
బోనస్ ప్రకటించిన బీహెచ్‌ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీహెచ్‌ఈఎల్ లాభం జూన్ త్రైమాసికంలో 3.9 శాతం వృద్ధితో రూ.80 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.77 కోట్లు. ఆదాయం మాత్రం 1.5 శాతం తగ్గి రూ.5,820 కోట్ల నుంచి రూ.5,732 కోట్లకు చేరింది.
మెటీరియల్స్, ఉద్యోగుల ప్రయోజనాలు, తరుగుదల తదితర రూపంలో వ్యయాలు 2 శాతం పెరిగి రూ.6,086 కోట్లకు చేరినట్టు సంస్థ తెలిపింది. విద్యుత్ రంగం నుంచి వచ్చిన ఆదాయం రూ.4,335 కోట్లుగా ఉంది. పూర్తి చేయాల్సిన ఆర్డర్ బుక్ విలువ రూ.1,01,380 కోట్లుగా ఉన్నట్టు బీహెచ్‌ఈఎల్ తెలిపింది. ప్రతి రెండు షేర్లకు గాను ఒక షేరును బోనస్‌గా ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది.