టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్‌లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.
ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..
సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment