bonus
-
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్‌లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్‌లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగారు. తన పోస్ట్‌లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్‌లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్‌గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్‌ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్‌స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
గుడ్‌న్యూస్ చెప్పిన టెక్ దిగ్గజం: ఉద్యోగులకు 85 శాతం బోనస్
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎట్టకేలకు ఉద్యోగులకు పర్ఫామెన్స్ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అర్హులైన వారికి 85 శాతం బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఈమెయిల్స్ కూడా ఉద్యోగులకు పంపించింది. కాబట్టి నవంబర్ జీతంతో పాటు ఈ బోనస్ కూడా పొందనున్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయం.. డెలివరీ, సేల్స్ వర్టికల్లో జూనియర్, మిడ్ లెవెల్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మెరుగైన లాభాలను పొందింది. ఈ నేపథ్యంలో సంస్థ తన ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. బోనస్ అనేది కేటగిరి వారీగా చెల్లించే అవకాశం ఉంది. అయితే ఏ కేటగిరి ఉద్యోగులకు ఎంత శాతం బోనస్ ఇస్తుందనే వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం తగ్గిందా?: రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే..సెప్టెంబరుతో ముగిసిన Q2FY25లో.. ఇన్ఫోసిస్ వరుసగా రెండవ త్రైమాసికంలో వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 4.7 శాతం పెరిగి రూ.6,506 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో రాబడి 5.1 శాతం పెరిగి రూ. 40,986 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ ఆర్ధిక సంవత్సరంలో టెక్ దిగ్గజం మంచి వృద్ధిని నమోదు చేస్తోందని స్పష్టమవుతోంది. -
బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ(సీపీఎస్ఈ)లకు మూలధన పునర్వ్యవస్థీకరణపై సవరించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ జారీ చేసింది. దీపమ్(డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్) విడుదల చేసిన విధానాల ప్రకారం ఇకపై సీపీఎస్ఈలు తమ నికర లాభాల్లో కనీసం 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 4 శాతాన్ని(ఏది అధికమైతే దాన్ని) వార్షిక డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. ఎన్బీఎఫ్సీ తదితర ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈలు తప్పనిసరిగా నికర లాభాల్లో కనీసం 30 శాతాన్ని డివిడెండుగా చెల్లించాలి. ఇంతకుముందు 2016లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమైతే నికర లాభాల్లో 30 శాతం లేదా నెట్‌వర్త్‌లో 5 శాతాన్ని(ఏది ఎక్కువైతే అది) డివిడెండుగా చెల్లించవలసి ఉంటుంది. అయితే అప్పట్లో ఫైనాన్షియల్ రంగ సీపీఎస్ఈల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. బైబ్యాక్ ఇలా..గత ఆరు నెలల్లో పుస్తక విలువ(బీవీ) కంటే షేరు మార్కెట్ విలువ తక్కువగా ఉన్న సీపీఎస్ఈ.. ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. అయితే ఇందుకు కనీసం రూ.3,000 కోట్ల నెట్‌వర్త్, రూ.1,500 కోట్లకంటే అధికంగా నగదు, బ్యాంక్ నిల్వలు కలిగి ఉండాలి. కంపెనీ రిజర్వులు, మిగులు నిధులు చెల్లించిన ఈక్విటీ మూలధనానికి సమానంగా లేదా 20 రెట్లు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేయవలసి ఉంటుంది. గత ఆరు నెలల్లో షేరు ముఖ విలువకంటే మార్కెట్ ధర 150 రెట్లు అధికంగా పలుకుతున్న లిస్టెడ్ సీపీఎస్ఈ.. షేర్ల విభజనను చేపట్టవలసి ఉంటుంది. ఈ బాటలో షేర్ల విభజన మధ్య కనీసం మూడేళ్ల వ్యవధిని పాటించవలసి ఉంటుంది. తాజా మార్గదర్శకాలు సీపీఎస్ఈల అనుబంధ(51 శాతానికిపైగా వాటా కలిగిన) సంస్థలకు సైతం వర్తించనున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ రూ.10 వేలకోట్లు సమీకరణ.. ఏం చేస్తారంటే..వీటికి మినహాయింపుదీపమ్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా రంగ కంపెనీలకు వర్తించబోవు. అంతేకాకుండా కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం లాభాలను పంచిపెట్టడాన్ని నిషేధించిన సంస్థలకు సైతం మార్గదర్శకాలు అమలుకావని దీపమ్ స్పష్టం చేసింది. సవరించిన తాజా మార్గదర్శకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) నుంచి అమలవుతాయని తెలియజేసింది. సీపీఎస్ఈలు మధ్యంతర డివిడెండ్ల చెల్లింపులను ప్రతీ త్రైమాసికానికీ లేదా ఏడాదిలో రెండుసార్లు చేపట్టేందుకు వీలుంటుంది. అన్ని లిస్టెడ్ సీపీఎస్ఈలు.. వార్షిక అంచనా డివిడెండ్‌లో కనీసం 90 శాతం ఒకే దశలో లేదా దశలవారీగా చెల్లించవచ్చు. అయితే గడిచిన ఏడాదికి తుది డివిడెండ్‌ను ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) ముగిసిన వెంటనే చెల్లించవలసి ఉంటుంది. అన్‌లిస్టెడ్ సంస్థలు గతేడాది ఆడిటెడ్ ఆర్థిక ఫలితాల ఆధారంగా ఏడాదిలో ఒకసారి తుది డివిడెండుగా చెల్లించాలి. -
నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!
దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్లకు క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.టీసీఎస్ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్ గతంలోనే స్పష్టం చేసింది.కార్యాలయ హాజరు కీలకంఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు. -
బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు: కేటీఆర్
-
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
అవినీతి మానేసి హామీలపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.ఈ మేరకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
కేంద్రం శుభవార్త: ఆ ఉద్యోగులకు రూ.2,029 కోట్ల బోనస్
దసరా, దీపావళి వచ్చిందంటే.. ఉద్యోగుల్లో ఆనందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో చాలా కంపెనీలు బోనస్, ఇంక్రిమెంట్స్ వంటివి అందిస్తాయి. మరికొన్ని ప్రైవేట్ సంస్థలైతే ఖరీదైన కార్లు, బైకులను శాతం గిఫ్ట్‌గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.రైల్వే ఉద్యోగులకు రూ. 2,029 కోట్ల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది 11,72,140 మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అర్హత కలిగిన ఉద్యోగులందరికీ.. రూ. 7000 కనీస వేతనం కింద 78 రోజులకు బోనస్ అందించనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..రైల్వే శాఖలో ట్రాక్ మెయింటెనెర్స్, స్టేషన్ మాస్టర్స్, టెక్నీషియన్స్, సూపర్ వైజర్స్, పాయింట్స్ మెన్, గార్డ్స్, లోకో పైలెట్స్, మినిస్టీరియల్ స్టాప్, గ్రూప్-సీ విభాగాలకు చెందిన ఉద్యోగులు బోనస్ పొందనున్నారు. 58,642 ఖాళీల భర్తీ ప్రక్రియ కూడా కొనసాగుతుందని, రిక్రూట్మెంట్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ అన్నారు.रेलवे इम्प्लॉईज़ के लिए 2 हजार 29 करोड़ रुपये का प्रोडक्टिविटी लिंक्ड बोनस माननीय प्रधानमंत्री जी की अध्यक्षता में कैबिनेट में अप्रूव हुआ है-माननीय रेल मंत्री @ashwinivaishnaw जी#ShramevJayate pic.twitter.com/15bHeQufpZ— Ministry of Railways (@RailMinIndia) October 3, 2024 -
ఇంక్రిమెంట్లు, బోనస్‌ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్‌ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
సింగరేణి కార్మికులకు రూ.796 కోట్ల బోనస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభు త్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో మూడోవంతు సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నామని, దీని ప్రకారం సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులందరికీ సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందని, వీరితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు కూడా తొలిసారి బోనస్ కింద రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రు లు, సింగరేణి అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ వివరాలను ప్రకటించారు. ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు: ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనే సింగరేణి యాజమాన్యం, మంత్రివర్గంతో కలిసి బోనస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడ్డ సింగరేణి గని కార్మికులు ఉద్యమాన్ని పతాక స్థాయికి కెళ్లారు. వారి పోరాట పటిమ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది. అలాంటి సంస్థ వ్యాపార లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి యాజమాన్యంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన మేరకు బోనస్ ప్రకటిస్తున్నాం’అని రేవంత్ వెల్లడించారు. సింగరేణితో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సంస్థ కార్మికుల శ్రమశక్తి కారణంగా ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను కార్మికులకు పంచడం సంతోషంగా ఉందన్నారు. పన్నులన్నీ మినహాయించుకున్న తర్వాత ఈ ఏడాది సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వచి్చందని, అందులో పెట్టుబడి కింద రూ.2,289 కోట్లు పోను మిగిలిన రూ.2,412 కోట్లలో 33 శాతం అంటే రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ కింద ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా సగటున ప్రతి ఉద్యోగికి రూ.1.90లక్షల బోనస్ లభిస్తుందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.20 వేలు అధికమని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న 41,837 మంది శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 25 వేల మంది పనిచేస్తున్నారని, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు. విస్తరణ కార్యాచరణ కూడా... సింగరేణి కార్మికులకు బోనస్‌తోపాటు సంస్థ విస్తరణ కార్యాచరణ కూడా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలోని 100 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ విస్తరణ చేపడతామని, 500 మెగావాట్ల పంప్ స్టోరేజీ (రామగుండం ఏరియా) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ జెన్కోతో కలిసి మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ప్రారంభిస్తామని, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన అంగూల్ జిల్లాలో 2,400 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.వీకే, గోలేటీ, నైనీ ఓపెన్‌కాస్ట్‌ల విస్తరణ చేపడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆస్పత్రుల ఆధునీకరణతోపాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. -
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్
సాక్షి,హైదరాబాద్:సింగరేణి సంస్థలో పనిచేసే ఒక్కో కార్మికునికి లక్షా 90 వేల రూపాయల దసరా బోనస్‌ను ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్‌రెడ్డి శుక్రవారం(సెప్టెంబర్20) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇస్తున్న బోనస్ గతేడాది ఇచ్చిన బోనస్ కంటే రూ.20 వేలు అధికం అని భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈసారి వారికి కూడా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. కొత్త రేషన్‌కార్డులకు అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు -
పెరుగుతున్న సంస్థల విలువ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్‌వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధికేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు. -
టెకీలకు శుభవార్త.. ‘ఉద్యోగులను తొలగించం’
ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని సంస్థ సీఈఓ సలీల్‌ఫరేఖ్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. జనరేటివ్‌ఏఐ వల్ల టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నప్పటికీ ఇకపై తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించబోమని తేల్చి చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సంస్థలో జనరేటివ్‌ఏఐతో సహా వివిధ టెక్నాలజీలను ఏకీకృతం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను తొలగించే బదులు సాంకేతిక పురోగతి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు జనరేటివ్ ఏఐలో నియామకాలు కొనసాగిస్తాం. ఇతర కంపెనీల్లాగా ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన లేదు. సమీప భవిష్యత్తులో జనరేటివ్‌ఏఐ విభాగానికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అప్పటివరకు కంపెనీలో నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు తయారవుతారు. దాంతో ప్రపంచంలోని మరిన్ని పెద్ద సంస్థలకు సేవలందిస్తాం’ అన్నారు.ఇన్ఫోసిస్ ఇటీవల ఉద్యోగుల పనితీరుపై బోనస్ ప్రకటించింది. బ్యాండ్ సిక్స్, అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు జనవరి-మార్చి త్రైమాసిక పనితీరుపై బోనస్‌ను అందుకున్నారు. అయితే, బోనస్ రూపంలో ఇచ్చిన సగటు చెల్లింపులు మునుపటి త్రైమాసికంలోని 73 శాతంతో పోలిస్తే 60 శాతానికి పడిపోయాయి.టెక్ కంపెనీలు ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భవిష్యత్తు అంచనాలపై ఆశించిన వ్యాఖ్యలు చేయలేదు. వచ్చే ఒకటి-రెండు త్రైమాసికాల్లోనూ కంపెనీలకు పెద్దగా లాభాలు రావని తేల్చిచెప్పాయి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే టెక్ ఉద్యోగాల్లో కోత తప్పదని తెలిసింది. కాస్టకటింగ్ పేరిట లేఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీల్లో తిరిగి కొలువులు పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫోసిస్ మాత్రం ఇకపై ఉద్యోగులను తొలగించమని ప్రకటించడం నిరుద్యోగ టెకీలకు కొంత ఊరట కలిగించే అంశమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఆ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల పెంపు, రూ.1.8 లక్షల బోనస్ కూడా
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఇటీవల పెద్ద ఎత్తున విమానాలను రద్దు చేసి వివాదాస్పదంగా మారింది. ఎక్కువ సంఖ్య విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి చెక్కబడింది. సంస్థ తమ ఉద్యోగులకు భారీ మొత్తంలో జీతాలు పెంచడమే కాకుండా బోనస్ కూడా ప్రకటించింది.2024 మే 23న పైలెట్ల జీతాలు రూ. 15000 పెంచారు. దీంతో పాటు బోనస్ రూ.1.8 లక్షల వరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. సంస్థ అధికారిక ప్రకటన ప్రకారం.. ఫస్ట్ ఆఫీసర్ నుంచి సీనియర్ కమాండర్ వరకు నెల జీతాలను రూ. 5000 నుంచి రూ. 15000 వరకు పెంచినట్లు వెల్లడించారు. అయితే జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతాల పెంపు లేదు. అయితే వీరికి బోనస్ కింద రూ. 42000 నుంచి రూ. 1.8 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సమాచారం.ఫస్ట్ ఆఫీసర్, కెప్టెన్ రూ. 60000 బోనస్ అందుకోగా, కమాండర్, సీనియర్ కమాండర్లు వరుసగా 1.32 లక్షలు & 1.80 లక్షల బోనస్‌లను పొందనున్నారు. అంతే కాకుండా గ్రౌండ్ అండ్ సిమ్యులేటర్ శిక్షణలో జరిగిన ఆలస్యానికి పరిహారం కూడా అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. సాలరీ హైక్, బోనస్ వంటివి జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది. -
రైతులకు రేవంత్ మోసం.. ప్రతిపక్షాలు ఫైర్
-
రేవంత్ హామీ నెరవేర్చినట్లా? యూటర్న్‌తో మోసం చేసినట్లా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయిన మంత్రివర్గం సన్నవడ్లు పండించే రైతులకు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లేనా! ఒక రకంగా చూస్తే వాగ్దానం అమలు చేసినట్లే అవుతుంది. ఇంకో రకంగా చూస్తే రైతులను మోసం చేసినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావించినప్పుడు అందులో ఉన్న పాయింట్ ఏమిటంటే వరి ధాన్యం పండించే రైతులకు ఏడాదికి 500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపారు. ఇప్పుడు అలాగే చేశారు కదా అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీలను అమలు చేయడంలో ముందుకు వెళ్లినట్లే కదా అని భావించవచ్చు. ఇక్కడే కిటుకు ఉంది. మంత్రివర్గం ఈ హామీ అమలులో ఒక షరతుపెట్టింది. సన్నరకం వడ్లు పండించే రైతులకే ఈ బోనస్ ఇస్తామని తెలిపింది. గ్యారంటీలలో ఇలాంటి షరతు పెట్టలేదు కదా అని ఎవరైనా అడగవచ్చు. అలా అని అన్ని రకాల వడ్లకు ముఖ్యంగా దొడ్డు రకం వడ్లకు బోనస్ ఇస్తామని ప్రత్యేకంగా చెప్పలేదు కదా అని వాదించవచ్చు. కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాలలో రైతు పండించే పంట ప్రతి గింజను కొనుగోలు చేసి బోనస్ కూడా ఇస్తామని చెప్పేవారు. అందువల్ల ఈ షరతు పెడతారని ఎవరూ అనుకోరు. ఇలా కండిషన్ పెట్టడం రైతులను మోసం చేసినట్లే కదా అని ఎవరైనా విమర్శిస్తే కూడా అంగీకరించవలసిందే. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణలో పండించే వడ్లలో సన్నరకం వాటా కేవలం ముప్పై శాతమేనని ఒక అంచనా. మిగిలినదంతా దొడ్డు రకం వడ్లేనని చెబుతున్నారు. అప్పుడు మిగతా రైతులకు బోనస్ దక్కదు. దీనిపై రైతు వర్గాలలో వ్యతిరేకత వస్తుంది. మార్కెట్ లో సన్నరకం ధాన్యానికి మంచి గిరాకి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కన్నా ఐదు వందల నుంచి ఏడువందల రూపాయలు అధికంగా మార్కెట్ లో లబిస్తుంది. అందువల్ల మార్కెట్ లో విక్రయించుకునే సన్నవడ్ల రైతులకు బోనస్ ఇవ్వవలసిన అవసరం ఉండదు. ఒక లెక్క ప్రకారం ఏడాదికి రెండు సీజన్ లలో కలిపి కోటిన్నర టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.మొత్తం ధాన్యానికి బోనస్ ఇవ్వవలసి వస్తే ప్రభుత్వానికి సుమారు ఆరువేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుంది. సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తే ప్రభుత్వంపై రెండువేల కోట్ల భారం పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నా,వాస్తవానికి అంత కూడా ఉండదన్నది విపక్షాల అభిప్రాయం. ఇది రైతులను మోసం చేయడమేనని వారు అంటున్నారు. సన్నవడ్లలో కూడా ఏ రకానికి బోనస్ ఇచ్చేది తర్వాత అధికారులు ప్రకటిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే ఇందులో కూడా లిటిగేషన్ ఉందన్న మాట. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ఉండడం లేదని, ఏదో రకంగా మభ్య పెట్టి ఓట్లుపొందడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. సన్నరకం వడ్లను ప్రోత్సహించడానికి తొలుత ఆ వడ్లకు బోనస్ ఇస్తున్నామని, తదుపరి దొడ్డురకం వడ్లకు కూడా ఇస్తామమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కె చెప్పారు. ఆయన తెలివిగానే ఈ ప్రకటన చేసినా, ఆ మేరకు క్యాబినెట్ లో తీర్మానం చేయలేదు కదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. తెలంగాణలోకాని, కర్నాటకలోని గ్యారంటీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి.ఒకటి,రెండు అంశాలను అమలు చేసి గ్యారంటీలను చెప్పినట్లే చేస్తున్నాం కదా అని డబాయిస్తున్నారు. రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. నిజానికి రైతులు ఎవరూ తమ ఉత్పత్తులకు బోనస్ ఇవ్వాలని అడగలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను గద్దె దించడానికి ఇలాంటి పలు వాగ్దానాలు చేసింది. వాటిలో రైతు భరోసా కింద పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని, కౌలు రైతులకు కూడా వర్తింప చేస్తామని, రైతు కూలీలకు పన్నెండువేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రైతు భరోసాను గత ప్రభుత్వం అమలు చేసిన పదివేలు చొప్పునే చేయగలిగారు. దానికి కొంత టైమ్ తీసుకున్నా మొత్తం మీద ఆ మేర అయినా చేశారు. ఇది ప్రామిస్ ను నెరవేర్చినట్లేనా అంటే మళ్లీ అదే రకంగా రెండు రకాల వాదనలు వస్తాయి.రైతుల రుణాలు రెండు లక్షల వరకు మాఫీ చేస్తామన్న మరో హామీ కూడా ఉంది. ఎన్నికల ప్రచారం సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి రైతులు ఎవరైనా బ్యాంకులలో అప్పులు చేయకపోతే వెళ్లి తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పుడు అది శక్తికి మించిన పని కావడంతో కిందా మీద పడాల్సి వస్తోంది. దాంతో పలు వాయిదాలు వేస్తున్నారు. ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేస్తామని రేవంత్ అంటున్నారు. ఇందుకోసం సుమారు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని ఒక అంచనా కాగా,పాతికవేల కోట్లు సరిపోవచ్చని కొందరి అంచనా. ఇప్పుడు బోనస్ లో ఎలా మెలిక పెట్టారో, రుణమాఫీలో కూడా కొన్ని షరతులు పెట్టి భారం తగ్గించుకునే ప్రయత్నం జరగవచ్చు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు పాటించక తప్పదు. వాటిని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయాలి. ఎన్నికల సమయంలో నేతలు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చేస్తున్నారు.కొండకు వెంట్రుక కట్టినట్లు వ్యవహరించి అధికారం సాధించిన తర్వాత మాత్రం గుడ్లు తేలేయవలసి వస్తోంది. గతంలో కెసిఆర్ ప్రభుత్వం చిన్న,పెద్ద,ధనిక రైతులందరికి రైతు బంధు అమలు చేసింది.ఆ రోజుల్లో పలు విమర్శలు కూడా వచ్చాయి. పంటలు పండని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని అనేవారు. కొందరు బెంజ్ కార్లలో వెళ్లి రైతు బంధు డబ్బు తీసుకున్నారు. కౌలు రైతులకు ఆ స్కీమ్ అమలు చేయలేమని అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టంగానే చెప్పారు.కాంగ్రెస్ వారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని అన్నారు.కాని ఆ దిశగా ముందుకు వెళ్లలేదు.ఇక రుణమాఫీ అమలు ఎలా చేస్తారా అన్నది ఆసక్తికరంగా ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేయగలుగుతామని రేవంత్ తదితరులు ఆయా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అదికారంలోకి రాలేకపోతే ఏమి చేయాలన్న ప్రశ్న వస్తుంది. రిజర్వు బ్యాంక్ ను అప్రోచ్ అయి బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆలోచిస్తున్నారు. ఎక్సైజ్,రిజిస్ట్రేషన్ వంటి శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలు గతంలో కొన్ని ప్రభుత్వాలు చేయకపోలేదు. రిజర్వుబ్యాంక్ అందుకు అంత సుముఖత చూపలేదు. ఉదాహరణకు ఎపిలో 2014లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ చేయాలని తలపెట్టి ,రైతుసాధికార సంస్థను నెలకొల్పినా, ఆచరణలో హామీని నిలబెట్టుకోలేకపోయింది. 89 వేల కోట్ల రూపాయల రుణాల మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అంతా కలిపి పదిహేను వేల కోట్లు చేసి చేతులెత్తేశారు. అందులో కూడా రైతులు నానా పాట్లు పడవలసి వచ్చింది.ఎన్నో షరతులు పెట్టేసరికి వారికి విసుగు వచ్చింది.తత్పలితంగా రైతులంతా టిడిపి ప్రభుత్వం తమను మోసం చేసిందని భావించి 2019 ఎన్నికలలో ఓడించారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తపడే యత్నం చేస్తోంది. అయినా తొలి అడుగులోనే తడబడాల్సి వస్తోంది.ప్రభుత్వం వద్ద ఆర్దిక వనరులు పుష్కలంగా ఉంటే దేనినైనా చేయవచ్చు. అలా నిధులు లేవని తెలిసినా, శక్తికి మించిన పని అని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేసి ఇప్పుడు దిక్కులు చూడవలసి వస్తోంది. కాంగ్రెస్ మాత్రమే ఇలా చేస్తోందని కాదు.ఆయా రాష్ట్రాలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలాగే చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఒడిషా లో బీజేపీ ప్రతి మహిళకు ఏభైవేల రూపాయల చొప్పున ఓచర్ ఇస్తామని వాగ్దానం చేసిందట. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతీరున ఉంటున్నారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలలో మరికొన్ని ముఖ్యమైన హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్తితి ఉంది.వృద్దులకు ఇచ్చేపెన్షన్ ను నాలుగువేల రూపాయలు చేస్తామని ప్రకటించినా, ఆచరణ ఆరంభం కాలేదు. నిరుద్యోగ బృతి పరిస్థితి అంతే. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి అసలు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తామని అనడంపై విపక్షాలు మండిపడ్డాయి. మహాలక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. అది ఎప్పటికి అమలు అవుతుందో చెప్పలేరు. దానికి కూడా ఏవేవో కండిషన్లు పెట్టి అయిపోయిందని చెబుతారో ఏమో చూడాలి.500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ స్కీము అమలు చేశామని చెప్పారు కాని అది ఎంతమందికి వస్తుందో తెలియదు. మహిళలకు ఉచిత బస్ హామీని మాత్రం పూర్తిగానే అమలు చేస్తున్నట్లు లెక్క.ఆలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచారు. వీటివల్ల ప్రభుత్వంపై తక్షణ భారం ఉండదు.అయినా ఆర్టిసి భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి ఉంటుంది. మరో వైపు ప్రభుత్వం ఇప్పటికే సుమారు పదహారువేల కోట్ల అప్పు చేసిందని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కింద 6500 కోట్ల బకాయిలు ఉన్నాయని కాలేజీలవారు, ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆస్పత్రులవారు చెబుతున్నారు.ఈ నేపధ్యంలో రేవంత్ ప్రభుత్వానికి ఈ గ్యారంటీలు,వాటితో నిమిత్తం లేకుండా ఆయా డిక్లరేషన్ లలో చేసిన ఇతర హామీలు పెద్ద గుది బండలే అవుతాయని చెప్పకతప్పదు.ఒకరకంగా ఇది రేవంత్ ప్రభుత్వానికి సవాలు వంటిది. కొసమెరుపుగా ఒకటి చెప్పుకోవాలి. ఏపీ లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోసే ఈనాడు,తదితర ఎల్లో మీడియా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేసింది. సన్నవడ్లకు బోనస్ వల్ల రెండువేల కోట్ల భారం అని ఈనాడు రాసిందే తప్ప, కాంగ్రెస్ వాగ్దాన భంగం చేసిందని మాత్రం రాయకుండా జాగ్రత్తపడింది. చూశారుగా..తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీడియా ఎలా జాకీలు పెడుతోందో..బాకాలు ఊదుతోందో!. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు -
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్‌లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
వరికి రూ. 500 బోనస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే వానాకాలం సీజన్లో పండించే వరికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూన్‌లో నిర్వహించే ‘గ్లోబల్ రైస్ సమ్మిట్’ బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ్మిట్ నిర్వాహకులు డాక్టర్ జానయ్య, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కమిషనర్ గోపి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు వరి తక్కువ వేయాలని, అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేసి, పంటల సాగులో సమతుల్యత పాటించాలన్నారు. వరితోపాటు అన్ని పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని కోరారు. వివిధ దేశాలకు వరి ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు రాష్ట్రానికి ప్రతిబంధకంగా ఉన్నాయని, రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించుకోవాలన్నారు. కేరళ ప్రజలు దొడ్డు బియ్యం, కర్నాటక ప్రజలు సన్నబియ్యం, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో జనం చిట్టి ముత్యాలు వంటి రకాల బియ్యం వాడుతారని, ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలకు తెలంగాణ నుంచి రైస్ అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఎంత అవసరమైతే అంతమేరకు వరి సాగు చేయాలని, ఎగుమతులు పెంచడం వల్ల రాష్ట్రంలో అదనపు వరిని విక్రయించడానికి వీలుకలుగుతుందని పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం ఆలోచించి తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. ఇప్పటికే పేదలకు ఇస్తు న్న రేషన్‌రైస్ ఎవరూ వాడుకోవడం లేదని తుమ్మల అభిప్రాయపడ్డారు. -
పోలీసులపై ‘సంగం’ దౌర్జన్యం
చేబ్రోలు: తమకు బకాయి ఉన్న బోనస్ డబ్బులను చెల్లించాలని కోరిన ఏలూరు జిల్లా పాడి రైతులపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై సంగం డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలు పోసిన రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సుమారు రూ.50లక్షల బోనస్ డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారంటూ సంగం డెయిరీ సిబ్బందిని నిలదీసిన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం, వేములపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులపై చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు దాడి చేసిన విషయం విదితమే. డెయిరీ సిబ్బంది, ధూళిపాళ్ల అనుచరులు సుమారు వందమంది విచక్షణారహితంగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో 15మంది రైతులకు కాళ్లు, చేతులు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. మూడు కార్లు ధ్వంసం కావడంతో రూ.ఐదు లక్షల మేర నష్టం జరిగింది. అప్పట్లో బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులోని కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.రాంబాబు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆనంద్, పొన్నూరు ఎస్ఐ బార్గవ్, పోలీసు సిబ్బంది శుక్రవారం డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులు అనుమతి లేకుండా సంగం డెయిరీలోకి ప్రవేశించడానికి వీలులేదని తెలిపారు. ఏలూరు రైతులపై దాడి కేసులో నిందితులు డెయిరీలో ఉన్నారని.. వారి కోసం వచ్చినట్లు సీఐ, ఎస్ఐలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. సెర్చ్ వారెంట్, రెవెన్యూ అనుమతి కావాలని చెప్పడంతో ఇరువురు వీఆర్వోలు ఉన్నారని చూపినప్పటికీ లోపలికి రావడానికి వీల్లేదని పట్టుబట్టారు. సంగం డెయిరీ సిబ్బందితోపాటు, నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, పెదకాకాని మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ ఆ ఉద్యోగులకు బోనస్!
భారతీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ త్రైమాసిక పనితీరు ఆధారంగా బోనస్ చెల్లించ నుంది. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ పంపింది. ఈ ఇమెయిల్ ప్రకారం, అర్హులైన ఉద్యోగులకు మాత్రమే 80 శాతం వెరియబుల్ పే చెల్లిస్తుంది. జూలై-సెప్టెంబర్ కాలానికి పనితీరు బోనస్‌కు కొంతమంది ఉద్యోగులు అర్హులు కారని ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశ నింపింది. ఈ నెలలో గటున 80 శాతం చెల్లింపుతో అందజేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి క్యూ2కి సంబంధించి 6వ (PL6-మేనేజర్) స్థాయి, అంతకంటే తక్కువ బ్యాండ్‌లో ఉన్న ఉద్యోగులు సగటున 80 శాతం వేరియబుల్ పేగా అందుకుంటారు. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, నిర్వహించిన పాత్ర ఆధారంగా ఈ బోనస్ ఉంటుందని తెలిపింది. బోసన్ ఎంత అనేది యూనిట్ మేనేజర్లు నిర్ణయిస్తారని పేర్కొంది. కాగా గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభంఏడాది ప్రాతిపదికన 3.2 శాతం స్వల్పంగా పెరిగి రూ. 6,212 కోట్లకు చేరుకుంది ఆదాయం కూడా 7 శాతం వృద్ధితో రూ. 38,994 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ, కంపెనీ తన ఆదాయ వృద్ధి మార్గదర్శకాలను FY24కి 1 శాతం-2.5 శాతానికి సవరించింది. -
సింగరేణి కార్మికులకు దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా లాభాల వాటా బోనస్ రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్‌ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరామ్ గురువారం సర్క్యులర్‌ను జారీ చేశారు. చదవండి: ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ -
సింగరేణిలో ‘బోనస్’ బొనాంజా
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్: సింగరేణి ఉద్యోగులకు లాభాల పంట పండింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అర్జించిన రూ.2222 కోట్ల లాభాల్లో ఏకంగా 32 శాతం..అంటే రూ.711 కోట్లు సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది లాభాల వాటాలో 30 శాతం బోనస్‌గా చెల్లించగా, ఈసారి రెండు శాతం పెంచారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు మంగళవారం రాష్ట్ర ఇంధనశాఖకు లేఖ రాశారు. దీంతో సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.60లక్షల నుంచి రూ1.70లక్షల వరకు లాభాల్లో వాటాగా చెల్లించే అవకాశముందని సంస్థ వర్గాలు అంచనా వేశాయి. ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం వచ్చే దసరా పండుగకు ముందే బోనస్ చెల్లిస్తారు. 11వ వేతన సవరణ సంఘం బకాయిల కింద ఈ నెలలో సింగరేణి సంస్థ ఉద్యోగులకు రూ.1450 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. దీపావళి బోనస్ చెల్లింపులపై సైతం త్వరలో సంస్థ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకోనుంది. సింగరేణి సంస్థ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో లాభాల బోనస్ చెల్లించనుండడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి సింగరేణి లాభాల్లో వాటాను కార్మికులకు బోనస్‌గా ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. 1998లో తొలిసారిగా లాభాల్లో పది శాతాన్ని కార్మికులకు అందించారు. ఎన్నికల ఎఫెక్ట్ రాష్ట్రంలో ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉంది. 42 వేల మంది కార్మికులు/ఉద్యోగులు సంస్థలో పనిచేస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి వచ్చే నెలలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేప థ్యంలోనే ఎరియర్స్, బోనస్ చెల్లింపులు చకచకా సాగుతున్నాయనే భావన కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి రైతుకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కేలా కృషి చేస్తోంది. ఏ సీజన్‌కు ఆ సీజన్ ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను గ్రామ స్థాయిలోనే రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ద్వారా అందిస్తోంది. దీంతో రైతులపై రవాణా చార్జీల భారం తప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కామన్ వెరైటీ, గ్రేడ్–ఏ రకాల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ బాసటగా నిలుస్తోంది. ఇలా ప్రతి దశలోనూ రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి ‘ఈనాడు’ తనదైన శైలిలో విషం చిమ్ముతోంది. ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తావించకుండా, ఇతర రాష్ట్రాల్లో బోనస్ అంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా ‘వరి రైతుకు మిగిలేదేంటి?’ శీర్షికన ఓ కథనాన్ని వండివార్చింది. ఇందులో నిజానిజాల్లోకి వెళితే.. ఆరోపణ: 2022–23లో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గింది. వాస్తవం: రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 38.8 లక్షల ఎకరాలు, రబీలో 19.92 లక్షల ఎకరాలు.. అంటే మొత్తం విస్తీర్ణం 58.72 లక్షల ఎకరాలు. కాగా 55.52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అంటే వ్యత్యాసం 3.20 లక్షల ఎకరాలు. రబీలో బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో 1.15 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగు విస్తీర్ణం పెరిగింది. మరో 35 వేల ఎకరాల్లో మత్స్య సాగు విస్తరించింది. మిగిలిన భూమిని ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. వాస్తవం ఇలా ఉంటే ఏకంగా 9 లక్షల ఎకరాలు తగ్గిపోయిందంటూ ‘ఈనాడు’ వక్రభాష్యం చెప్పింది. ఆరోపణ: క్వింటా రూ.3,126 ప్రతిపాదిస్తే ఎందుకు తగ్గించారు? వాస్తవం: పెట్టుబడి ఖర్చుల ఆధారంగా దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని ప్రతిపాదిస్తాయి. ఇలా మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎకరాకు రూ.32 వేలు, రబీలో రూ.41 వేలు ఖర్చవుతుందన్న అంచనాతో క్వింటా రూ.3,126గా ఎంఎస్పీ నిర్ణయించాలని కేంద్రానికి నివేదిక పంపింది. ఇదే రీతిలో పంటల వారీగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రీతిలో వచ్చే ప్రతిపాదనలన్నీ క్రోడీకరించుకొని పంట కాలానికయ్యే సాగు ఖర్చును సరాసరి లెక్కించి పంటల వారీగా అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన మద్దతు ధరను కేంద్రం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అదే రీతిలో 2023–24 సీజన్‌కు సాధారణ రకానికి క్వింటాకు రూ.2,183, గ్రేడ్–ఏ రకానికి రూ.2,203గా కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధి ప్రతిపాదనలు పంపించడం వరకే. నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనన్న విషయం రామోజీకి తెలియనట్లుంది కాబోలు. ఆరోపణ: బోనస్ ఇవ్వాలన్న ఆలోచనే మరిచారు వాస్తవం: కేరళ, తమిళనాడు, జార్ఖండ్ వరికి బోనస్ ఇస్తున్నాయంటూ ‘ఈనాడు’ కొత్త వాదన తీసుకొ చ్చింది. మరి బోనస్ ఇస్తున్నా ఆయా రాష్ట్రాల్లో వరి సాగు ఎందుకు పెరగడం లేదు? ఏపీలో 24 లక్షల హెక్టార్లలో వరి సాగవుతుంటే కేరళలో 1.98 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 13.57 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 19 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిసాగవుతోంది. ఇక దిగుబడిని పరిశీలిస్తే ఏపీలో ఎకరాకు 23.24 క్వింటాళ్ల్ల దిగుబడి (2022–23) వస్తుంటే, తమిళనాడులో 17, జార్ఖండ్‌లో 9, కేరళలో 13 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఎంతగా ప్రోత్సహిస్తున్నా, వరిసాగు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పంటల వైపు అక్కడి రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే కేరళ.. ఏటా మన గోదావరి జిల్లాల్లో సాగయ్యే బోండాల కోసం క్యూ కడుతుంటే, తమిళనాడు.. రాయలసీమ జిల్లాల్లో సాగయ్యే ఫైన్ వెరైటీ, జార్ఖండ్.. ఉత్తరాంధ్రలో సాగయ్యే ఫైన్ వెరైటీ ధాన్యం కొనుగోలుకు ఎగబడుతున్నాయి. సాధారణంగా డిమాండ్ కంటే తక్కువ ఉత్పత్తి ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతోనే బోనస్ ప్రకటిస్తుంటారు. మన రాష్ట్రంలో డిమాండ్‌కు మించి ఉత్పత్తి జరుగుతోంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క సీజన్లో కూడా ఒక్క రూపాయి బోనస్ ప్రకటించిన పాపాన పోలేదు. అయినా ఇదేంటని రామోజీ అప్పట్లో ఏనాడైనా ప్రశ్నించారా? ఆరోపణ: మిల్లర్లకు ఎదురు సొమ్ము ఇవ్వాల్సి వస్తోంది వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో మిల్లర్లు, దళారీల కనుసన్నల్లోనే ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే ధాన్యం సేకరణ జరిగేది. ఏనాడూ ఏ ఒక్క రైతుకు కూడా ఎమ్మెస్పీ దక్కిన దాఖలాలు లేవు. కానీ నేడు దళారీలు, మిల్లర్ల ప్రమేయం కూడా లేకుండా ప్రతి గింజను కనీస మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం ఆర్బీకేలన్నింటిని ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యంలో మంచి రకాలను ఎంపిక చేసి అదనపు ఖర్చుల కింద క్వింటాకు రూ.110 వెచ్చించి నాణ్యమైన బియ్యంగా మార్చి కార్డుదారులకు ఇంటి వద్దే అందిస్తోంది. ఇవేమీ ‘ఈనాడు’కు కనిపించడం లేదు. ఆరోపణ: వరి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు వాస్తవం: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 17,94,279 మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2,65,10,747 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. బాబు హయాంలో తక్కువ మంది రైతుల వద్ద నుంచి ఎక్కువ మొత్తం ధాన్యం సేకరించేవారు. ఉదాహరణకు 2014–15లో 1.18 లక్షల మంది రైతుల నుంచి రూ.5,583 కోట్ల విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. నూటికి 90 శాతం సన్న, చిన్నకారు రైతులున్న ఈ రాష్ట్రంలో ఈ స్థాయిలో ధాన్యం అమ్మారంటే వార్ని ఏమంటారో అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఏకంగా 32,76,354 మంది రైతుల నుంచి రూ.58,739 కోట్ల విలువైన 3,10,56,117 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంతో పోలిస్తే ధాన్యం అమ్ముకున్న రైతుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఆరోపణ: అమ్మాలంటే అగచాట్లు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని బస్తా (75 కిలోలు)కు మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.500 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరాకు తక్కువలో తక్కువ 30–33 బస్తాల దిగుబడి వేసుకున్నా రూ.6 వేలకు పైగా రైతులు నష్టపోయేవారు. అంతేకాకుండా దళారులు, వ్యాపారులు తేమ శాతం పేరిట ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. కానీ ప్రస్తుతం జిల్లాకో మొబైల్ మిల్లును పంపి రైతుల ఎదుటే శాంపిల్స్ పరీక్షించి మరీ కొనుగోలు చేశారు. ముక్క విరుగుడు ధాన్యాన్ని బాయిల్డ్ రకంగా పరిగణించి మరీ కొన్నారు. గత ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తేమ, నూక శాతాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. బోనస్‌కు మించి జీఎల్టీ రైతు ప్రయోజనార్థం రైతు భరోసా కేంద్రాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించింది. అంతటితో ఆగకుండా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలు చేసేందుకు అదనపు ఖర్చులు భరించింది. మునుపెన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, హమాలి.. రవాణా చార్జీలు మద్దతు ధరతో పాటు కలిపి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచి ఖరీదు రూ.70. ఈ లెక్కన ఒక టన్ను ధాన్యం నిల్వ చేసేందుకు గోనె సంచుల కోసం రూ.1,750 ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. హమాలి ఖర్చు టన్నుకు రూ.220, రవాణాకు రూ.468 (25 కి.మీ పరిధిలో) చొప్పున.. మొత్తంగా టన్నుకు రూ.2,523 చొప్పున ప్రభుత్వం జీఎల్టీ (గన్నీ బాగులు, లేబర్, ట్రాన్స్పోర్ట్) రూపంలో ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ధాన్యం కొనుగోలు సొమ్ముతో కలిపి రైతు ఖాతాల్లో జమ చేస్తోంది. చదవండి: Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’ ఇది ఆయా రాష్ట్రాల్లో ఇచ్చే బోనస్‌తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. పైగా పక్క రాష్ట్రాల్లో పరిమితికి లోబడే కొనుగోలు చేస్తారు. మన రాష్ట్రంలో మాత్రం ఆర్బీకే వద్దకు వచ్చిన ప్రతి రైతు నుంచి ఈ–క్రాప్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తుండటం బహిరంగ రహస్యం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోని ఈనాడు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద చల్లడమే లక్ష్యంగా అర్ధసత్య కథనాలు ఎవరి కోసం రాస్తోంది? -
దిగిపోతున్న ఈ సీఈవో అందుకున్న పరిహారం రూ. 22 కోట్లు!
త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) వ్యాపార దిగ్గజం హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) సీఈవో, ఎండీ భారీ పరిహారాన్ని అందుకున్నారు. వచ్చే నెలలో దిగిపోతున్న సంజీవ్ మెహతా 2022 - 23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 22 కోట్లకు పైగా పరిహారాన్ని అందుకున్నారు. ఇందులో రూ. 6.3 కోట్ల బోనస్‌కూడా ఉంది. బోనస్ దాదాపు 50 శాతం పెరగడంతో సరాసరిగా మొత్తం పరిహారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారీగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 5 శాతం అంతర్గత వ్యాల్యూమ్ వృద్ధిని సాధించిన హెచ్‌యూఎల్ 16 శాతం వృద్ధితో రూ. 58,154 కోట్ల టర్నోవర్ సాధించింది. దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన సంజీవ్ మెహతా పదవీకాలంలో జూన్ నెలలో ముగియనుంది. ఇన్పుట్ కాస్ట్ ద్రవ్యోల్బణం కారణంగా తలెత్తిన కఠినమైన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని కంపెనీ పోర్ట్‌ఫోలియో అత్యధిక మార్కెట్ వాటా పొందేలా చేసిన ఘనత సంజీవ్ మెహతాకు దక్కుతుంది. జూన్ 27న పదవి నుంచి దిగిపోతున్న సంజీవ్ మెహతా కొత్త సీఈవో రోహిత్ జావాకు బాధ్యతలు అప్పగించనున్నారు. సింగపూర్ పౌరుడైన రోహిత్ జావా కూడా రూ. 21 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇందులో రూ. 7 కోట్ల టార్గెట్ బోనస్‌కూడా ఉంటుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు
సాక్షి, ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు అద్భుతమైన వార్త. తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కంపెనీ. రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించిన తర్వాత, ఎయిర్‌లైన్ దాని సిబ్బందికి ఎనిమిది నెలల జీతంతో సమానమైన బోనస్‌ను అందించనుంది. మెగా బోనస్ కోవిడ్ మహమ్మారి సమయంలో విశిష్ట సేవలందించిన, అర్హత కలిగిన ఉద్యోగులు 6.65 నెలల వేతనానికి సమానమైన లాభాల-భాగస్వామ్య ప్రోత్సాహకాన్ని, గరిష్టంగా 1.5 నెలల ఆదాయాన్ని ఎక్స్-గ్రేషియా బోనస్‌గా అందిస్తున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఎక్స్‌గ్రేషియా ఇన్సెంటివ్ ఉండదని చెప్పారు.(గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) స్టాఫ్ యూనియన్లతో ఒప్పందం ప్రకారం తమ దీర్ఘకాలిక వార్షిక లాభాల-భాగస్వామ్య బోనస్ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 1.62 బిలియన్ డాలర్లు (రూ.13వేల కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) అన్ని క్యాబిన్ తరగతుల్లో ఫార్వర్డ్ సేల్స్ చైనా, జపాన్ , దక్షిణ కొరియాలకు రిజర్వేషన్లు బలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ ధరల అనుబంధ సంస్థ స్కూట్‌లో ఒకే ఏడాదిలో ఆరు రెట్లు ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించారు (26.5 మిలియన్లు). (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మార్చిలో 79శాతంతో ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుంది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ షేర్లు గురువారం 1.2శాతం పెరిగాయి సింగపూర్ ఎయిర్ ఏప్రిల్‌లో 1.75 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లు సోమవారం నివేదించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 53శాతం పెరిగింది. ఇలాంటిమరెన్నో అద్భుతమైన వార్తలు, విశేషాల కోసం చదవండి :సాక్షి, బిజినెస్