ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్ | smart gifts for infosys techies | Sakshi
Sakshi News home page

ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్

Published Fri, Jan 9 2015 1:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్

ఇన్ఫీ టెకీలకు స్మార్ట్ గిప్ట్

బెంగళూరు : సాప్ట్వేర్ కంపెనీలు పోటాపోటీగా తమ ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ కూడా హెచ్సీఎల్ సంస్థను ఫాలో అయ్యింది. హెచ్సీఎల్...తమ ఉద్యోగులకు మెర్సిడెజ్ కారులు ఇస్తే... ఇన్ఫీ తమ ఉద్యోగులకు ఐ ఫోన్ 6 ఎస్ను ఇచ్చింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-3000  ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో విశాల్ సిక్కా హాలిడే బోనస్ ఇచ్చారు. ఐఫోన్ 6ఎస్తో పాటు ఓ ఈ మెయిల్ను ఉద్యోగులకు పంపారు.

ఈ సందర్భంగా విశాల్ సిక్కా 'గతేడాది సంతోషకరంగా ముగిసింది. ప్రస్తుతం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. సంస్థ సాధించిన విజయాన్ని గుర్తించడం మాత్రమే కాదు... వేడుక చేసుకోవాల్సిన సమయం' అని అన్నారు. హాలిడే బోసన్పై సంస్థ ఉద్యోగి హర్షం వ్యక్తం చేస్తూ ...గతంలో ఇలా బహుమతులు ఇచ్చిన సందర్భాలు లేవన్నారు.  కాగా ఉన్నత పదవులతో పాటు,

భారీ ప్యాకేజీల వేతనాల కోసం సాప్ట్వేర్ ఉద్యోగులు...ఉద్యోగాలు వీడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఉద్యోగులను నిలుపుకునేందుకు గిప్ట్లతో పాటు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement