BHEL
-
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్‌తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్‌తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్‌ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
అది అగ్గే..కాదు పిడుగే!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన వ్యవహారంలో.. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు, ప్లాంట్ నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్కు మధ్య వివాదం ముదురుతోంది. ఇది ప్లాంట్‌లో విద్యుదుత్పత్తిపై ప్రభావం చూపి నష్టానికి కారణమవుతోంది. ఇటీవల బీటీపీఎస్‌లోని 270 మెగావాట్ల యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన విషయం తెలిసిందే.అంతర్గత సమస్య వల్లే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని జెన్కో దర్యాప్తులో తేల్చగా.. అది పిడుగుపాటుతోనే దగ్ధమైందని బీహెచ్ఈఎల్ చెబుతోంది. 320 ఎంవీఏ (మెగా వోల్ట్స్ యాంపియర్) సామర్థ్యమున్న ఈ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్.. మరమ్మతులు సాధ్యం కాని రీతిలో దెబ్బతిన్నదని, మరమ్మతులు చేసినా మళ్లీ కాలిపోతుందని బీహెచ్ఈఎల్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం కొలిక్కిరాకపోవడంతో.. యూనిట్–1 పునరుద్ధరణలో పీటముడి పడింది. రోజూ 6.48 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి గండిపడింది. రూ.108 కోట్ల విద్యుత్ నష్టం! ఈఆర్సీ టారిఫ్ ఉత్తర్వుల ప్రకారం.. భద్రాద్రి ప్లాంట్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.30 కాగా.. అందులో ఫిక్స్డ్ చార్జీ రూ.1.94, వేరియబుల్ చార్జీ రూ.2.36గా నిర్ధారించింది. ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా.. విద్యుత్ కేంద్రం నిర్మాణానికి తీసుకున్న పెట్టుబడి రుణాలను జెన్కో ప్రతినెలా క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన మొత్తాన్నే విద్యుత్ ధరలో ఫిక్స్డ్ చార్జీలుగా గణించి వసూలు చేస్తారు. ప్లాంట్ నుంచి విద్యుత్ కొన్నా, కొనకున్నా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు జెన్కోకు ఫిక్స్డ్ చార్జీలు చెల్లిస్తాయి. అదే సాంకేతిక సమస్యలతో విద్యుదుత్పత్తి నిలిచిపోతే ఫిక్స్డ్ చార్జీల నష్టాన్ని జెన్కోనే భరించాల్సి ఉంటుంది. భద్రాద్రి యూనిట్–1లో 39 రోజులుగా రోజుకు రూ.2.78 కోట్ల విలువైన విద్యుదుత్పత్తి నిలిచిపోగా.. ఇందులో రోజుకు రూ.1.25 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కో నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.108.66 కోట్ల విలువైన విద్యుదుత్పత్తికి గండిపడగా.. రూ.49.02 కోట్లను ఫిక్స్డ్ చార్జీల రూపంలో నష్టాన్ని భరించాల్సి వచ్చింది. రోజులు గడిచే కొద్దీ ఈ నష్టం పెరుగుతూ పోతుంది. వెంటనే మరమ్మతులు చేసి యూనిట్–1ను పునరుద్ధరించకపోతే జెన్కోకు రూ.వందల కోట్ల నష్టం తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరమ్మతులకు బీహెచ్ఈఎల్ ససేమిరా.. కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 270 మెగావాట్ల నాలుగు యూనిట్లున్నాయి. జూన్ 29న రాత్రి 7.30 గంటల సమయంలో ప్లాంట్‌లో పిడుగుపడింది. ఆ సమయంలో యూనిట్–1కు సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. అయితే పిడుగుపడిన సమయంలోనే.. యాదృచ్ఛికంగా జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంతర్గత లోపాలతో మంటలు రేగి కాలిపోయిందని జెన్కో ఇంజనీర్లు నిర్ధారించి నివేదిక సమరి్పంచారు. అంతర్గత సమస్యలతో కాలిపోయినందున నిర్మాణ సంస్థ బీహెచ్ఈఎల్ తన సొంత ఖర్చుతో పునరుద్ధరిస్తుందని పేర్కొన్నారు.మరోవైపు బీహెచ్ఈఎల్ నిపుణుల కమిటీ మాత్రం పిడుగుపాటు వల్లే జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ విరుద్ధమైన నివేదిక ఇచ్చింది. ట్రాన్స్ఫార్మర్కు తీవ్ర నష్టం జరిగిందని.. మరమ్మతులు చేసినా, మళ్లీ కాలిపోవడం ఖాయమని పేర్కొంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో మరమ్మతులు ఎవరు చేయాలన్న విషయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య వివాదం నెలకొంది. దీనితో యూనిట్–1 పునరుద్ధరణ పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీహెచ్ఈఎల్ మరమ్మతులకు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్లతో మరమ్మతులు చేయించేందుకు జెన్కో ప్రయతి్నస్తున్నట్టు తెలిసింది. -
బీహెచ్ఈఎల్కు జాక్ పాట్.. అదానీ పవర్ నుంచి భారీ ఆర్డర్
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు బీహెచ్ఈఎల్ తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి. -
BHEL కంపెనీ దగ్గర ఉద్రిక్త వాతావరణం.. ఆక్టోపస్ దళాల హంగామాతో ప్రజల్లో భయం
-
బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. మూర్తిని సీఎండీగా నియమించే ప్రతిపాదనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ఏసీసీ) ఆమోదం తెలిపిన విషయమై భారీ పరిశ్రమల శాఖ నుంచి బీహెచ్ఈఎల్కు సమాచారం అందింది. దీంతో సోమవారం సమావేశమైన బీహెచ్ఈఎల్ బోర్డు ఇందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సదాశివ మూర్తి కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ‘‘సీఎండీగా కొప్పు సదాశివ మూర్తి నియామకం నవంబర్ 1 తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు అమల్లోకి వస్తుంది. పదవీ విమరణ తేదీ 2027 ఫిబ్రవరి 28 వరకు లేదంటే, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు (ఏది ముందు అయితే అది) ఈ నియామకం అమల్లో ఉంటుంది’’అని బీహెచ్ఈఎల్ తెలిపింది. -
చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3 ) మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర తిరగరాసింది. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో లార్సెన్ & టూబ్రో (L&T), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తో సహా పలు కంపెనీలు ‘చంద్రయాన్-3’ మిషన్‌లో కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో మిషన్‌కు సహకరించాయి. ఎల్అండ్టీ పాత్ర ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్, ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది. మిదాని నుంచి లోహ మిశ్రమాలు మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్ చంద్రయాన్-3 మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది. బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3 క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే. చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది. గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్లను తయారు చేయడానికి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)కి అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్‌కు కీలకమైన సహాయాన్ని అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్ దోష్‌ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్‌సిస్టమ్‌లు కూడా ఈ సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది. -
బంగ్లాదేశ్ ప్రాజెక్టును పూర్తి చేసిన బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) బంగ్లాదేశ్‌లో నెలకొల్పిన మైత్రీ సూపర్ థర్మల్ పవర్‌ప్రాజెక్టులో యూనిట్–2ను పూర్తి చేసింది. 660 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్–2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు బుధవారం ప్రకటించింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్టీపీసీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన బంగ్లాదేశ్–ఇండియా ఫ్రెండ్షిప్ పవర్ కంపెనీ కోసం బీహెచ్ఈఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. -
వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్ట్ దక్కించుకున్నదెవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశీ రైల్వేలు కొత్తగా ప్రవేశపెట్టదలచిన వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(భెల్) కన్సార్షియం దక్కించుకుంది. తద్వారా మొత్తం 80 స్లీపర్ ట్రైయిన్ల తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీటిని 2029కల్లా అందించవలసి ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో టిటాగఢ్, భెల్ తెలియజేశాయి. మొత్తం కాంట్రాక్టు విలువను ర. 24,000 కోట్లుగా వెల్లడించాయి. దేశీ సంస్థల కన్సార్షియంకు ఈ స్థాయి విలువలో రైల్వే శాఖ కాంట్రాక్టునివ్వడం ఇదే తొలిసారికాగా.. వందే భారత్ స్లీపర్ రైళ్ల డిజైన్, తయారీతోపాటు.. 35 ఏళ్లపాటు నిర్వహణను చేపట్టనున్నాయి. టెండర్ విధానంలో ఏకైక ఆత్మనిర్భర్ కన్సార్షియంగా టిటాగఢ్ రైల్ సిస్టమ్స్, బీహెచ్ఈఎల్ కన్సార్షియం నిలిచింది. (ఇదీ చదవండి: చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలా ఎగతాళి చేసేవారు - అనంత్ అంబానీ) రెండేళ్లలో..: వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ కాంట్రాక్టును ఆరేళ్లలో పూర్తి చేయవలసి ఉన్నట్లు టిటాగఢ్ రైల్ వైస్‌చైర్మన్, ఎండీ ఉమేష్ చౌధరీ తెలియజేశారు. తొలి ప్రొటోటైప్ రైలును రెండేళ్లలోగా డెలివరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తదుపరి మిగిలిన రైళ్లను అందించనున్నట్లు వివరించారు. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) ప్రతీ రైలుకు 16 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. తద్వారా సువరు 887 మంది ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా డిజైన్ చేయనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచి్చన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగమవుతున్నందుకు గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. రైళ్ల తయారీలో చివరి దశ అసెంబ్లీ, పరిశీలన, నిర్వహణ వంటివి చెన్నైలోని దేశీ రైల్వే ప్లాంటులో చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
ఇది విన్నారా..! వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లు వస్తున్నాయ్
భారతదేశంలో ఇప్పుడు వందే భారత్ రైళ్ల హవా నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కొత్త వందే భారత్ మొదలైంది. అయితే రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసులు త్వరలోనే దేశం మొత్తం మీద అందుబాటులో రానున్నాయి. నివేదికల ప్రకారం, భెల్ (BHEL) నేతృత్వంలో ఉన్న కన్సార్టియం మరో ఆరు సంవత్సరాల్లో 80 స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే ఆర్డర్ సొంతం చేసుకుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ. 9,000 కోట్లకంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ప్రస్తుతం స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్ల వినియోగం కూడా చాలా అవసరమని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ఇదీ చదవండి: కొత్త యాప్‌లో కలిసిపోయిన ట్విటర్.. ఎలన్ మస్క్ ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లు ఢిల్లీ నుంచి ముంబై, ఢిల్లీ నుంచి హౌరా వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ట్రైన్లు ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ క్లాస్‌లను మాత్రమే కలిగి ఉంటాయి. అయితే స్లీపర్ క్లాసులు ఇప్పటికి అందుబాటులో లేదు. (ఇదీ చదవండి: AIMA Awards 2023: ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న వ్యాపారవేత్తలు.. వీరే!) స్లీపర్ క్లాస్ వందే భారత్ రైళ్లను అందించే భెల్ ఒక్క ట్రైన్ కోసం రూ. 120 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. కన్సార్టియం ICF చెన్నైలోని తయారీ యూనిట్‌తో పాటు భారతీయ రైల్వేలు కేటాయించిన రెండు డిపోలలో అందించిన ప్రత్యేక స్థలాన్ని కూడా సన్నద్ధం చేస్తుంది. మొత్తానికి స్లీపర్ క్లాస్ వందే భారత్ ట్రైన్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయని స్పష్టమవుతోంది. -
Hyderabad: మెట్రో రెండో దశ.. దూరమే!
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు విస్తరణ పనులు మరింత ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ కింద చేపట్టాలని భావించిన మూడు ప్రాజెక్టుల్లో ఒకటైన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు కేరిడార్‌ను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శంకుస్థాపన కూడా చేసింది. మిగతా రెండు ప్రాజెక్టులైన బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు పొడిగింపు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. ఆ దిశగా అడుగులు అంత వేగంగా పడడం లేదు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనుగంటి రవికుమార్ ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని కోరగా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వికాష్ కుమార్ ఈ మేరకు సమాధానమిచ్చారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తాము స్పందించామని, తదుపరి కార్యాచరణ లేదని స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమాధానమిస్తూ మెట్రో మంజూరుకు కీలకమైన డీపీఆర్‌లో మార్పులతో పాటు సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. వివరణ పంపని రాష్ట్రం డీపీఆర్‌ను ప్రస్తుత ధరలకు అనుగుణంగా మార్చాలని సూచించడంతో పాటు 14 అంశాలపై వివరణ కోరారు. తాము కోరిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు అర్వింద్‌కుమార్‌కు గత డిసెంబర్ 1న లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి వివరణ పంపలేదు. కేంద్రం అడిగిన కేబినెట్ తీర్మానం కాపీ, స్పెషల్ పర్పస్ వెహికిల్, నిధులు సమకూర్చే సంస్థను ఎంపిక చేయడం, రోడ్‌మ్యాప్ మొదలైనవాటిని ఫైనలైజ్ చేసి పంపాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పంపలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో రెండోదశ మెట్రో పనులపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
బీహెచ్ఈఎల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 56 శాతంపైగా జంప్‌చేసి రూ. 42 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 27 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 5,220 కోట్ల నుంచి రూ. 5,354 కోట్లకు స్వల్పంగా బలపడింది. పన్నుకుముందు లాభం 60 శాతం ఎగసి రూ. 53 కోట్లకు చేరింది. విద్యుత్ విభాగం నుంచి ఆదాయం 7 శాతం బలపడి రూ. 3,992 కోట్లను దాటింది. ఇండస్ట్రీ విభాగం టర్నోవర్ 21 శాతం క్షీణించి రూ. 947 కోట్లకు పరిమితమైంది. కంపెనీలో ప్రభుత్వానికి 63.17 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ. 75 వద్ద ముగిసింది. -
చిగురిస్తున్న మెట్రో ఆశలు.. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో హారం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పలు మార్గాల్లో మెట్రో మార్గం ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టుకు పునాదిరాయి పడిన నేపథ్యంలో.. తాజాగా పలు ప్రాంతాల నుంచి మెట్రో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటికి అధికార, విపక్ష పార్టీలు, వివిధ వర్గాల వారు మద్దతునిస్తుండడంతో నూతనంగా చేపట్టాల్సిన మెట్రో మార్గాలపై అధ్యయనానికి హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ శ్రీకారం చుట్టింది. ప్రతి కిలోమీటరు మెట్రో పూర్తికి సుమారు రూ.300 కోట్లు అంచనా వ్యయం అవుతుంది. ఈ స్థాయిలో నిధులు వ్యయం చేసే స్థితిలో రాష్ట్ర సర్కారు లేదన్న విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యం, లేదా కేంద్ర సహకారంతో పలు రూట్లలో ప్రాజెక్టులు చేపట్టడం.. తొలుత ప్రైవేటు సంస్థలు చేసే వ్యయంతో పూర్తిచేసి ఆ తర్వాత వాయిదా పద్ధతిలో సదరు సంస్థకు వడ్డీతో సహా చెల్లించడం (హైబ్రిడ్ యాన్యుటీ ) తదితర విధానాలపై సర్కారు దృష్టి సారించడం విశేషం. (క్లిక్ చేయండి: ఇక ఈజీగా ఆధార్ అప్డేట్) ఔటర్ చుట్టూ మెట్రో హారం... మహానగరానికి మణిహారంలా 158 కి.మీ మేర విస్తరించిన ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సుమారు 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలు ఔటర్ రింగ్‌రోడ్డు లోపలున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రూటు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు మెట్రో రూటు మరింత ఊపునిస్తుందన్న అంచనాలు సైతం వ్యక్తమవుతున్నాయి. -
హైదరాబాద్ : మెట్రో రైల్ రెండవ దశకు ముహూర్తం ఖరారు
-
సెయిల్ మాజీ ఛైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూత
బిజినెస్ వరల్డ్‌లో విషాదం చోటు చేసుకుంది. మాజీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), మారుతి సుజుకి చైర్మన్ వీ.కృష్ణమూర్తి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో వి.కృష్ణమూర్తి మరణించినట్లు సెయిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కృష్ణమూర్తి సెయిల్‌లో 1985 నుంచి 1990 వరకు చైర్మన్‌గా విధులు నిర్వహించారు. "పద్మ విభూషణ్ డాక్టర్. వెంకట రామన్ కృష్ణమూర్తి మరణం పట్ల సెయిల్ కుటుంబం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందంటూ" సెయిల్ విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఆయన సేవలు మరువలేం! వెంకట రామన్ కృష్ణమూర్తి సెయిల్, బీహెచ్ఈఎల్ వంటి దిగ్గజ సంస్థలకు చైర్మన్‌గా వ్యవరించారు. వీటితో పాటు మారుతి ఉద్యోగ్(మారుతి సుజుకి), గెయిల్‌లో చైర్మన్‌గా ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ మూర్తి మరణంపై మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ. బార్గవ విచారం వ్యక్తం చేశారు. అవుట్ స్టాండింగ్ లీడర్, గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. ఆయన సారధ్యంలోనే మారుతి ఉద్యోగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. భారత్‌లో జపనీస్ వర్క్ కల్చర్‌ను పరిచయం చేసింది కృష్ణమూర్తేనని గుర్తు చేశారు. వ్యక్తి గతంగా సివిల్ సర్వీస్ నుంచి ఇండస్ట్రీలిస్ట్‌గా ఎదగడానికి కృష్ణమూర్తి ఎంతో తోడ్పడ్డారని చెప్పారు. కృష్ణమూర్తి గొప్ప దార్శానికుడు. నా గురువుగా..టీవీఎస్ మోటార్‌ను ఒక సామ్రాజ్యంగా విస్తరించడంలో చేసిన కృషి చిరస్మరణీయం. అంతేకాదు వ్యాపార రంగంలో దేశ ఎకానమీ వృద్ది కోసం పాటు పడిన వారిలో కృష్ణమూర్తి ఒకరని టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ కొనియాడారు. -
రెండో దశ మెట్రో రూట్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ (27 కి.మీ)మార్గం ఏర్పాటుపై గతంలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించిన నివేదికలో సూచించిన అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రూట్లో ఎస్ఆర్డీపీ పథకం కింద నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్దారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో మార్గాన్ని ఫ్లైఓవర్ల వద్ద అత్యంత ఎత్తున ఏర్పాటు చేయడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకోవడమే కారణమని సమాచారం. గతంలో ఈ మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండేళ్ల క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సిద్ధం చేసిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ మెట్రో రూట్ ఇలా.. ఈ మార్గాన్ని బీహెచ్ఈఎల్, మదీనాగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డికాపూల్ రూట్లో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ రూట్లోనే తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో మెట్రో మార్గానికి అడ్డొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దాటుతూ మెట్రోను ఏర్పాటు చేసేందుకు అధిక వ్యయం కావడం, ప్రధాన రహదారిపై పనులు చేపట్టేందుకు వీలుగా రైట్ఆఫ్ వే ఏర్పాటు చేయడం వీలుకానందున మెట్రో మార్గంలో స్వల్ప మార్పులు అనివార్యమని హెచ్ఎంఆర్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మార్పులపై మెట్రో వర్గాల మౌనం.. మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) ఉన్నతాధికారులను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశం తమ పరిధిలోది కాదని.. మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. డీఎంఆర్సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంశాలివే.. బీహెచ్ఎఈఎల్–లక్డికాపూల్ మార్గంలో 22 మెట్రో స్టేషన్ల ఏర్పాటు. బీహెచ్ఈఎల్లో మెట్రో డిపో ఏర్పాటుకు 70 ఎకరాల స్థలం కేటాయింపు. రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక,ట్రాక్‌ల నిర్మాణం. భద్రతా పరమైన చర్యలు. టికెట్ ధరల నిర్ణయం. రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ. వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన. ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు. (చదవండి: పోలీసు కొలువు కొట్టేలా!) -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్, క్యూ4లో రూ.916 కోట్లు!
ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ.916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ.1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ.7,245 కోట్ల నుంచి రూ.8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ.8,644 కోట్ల నుంచి రూ.7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
మిథనాల్ ప్లాంట్ జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్/రామచంద్రాపురం (పటాన్చెరు): బొగ్గు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన కోల్ టు మిథనాల్ (సీటీఎం) ప్లాంట్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే శనివారం జాతికి అంకితం చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రోజుకు 0.25 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను బీహెచ్ఈఎల్ అభివృద్ధి చేసింది. ఎక్కువ బూడిద ఉండే భారతీయ బొగ్గు నుంచి 99 శాతం స్వచ్ఛతతో మిథనాల్‌ను ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఎక్కువ బూడిద కలిగి ఉండే భారతీయ బొగ్గును మిథనాల్‌గా మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి రావడం దేశంలో ఇదే తొలిసారి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఆత్మనిర్భర్ భారత్ కింద అభివృద్ధి చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. స్వదేశీ ఉత్పాదక రంగాన్ని నిర్మించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా తయారీ రంగం ప్రాముఖ్యతను ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేసిందన్నారు. పరిశోధన, అభివృద్ధికి బీహెచ్ఈఎల్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సంస్థ సీఎండీ నలిన్ సింఘాల్ పేర్కొన్నారు. -
బీహెచ్ఈఎల్, నాగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
నాగ్‌పూర్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్), పవర్ సెక్టర్ వెస్టర్న్ రీజియన్ నిర్ణీత కాల ప్రాతిపదికన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 36 ► పోస్టుల వివరాలు: ఇంజనీర్లు(సివిల్)–10, సూపర్వైజర్లు(సివిల్)–26. ► ఇంజనీర్లు(సివిల్): అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం బ్యాచిలర్స్ డిగ్రీ/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.71,040 చెల్లిస్తారు. ► సూపర్వైజర్లు(సివిల్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.39,670 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్, డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్) బీహెచ్ఈఎల్, పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్, 345 కింగ్స్వయ్, నాగ్‌పూర్–440001 చిరునామకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.01.2022 ► దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 14.01.2022 ► వెబ్సైట్: pswr.bhel.com -
బాల్యమిత్రులతో ఉల్లాసంగా ఎయిర్‌చీఫ్ మార్షల్
సాక్షి, హైదరాబాద్: రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ చౌదరి హాజరై చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడిపారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బాల్యంలో తాను చదువుకున్న రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. జూబ్లీక్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో వివేక్‌చౌదరి సహాధ్యాయి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. -
బీహెచ్ఈఎల్లో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్).. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► విభాగాలు: హైడ్రోజన్ ఎకనామిక్స్, ఆడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్, అప్‌స్ట్రీమ్ సోలార్ వాల్యూ చైన్, ఎనర్జీ స్టోరేజ్, కోల్ టూ మిథనాల్, కార్బన్ క్యాప్చర్. ► అర్హత: మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పని అనుభవం ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: సెలక్షన్ బోర్డ్ ద్వారా అభ్యర్థుల్ని స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల్ని ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021 ► వెబ్సైట్: www.bhel.com -
బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్‌లు.. అప్లై చేసుకోండి
ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 80 ► ఖాళీల వివరాలు: మెకానికల్ ఇంజనీరింగ్–20, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్–20, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–20, మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్–20. ► అర్హత: 30.11.2018 తర్వాత సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 30.11.2021 నాటికి 23ఏళ్లు మించకుండా ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దర ఖాస్తులకు చివరి తేది: 15.11.2021 ► వెబ్సైట్: www.bel-india.in బెల్, చెన్నైలో 73 అప్రెంటిస్‌లు చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. 2021–22 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 73 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–63, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.11,110 చెల్లిస్తారు. ► టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్‌లు:విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. స్టయిపెండ్: నెలకు రూ.10,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.11.2021 ► బెల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 25.11.2021 ► వెబ్సైట్: www.mhrdnats.gov.in -
భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో..
ఎన్నో భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్టుగా గ్రీన్ ఎనర్జీ విభాగంలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన తొలి పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించింది. తొలి అడుగు హైదరాబాద్‌లో కర్బన ఉద్ఘారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక విధాలైన టెక్నాలజీలు వస్తున్నాయి. అందులో భాగంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ కాలుష్యంతో ఎక్కువ శక్తిని ఇచ్చే ఇంధనాన్ని తయారు చేసే టెక్నాలజీని భెల్ అభివృద్ధి చేసింది. అందులో భాగంగా బొగ్గు నుంచి మిథనాల్ ఉత్పత్తి చేసే ప్లాంటుని పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌లో భెల్ ప్రారంభించింది. ఉమ్మడి పరిష్కారం సాధారణంగా మిథనాల్‌ని నేచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తారు. అయితే మన దేశంలో సహాయ వాయు నిల్వలు సమృద్ధిగా లేకపోవడంతో ప్రతీసారి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతేకాదు అధికంగా విదేశీ మారక ద్రవ్యం దీనిపై ఖర్చు చేస్తోంది. మరోవైపు మన దేశంలో బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నా వాటిలో బూడిద శాతం ఎక్కువగా ఉంటోంది. అందువల్లే కాలుష్యం ఎక్కువ వస్తోందనే నెపంతో కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనేక కోర్రీలు ఎదురవుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఉమ్మడి పరిష్కారంగా భెల్ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. బూడిద నుంచి మీథేన్ సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న పలు ఏరియాల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో యాష్ (బూడిద) కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. ఈ బొగ్గుకి డిమాండ్ కూడా తక్కువ. ఇలాంటి బొగ్గును ప్రత్యేక పద్దతిలో ప్రాసెస్ చేసి మిథనాల్‌గా మార్చే పరిశ్రమను హైదరాబాద్‌లో భెల్ ప్రారంభించింది. ప్రతీ రోజు ఈ ప్లాంటు నుంచి రోజుకు 0.25 టన్నుల మిథనాల్ ఉత్పత్తి అవుతోంది. దీని ప్యూరిటీ 99 శాతంగా ఉండటం గమనార్హం. నీతి అయోగ్ సహకారంతో ఇండియాలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్నా అందులో యాష్ కంటెంట్ ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. దీంతో ఈ బొగ్గును పూర్తి స్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ బొగ్గును మిథనాల్ మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిని భెల్‌కి 2016లో నీతి అయోగ్ అప్పటించింది. ఐదేళ్ల శ్రమ నీతి అయోగ్ సూచలనలు అనుసరించి కోల్ టూ మిథనాల్ ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి రూ. 10 కోట్లు కేటాయించారు. ఐదేళ్ల శ్రమ అనంతరం తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ద్రవరూప మిథనాల్‌ని డీజిల్‌కి ప్రత్యామ్నాయంగా వాడుకునే వీలుంది. చదవండి : Reliance AGM 2021:ఫ్యూచర్ గ్రీన్ ఎనర్జీదే... భవిష్యత్ భారత్‌దే -
బొగ్గుతో మెథనాల్ ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే దిశలో భారత్ మరో ముందడుగు వేసింది. బూడిద శాతం ఎక్కువగా ఉండే భారతీయ బొగ్గు నుంచి మోటారు ఇంధనంగా ఉపయోగపడే మెథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన టెక్నాలజీని డిజైన్ చేసింది. ప్రయోగాత్మక రియాక్టర్‌ను విజయవంతంగా పరీక్షించింది. మెథనాల్‌తో కాలుష్యం తక్కువ పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే మెథనాల్‌తో కాలుష్యం తక్కువ. ఇప్పటికే నౌకల ఇంజిన్లలో దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. అంతేకాకుండా.. మెథనాల్‌తో డీజిల్ మాదిరిగానే ఉండే డై మిథైల్ ఈథర్‌ను కూడా తయారు చేయవచ్చు. కొద్దిపాటి మార్పులతో ఈ ఇంధనాన్ని కార్లు, లారీలు, బస్సుల్లో వాడుకోవచ్చు. ప్రపంచ దేశాల్లో మెథనాల్‌ను సహజ వాయువుతో తయారు చేస్తుండగా భారత్‌లో దాని నిక్షేపాలు తక్కువగా ఉన్న కారణంగా సాధ్యపడటం లేదు. భారత్‌లో విస్తారంగా అందుబాటులో ఉన్న బొగ్గుతో తయారు చేయగలిగినా భారతీయ బొగ్గులో బూడిద మోతాదు చాలా ఎక్కువ. 98 నుంచి 99.5 శాతం స్వచ్ఛత: సారస్వత్ అందుబాటులో ఉన్న అదేతరహా బొగ్గును వినియోగించుకుని మెథనాల్ తయారు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం అంటే 2016లోనే హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)లో దీనికి సంబంధించిన పరిశోధనలు మొదలయ్యాయి. నీతి అయోగ్ సహకారంతో మొదలైన ఈ పరిశోధనల్లో భాగంగా టెక్నాలజీకి రూపకల్పన చేసి, ముందుగా రోజుకు 0.25 టన్నుల మెథనాల్‌ను తయారు చేసే ఓ రియాక్టర్‌ను తయారు చేయాలని నిర్ణయించారు. నాలుగేళ్ల శ్రమ తరువాత, కేంద్ర ప్రభుత్వం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం ఇచ్చిన రూ.10 కోట్ల గ్రాంట్‌తో తొలి రియాక్టర్ సిద్ధమైంది. దీనిని గత సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీనిద్వారా ఉత్పత్తి అయిన మెథనాల్ 98 నుంచి 99.5 శాతం స్వచ్ఛతతో ఉన్నట్లు తెలిసిందని, నీతి అయోగ్ గౌరవ సభ్యులు, డీఆర్డీవో మాజీ డైరెక్టర్ డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. బొగ్గును గ్యాస్‌గా మార్చి వాడుకునేందుకు, బొగ్గు నుంచి స్వచ్ఛ ఇంధనం హైడ్రోజన్‌ను తయారు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది తొలి విజయమని పేర్కొన్నారు. -
'ఉక్కు' పరిరక్షణకు 29న భారీ మానవహారం
గాజువాక: విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 29న నిర్వహించనున్న భారీ మానవహారం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. అగనంపూడి నుంచి బీహెచ్ఈఎల్ వరకు జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పొడవునా 10 వేల మంది కార్మికులతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఫిబ్రవరి 18న నిర్వహించిన ఉక్కు పరిరక్షణ దినోత్సవానికి రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయన్నారు. ఆ తరువాత కాలంలో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానికి రెండు లేఖలను రాశారని, అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని పంపిందని పేర్కొన్నారు. జీవీఎంసీ కూడా తన మొదటి కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. పార్లమెం ట్ సమావేశాల్లో మన ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జవాబు ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రం తన విధానాలను మార్చుకోకుండా మొండిగా తన నిర్ణయాలను అమలు చేస్తానని చెప్పడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వరుస పరిణామాలతో తెలంగాణ నీటిపారుదల యంత్రాంగం బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెజిట్ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావ డంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోపక్క కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖకు ఊపిరి సలపడం లేదు. లేఖాస్త్రాలతో పెరుగుతున్న ఒత్తిడి గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే.. అందులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి. ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. నాలుగురోజులుగా తలమునకలు ఇలా కోర్టు కేసులు, కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలు, వాటికి వివరాల సమర్పణ, లేఖలకు సమాధానాలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడం తదితర పనుల్లో రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్లు గడిచిన నాలుగు రోజులుగా తల మునకలుగా ఉన్నారు. ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కోర్టు కేసులు, తదితర అంశాలపై రిటైర్ట్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంపుల సరఫరా చేస్తే డబ్బులిస్తారా? తాజాగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పంపులు, మోటార్లను సరఫరా చేస్తున్న బీహెచ్ఈఎల్ సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వీటికి అనుమతులు వస్తాయా? అనుమతులు వచ్చేంతవరకూ పనులు నిలిపివేయాలా? ఒకవేళ పంపులు, మోటార్లు సరఫరా చేస్తే చెల్లింపులు యధావిధిగా కొనసాగుతాయా? అనే ప్రశ్నలకు వివరణ కోరినట్లు సమాచారం. -
హైదరాబాద్: ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..?
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో 69 కి.మీ మార్గంలో పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు నిర్మాణ సంస్థ రూ.16 వేల కోట్లు వ్యయం చేసింది. మెట్రో ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా నష్టాల బాట తప్పడంలేదు. గతేడాదిగా కోవిడ్ విజృంభణ, వరుస లాక్డౌన్ల కారణంగా మెట్రోకు కష్టాలు..నష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సంఖ్య గతేడాది లాక్‌డౌన్‌కు ముందు నాలుగున్నర లక్షలు కాగా.. తాజాగా లాక్డౌన్ ఎత్తివేయడంతో సంఖ్య సుమారు 80 వేలుగా ఉన్నట్లు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. అంచనాలు తలకిందులు... మెట్రో మాల్స్ నిర్మాణం, వాణిజ్య ప్రకటనలు, రవాణా ఆధారిత, రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా భారీగా రెవెన్యూ ఆర్జించవచ్చన్న నిర్మాణ సంస్థ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టును ప్రభుత్వం సొంత నిధులతో చేపట్టడం దాదాపు అసాధ్యమే. తాజా అనుభవాలతో మెట్రో ప్రాజెక్టులు వాణిజ్య పరంగా అంతగా గిట్టుకాటు కావని రుజువుకావడంతో..ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలు సైతం ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. విశ్వవ్యాప్తంగా సుమారు వందకు పైగా మెట్రో రైలు ప్రాజెక్టులుండగా.. సింగపూర్, హాంకాంగ్, టోక్యో, తైపి మినహా మిగతా అన్ని ప్రాజెక్టులదీ నష్టాల బాటేనన్నది నిర్మాణరంగ సంస్థ వర్గాల మాట కావడం గమనార్హం. రెండోదశ కింద ప్రతిపాదించిన మార్గాలివే.. మెట్రో రెండోదశ కింద బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ (29 కి.మీ), గచ్చిబౌలి–శంషాబాద్ (22 కి.మీ) మెట్రో మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనా ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ జఠిలంగా మారడంతో రెండోదశ మెట్రో ప్రాజెక్టు ఎప్పటికి సాధ్యపడుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ మెట్రో మార్గం ఇదీ.. ► బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ వరకు తీసుకొచ్చి ప్రస్తుత మెట్రో లైనులో కలిపేలా డీపీఆర్ సిద్ధమైంది. ► ఈ మార్గం మొత్తంగా 29 కి.మీ ఉంటుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్ఎల్)లతోపాటు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. ► బీహెచ్ఈఎల్ దగ్గర మెట్రోరైలు ఎక్కితే చందానగర్ మీదుగా ఆల్విన్ క్రాస్ రోడ్డు వరకు జాతీయ రహదారిలో ప్రయాణం సాగుతుంది. తర్వాత హఫీజ్‌పేట వైపు తిరుగుతుంది. కొత్తగూడ, గచ్చిబౌలి, బయోడైవర్శిటీ, కాజగూడ, విస్పర్‌వ్యాలీ, టోలీచౌక్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్ మీదుగా లక్డీకాపూల్ చేరుకుంటుంది. అక్కడ ప్రస్తుతం ఉన్న మెట్రోలైనులో కలుస్తుంది. గచ్చిబౌలి–శంషాబాద్ మెట్రో రూటు ఇదీ.. ►గచ్చిబౌలి–రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 22 కిలో మీటర్ల పొడవున మెట్రో లైనును నిరి్మంచడానికి డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. ► బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడా తెలంగాణా పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ వరకు ఏర్పాటుచేయాల్సి ఉంది. ► ఈ మార్గంలో హైస్పీడ్ రైలును నడపాలని ప్రతిపాదించారు. ఈమేరకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు రెండోదశ మార్గాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి ఈ రూట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ► కాగా సుమారు రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం కానున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపట్టాలని నిర్ణయించినా నిధుల లేమితో ఈ మెట్రో రూటు సైతం కాగితాలకే పరిమితమవడం గమనార్హం. ఈ మార్గాల్లో మెట్రో లేనట్టేనా..? గతంలో మరో ఐదు మార్గాల్లో రెండోదశ మెట్రో ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని నిర్ణయించినప్పటికీ ఆదిశగా అడుగులు పడకపోవడంతో ఈ కింది మార్గాల్లో మెట్రో అనుమానమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1.ఎల్బీనగర్–హయత్‌నగర్ 2.ఎల్బీనగర్–ఫలక్‌నుమా–శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3.మియాపూర్–పటాన్చెరు 4.తార్నాక–ఈసీఐఎల్ 5.జేబీఎస్ –మౌలాలి -
బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు
బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్–06, ప్రాజెక్ట్ ఇంజనీర్–03. ► ట్రెయినీ ఇంజనీర్: అర్హత: ఏరోస్పేస్/ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 01.05.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. జీతం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ► ప్రాజెక్ట్ ఇంజనీర్: అర్హత: ఏరోస్పేస్/ఏరోనాటికిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ /బీఎస్సీ(ఇంజనీరింగ్)/ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.ఎంఈ/ ఎంటెక్ అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. వయసు: 01.05.2021 నాటికి 28ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. జీతం: మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకు రూ.50,000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్(హెచ్ఆర్/ఎస్సీ–యూఎస్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, జలహల్లీ, బెంగళూరు–560013 చిరునామాకు పంపించాలి. ► దర ఖాస్తులకు చివరి తేది: 09.06.2021 ► వెబ్సైట్: https://www.bel-india.in మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు -
బెల్లో 16 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు
బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 16 » పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్ (సివిల్) –10, ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) –06. ట్రెయినీ ఇంజనీర్(సివిల్): » అర్హత: సివిల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28,000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్): » అర్హత: ఎలక్ట్రికల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. » పని ప్రదేశాలు: ఏఆర్కోణం, వైజాగ్, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, గోవా, ముంబై. » ఎంపిక విధానం: బీఈ/బీటెక్ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వివిధ విభాగాలకు కింద సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది. –బీఈ/బీటెక్ మార్కులకు75శాతం; –పోస్టు క్వాలిఫికేషన్ అనుభవానికి 10శాతం; ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2021 » వెబ్సైట్: https://careers.bhel.in/bhel/jsp/ బీహెచ్ఈఎల్ భోపాల్‌లో 300 అప్రెంటిస్ ఖాళీలు భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 300 » ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్–80, ఫిట్టర్–80, మెషినిస్ట్ కంపోజిట్–30, వెల్డర్(గ్యాస్–ఎలక్ట్రిక్)–20, టర్నర్–20, కంప్యూటర్(కోపా/పాసా)–30, డ్రాఫ్ట్‌మెన్ (మెకానిక్)–05, ఎలక్ట్రిక్ మెకానిక్–05, మెకానికల్ మోటార్ వెహికిల్–05, మెషినిస్ట్(గ్రైండర్)–05, మాసన్–05, పెయింటర్(జనరల్)–05, కార్పెంటర్–05, ప్లంబర్–05. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 14–27ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం–బీసీ/ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.02.2021 » దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.03.2021. » చిరునామా: బీహెచ్ఈఎల్, భోపాల్ (మధ్యప్రదేశ్)– 462022. » వెబ్సైట్: https://bpl.bhel.com/bplweb_new/careers/index.html -
బీహెచ్‌ఈఎల్‌షేరు ఢమాల్: ఎందుకంటే
సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్ తగిలింది. క్యు3లో ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్లో బీహెచ్ఈఎల్ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును మరింత దెబ్బ తీసింది. 2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో 218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన కంపెనీ, మార్కెట్ వర్గాలను భారీగా నిరాశపర్చింది. అలాగే ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభం, ఆర్డర్ల క్షీణత కూడా కంపెనీ లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్ కాల్ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత కొనసాగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది. -
మృత్యు దారం!
ఇదే పొజిషన్లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది.. ఈ పాపం ఎవరిది? అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే.. సాక్షి, హైదరాబాద్: బీహెచ్ఈఎల్ సమీపంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు.. ఏంటా ప్రమాదం.. అమీన్పూర్ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్స్, కింగ్ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్పూర్ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కొత్తగా మాస్కులు.. ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇదీ చరిత్ర ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్ అమీన్ ఖాన్ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. ‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ – సంజీవ్‌వర్మ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. -
Q4- బీహెచ్ఈఎల్, క్యాస్ట్రాల్ వీక్
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచాయి. దీంతో విదేశీ మార్కెట్లలో మళ్లీ చమురు ధరలు పతనంకాగా.. దేశీయంగా స్టాక్ మార్కెట్లలోనూ అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 500 పాయింట్లు పతనమై 33,281కు చేరగా.. నిఫ్టీ 150 పాయింట్లు పడిపోయి 9,822 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఎంఎన్ఎసీ.. క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. బీహెచ్ఈఎల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్ పరికరాల కంపెనీ బీహెచ్ఈఎల్ రూ. 1532 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 681 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 54 శాతం క్షీణించి రూ. 4594 కోట్లకు పరిమితమయ్యాయి. గతంలో రూ. 1278 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించగా.. తాజా త్రైమాసికంలో రూ. 708 కోట్ల ఇబిటా నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 30 దిగువన ట్రేడవుతోంది. క్యాస్ట్రాల్ ఇండియా లూబ్రికెంట్స్, స్పెషాలిటీ ప్రొడక్టుల దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా ఈ ఏడాది క్యూ1(జనవరి-మార్చి)లో 32 శాతం తక్కువగా రూ. 125 కోట్ల నికర లాభం ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 29 శాతం వెనకడుగుతో రూ. 688 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 41 శాతం నీరసించి రూ. 170 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో క్యాస్ట్రాల్ ఇండియా షేరు తొలుత 5 శాతం పతనమై రూ. 116కు చేరింది. ప్రస్తుతం రికవరై 1 శాతం నష్టంతో రూ. 121 దిగువన ట్రేడవుతోంది. -
ఈ భెల్‌మిస్టర్.. కరోనా స్పెషల్
నోయిడా: అవసరం అన్నీ నేర్పిస్తుందంటారు. ఈ భారీ స్ప్రేయర్ కూడా అలాంటిదే. ఇది కరోనా స్పెషల్. తక్కువ సమయంలో ఎక్కువ భాగంలో రసాయనాలు స్ప్రే చేయడానికి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్).. నాలుగే నాలుగు రోజుల్లో దీన్ని డిజైన్, ఉత్పత్తి పూర్తి చేసింది. దీని పేరు భెల్‌మిస్టర్.. రసాయనాలు వ్యర్థం కాకుండా వాటిని అతి సూక్ష్మ బిందువుల రూపంలో మార్చి ముఫ్పై అడుగుల దూరం వరకూ వెదజల్లుతుంది. ఈ భెల్‌మిస్టర్ ద్వారా వాహనాలపై రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో దీన్ని వాడుతున్నారు. (భెల్‌మిస్టర్ మిషన్‌తో కరోనా నియంత్రణ) -
తగ్గిన భెల్ నికర లాభం, నష్టాల్లో షేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ కంపెనీ భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.196 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.162 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ.7,564 కోట్ల నుంచి రూ.5,828 కోట్లకు చేరిందని భెల్ తెలిపింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రూ.64 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.322 కోట్లుగా ఉంది. క్యూ3 ఫలితాలు మార్కెట్‌ను నిరుత్సాహరపచడంతో కంపెనీ షేరు ఏడాది కనిష్టానికి దిగివచ్చింది. కీలక సూచీలు లాభాలతో దూసుకుపోతుండగా మంగళవారం మార్కెట్ ముగిసిన తరువాత బీహెచ్ఈఎల్ కంపెనీ ఫలితాలను విడుదల చేసింది. దీంతో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 7 శాతం కుప్పకూలింది. -
పాల్వంచలో మరో విద్యుత్ ప్లాంట్ !
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో మరో విద్యుత్ ప్లాంట్ నిర్మించడంపై జెన్కో యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్స్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై గురువారం సర్వే చేపట్టారు. 1966 –78 మధ్య కాలంలో నిర్మించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం(720 మెగావాట్ల) ప్లాంట్లలో ఈ ఏడాది డిసెంబర్ 31తో ఉత్పత్తి ఆపేయాల్సి ఉంది. అనంతరం కర్మాగారాన్ని నేలమట్టం చేస్తారు. అయితే ఇక్కడి భౌగోళిక వనరులను ఉపయోగించి ఓఅండ్ఎం కర్మాగారం స్థానంలో మరో ప్లాంట్ నిర్మించే అంశంపై బీహెచ్ఈఎల్, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే చేశారు. మూసివేత అనంతరం నేల మట్టం చేయకుండా భవిష్యత్ ప్లాంట్‌కు ఉపయోగకరంగా పనిచేసే నిర్మాణాలను పరిశీలించారు. ముఖ్యంగా కూలింగ్ టవర్ల స్థితిగతులపై అధ్యయనం చేశారు. అయితే, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ కంటే మెరుగైన టెక్నాలజీతో ప్లాంట్ రూపుదిద్దుకోవడానికి ఇక్కడ భూమితో పాటు బొగ్గు, నీటి వసతులు పుష్కలంగా ఉన్నాయని సర్వే బృందం గుర్తించింది. దీని వల్ల అతి తక్కువ మోతాదులో మాత్రమే కాలుష్యం వెలువడుతుందని చెబుతున్నారు. కొత్త టెక్నాలజీతో నిర్మించే సూపర్ క్రిటికల్ ఆల్ట్రా యూనిట్లను భారత దేశంలోనే మొదటిసారిగా పాల్వంచలో ఏర్పాటు చేయాలని యోచిస్తుండటం విశేషం. ఇప్పటివరకూ యూనిట్లకు మరమ్మతులు వస్తే.. చాలా రోజుల పాటు రాష్ట్ర గ్రిడ్‌కు ఉత్పత్తి నిలిచిపోయేది. అయితే ఆల్ట్రా యూనిట్లకు మరమ్మతులు తక్కువని, ఒకవేళ వచ్చినా చేయడం సులువని అధికారులు చెబుతున్నారు. -
భెల్ లాభం 42 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ, భెల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360 కోట్లకు తగ్గింది. ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీకి నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ కాలానికి రూ.125 కోట్ల నికర లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.98 కోట్ల నికర నష్టాలు (కన్సాలిడేటెడ్) వచ్చాయని భెల్ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,050 కోట్ల నుంచి రూ.11,033 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.54.55 వద్ద ముగిసింది. -
వేధింపులకు బీహెచ్ఈఎల్ ఉద్యోగిని బలి
-
వాళ్లు నన్ను చంపేస్తారు; ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఉన్నతాధికారి వేధింపులు తాళలేక బీహెచ్ఈఎల్ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగిక వేధింపులకు పాల్పడి తనను చిత్రవధ చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రఘురాం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోపాల్‌కు చెందిన రాజుకుమారి, తులసీరాం దంపతుల కుమార్తె నేహా చౌక్సే (33) బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన సునీల్ కండిల్‌వాల్‌తో ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న నేహా.. తన భర్త 2018 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు రావడంతో ఆమె కూడా ఆర్సీపురంలోని బీహెచ్ఈఎల్కు బదిలీ చేయించుకుంది. ప్రస్తుతం వీరిద్దరు మియాపూర్, ప్రజయ్‌సిటీలోని భానుటౌన్‌షిప్‌లో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో భోపాల్‌లో పని చేసే సమయంలో అదే కంపెనీలో పనిచేస్తున్న డీజీఎం నేహను తరచూ వేధింపులకు గురి చేసేవాడు. అయితే బదిలీ అయి నగరానికి వచ్చిన తర్వాత కూడా అతడి వేధింపులు కొనసాగాయి. ఇందులో భాగంగా గత కొన్నిరోజులుగా తన ఫోన్ టాపరింగ్ చేసి రికార్డింగ్ చేస్తున్నాడని నేహా నోట్లో పేర్కొంది. సదరు డీజీఎం తన పలుకుబడితో తనపై కంపెనీలో చెడుగా ప్రచారం చేస్తున్నారని మనస్తాపానికి లోనైంది. ‘ఆర్థర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి నాపై అత్యాచారానికి పాల్పడి.. చంపాలని చూస్తున్నాడు. ఆ తర్వాత నా సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ నకిలీ లేఖను సృష్టించి కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడు. ఈ నోట్‌ను నేను వాష్‌రూంలో రాస్తున్నా. నేను ఆఫీసు నుంచి వచ్చే ముందు ఓ వ్యక్తి నన్ను కలిశాడు. ఈరోజు ఎలాగైనా నాపై లైంగిక దాడికి పాల్పడతామని చెప్పాడు. గతంలో కూడా వాళ్లు ఇలాగే చేశారట. ఈ విషయం గురించి నాకు ఒకరు చెప్పారు. ఆధారాలు లేనిదే అత్యాచారాన్ని నిరూపించలేరనే ధైర్యంతో తనపై దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పారు. వాళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు’ అని నేహ తన డైరీలో రాసుకున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భెల్ నష్టాలు రూ.219 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ భెల్ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.219 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత క్యూ1లో రూ.40 కోట్ల నికర లాభం ఆర్జించామని భెల్ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.6,116 కోట్ల నుంచి రూ.4,673 కోట్లకు తగ్గిందని పేర్కొంది. విద్యుత్తు విభాగం ఆదాయం రూ.4,636 కోట్ల నుంచి రూ.3,492 కోట్లకు, ఇండస్ట్రీ సెగ్మెంట్ ఆదాయం రూ.1,161 కోట్ల నుంచి రూ.920 కోట్లకు తగ్గాయని భెల్ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భెల్ షేర్ 2 శాతం నష్టంతో రూ.57 వద్ద ముగిసింది. -
బీహెచ్ఈఎల్ సీఎండీగా నలిన్ షింగల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ బీహెచ్ఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నలిన్ షింగల్ నియమితులయ్యారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదేళ్లు ఈయన పదవీకాలం ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ, తదుపరి ఆదేశాలకు లోబడి పదవీకాలం ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. -
‘పాలమూరు’పై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయా లని ఆదేశించింది. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు లో దాఖలు చేయగా హైకోర్టు దాన్ని తోసిపుచ్చడంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును నాగం ఆశ్రయించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వం లోని ధర్మాసనం వద్దకు సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్యాకేజీ 1, 5, 8, 16 పనుల అంచనా వ్యయాన్ని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960.79 కోట్లుగా మదించగా.. తెలంగాణ ప్రభుత్వం బీహెచ్ఈఎల్, మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థలతో కుమ్మక్కై అంచనాలను రూ.8,386 కోట్లకు పెంచింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,426 కోట్లు నష్టం వాటిల్లింది. మోటారు పంపుసెట్లకు అధిక రేటు చూపి, యంత్రాలు డిజైన్ చేసి సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ కంటే అదనంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థకు చెల్లించారు. ప్యాకేజీ–5లో ఒక పంపు సెట్‌కు రూ.92 కోట్లు, ఒక మోటారుకు రూ.87 కోట్లుగా లెక్కించి 9 మోటారు పంపుసెట్లకు రూ.179 కోట్ల చొప్పున రూ.1,611 కోట్ల చెల్లింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెల్లింపుల బ్రేకప్‌లో మాత్రం బీహెచ్ఈఎల్కు రూ.803 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.808 కోట్లను మెఘా సంస్థకు చూపారు. వాస్తవానికి ఇక్కడ అయిన ఖర్చు రూ.803 కోట్లు మాత్రమే. ఇక సివిల్ పనులకు మరో రూ.1,459 కోట్లు ఖర్చుగా చూపారు. అంటే యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు అదనంగా వెచ్చించారు. ఇక్కడ సివిల్ పనులు చూడాల్సిన మెఘా సంస్థ ఈ రూ.1,459 కోట్లు పొందడమే కాకుండా.. ప్యాకేజీ–5 మొత్తం ఈసీవీ విలువైన రూ.4,018 కోట్లలో మిగిలిన రూ.2,558 కోట్ల నుంచి కూడా తీసుకుంది. వీటిలో బీహెచ్ఈల్కు రూ.803 కోట్లు చెల్లించింది. ఇదే తరహాలో ఎలక్ట్రికల్, మెకానికల్ యంత్రాలకు ఎక్కువ వ్యయా న్ని చూపడం ద్వారా నవయుగ సంస్థకు కూడా లబ్ధి చేకూర్చారు. ప్యాకేజీ 1, 16లలో బీహెచ్ఈఎల్–మెఘా సంస్థ 145 మెగావాట్ల మోటారుకు రూ.38 కోట్లు కోట్ చేసింది. నవయుగ సంస్థ రూ.40 కోట్లకు కోట్ చేసింది. కానీ ప్రభుత్వం 145 మెగావాట్ల మోటారుకు రెండు సంస్థలకు రూ.87 కోట్లు ఆమోదించింది. అంటే దాదాపు రూ.50 కోట్లు పెంచింది. వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా హైకోర్టు వీటిని విస్మరించింది’ అని వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొంది. అందులో ఆశ్చర్యమేమీ లేదు.. పాలమూరు అంశంపై పిటిషనర్ 4 పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు రెండింటిని కొట్టేసిందని, మరో రెండు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. యంత్రాల ఖర్చు కంటే సివిల్ పనులకు ఎక్కువ వ్యయం కావడంలో ఆశ్చర్యం లేదని, ఆ ప్రాజెక్టు స్వరూపమే ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ఆరోపణలను తోసిపుచ్చిందని వివరించారు. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందిస్తూ ‘మీ వాదనలు కూడా వింటాం. అంకెలు చూస్తుంటే అసాధారణ రీతిలో ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి. మీరు కరెక్టే కావచ్చు. కానీ ఈ కేసును మేం విచారిస్తాం’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్ రోహత్గీ బదులిస్తూ ‘హైకోర్టు ఈ అంశాలను కొట్టివేసింది’ అని నివేదించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే స్పందించారు. ‘హైకోర్టు కొట్టివేసి ఉండొచ్చు. కానీ అంకెలు అసాధారణ రీతిలో ఉండటాన్ని హైకోర్టు ప్రస్తావించలేదు’ అని జస్టిస్ పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్ తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘ఒకవేళ బీహెచ్ఈఎల్ సంస్థ తాను సరఫరా చేసిన పంపుసెట్లు, మోటారు సెట్లు అమర్చడంతో పాటు సివిల్ పనులు చేపట్టి ఉంటే ఎంత వసూలు చేసేది..’ అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది స్పందిస్తూ ఖర్చు మదింపు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ నేపథ్యం లో కేసును ఏప్రిల్ 26కు వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
బీహెచ్ఈఎల్ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఢిల్లీ– చండీగఢ్ జాతీయ రహదారిపై సోలార్ ఆధారిత చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్ ప్రకటించింది. ‘‘250 కిలోమీటర్ల పరిధిలో మధ్య మధ్యలో ఈ ఎలక్ట్రిక్ చార్జర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల మధ్యలో చార్జింగ్ అయిపోతుందేమో!! ప్రయాణించటం కష్టమేమో!! అనే భయాలు ఎలక్ట్రిక్ వాహనాదారుల్లో తొలగుతాయి. ఎలక్ట్రిక్ వాహన ప్రయాణాలపై విశ్వాసం పెరుగుతుంది’’ అని భెల్ వివరించింది. దేశంలో వాహన కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు, ఇంధన దిగుమతులకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, చార్జింగ్ వసతుల లేమి కొనుగోళ్లకు అడ్డుపడుతోంది. ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను తామే సొంతంగా డిజైన్ చేయటంతో పాటు తయారీ, సరఫరా, ఇన్స్టాల్ కూడా చేస్తామని బీహెచ్ఈఎల్ తెలిపింది. ప్రతీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌తో ఉంటుందని, వేగంగా, నిదానంగా చార్జ్ చేసే వసతులు కూడా ఉంటాయని వివరించింది. బీహెచ్ఈఎల్ ఇప్పటికే ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్లో డీసీ చార్జర్లను ఏర్పాటు చేసింది. ఎలక్ట్రిక్ చార్జర్ల ఏర్పాటుకు సంబంధించి మరో ఆర్డర్ కూడా సంస్థ నిర్వహణలో ఉంది. -
నవంబర్ చివరినాటికి వీవీప్యాట్లు సిద్ధం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 17 లక్షల వీవీప్యాట్(ఓటు రశీదు) యంత్రాలను నవంబర్ చివరినాటికి సమకూర్చుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. భవిష్యత్తులో జరగబోయే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వీవీప్యాట్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వెల్లడించింది. ఇందుకోసం 17.45 లక్షల యూనిట్ల వీవీప్యాట్ మెషీన్ల తయారీకి బెంగళూరులోని బెల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 9 లక్షల యంత్రాలు సిద్ధమయ్యాయని, మిగిలిన 8 లక్షల యంత్రాలను నవంబర్ చివరినాటి అందిస్తామని ఆ రెండు కంపెనీలు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. -
పోలీసుస్టేషన్ ముందే నిప్పంటించుకున్నాడు
హైదరాబాద్: తల్లిదండ్రులు, సోదరుడిపై తన మామ కేసు పెట్టినందుకు కోపంతో ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు మంటలు ఆర్పి, అతడిని ఆస్పత్రికి తరలించారు. బీహెచ్ఈఎల్ సమీపంలోని బీరంగూడకు చెందిన సతీశ్(24) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్ 7న బంజారాహిల్స్ రోడ్ నెం.5లోని దేవరకొండ బస్తీకి చెందిన శివానితో అతడికి వివాహం జరిగింది. ఇటీవల అత్తమామలకు, శివానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఈనెల 12న సతీశ్ తల్లి సీతాదేవి, తండ్రి మనోజ్‌కుమార్, సోదరుడు సాయికుమార్ దేవరకొండ బస్తీలోని శివాని ఇంటికి వచ్చారు. చెప్పకుండా పుట్టింటికి ఎందుకు వచ్చావంటూ గొడవ పడ్డారు. అక్కడే ఉన్న శివాని తల్లిదండ్రులు షగుప్తా, మనోజ్‌కుమార్‌లపై దుర్భాషలాడారు. దీంతో శివాని తండ్రి ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశారు.ఈ విషయం తెలుసుకున్న సతీశ్.. తీవ్ర ఆగ్రహంతో మామకు ఫోన్ చేసి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అల్లుడు తనను బెదిరిస్తున్న విషయాన్ని ఆయన పోలీసులకు చెప్పడంతో వారు సతీశ్‌కు ఫోన్ చేశారు. కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పి స్టేషన్‌కు రమ్మన్నారు. మట్టి పోసి మంటలు ఆర్పిన పోలీసులు... బుధవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వచ్చిన సతీశ్.. మరోసారి మామకు ఫోన్ చేశాడు. కేసు వెనక్కి తీసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. ఆయన సరిగా స్పందించకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు. మామను దుర్భాషలాడుతూ అగ్గిపుల్ల గీసి అంటించుకున్నాడు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటల్లో చిక్కుకుని అటూ ఇటూ పరుగులు పెడుతున్న సతీశ్‌ను.. అక్కడే ఉన్న పోలీసులు కాపాడారు. అతడి మీద మట్టి పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వెంటనే కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి డీఆర్డీఏ అపోలోకు తరలించారు. ప్రస్తుతం సతీశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. -
మెట్రో కోచ్‌ల తయారీలోకి భెల్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ భెల్ మెట్రో రైలు కోచ్‌ల తయారీరంగంలోకి ప్రవేశించనున్నదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. భారత్‌లో నాలుగు విదేశీ కంపెనీలతో కలిసి లిథియమ్–ఆయాన్ బ్యాటరీలను తయారు చేసే సాధ్యాసాధ్యాలపై ఈ కంపెనీ కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ఉద్దేశించిన ఫేమ్ ఇండియా రెండో దశ సెప్టెంబర్ తర్వాత ప్రారంభమవుతుందని ఒక పత్రికా సమావేశంలో ఆయన చెప్పారు. ఫేమ్ రెండో దశ అమలు కోసం రూ.9,300 కోట్లు కేటాయించాలని బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని, దీంట్లో రూ.1,000 కోట్లు ఛార్జింగ్ సదుపాయాల కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు. లిథియమ్ అయాన్ జేవీలో 20% వాటా భెల్‌కు, మిగిలిన 80%వాటా ఆ నాలుగు కంపెనీలకు ఉంటాయని తెలిపారు. -
భెల్ లాభం డబుల్
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్ నికర లాభం నాలుగో త్రైమాసిక కాలంలో దాదాపు రెట్టింపైంది. 2016–17 క్యూ4లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్ఆలోన్) తాజా క్యూ4లో 112 శాతం వృద్ధితో రూ.457 కోట్లకు ఎగసింది. రాబడి అధికంగా రావడంతో ఈ స్థాయిలో నికర లాభం పెరిగిందని భెల్ తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.10,476 కోట్ల నుంచి రూ.10,342 కోట్లకు పడిపోగా, టర్నోవర్ మాత్రం రూ.9,479 కోట్ల నుంచి రూ.9,833 కోట్లకు ఎగసిందని భెల్ సీఎమ్‌డీ అతుల్ సోబ్తి చెప్పారు. నిర్వహణ లాభం రూ.569 కోట్ల నుంచి దాదాపు రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,232 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్ 6.3 శాతం వృద్ధితో 12.1 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. మొత్తం డివిడెండ్ 91 శాతం రూ.2 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు 51 శాతం (రూ.1.10) డివిడెండ్‌ను చెల్లించనున్నామని సోబ్తి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను 40 శాతం మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని, దీంతో మొత్తం డివిడెండ్ 91 శాతానికి పెరుగుతుందని వివరించారు. గత నాలుగేళ్లలో ఇదే అత్యధిక డివిడెండ్ అని తెలిపారు. 1976–77 నుంచి అప్రతిహతంగా డివిడెండ్‌ను చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇక 2016–17లో రూ.496 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.807 కోట్లకు పెరిగిందని సోబ్తి చెప్పారు. టర్నోవర్ రూ.27,740 కోట్ల నుంచి రూ.27,850 కోట్లకు పెరిగిందని తెలిపారు. రూ.1,18,000 కోట్లకు ఆర్డర్లు.. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో రూ.40,932 కోట్ల ఆర్డర్లను సాధించామని, మార్కెట్ వాటా మరింతగా పెంచుకున్నామని అతుల్ సోబ్తి చెప్పారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆర్డర్లు, రూ.33,342 కోట్లతో పోల్చితే 74% వృద్ధి సాధించామని వివరించారు. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం ఆర్డర్లు రూ.1,18,000 కోట్లకు చేరాయని, గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. లాభాల జోరుతో బీఎస్ఈలో భెల్ షేర్ దూసుకెళ్లింది. స్టాక్ మార్కెట్ పడినప్పటికీ, ఈ షేర్ ఇంట్రాడేలో 10% లాభంతో రూ.86.80ను తాకింది. చివరకు 5.5 శాతం లాభంతో రూ.83.60 వద్ద ముగిసింది. -
భెల్ లాభం 64% అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సర క్యూ3లో నమోదైన రూ.93 కోట్లతో పోలిస్తే 64 శాతం అధికం. మరోవైపు ఆదాయం రూ. 6,187 కోట్ల నుంచి రూ. 6,494 కోట్లకు పెరిగింది. 2017–18కి గాను 40 శాతం మధ్యంతర డివిడెండు (షేరుకు రూ.0.80) ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 28న దీన్ని చెల్లిస్తామని కంపెనీ తెలియజేసింది. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నిల్చిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు నిర్విరామ కృషి మొదలైనవి సానుకూల ఫలితాలిస్తున్నాయని భెల్ చైర్మన్ అతుల్ సోబ్తి ఈ సందర్భంగా చెప్పారు. -
కేటీపీఎస్ 7వ దశలో అరుదైన రికార్డు
