ఆ ఐఫోన్లు చవగ్గా..!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సెకండ్ హ్యాండ్ ఆపిల్ ఫోన్ల విక్రయాలకు మరోసారి తెరలేపింది. రీఫర్‌బిష్డ్ ఫోన్లను తమ అధికారిక వెబ్ సైట్ లో విక్రయానికి ఉంచినట్టు అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్స్‌తో పోలిస్తే 15 శాతం డిస్కౌంట్ ధరల్లో వీటిని ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉంచినట్టు ఆపిల్ ప్రకటించింది. అన్‌లాక్ చేసిన, పునరుద్ధరించిన 6ఎస్, 6 ఎస్‌ప్లస్ లాంటి ఐఫోన్లను ఈ తగ్గింపు ధరల్లో ఫోన్ లవర్స్‌కు అందుబాటులో ఉంచింది.
టెక్నాలజీ వెబ్‌సైట్ అందించిన వివరాల ప్రకారం గోల్డ్ కలర్ 64జీబీ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఐఫోన్ను సుమారు రూ.39వేలకు ($589 డాలర్లు) , సిల్వర్ కలర్ 16GB 6ఎస్ ప్లస్ ఐఫోన్ రూ.35 వేలకు ($ 529) అందుబాటులో ఉంది. కొత్త బ్యాటరీ , కొత్త ఔటర్ షెల్ అమర్చి ఈ పునరుద్ధరించిన ఆపిల్ ఫోన్లకు ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.కాగా ఆపిల్ గతంలో సెకండ్ హ్యాండ్ మ్యాక్‌లు, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటి ఇతర ఆపిల్ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం తెలిసిందే. ఇలా 2007 లో చివరిసారిగా తన ఉత్పత్తులను విక్రయించింది.