భారత్‌లో భారీగా తగ్గిన 'ఐ ఫోన్' ధరలు!
న్యూఢిల్లీ: ప్రస్తుత సీజన్‌లో మరింత అమ్మకాలు పెంచుకునే లక్ష్యంతో యాపిల్ సంస్థ తన లెటెస్ట్ మోడళ్ల ధరలను తగ్గించింది. ఐ ఫోన్ 6ఎస్, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్ల ధరలు భారత్‌లో 16శాతం వరకు తగ్గాయి. రానున్న త్రైమాసికం అత్యంత కీలకం కావడంతో తొలిసారిగా ఈమేరకు భారీగా ధరలు తగ్గించింది. అక్టోబర్ 16న భారత్‌లో ప్రవేశపెట్టిన ఐ ఫోన్ 6ఎస్ 16జీబీ మోడల్ ధర రూ. 62వేలు ఉండగా, అది ఇప్పుడు 11-16శాతం పడిపోయి రూ. 52-55వేల మధ్య లభిస్తున్నదని రిటైలర్స్ తెలిపారు. ఈ మోడల్‌కు చెందిన 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ.. ఇలా అన్ని వెరియంట్స్ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి.
ఐ ఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ ధరలు.. లాంచింగ్ సమయంతో పోల్చుకుంటే గరిష్ఠంగా 15శాతం వరకు తగ్గాయని ఓ జాతీయ రిటైలర్ తెలిపారు. దీంతో 2014లో మార్కెట్లోకి వచ్చిన ఐ ఫోన్ 6 మోడల్‌కు, దాని లెటెస్ట్ మోడళ్లకు మధ్య ధర వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోయిందని, దీంతో అప్‌గ్రేడ్ మోడల్ మొబైల్ ఫోన్లు కొనేందుకు వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని ఆ రిటైలర్ సంస్థ వివరించింది. రెండు నెలల కిందట ప్రతిష్ఠాత్మకంగా భారత్‌లోకి ప్రవేశపెట్టిన ఐ ఫోన్ 6ఎస్, ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్ల ధరలను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.