఫోన్ల విక్రయాలకు మరోసారి తెరలేపింది. రీఫర్బిష్డ్ ఫోన్లను తమ అధికారిక వెబ్ సైట్ లో విక్రయానికి ఉంచినట్టు అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్స్‌తో పోలిస్తే 15 శాతం డిస్కౌంట్ ధరల్లో వీటిని ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు ఆపిల్ ప్రకటించింది. అన్‌లాక్ చేసిన, పునరుద్ధరించిన 6ఎస్, 6 ఎస్‌ప్లస్ లాంటి ఐఫోన్లను ఈ తగ్గింపు ధరల్లో ఫోన్ లవర్స్‌కు అందుబాటులో ఉంచింది. టెక్నాలజీ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం గోల్డ్ కలర్ 64జీబీ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఐఫోన్‌ను సుమారు రూ.39వేలకు ($589 డాలర్లు) , సిల్వర్ కలర్ 16GB 6ఎస్ ప్లస్ ఐఫోన్ రూ.35 వేలకు ($ 529) అందుబాటులో ఉంది. కొత్త బ్యాటరీ , కొత్త ఔటర్ షెల్ అమర్చి ఈ పునరుద్ధరించిన ఆపిల్ ఫోన్లకు ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.కాగా ఆపిల్ గతంలో సెకండ్ హ్యాండ్ మ్యాక్‌లు, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటి ఇతర ఆపిల్ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం తెలిసిందే. ఇలా 2007 లో చివరిసారిగా తన ఉత్పత్తులను విక్రయించింది. -
బయ్యారంలో మారిన సరిహద్దులు
బయ్యారం : నూతన జిల్లాల ఏర్పాటులో బయ్యారం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు బయ్యారం మండలానికి దక్షిణం వైపున వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, కొత్తగూడ మండలాలు సరిహద్దుగా ఉండేవి. ప్రస్తుతం బయ్యారం మండలం దక్షిణాన ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కలువగా తూర్పున ఉన్న ఇల్లెందు మండలం భద్రాద్రి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ప్రాంతాలు వేర్వురు జిల్లాల్లోకి వెళ్లాయి. మండలంలోని నామాలపాడు సమీపంతో పాటు పాఖాలకొత్తగూడ సరిహద్దులో ఉన్న మిర్యాలపెంట గ్రామం భద్రాద్రి జిల్లాకు హద్దుగా మారింది. గతంలో ఉప్పలపాడు పంచాయతీలోని లకీ‡్ష్మనర్సింహపురం గ్రామంలో రహదారికి తూర్పు వైపున ఉన్న ఇళ్లు ఖమ్మం జిల్లాలో ఉండగా దక్షిణం వైపున ఉన్న ఇళ్లు వరంగల్ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఆ గ్రామానికి జిల్లా సరిహద్దులు మారగా మండల హద్దులు మాత్రం అలానే ఉన్నాయి. బయ్యారం మండలం నూతన జిల్లాలోకి మారినప్పటికీ పాత సంప్రదాయం ప్రకారం ఇతర జిల్లాకు హద్దుగా మారడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు -
కొత్తగా ముస్తాబైన ఆల్టో 800
న్యూఢిల్లీ: చవకగా, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్న కారు అంటే అందరికీ గుర్తొచ్చేది ఆల్టో 800. ఇపుడు ఈ కారు కొత్తగా ముస్తాబై కారు ప్రియులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. మరోసారి దాదాపు 3 లక్షల లోపు కారును అందుబాటులోకి తీసుకొస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అవును..ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్టో 800 అప్ గ్రేడేడ్ వెర్షన్ బుధవారం విడుదల చేసింది. ఆల్టో 800కు మెరుగులు దిద్దుతూ కొత్త వెర్షన్‌ని ఢిల్లీలో రిలీజ్ చేఇంది. దీని ప్రారంభ ధరను రూ.2.49 లక్షలుగా పేర్కొంది. ఈ కొత్త ఆల్టో 800 అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలచింది. దీంతోపాటుగా వెలుపలి భాగాన్ని ఆకర్షణీయంగా రూపొందించి, కేబిన్‌లో మరింత స్థలాన్ని కేటాయించింది. పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లలో మొత్తం ఆరు రంగుల్లోఅందుబాటులో ఉంటుందని తెలిపింది. మేలైజీని 10 శాతం మెరుగుపర్చినట్టు పేర్కొంది. సీఎన్జీ ( కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) వేరియంట్ ధర (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.3.70 లక్షలు, ఎయిర్ బ్యాగ్ ఉన్న సీఎన్జీ కారును 3.76 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. 796సీసీ సామర్ధ్యంతో మూడు సిలెండర్ల ఉన్న పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ దీని ప్రత్యేకతలు. పెట్రోల్ మోడల్ లీటరుకి 24.7 కి.మీ. మైలేజ్ ఇవ్వనుండగా, సీఎన్జీ రకం లీటరుకి 33.44 కి.మీ.మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెప్పింది. భద్రతాపరంగా చూస్తే. కారు వినియోగదారుల సౌలభ్యంకోసం అధునాతన రూపొందించామని మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్పి ఒక ప్రకటనలో తెలిపారు. మెరుగైన డ్రైవింగ్ కోసం అద్భుతమైన మైలేజీకోసం తమ ఇంజనీర్లు ఇంజిన్ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారన్నారు. కాగా గత 12 ఏళ్లుగా దేశంలో టాప్ సెల్లింగ్ మోడల్ ఆల్టో 800. సుమారు 30 లక్షల కార్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన ఏకైక మోడల్ ఆల్టో . -
పాత 'యాపిల్' మాకొద్దు...
♦ రీఫర్బిష్డ్ ఫోన్ల అమ్మకానికి కేంద్రం నో ♦ మేకిన్ ఇండియా ప్రచారం దెబ్బతింటుందని ఉద్దేశం ♦ పాత ఫోన్లకు దేశం డంప్‌గా మారుతుందని ఆందోళన ♦ యాపిల్ వస్తే నమ్మకం పెరుగుతుందన్న వాదనలూ ఉన్నాయ్ ♦ ప్రస్తుతం ఈ పరిశ్రమ విలువ ఏటా రూ.20,000 కోట్లుగా అంచనా.. మహేందర్ నూగూరి అరె! యాపిల్ ఫోన్ రూ.15 వేలకే వస్తోందే!!. ఎంచక్కా నా కల నెరవేరుతోంది... అనుకున్న వారికి కాస్తంత నిరాశే. ‘‘చైనా ఫోన్లు ఇండియాను ముంచేస్తున్నాయి. ఒక్క ఫోన్లేంటి? విదేశీ ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇండియాను కమ్మేస్తున్నాయి. ఇక వాడేసిన విదేశీ ఫోన్లు కూడా ఇక్కడికొచ్చేస్తే... ఇదొక డంప్ యార్డ్‌లా తయారయ్యే ప్రమాదం ఉంది’’ అని అనుకున్నవారికి మాత్రం కాస్త సంతోషకరమే. ఎందుకంటే... విదేశాల్లో వాడేసిన ఫోన్లను బాగు చేసి ఇండియాకు తెచ్చి విక్రయించాలని చూసిన దిగ్గజ మొబైల్ సంస్థ ‘యాపిల్’కు ఎదురుదెబ్బ తగిలింది. యాపిల్ చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి యాపిల్ చేసిన ఈ ప్రతిపాదన దేశంలో పెద్ద కదలికే తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్-1 సంస్థయిన యాపిల్ గనక ఈ మార్కెట్లోకి వస్తే ఐఫోన్లు మరింత చౌకగా వస్తాయని, అందుబాటులోకి వస్తాయని చాలామంది భావించారు. యాపిల్ బ్రాండ్ దానికి తోడుంటుంది కనక పాత ఫోనైనా సరే నమ్మకమైన సర్వీసు ఉంటుందని, రీఫర్బిష్డ్ మార్కెట్లో ఇదో సంచలనమవుతుందని చాలామంది భావించారు. అయితే యాపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు. యాపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే... ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ప్రభుత్వానికి అభ్యర్థనలు కూడా పంపాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు ‘బ్లూమ్‌బర్గ్’ వార్తా సంస్థ తెలియజేసింది. ‘‘ఇలాంటి ప్రతిపాదనను గతేడాది పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. యాపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది’’ అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది. బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు... దేశంలో రీఫర్బిష్డ్ మార్కెట్ విలువ అక్షరాలా ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు. పెపైచ్చు ఏటా 25-30 శాతం పెరుగుతోంది కూడా. అందుకే ఈ మార్కెట్లో సింహ భాగాన్ని చేజిక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో యాపిల్ పావులు కదిపింది. నిజానికి ఇంత భారీ పరిమాణం ఉన్న మార్కెట్లో ఇప్పటిదాకా బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు. ఎక్కడికక్కడ వ్యాపారులే పాత ఫోన్లను కొని, రీఫర్బిష్ చేసి విక్రయిస్తున్నారు. స్థానికంగా విక్రయించటంతో పాటు ఈబే సహా కొన్ని ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా వీరే విక్రయిస్తున్నారు. ఇక రీఫర్బిష్డ్ కాకుండానే తాము వాడేసిన ఫోన్లను జనం నేరుగా క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర సైట్ల ద్వారా విక్రయానికి పెడుతున్నారు. అంతేతప్ప ఫోన్లను తయారు చేస్తున్న ఏ కంపెనీ కూడా ఇండియాలో అధికారికంగా రీఫర్బిష్డ్ ఫోన్లను విక్రయిం చటం లేదు. అందుకే యాపిల్ దీన్నొక అవకాశంగా తీసుకుంది. కంపెనీలకు చేరకుండా మధ్యలోనే... ఈ-కామర్స్ సైట్ల ద్వారా ఫోన్ కొన్నపుడు... వారం రోజుల్లోనే పనిచేయకుండా పోయే ఫోన్లు మాత్రమే (డెడ్ ఆన్ అరైవల్) తిరిగి తయారీ కంపెనీల వద్దకు వెళ్తున్నాయి. అలాంటపుడు కస్టమర్‌కు కొత్త ఫోన్ ఇస్తాయి. వెనక్కివచ్చిన ఫోన్లను కంపెనీలు రిపేర్ చేసి... ఎక్కువ జమ కాగానే వేలంలో రిజిస్టర్డ్ డీలర్లకు విక్రయిస్తాయి. వారు వీటిని ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, ఆన్లైన్లో విక్రయించకూడదు. ఆఫ్‌లైన్ విధానంలో సబ్‌డీలర్లు, ఇతర విక్రేతల ద్వారా కస్టమర్లకు డిస్కౌంట్లతో విక్రయించాలి. తక్కువ ధరకు వచ్చింది కదా అని కొంటే... దీనికి తయారీ కంపెనీ వారంటీ ఉండకపోతే ఇబ్బందే. ఇక కస్టమర్లు 30 రోజుల రిటర్న్ పాలసీ ఉంది కదా అని 20 రోజులు వాడేసి... ఆ తరవాత తమకు నచ్చలేదని వెనక్కిచ్చేస్తే అవి తయారీ కంపెనీలకు వెళ్లటం లేదు. ఉత్పత్తి వెనక్కి రావటం వల్ల విక్రేత నష్టపోతాడు కనక... ఆ నష్టంలో కొంత మొత్తాన్ని ఈ-కామర్స్ కంపెనీలు భరిస్తున్నాయి. ఇలా తిరిగొచ్చిన ఫోన్లను చిన్నచిన్న వ్యాపారులు, సెకండ్ హ్యాండ్ ఫోన్ల వ్యాపారంలో ఉన్నవారు కొనుక్కుని, చిన్నపాటి మార్పులు చేసి వాటినే రీఫర్బిష్డ్ పేరిట అమ్ముతున్నారు. తయారీ కంపెనీలే రీఫర్బిష్ చేసినట్లు మాయ మాటలు చెబుతున్నారు.