భారత్లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ | India to launch iPhone 6S, 6S Plus on Oct 16 | Sakshi
Sakshi News home page

భారత్లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్

Published Mon, Sep 28 2015 7:44 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

భారత్లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ - Sakshi

భారత్లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్

న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. వచ్చే నెల 16 నుంచి ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. భారత్లోకి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ తొందరగా రావడం ఇదే తొలిసారి. ప్రపంచ మార్కెట్లో ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ విడుదలయిన నెల రోజులకే భారత్ మార్కెట్లోకి రానున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. తొలి మూడు రోజుల్లోనే కోటి 30 లక్షల ఫోన్లను అమ్మినట్టు యాపిల్ ప్రకటించింది. గతేడాది ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాల రికార్డు (కోటి యూనిట్లు)ను బ్రేక్ చేసినట్టు వెల్లడించింది. భారత్లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్లు  ధరల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐఫోన్ 6 ఎస్ కనీస ధర 60 వేల రూపాయలు, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ప్రారంభ ధర 68 వేల రూపాయల నుంచి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్లలో కొత్త త్రీడి టచ్ డిస్ప్లే టెక్నాలజీ, 2 జీబీ రామ్తో ఏ 9 ప్రొసెసర్, ios ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement