iphone 6s
-
ఇక చౌకగా ఐఫోన్ 6ఎస్
ఆపిల్ ఐఫోన్ అంటేనే.. కాస్త ఖరీదెక్కువ. ఆ ఫోన్ చేతిలో ఉందంటే, ఓ స్థాయిగా ఫీలవుతారు. సాధారణ మొబైల్స్‌తో పోలిస్తే ఐఫోన్ ధరలు ఎక్కువగా ఉండటానికి గల కారణం మనదేశంలో అమలవుతున్న అత్యధిక దిగుమతి సుంకాలే. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి మెల్లమెల్లగా ఆపిల్ భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపడుతోంది. గతేడాది నుంచే ఆపిల్ భారత్‌లో తన ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించింది. బెంగళూరులో ఈ తయారీ సౌకర్యాన్ని ఏర్పరిచింది. తాజాగా కొత్త ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లోనే రూపొందించడం ప్రారంభించిందని తెలిసింది. అదీ కూడా బెంగళూరులోని ఐఫోన్ ఎస్ఈ రూపొందే విస్ట్రోన్ ప్లాంట్‌లోనే ఐఫోన్ 6 ఎస్‌ను ఆపిల్ తయారు చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో, ఐఫోన్ 6ఎస్ ఉత్పత్తినే ఇక్కడ ప్రారంభించాలని ఆపిల్ నిర్ణయించిందని తెలిసింది. దీంతో ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి. ఈ సుంకాలు తగ్గిపోవడంతో, ఐఫోన్ 6ఎస్ చౌకైన ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి. మిడ్-రేంజ్ ప్రీమియం సెగ్మెంట్లోకి కొంత షేర్‌ను విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపాయి. ‘ఐఫోన్ ఎస్ఈ మాదిరి మేడిన్ ఇండియాలో రూపొందుతున్న ఐఫోన్ 6ఎస్‌ను భారత్‌లోనే విక్రయిస్తాం. భారత్‌లో తయారీ సామర్థ్యం పెరిగేంత వరకు ఐఫోన్ 6ఎస్ దిగుమతులు కొనసాగిస్తాం. స్థానిక తయారీ యూనిట్లతో ఎలాంటి ధర కరెక్షన్ ఉండదు. త్వరలోనే మేడిన్ ఇండియా ఐఫోన్ 6ఎస్ స్మార్ట్‌ఫోన్ స్టోర్లలోకి వస్తుంది’ అని ఆపిల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐఫోన్ 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు, మొత్తం భారత్‌లో ఐఫోన్ అమ్మకాల్లో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ధరలో స్థిరత్వం, పోటీ కోసం కంపెనీ స్థానికంగా తయారీ యూనిట్లను పెంచుతున్నామని ఆపిల్ వివరించింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6 ధర రూ.5,999?
ఆపిల్ తన ఐఫోన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్ X అనే స్పెషల్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ సందర్భంగా పాత ఐఫోన్లన్నింటి ధరలను తగ్గించేసింది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ఫోన్లపై భారీగా ధర కోత పెట్టింది. ఈ ధరల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ స్మార్ట్ఫోన్లు 5,999 రూపాయలకు, 17,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి. అయితే నిజంగా ఐఫోన్ 5,999 రూపాయలేనా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. నిజంగా ఈ ఫోన్ రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ 32జీబీ ఎడిషన్ అసలు ధర 25,999 రూపాయలు. అదనంగా ఈ ఫోన్‌పై 3,501 రూపాయల వరకు స్పెషల్ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్లో కొనుగోలుచేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపు లభించి, రూ.5999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లభించనుందట. అది కూడా ఐఫోన్ 7 ప్లస్ లాంటి ఏదైనా హై-ఎండ్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి దీన్ని కొనుగోలుచేస్తేనే, ఈ స్మార్ట్‌ఫోన్ రూ.5,999కు లభ్యంకానుంది. కానీ ఐఫోన్ 7 ప్లస్ లాంటి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి ఐఫోన్ 6ను ఎవరు కొనుగోలుచేస్తారు? ఇదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ చాలా హాస్యాస్పదంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పలువురంటున్నారు. ఐఫోన్ 6ఎస్ విషయంలో తీసుకున్న కూడా ఇదే విధమైన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఐఫోన్ 6ఎస్ 32జీబీ వేరియంట్ అసలు రూ.37,999కు లిస్టు అయింది. కానీ ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.17,999కు విక్రయిస్తోంది. ప్రీమియం, ఖరీదైన ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి, దీన్ని కొనుక్కుంటే, ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలుస్తోంది. -
ఐఫోన్ 6ఎస్ తో సినిమా..
హైదరాబాద్: సెల్‌ఫోన్ ప్రపంచంలో యాపిల్ ఐఫోన్‌ది ఓ చరిత్ర. అత్యధిక మంది ఐఫోన్ వాడాలనుకుంటారు. దీనికి మార్కెట్లో ఉండే క్రేజే వేరు. అలాంటి ఐఫోన్‌తో ఏకంగా ఓ సినిమా తీశారు. అది కూడా తెలుగు సినిమా. ఐఫోన్‌తో సినిమాని చిత్రీకరించారు. ఆ సినిమా పేరు "లవర్స్ క్లబ్". వివరాల్లోకి వెళ్తే "ప్లాన్ బీ ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్" బ్యానర్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి భరత్ అవ్వారి దర్శకత్వం వహిస్తున్నారు. దృవ శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, సన్నివేశాలు, ఇలా అన్నీ ఐఫోన్ 6ఎస్ తో చిత్రీకరించారు. ఇండియాలోనే ఐఫోన్‌తో తీసిన తొలిచిత్రం కావడం విశేషం. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్ర ప్రచారంలో భాగంగా 34 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. -
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
-
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బ్రాండెట్ ఫోన్ గా ముద్రపడిన ఐఫోన్ కొనుక్కోవాలంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు.. ఆపిల్ స్టోర్ కు లేదా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మీ అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఐఫోన్ కొనుక్కోవాలంటే వాటి వద్దకే వెళ్లాలా.. సింపుల్ గా మనమే తయారీచేసుకుంటే పోలా అని రంగంలోకి దిగేశాడు. ఐఫోన్ కు కావాల్సిన విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి, బెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా పేరు తెచ్చుకుంటున్న ఐఫోన్ 6ఎస్ ను తయారీచేసేశాడు. తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.ఇక అంతే ఆ వీడియోకు లైక్స్, కామెంట్స్ యూట్యూబ్ లో దంచికొడుతున్నాయి. కేవలం ఆ ఒక్క వీడియోతోనే ఆ ఛానల్ కు 20వేల మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు. అది కూడా కేవలం 22 గంటల్లోనేనట. ఆ వ్యక్తి రూపొందించిన వీడియోకు 2500 కామెంట్లు రాగా, 25వేల లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వెల్లువెత్తాయి. మెటల్ బ్యాక్ కేసును సెర్చ్ చేయడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడు ఆ వ్యక్తి. గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని ఆ వ్యక్తి మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపించాడు. ఎట్టకేలకు తన కోసం తాను సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారుచేసుకున్నట్టు పేర్కొన్నాడు. -
2016 బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ ఏదో తెలుసా?
లండన్ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో జోరు మీదున్న ఆపిల్ మరోసారి తన సత్తా చాటుకుంది. 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కిరీటం ఆపిల్ ఐఫోన్ 6ఎస్ దక్కించుకుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచినట్టు తెలిసింది. ఇటీవల ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఐఫోన్ 7, నాలుగో క్వార్టర్లో బెస్ట్-సెల్లర్ గా నిలిచినట్టు ఈ ర్యాంకింగ్స్ తెలిపాయి. దాని తర్వాత ఐఫోన్ 7ప్లస్ ఉంది.ఎన్నో నూతన ఆవిష్కరణలను, కొత్త కొత్త ఫీచర్లతో ఐఫోన్లను ఆపిల్ మార్కెట్లోకి తీసుకొస్తుడటంతో కంపెనీ మళ్లీ సత్తా చాటుకుంటోందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. కొత్త ఫోన్లతో పాటు పాత ఐఫోన్లను కంపెనీ విక్రయాలకు ఉంచుతోందని రిపోర్టు పేర్కొంది. 2016లో ఎక్కువగా రవాణా అయిన స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో పాత ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్లే ఉన్నాయని మార్కిట్ వెల్లడించింది. అదేవిధంగా గెలాక్సీ నోట్7 పేలుళ్లకు ముందు మార్కెట్లో తన సత్తా చాటిన శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు కూడా ఐదు, తొమ్మిదవ స్థానాల్లో నిలిచాయి. పేలుళ్ల దెబ్బతో శాంసంగ్ అల్లాడినప్పటికీ, ఎక్కువగా సరుకురవాణా అయిన టాప్-10 స్మార్ట్ఫోన్లలో శాంసంగ్ ఫోన్లే ఐదున్నాయి. టాప్-10 ర్యాంకింగ్స్ లో చైనీస్ కంపెనీ ఓపో మోడల్స్ కూడా నిలిచాయి. -
88,700-6ఎస్ ఐఫోన్లు వెనక్కు!
అబుదాబి: ఆపిల్ సంస్ధ మార్కెట్లోకి తెచ్చిన 6ఎస్ ఐఫోన్లలో 88,700 వెనక్కి తెప్పించనుంది. యూఏఈలో విక్రయించిన 6ఎస్ మోడల్స్‌లో బ్యాటరీ సమస్యలు తలెత్తుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ ఫోన్లంటినీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. 2015లో చైనాలో తయారైన ఈ ఫోన్లన్నీ ఉన్నట్టుండి షట్‌డౌన్ అయిపోతున్నాయి. 6ఎస్ ఫోన్ల వినియోగదారులు తమ ఫోన్ బ్యాటరీలో లోపం ఉందా? అనే విషయాన్ని https://www.apple.com/ae/support/iphone6s-unexpectedshutdown/ ద్వారా పరిశీలించుకోవాలని యూఏఈ కంజ్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ చెప్పింది. -
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్!
ప్రముఖ మొబైల్ కంపెనీలను బ్యాటరీ కష్టాలువెన్నాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో శాంసంగ్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఆపిల్ కూడా దాదాపు ఇదే బాటలో పయినిస్తోంది. తాజాగా ఐఫోన్ 6s బ్యాటరీ సమస్య సీరియస్ గానే ఉన్నట్టు యాపిల్ అంగీకరించింది. తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది. మొదట్లో కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలోనే సమస్య ఉందని చెప్పిన యాపిల్ స్థానిక ఏజెన్సీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో చివరికి చైనీస్ వెబ్ సైట్ లో తప్పును ఒప్పుకుంది. దీనికి సంబంధించి మంగళవారం ఒక నోటీసును వెబ్ సైట్ లో పోస్ల్ చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్ లోసమస్య అయి వుండవచ్చని భావిస్తోంది. దీన్ని పరిష్కరించడానికి డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది. మరోవైపుకొద్ది రోజుల కిందట చైనీస్ వాచ్ డాగ్ యాపిల్ 6 ఎస్ తో పాటు 5ఎస్ లో కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఐ ఫోన్ 6ఎస్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడం, పేలుడు సంభవిస్తున్నట్టుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015 లో విక్రయించిన ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ కు ఎదురేలేదు!
న్యూయార్క్: ఎంత పోటీ ఉన్నా ఆపిల్ ఐఫోన్ కు తిరుగులేదని మరోసారి రుజువైంది. మార్కెట్ లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వస్తున్నా ఐఫోన్ కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా గణింకాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచింది. 2016 ద్వితీయ త్రైమాసికంలో అత్యధికంగా 1.42 కోట్ల(14.2 మిలియన్లు) ఐఫోన్ 6ఎస్ అమ్ముడైనట్టు మార్కెట్ అధ్యయన సంస్థ స్ట్రాటజీ ఎనలిటిక్స్ వెల్లడించింది. మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఇది 4 శాతమని తెలిపింది. 2 శాతం వాటాతో ఐఫోన్ 6 రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 85 లక్షల ఐఫోన్ 6 అమ్ముడయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 మూడో స్థానం(83 లక్షలు) దక్కించుకుంది. గతేడాదితో పోల్చుకుంటే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. నిరుడు ద్వితీయ త్రైమాసికంలో 33 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 34 కోట్లు సేల్ అయ్యాయి. -
టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే...
ఇన్నిరోజులు అత్యధిక ధరలున్న స్మార్ట్ ఫోన్లు ఏవీ అంటే.. యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్లేనని చటుక్కున చెప్పేవాళ్లం. కానీ యాపిల్ ఐఫోన్ కంటే మించి ధరలున్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయట. చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఐఫోన్ 6ఎస్ ధరకి సమానంగా లేదా దానికంటే ఎక్కువగా ధరలను భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి. ఐఫోన్ కంటే ధరలు అధికంగా ఉన్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు.... 1. హెచ్ టీసీ 10 : మెటల్ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్ ను ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ధర రూ.52,990. ఫోన్ ఫీచర్లు...5.2 అంగుళాల 2కె డిస్ ప్లే 820 క్వాల్కం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 1440x2560 ఫిక్సల్స్ 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. 12 మెగాఫిక్సెల్, అల్ట్రా మెగా ఫిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 5 మెగాఫిక్సె ల్ ఫ్రంట్ కెమెరా 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 2. ఎల్ జీ జీ5 : జీ5 స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ ఇంకా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టలేదు. కానీ ఈ ఫ్లాగ్ షిప్ కు ఈ-కామర్స్ వెబ్ సైట్ లో ముందస్తు బుకింగ్ లు మొదలయ్యాయి. ధర హెచ్ టీసీ 10కి సమానంగా రూ.52,990గా కంపెనీ నిర్ణయించింది. ఎల్ జీ జీ5 ఫీచర్లు... 5.3 అంగుళాల క్వాడ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 16 ఎంపీ అండ్ 8 ఎంపీ రెండు వెనుక కెమెరాలు 8 ఎంపీ ముందు కెమెరా 2800 ఎంఏహెచ్ బ్యాటరీ 3. సోనీ ఎక్స్ పీరియా : సోనీ ఎక్స్ పీరియా జడ్5 ప్రీమియం ను సోనీ ఆవిష్కరించింది. హెచ్ టీసీ, ఎల్జీలకు సమానమైన ధరనే సోనీ ఈ స్మార్ట్ ఫోన్ కు నిర్ణయించింది. దీని ధర కూడా రూ.52,990నే. ఫోన్ ఫీచర్లు....5.5 అంగుళాల యూహెచ్డీ రెజుల్యూషన్ ట్రిల్యుమినోస్ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 23 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 5మెగా పిక్సెల్ ముందు కెమెరా 3430 ఎంఏహెచ్ బ్యాటరీ 4. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ : శామ్ సంగ్ తన గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ను, గెలాక్సీ ఎస్7 లను రెండింటినీ రూ.56,900కు భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫోన్ ఫీచర్లు... ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో 5.1 అంగుళాల క్యూహెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే ఆక్టా కోర్ ఎక్సీనోస్ 8890 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 12 ఎంపీ వెనుక కెమెరా 5ఎంపీ ముందు కెమెరా 3600 ఎంఏహెచ్ బ్యాటరీ 5. బ్లాక్ బెర్రీ : కెనడా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ కంపెనీ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే స్మార్ట్ ఫోన్"ప్రివ్"ను భారత మార్కెట్లోకి ఈ జనవరిలో తీసుకొచ్చింది. దీని ధర రూ.55,649. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ... 5.4 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే 1.8 గిగాహెర్ట్జ్ హెక్జా కోర్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ 18 ఎంపీ ముందు కెమెరా, 2 ఎంపీ వెనుక కెమెరా 3,410 ఎంఏహెచ్ బ్యాటరీ 6. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ : రూ.57,900కి గతేడాది ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.53,895లకి మార్కెట్లో లభ్యమవుతోంది. ఫోన్ ఫీచర్లు..5.7 అంగుళాల క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే ఎక్సీనోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 7. సోనీ ఎక్స్ పీరియా జడ్3 ప్లస్ : ఐఫోన్ 6ఎస్ 16 జీబీ మోడల్ కంటే ఈ ఫోన్ ఖరీదే ఎక్కువ. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.52,990కి మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు...5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 20.7 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 2,930 ఎంఏహెచ్ బ్యాటరీ 8. శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 5 : ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.51,400లకు భారత మార్కెట్లోకి శామ్ సంగ్ లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 50,864లకు భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు...5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే, ఎక్సీ నోస్ ఆక్టా కోర్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా 5 మెగా పిక్సెల్ ముందు కెమెరా 9. శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 4 : శామ్ సంగ్ నోట్ సిరీస్ లో ఇది నాలుగో స్మార్ట్ ఫోన్. ఈ హ్యాండ్ సెట్ ను రూ.58,300గా 2014లో భారత మార్కెట్లోకి శామ్ సంగ్ ప్రవేశపెట్టింది.. ప్రస్తుతం ఇది రూ.49,900లకు మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు... 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 805 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ వెనుక కెమెరా 3.7 ఎంపీ ముందు కెమెరా 3220 ఎంఏహెచ్ బ్యాటరీ 10. హెచ్ టీసీ వన్(ఎమ్8) : ఈ పాత హెచ్ టీసీ వన్(ఎమ్8) ధర కూడా ఐఫోన్ కంటే ఎక్కువగానే ఉంది. రూ.48,000గా ఆన్ లైన్ రిటైలర్స్ లో లభ్యమవుతోంది. 2014లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫీచర్లు...5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఆల్ట్రాపిక్సెల్ రేర్ కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా 2600 ఎంఏహెచ్ బ్యాటరీ -
భారత్‌లో భారీగా తగ్గిన 'ఐ ఫోన్' ధరలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్లో మరింత అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో యాపిల్ సంస్థ తన లెటెస్ట్ మోడళ్ల ధరలను తగ్గించింది. ఐ ఫోన్ 6ఎస్, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్ల ధరలు భారత్‌లో 16శాతం వరకు తగ్గాయి. రానున్న త్రైమాసికం అత్యంత కీలకం కావడంతో తొలిసారిగా ఈమేరకు భారీగా ధరలు తగ్గించింది. అక్టోబర్ 16న భారత్‌లో ప్రవేశపెట్టిన ఐ ఫోన్ 6ఎస్ 16జీబీ మోడల్ ధర రూ. 62వేలు ఉండగా, అది ఇప్పుడు 11-16శాతం పడిపోయి రూ. 52-55వేల మధ్య లభిస్తున్నదని రిటైలర్స్ తెలిపారు. ఈ మోడల్‌కు చెందిన 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ.. ఇలా అన్ని వెరియంట్స్ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఐ ఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ధరలు.. లాంచింగ్ సమయంతో పోల్చుకుంటే గరిష్ఠంగా 15శాతం వరకు తగ్గాయని ఓ జాతీయ రిటైలర్ తెలిపారు. దీంతో 2014లో మార్కెట్లోకి వచ్చిన ఐ ఫోన్ 6 మోడల్‌కు, దాని లెటెస్ట్ మోడళ్లకు మధ్య ధర వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోయిందని, దీంతో అప్‌గ్రేడ్ మోడల్ మొబైల్ ఫోన్లు కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని ఆ రిటైలర్ సంస్థ వివరించింది. రెండు నెలల కిందట ప్రతిష్ఠాత్మకంగా భారత్‌లోకి ప్రవేశపెట్టిన ఐ ఫోన్ 6ఎస్, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్ల ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
మరో రెండు కొత్త ఐఫోన్లు వచ్చేశాయి
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సంస్థ యాపిల్ భారత్‌లో మరో రెండు కొత్త వర్షన్ ఐఫోన్లను ప్రారంభించింది. ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఐఫోన్లను విడుదల చేసింది. నెల రోజుల్లోనే భారత్‌లో అంతటా ఈ ఫోన్ల లభించనున్నాయి. ఐఫోన్ 6ఎస్ 16 జీబీ వర్షన్ రూ.62,000, 64 జీబీ సపోర్ట్ ఐఫోన్ రూ.72,000కు, 128 జీబీ స్టోరేజి కెపాసిటీ ఫోన్ రూ.82,000కు లభ్యం కానుంది. ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ 16 జీబీ సపోర్ట్‌తో రూ.72,000, 64 జీబీ వర్షన్ రూ.82,000, 128 జీబీ వర్షన్ రూ.92 వేలల్లో లభించనుంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్, జంబోవంటి పెద్దపెద్ద మార్కెట్లతోపాటు ఆన్ లైన్ షాపింగ్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్‌లో ఈ ఫోన్లు లభించనున్నాయి. మొత్తం 12 వేల రిటెయిల్ షాపుల్లో వీటి అమ్మకాలు జరగనున్నట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే ఐఫోన్ 6 విడుదలైన విషయం తెలిసిందే. -
భారత్‌లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. వచ్చే నెల 16 నుంచి ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. భారత్‌లోకి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ తొందరగా రావడం ఇదే తొలిసారి. ప్రపంచ మార్కెట్లో ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ విడుదలయిన నెల రోజులకే భారత్ మార్కెట్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. తొలి మూడు రోజుల్లోనే కోటి 30 లక్షల ఫోన్లను అమ్మినట్టు యాపిల్ ప్రకటించింది. గతేడాది ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాల రికార్డు (కోటి యూనిట్లు)ను బ్రేక్ చేసినట్టు వెల్లడించింది. భారత్‌లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌లు ధరల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐఫోన్ 6 ఎస్ కనీస ధర 60 వేల రూపాయలు, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ప్రారంభ ధర 68 వేల రూపాయల నుంచి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్లలో కొత్త త్రీడి టచ్ డిస్ప్లే టెక్నాలజీ, 2 జీబీ రామ్‌తో ఏ 9 ప్రొసెసర్, ios ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి. -
ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్
బెంగళూరు : సాప్ట్వేర్ కంపెనీలు పోటాపోటీగా తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ కూడా హెచ్‌సీఎల్ సంస్థను ఫాలో అయ్యింది. హెచ్‌సీఎల్...తమ ఉద్యోగులకు మెర్సిడెజ్ కారులు ఇస్తే... ఇన్ఫీ తమ ఉద్యోగులకు ఐ ఫోన్ 6 ఎస్‌ను ఇచ్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-3000 ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు. ఐఫోన్ 6ఎస్తో పాటు ఓ ఈ మెయిల్‌ను ఉద్యోగులకు పంపారు. ఈ సందర్భంగా విశాల్ సిక్కా 'గతేడాది సంతోషకరంగా ముగిసింది. ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు... వేడుక చేసుకోవాల్సిన సమయం' అని అన్నారు. హాలిడే బోసన్పై సంస్థ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తూ ...గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు. కాగా ఉన్నత పదవులతో పాటు, భారీ ప్యాకేజీల వేతనాల కోసం సాప్ట్వేర్ ఉద్యోగులు...ఉద్యోగాలు వీడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఉద్యోగులను నిలుపుకునేందుకు గిప్ట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వటం విశేషం.