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): కేటీపీఎస్ ఏడో దశ పనుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏడాదిన్నరలోనే కూలింగ్ టవర్‌ను పూర్తి చేసి ఈ రికార్డును సాధించారు. దేశంలోని 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగారాల్లో కూలింగ్ టవర్‌ను ఇంత తక్కువ వ్యవధిలో నిర్మించడం విశేషం. రూ.5,200కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగార పనులను బీహెచ్ఈఎల్ కంపెనీ నిర్వహిస్తోంది. కర్మాగారంలో ప్రాధాన్యత కలిగిన కూలింగ్ టవర్‌ను బీహెచ్ఈఎల్ సంస్థ పహార్పూర్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. వాస్తవంగా కేటీపీఎస్ 7వ దశ పనులు 2015 జనవరిలో ప్రారంభం కాగా ఏడాదిన్నర ఆలస్యంగా కూలింగ్ టవర్ పనులు ప్రారంభించారు. ఆలస్యంగా పనులు చేపట్టడంతో కూలింగ్ టవర్ నిర్మాణం వెనుకబడుతుందని అధికారులు ఆందోళన చెందారు. కానీ,2016 జూలై 12న పనులు ప్రారంభించి డిసెంబర్ 30 నాటికి పూర్తి చేశారు.175 మీటర్ల ఎత్తులో విశాలమైన ఈ కట్టడాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేసి రికార్డ్ సాధించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మూడేళ్లలో యాదాద్రి విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ కేంద్రం పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ని ర్మాణ పనులను చేపడుతున్న బీహెచ్ఈఎల్ కంపెనీ సీఎండీ అతుల్ సోబ్జీ శుక్రవారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆయనను కోరారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకత, జాప్యాన్ని నివారించేందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు ఈ పని అప్పగించామని, ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి అయ్యే రూ.20,379 కోట్ల వ్యయంలో మొదటి విడతగా రూ.417.16 కోట్ల చెక్కును బీహెచ్ఈఎల్ సీఎండీకి అందించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని అనుమతులు వచ్చాయి బీహెచ్ఈఎల్ సీఎండీకి చెక్కు అందజేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని.. దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్లాంట్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి ప్లాంటుకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల అనుమతులు వచ్చాయని తెలిపారు. ‘‘వచ్చే మార్చి నుంచి రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. దానికితోడు ఎత్తిపోతల పథకాల నిర్మాణం జరుగుతోంది. కొత్తగా అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇతరత్రా వినియోగం కూడా పెరుగుతోంది. అందువల్లే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం. అన్నింటిలోకెల్లా యాదాద్రి ప్లాంటు ముఖ్యమైంది..’’అని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎత్తిపోతల పథకాలు, పరిశ్రమలు, మిషన్ భగీరథ, మెట్రో రైలు తదితర కార్యక్రమాల నిర్వహణకు ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సీఎంను కలసిన టీఎస్ఈఆర్సీ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పడి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. కమిషన్ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యుడు హెచ్.శ్రీనివాస్ శుక్రవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. వచ్చే ఏడాది మణుగూరు ప్లాంటు కొత్తగూడెం, మణుగూరులో నిర్మిస్తున్న కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై చర్చ జరిగింది. కొత్తగూడెంలో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణం 2–3 నెలల్లో పూర్తవుతుందని, వచ్చే ఏడాది మణుగూరు ప్లాంటూ పూర్తవుతుందని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరించారు. -
మూడేళ్లలో అత్యధికంగా భెల్ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌పరికరాల తయారీ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్) 2016–17లో మొత్తం 79 శాతం మేర డివిడెండ్ చెల్లించింది. తొలి విడతగా 40 శాతం, మలివిడతలో 39 శాతం చెల్లించింది. గడిచిన మూడేళ్లలో ఇదే అత్యధికమని, గతేడాది చెల్లించిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని భెల్ తెలిపింది. దీంతో నాలుగు దశాబ్దాల నుంచి నిరాటంకంగా ఇన్వెస్టర్లకు డివిడెండ్లు అందిస్తున్న సంస్థగా నిల్చింది. విలువపరంగా చూస్తే 2016–17లో భెల్ మొత్తం మీద రూ. 386.72 కోట్లు, కేంద్రానికి రూ.244 కోట్లు డివిడెండ్ చెల్లించినట్లయింది. మలి విడతకు సంబంధించి రూ.120.39 కోట్ల చెక్కును భెల్ సీఎండీ అతుల్ సోబ్ది.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ జి. గీతేకి బుధవారం అందించారు. -
బుల్లెట్ ట్రెయిన్: బీహెచ్ఈఎల్ జోష్
సాక్షి, ముంబై: దేశంలో తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును దక్కించుకుందన్న వార్తలతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్) మార్కెట్లో దూసుకుపోతోంది. రూ. 1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న దేశంలోని తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బీహెచ్ఈఎల్ కవాసాకితో కలిసి పని చేయనుందనే అంచనాలు ఇండస్ట్రీలో భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భెల్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు గురువారం 10 శాతం పెరిగింది. దీంతో ఈ ఏడాదిలోనే ఇది అత్యంత ఎక్కువ పెరుగుదలగా నమోదైంది. అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రోలింగ్ స్టాక్ కోసం భెల్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ కలిసి పనిచేస్తాయని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే వ్యాఖ్యలను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ నివేదించింది. మరోవైపు ఇది తమకు మంచి ప్రోత్సాహాన్నందిస్తుందని భెల్ సీఎండీ తెలిపారు. దీంతో బీహెచ్ఈఎల్ స్టాక్ భారీ లాభాలతో 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా జపాన్ సాయంతో దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు నిర్మాణానికి కేంద్రం నాంది పలికింది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నిర్మాణ పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే గురువారం అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు. -
స్కూల్ యూనిఫాం వేసుకోలేదని..దారుణం
-
బోనస్ ప్రకటించిన బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీహెచ్ఈఎల్ లాభం జూన్ త్రైమాసికంలో 3.9 శాతం వృద్ధితో రూ.80 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.77 కోట్లు. ఆదాయం మాత్రం 1.5 శాతం తగ్గి రూ.5,820 కోట్ల నుంచి రూ.5,732 కోట్లకు చేరింది. మెటీరియల్స్, ఉద్యోగుల ప్రయోజనాలు, తరుగుదల తదితర రూపంలో వ్యయాలు 2 శాతం పెరిగి రూ.6,086 కోట్లకు చేరినట్టు సంస్థ తెలిపింది. విద్యుత్ రంగం నుంచి వచ్చిన ఆదాయం రూ.4,335 కోట్లుగా ఉంది. పూర్తి చేయాల్సిన ఆర్డర్ బుక్ విలువ రూ.1,01,380 కోట్లుగా ఉన్నట్టు బీహెచ్ఈఎల్ తెలిపింది. ప్రతి రెండు షేర్లకు గాను ఒక షేరును బోనస్‌గా ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. -
పేదలకు రాయితీ విద్యుత్!
► సమర్థంగా ఉత్పత్తి చేస్తే సాధ్యమే: సీఎం కేసీఆర్ ► విద్యుత్ ప్రాజెక్టులపై ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణను మిగులు విద్యుత్‌గల రాష్ట్రంగా మార్చేందుకు సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. సమర్థంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే అంతిమంగా ప్రజలకు మేలు జరుగుతుందని... పేదలు, రైతులకు రాయితీలు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహె చ్‌ఈఎల్ ఈ ప్రక్రియలో మరింత వేగం సాధించాలని కోరారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మంగళవారం అక్కడే వివిధ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్నతస్థాయిలో సమీక్షిం చారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు సీతారాం నాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలా చారి, బీహెచ్ఈఎల్ చైర్మన్ అతుల్ సోక్తి, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో ఈడీ అజయ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల ప్లాంటును డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. మణుగూరులో 1,080 మెగావాట్ల బీటీపీఎస్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దామరచర్లలో నిర్మించతలపెట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగూడెంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంటు స్థాపనకు సిద్ధం కావాలన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించలేదని సీఎం గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి అంతా ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే జరగాలన్న నియమం పెట్టుకుని త్రికరణ శుద్ధితో అమలు చేస్తు న్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన బీహెచ్ ఈఎల్, జెన్కో ప్రభుత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: ఆద్యంతం ఊగిసలాట ధోరణిలో కొనసాగిన బుధవారం స్టాక్ మార్కెట్లు, ఆఖరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 17.47 పాయింట్ల లాభంలో 29,336.57 వద్ద ముగియగా.. నిఫ్టీ 1.65 పాయింట్ల నష్టంలో 9103.50 వద్ద క్లోజైంది. రెండు సూచీల్లో అదానీపోర్ట్స్, బీహెచ్ఈఎల్, పవర్ గ్రిడ్, భారతీ ఇన్ఫ్రాటెల్లు టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, అరబిందో ఫార్మా నష్టాల్లోనడిచాయి. ఇండస్ఇండ్ బ్యాంకు లాభాల్లో అంచనాలను అందుకోలేకపోవడంతో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 1-2 శాతం పడిపోయాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా 5 పైసలు లాభపడి 64.58 వద్ద ట్రేడైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 190 రూపాయలు పడిపోయి 29,324 గా నమోదయ్యాయి. -
సెమీస్‌లో బీహెచ్ఈఎల్, ఈగల్స్
సాక్షి, హైదరాబాద్: నవాబ్ షుజాత్ అహ్మద్ ఖాన్ స్మారక బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఈగల్స్, బీహెచ్ఈఎల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. సిటీ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ జట్టు 57– 47తో షార్ప్ షూటర్స్ జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ షార్ప్ షూటర్స్ యువ ఆటగాళ్లు అద్భుత పోరాట పటిమతో ఆకట్టుకున్నారు. బీహెచ్ఈఎల్ జట్టులో రాజు, రాహుల్ చెలరేగడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి 29–22తో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తర్వాత అదే జోరును కొనసాగిస్తూ మూడో క్వార్టర్లో 48–30తో ఏకంగా 18 పాయింట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరిదైన నాలుగో క్వార్టర్లో షార్ప్ షూటర్స్ దీటుగా పోరాడినప్పటికీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. చివరికి 10 పాయింట్ల తేడాతో బీహెచ్ఈఎల్ గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో బీహెచ్ఈఎల్ తరఫున రాజు (13), పాల్ (13) ఆకట్టుకున్నారు. షార్ప్ షూటర్స్ జట్టులో అశ్విన్ 17 పాయింట్లు స్కోర్ చేయగా.. ఒమేర్ 12 పాయింట్లు చేశాడు. ఈగల్స్ జోరు రాజేంద్రనగర్ బాస్కెట్‌బాల్ క్లబ్‌తో జరిగిన మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో ఈగల్స్ జట్టు 52– 28తో ఘనవిజయం సాధించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో రాజేంద్రనగర్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఈగల్స్ జట్టులో రోహన్ (21), అమన్ (15) అద్భుత ప్రదర్శన కనబరిచారు. రాజేంద్రనగర్ జట్టు తరఫున సలీమ్ (16) ఒక్కడే చివరి వరకు పోరాడాడు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్‌గా మిక్స్డ్ సంకేతాలు వస్తుండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 21.98 పాయింట్ల లాభంతో 27257.64 వద్ద , నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 8417 వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల గరిష్టంలో నమోదైన ఆసియన్ స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, గెయిల్, హీరో మోటోకార్పొ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. రెండు నెలల కాలంలో బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.5 శాతం పైకి ఎగిసింది. ఎస్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి లాభాలను పండించాయి. సెన్సెక్స్‌లో మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది. నాల్కో, హిందాల్కో, వెదంతా, జేఎస్పీఎల్, టాటా స్టీల్ లాభాలతో మెటల్ షేర్లు 2 శాతం పెరిగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు పడిపోయి, 68.05గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18 రూపాయలు పడిపోయి 28,720గా నమోదైంది. -
బీహెచ్ఈఎల్కు రూ.109 కోట్ల లాభం
చెన్నై: పవర్ ఎక్విప్‌మెంట్‌లో అగ్రగామి కంపెనీ అరుున ప్రభుత్వ రంగ బీహెచ్ఈఎల్ సెస్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.109 కోట్ల లాభాన్ని గడించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.181 కోట్ల మేర నష్టాలను నమోదు చేయడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.6,860 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.6,314 కోట్లకం టే 9 శాతం వృద్ధి చెందింది. కంపెనీకి చెందిన అన్ని విభాగాల్లోనూ వృద్ధి నెలకొంది. విద్యుత్ విభాగం ఆదాయం 10.5 శాతం పెరిగి రూ.5,254 కోట్లుగా నమోదైంది. ఇబిటా రూ.155 కోట్లుగా ఉండగా... గతేడాది ఇదే కాలంలో ఇది రూ.438 కోట్ల నష్టంగా ఉండడం గమనార్హం. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్డర్ బుక్ విలువ రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
భగీరథకు భెల్ సాంకేతికత
పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం సర్కారు సంప్రదింపులు 2,900 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్ల కొనుగోలుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌లో పంపింగ్ స్టేషన్ల ఏర్పాటు నిమిత్తం అవసరమైన సాంకేతిక సహకారాన్ని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్.. భెల్) నుంచి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి గురువారం సచివాయలంలో బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాల నిమిత్తం బీహెచ్ఈఎల్ ప్రతినిధులతో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 1,066 మోటార్లు అవసరమని, 10 నుంచి 2,900 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటర్లను తయారు చేసి సకాలంలో అందించాలని ప్రశాంత్‌రెడ్డి బీహెచ్ఈఎల్ అధికారులను కోరారు. అంతకు మునుపు భగీరథ ప్రాజెక్ట్ లక్ష్యం, పురోగతి, ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును అధికారులకు ప్రశాంత్‌రెడ్డి వివరించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై అవగాహనతోనే, కాంటూర్ల ఆధారంగా సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారని చెప్పారు. రాష్ట్రంలోని 26 సెగ్మెంట్లలో, 250 ప్రదేశాల్లో ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. బీహెచ్ఈఎల్ అధికారులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌కు తమవంతు సహకారాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం తమకప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని, ప్రాజెక్ట్ యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా, అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను అందిస్తామన్నారు. త్వరలోనే సమగ్ర ప్రొడ క్షన్ ప్లాన్‌తో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహా దారు జ్ఞానేశ్వర్, ఓఎస్డీ సత్యపాల్, బీహెచ్ఈఎల్ జనరల్ మేనేజర్లు నరేంద్ర కుమార్, జీకే హెడూ, అదనపు జీఎం పంకజ్ రస్తోగి, మార్కెటింగ్ నిపుణుడు గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ కాలనీల నుంచే ‘భగీరథ’
‘మిషన్’పై సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించే కార్యక్రమం ఎస్సీ కాలనీల నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దళిత వాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు సహా ప్రతి ఇంటికీ తప్పక నీరు చేరేలా చూడాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఇంతకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని, అందువల్ల మంచినీటి పథకం వారితోనే ప్రారంభం కావాలన్నారు. ఆ తర్వాతే మిగతా ఇళ్లకు నీటిని సరఫరా చేయాలని సూచించారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు గోదావరి, కృష్ణా జలాలు సరఫరా అయ్యేలా పనులు పూర్తి చేయాలని, ఆ తర్వాత గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నీటిని అందించాలన్నారు. నల్లాల బిగింపు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన కార్యచరణతో పనులు చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్డీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సీఈ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, మోటర్ల ఫిట్టింగ్ తదితర పనులన్నీ 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలు... అన్ని జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనది అయినందున మంత్రులు, కలెక్టర్లు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలన్నారు. రైల్వే క్రాసింగ్‌లు దాటుకుని, అటవీ అనుమతులు సాధించి, ప్రైవేటు భూముల యజమానులను ఒప్పించి రికార్డు సమయంలో పైపులైన్లు నిర్మించడాన్ని దేశమంతా గుర్తించి అభినందిస్తుందని సీఎం చెప్పారు. ఇదే స్ఫూర్తితో మిగతా పనులు జరగాలని, ఎక్కడైనా పనులు నెమ్మదిగా సాగితే వెంటనే వర్కింగ్ ఏజెన్సీతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన విద్యుత్‌ను నిరంతరంగా అందించే ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పది శాతం నీటిని తాగునీటికి రిజర్వ్ చేసినందున ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నీటిని ఎక్కడికక్కడ వాడుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని, ఇప్పటికే అనేక ఆర్థిక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లోనూ కొంత కేటాయిస్తున్నట్లు చెప్పారు. సకాలంలో పనులు చేసిన ఏజెంట్లకు ఇన్సెంటివ్‌లు ఇచ్చే విధానం కూడా ఉన్నందున దాన్ని వినియోగించుకోవాలన్నారు. బీహెచ్ఈఎల్ ద్వారా కొనుగోళ్లు... మిషన్ భగీరథకు అవసరమయ్యే ఎలక్ట్రో మెకానికల్ పరికరాలను ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ద్వారా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. పెద్ద ఎత్తున మోటర్లు, పంపింగ్ సామగ్రి అవసరమున్నందున బీహెచ్ఈఎల్ ద్వారానే వాటిని సమకూర్చుకోవాలన్నారు. ఇరిగేషన్, విద్యుత్ రంగాల్లో బీహెచ్‌ఈఎల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పుడు మిషన్ భగీరథలోనూ అలాగే జరగాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థతో పని వల్ల అనవసర రాద్ధాంతాలేవీ ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు. బీహెచ్ఈఎల్ సీఎండీ అతుల్ సోమ్టితో సీఎం ఫోన్లో మాట్లాడారు. మిషన్ భగీరథ కోసం 50 హెచ్‌పీ నుంచి 1000 హెచ్‌పీల వరకు మోటర్లు కావాలని, వాటిని సమకూర్చాలన్నారు. దీనిపై ప్రభుత్వాధికారులు, బీహెచ్ఈఎల్ ప్రతినిధులు త్వరలో సమావేశమై స్పష్టమైన అవగాహనకు రావాలని సీఎం ఆదేశించారు. -
కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య పరీక్షలు
భెల్: కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారని ఏజీఎం హెచ్ఆర్ ఆదిశేష్, భెల్ అధికార కార్మిక యూనియన్ అధ్యక్షుడు జి.ఎల్లయ్య పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, ఈఎస్ఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతి విద్యాలయంలో ఒప్పంద కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్ఐ జాయింట్ డైరక్టర్ సమక్షంలో వైద్య బందం కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భెల్ పరిశ్రమ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించిదన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరం మరో రెండు రోజుల పాటు కొనసాగింస్తామనిఅధికారులు పేర్కొన్నారు. కార్మికులకు పరీక్షల్లో ఇతరత్ర వ్యాధులు నిర్ధారణ అయితే మెరుగైన వైద్యం కోసం కార్పొరేటర్ ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్యబాబు, వైద్యులు, కార్మిక యూనియన్ నాయకులు, హెచ్ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
భెల్ పూర్తయితే 4వేల మందికి ఉపాధి
చిత్తూరు(కార్పొరేషన్) : జిల్లాలోని మన్నవరం వద్ద నిర్మిస్తున్న భెల్ పరిశ్రమను త్వరగా పూర్తి చెయ్యాలని ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భెల్ పరిశ్రమ వల్ల జిల్లాలో దాదాపు నాలుగువేల మందికి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. మన జిల్లాలో ఆలస్యమవుతున్న పరిశ్రమలను వెంటనే పూర్తి చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే బాధ ఉండదన్నారు. భెల్ పరిశ్రమ త్వరగా పూర్తిచెయ్యాలని ఈనెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. -
54 శాతం పెరిగిన బీహెచ్ఈఎల్ లాభం
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ పనితీరులో యూ టర్న్ తీసుకుంది. జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం రూ.77.77కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.50.43 కోట్లతో పోలిస్తే 54.21% వృద్ధి చెందింది. మూడున్నరేళ్ల తర్వాత కంపెనీ ఆదాయాల్లో మళ్లీ వృద్ధి సాధ్యమైంది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 29% వృద్ధి చెంది రూ.4,421 కోట్ల నుంచి రూ.5,721 కోట్లకు చేరుకుంది. ఆదాయాల్లో 14 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత తిరిగి వృద్ధి నమోదు కావడం ఇదే. ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయడమే దీనికి కారణమని బీహెచ్ఈఎల్ సీఎండీ అతుల్సోబ్తి తెలి పారు. ఆర్డర్‌బుక్ పెంచుకునే చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పూర్తి చేయాల్సిన ఆర్డర్ బుక్ రూ.1,08,000 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్ఈఎల్ స్టాక్ ఎన్ఎస్ఈలో 16.66% లాభపడి రూ.160 వద్ద ముగిసింది. -
నష్టాలోకి జారుకున్న మార్కెట్లు
ముంబై : బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో మంగళవారం కొత్త శిఖరాల దిశగా దూసుకెళ్లిన్న స్టాక్ మార్కెట్లు, నేడు కూడా అదే ఉత్సాహంతో ముందుకొచ్చాయి. కానీ ఆ ఉత్సాహం ఎన్నో నిమిషాలు నిలవలేదు. దేశీయ సూచీలు వెంటనే నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 28954 వద్ద, నిఫ్టీ 14.80 పాయింట్ల నష్టంతో 8928 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బీహెచ్ఈఎల్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్ నష్టాలు గడిస్తుండగా..ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీలు, విప్రోలు లాభాల్లో నడుస్తున్నాయి. మార్కెట్లలో నమోదవుతున్న లాభాల వల్ల పెట్టుబడిదారులు నేడు ప్రాఫిట్ బుకింగ్స్ పై ఎక్కువగా మొగ్గుచూపారని ఆ ప్రభావంతో దేశీయ సూచీలు నష్టాలోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. నాలుగు నెలల గరిష్టంలో నమోదవుతున్న డాలర్‌తో రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్‌లో కూడా బలపడింది. నిన్నటి ముగింపుకు 16 పైసలు లాభంతో ప్రారంభమైంది. ఫెడ్ రేటు ఆందోళనలు వీడటంతో డాలర్ బలహీనపడిందని, రూపాయి విలువ పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 బలపడి 66.38గా ఉంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 393 రూపాయల లాభంతో 31,378గా కొనసాగుతోంది. -
15 ప్రైవేట్ బస్సులపై కేసులు
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. రంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ సమీపంలోని ముంబై హైవేపై బుధవారం తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులను, ఏడు లారీలపై కేసులు నమోదు చేశారు. -
మందకొడిగా ట్రేడింగ్..
స్వల్పంగా తగ్గిన సూచీలు ముంబై: అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ శుక్రవారం రోజంతా మందకొడిగా ట్రేడింగ్ కొనసాగింది. చైనా షాంఘై సూచి భారీగా 3 శాతం పతనంకావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో భారత్ సూచీలు కూడా అరశాతంపైగా తగ్గినప్పటికీ, కనిష్టస్థాయిలో కొద్దిపాటి కొనుగోలు మద్దతు లభించడం, వారాంతపు షార్ట్ కవరింగ్ జరగడంతో ట్రేడింగ్ ముగింపులో కాస్త కోలుకున్నాయి. 25,058-25,260 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 34 పాయింట్ల నష్టంతో 25,228 పాయింట్ల వద్ద ముగిసింది.నిఫ్టీ 2 పాయింట్ల స్వల్పనష్టంతో 7,733 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇటీవల చైనా నుంచి వెలువడిన తయారీ రంగ గణాంకాలతో ప్రపంచ ఆర్థికాభివృద్ధి పట్ల సందేహాలు ఏర్పడి, ఈక్విటీ ఇన్వెస్టర్ల ఆసక్తి సన్నగిల్లిందని, దాంతో మార్కెట్ కార్యకలాపాలు మందకొడిగా వున్నాయని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. గెయిల్ జోరు... సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ 4.99 శాతం ఎగిసింది. బీహెచ్ఈఎల్ 3.17 శాతం పెరగ్గా, ఆసియన్ పెయింట్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2.3 శాతం మధ్య పెరిగాయి. డాక్టర్ రెడ్డీస్ లాబ్, విప్రో, ఆదాని పోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. వరుసగా రెండోవారమూ డౌన్... స్టాక్ సూచీలు వరుసగా రెండోవారమూ తగ్గాయి. సెన్సెక్స్ అంతక్రితంవారంతో పోలిస్తే 378 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 116 పాయింట్లు క్షీణించింది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయంగా వస్తున్న బలహీన సంకేతాలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 190.86 పాయింట్లు పడిపోతూ 25,415.76 వద్ద నమోదవుతుండగా.. నిఫ్టీ 50.05 పాయింట్ల నష్టంతో 7,799 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ, లుపిన్, హీరో మోటో కార్పొ, బీపీసీఎల్, ఎస్ బ్యాంకు లాభాల్లో నడుస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంకు, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, బీహెచ్ఈఎల్, విప్రోలు నష్టాలను చవిచూస్తున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు శుక్రవారం ప్రకటించిన నిరుత్సాహకర ఆర్థిక ఫలితాలతో నేటి ట్రేడింగ్ లో ఈ బ్యాంకు షేర్లు 4శాతం మేర పడిపోతున్నాయి. మరోవైపు మార్కెట్లో పసిడి, వెండి పుంజుకుంటున్నాయి. పసిడి 14 పాయింట్ల లాభంతో 30,280 వద్ద, వెండి 109 పాయిట్ల లాభంతో 41,675 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 66.33గా ఉంది. ఆసియా మార్కెట్లు సైతం సోమవారం ట్రేడింగ్ లో నష్టాలనే నమోదుచేస్తున్నాయి. -
భెల్ నష్టాలు రూ.877 కోట్లు
2015-16 ప్రాథమిక ఫలితాలు వెల్లడించిన కంపెనీ న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు భారీగా ఉన్నా, టర్నోవర్ అధికంగా ఉన్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్‌కు రూ.877 కోట్ల నష్టాలు వచ్చాయి. గురువారం జరిగిన కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరపు తాత్కాలిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. గతేడాది రూ.43,727 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని భెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు రూ.30,814 కోట్లుగా ఉన్నాయని, గత ఐదేళ్లలో ఎన్నడూ రానంతగా ఆర్డర్లు వచ్చాయని వివరించింది. ఇక గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ.396 కోట్ల నికర లాభం సాధించామని తెలిపింది. వ్యాపార వాతావరణం మందకొడిగా ఉండడం, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రం ఫలితాలు సాధించామని భెల్ తెలిపింది. -
ఐదేళ్లలో 4వేల మెగావాట్ల ఉత్పత్తి
► రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని వేగంగా పూర్తిచేస్తాం ► సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ► బీహెచ్ఈఎల్ వద్ద ఉన్న 4 యూనిట్లు రాష్ట్రానికి అందించడానికి అంగీకారం సాక్షి, న్యూఢిల్లీ: రామగుండం వద్ద ఎన్టీపీసీ నిర్మించనున్న 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఐదేళ్లలోగానే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. తెలంగాణలో మరిన్ని సోలార్ పార్క్‌లను ఏర్పాటుకు అనుమతివ్వనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీలో పీయూష్ గోయల్‌ను కలసి పలు అంశాలపై చర్చించారు. ఆయన వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ పి.రాజేశ్వర్‌రెడ్డి, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ... రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రెండు 800 మెగావాట్ల యూనిట్లకు టెండర్లు పూర్తయ్యాయని... త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మరో మూడు 800 మెగావాట్ల యూనిట్లను కూడా నిర్మిస్తామని... 2021వ సంవత్సరం నాటికి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు 600 ఎకరాల భూమి అవసరమని, కొంత భూమి రైల్వేలైన్ విస్తరణకు అవసరమని... త్వరలోనే దీనికి పరిష్కారం కనుగొంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. టీ జెన్కో ప్రతిపాదించిన 1,080 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు బీహెచ్ఈఎల్ వద్ద ప్రస్తుతమున్న 270 మెగావాట్ల 4 యూనిట్లను రాష్ట్రానికి అందించాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్ర మంత్రి గోయల్ చెప్పారు. తద్వారా ఖమ్మం జిల్లాలోని మణుగూరులో యూనిట్లను రెండేళ్లలోగా ఏర్పాటు చేయవచ్చని, ఈలోగా పర్యావరణ అనుమతులను పొందాల్సి ఉంటుందని తెలిపారు. 2,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని.. భవిష్యత్తులో మరిన్ని సోలార్ పార్క్‌లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న మూడేళ్లలో కొత్తగా 5,880 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం అభినందనీయమని చెప్పారు. ఈ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కోల్ లింకేజీకి సంబంధించి కొత్త విధానాన్ని ఖరారు చేస్తున్నామని.. అది ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిష్కరిస్తామని చెప్పారు. తాడిచెర్ల-1 కోల్‌బ్లాక్‌ను టీజెన్‌కోకు కేంద్రం గతేడాదే కేటాయించిందని, బొగ్గు ఉత్పత్తికి కొంత సమయం పడుతుందని తెలిపారు. తాత్కాలికంగా 2.5 మిలియన్ టన్నుల కోల్ లింకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని... అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశామని గోయల్ చెప్పారు. -
భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అతిపెద్ద విద్యుత్ యంత్రాల తయారీ సంస్థ భెల్ సీఎండీగా అతుల్ సోబ్టి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం భెల్ సీఎండీ (చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్)గా అతుల్ సోబ్టి నియామకానికి పచ్చజెండా ఊపింది. ఈయన ఐదేళ్లపాటు తన సేవలను భెల్‌కు అందించనున్నారు. ఈ నియామకానికి ముందు అతుల్ సోబ్టి.. భెల్ బోర్డులో డెరైక్టర్‌గా ఉన్నారు. -
కోహ్లితో జత కలిసిన బేల్
న్యూఢిల్లీ: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన సోషల్ నెట్వర్కింగ్ స్టార్టప్ వెంచర్ ‘స్పోర్ట్ కోన్వో’కు రియల్ మాడ్రిడ్ క్లబ్ ఫుట్‌బాల్ స్టార్ గారెత్ బేల్ మద్దతిచ్చాడు. అభిమానులతో ముచ్చటించేందుకు ఇది చక్కని వేదికగా ఉపయోగపడుతుందని కితాబిచ్చాడు. ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న కోహ్లి... లండన్‌కు చెందిన ఈ స్టార్టప్ వెంచర్‌తో రెండోసారి క్రీడలకు సంబంధించిన వ్యాపారంలోకి దిగాడు. అభిమానులు తమకు నచ్చిన క్రీడలతో పాటు ప్రస్తుత వార్తా కథనాలపై నేరుగా స్పందించేందుకు ఈ స్పోర్ట్ కోన్వో ఉపయోగపడుతుంది. అయితే కోహ్లి తన కోన్వో అకౌంట్లో బేల్ ఫొటోతో పాటు హార్ట్ సైన్ను పోస్ట్ చేసి ఫుట్‌బాలర్ కూడా ఇందులో చేరిపోయాడనే సంకేతాలిచ్చాడు. క్రికెట్‌తో పాటు భారత కెప్టెన్‌కు తాను పెద్ద అభిమానినని బేల్ తన మెసేజ్‌లో పేర్కొన్నాడు. -
స్టాక్ మార్కెట్‌కు భెల్ షాక్
బ్యాంక్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ ♦ ఆయిల్ షేర్లకు లాభాలు ♦ 62 పాయింట్ల క్షీణతతో 28,236కు సెన్సెక్స్ ♦ 24 పాయింట్లు నష్టంతో 8,565కు నిఫ్టీ ముంబై : బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రభుత్వ రంగ సంస్థ భెల్ నికర లాభం భారీగా క్షీణించడంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ బలహీనంగా సాగింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 62 పాయింట్లు క్షీణించి 28,236 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు క్షీణించి 8,565 పాయింట్ల వద్ద ముగిశాయి. విద్యుత్తు, బ్యాంక్, లోహ, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయానికి ఈ గణాంకాలు కీలకం కానుండటంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను తగ్గించుకున్నారని నిపుణులంటున్నారు. భెల్ నికర లాభం 82 శాతం క్షీణించడం స్టాక్‌మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపించింది. అర్థిక ఫలితాలు అధ్వానంగా ఉండటంతో బీఎస్ఈలో ఈ షేర్ 6 శాతం క్షీనించి రూ.266 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా పతనమైన షేర్ ఇదే. కాగా 142 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ కదలాడింది. లాభాల్లో ఆయిల్ షేర్లు...:అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు-హెచ్‌పీసీఎల్ 7 శాతం, బీపీసీఎల్, ఐఓసీలు చెరో 2 శాతం, ఓఎన్జీసీ 4 శాతం చొప్పున పెరిగాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో ముగిశాయి. భెల్ 5.8 శాతం, కోల్ ఇండియా 3.6 శాతం, ఎస్బీఐ 2.3 శాతం, బజాజ్ ఆటో 1.4 శాతం, ఎన్టీపీసీ 1.3 శాతం, సిప్లా 0.9 శాతం, టీసీఎస్ 0.8 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.7 శాతం చొప్పున తగ్గాయి. ఇక పెరిగిన షేర్ల విషయానికొస్తే ఓఎన్జీసీ 4.4 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, వేదాంత 2 శాతం చొప్పున పెరిగాయి. 1,542 షేర్లు నష్టాల్లో, 1,380 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,444 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,509 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,33,059 కోట్లుగా నమోదైంది ఆసియా మార్కెట్లు లాభాల్లో, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో... అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచే విధంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడడంతో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నేటి బోర్డు సమావేశాలు... దివీస్ ల్యాబ్, సెంట్రల్ బ్యాంక్, డీబీ రియల్టీ, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, జై ప్రకాశ్ అసోసియేట్స్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, వా టెక వాబాగ్, బీఎఫ్ యుటిలిటీస్, ధమ్‌పూర్ షుగర్స్, అంబికా కాటన్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, కామత్ హోటల్స్, తపారియా టూల్స్ -
భారీగా తగ్గిన భెల్ నికర లాభం
82 శాతం క్షీణత నికర అమ్మకాలు 16 శాతం డౌన్ న్యూఢిల్లీ : విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ కంపెనీ భెల్ నికర లాభం (స్టాండెలోన్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి 82 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.194 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.34 కోట్లకు తగ్గిందని భెల్ తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండడమే దీనికి కారణమని పేర్కొంది. నికర అమ్మకాలు రూ.5,068 కోట్ల నుంచి 16 శాతం క్షీణించి రూ.4,281 కోట్లకు తగ్గాయని కంపెనీ వివరించింది. విద్యుత్ రంగ ఆదాయం రూ.4,144 కోట్ల నుంచి రూ.3,357 కోట్లకు తగ్గిందని తెలిపింది. ఈ ఏడాది జూలై 30 నాటికి మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.1,16,200 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా కజకిస్థాన్ కంపెనీలతో భెల్ మూడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భెల్ షేర్ ధర శుక్రవారం బీఎస్ఈలో 6 శాతం మేర క్షీణించి రూ.266 వద్ద ముగిసింది. -
గాజువాక బీహెచ్ఈఎల్లో ప్రమాదం
గాజువాక (విశాఖపట్నం): గాజువాకలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) లో గురువారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బీహెచ్ఈఎల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది. హెచ్‌పీవీపీ విభాగంలో ట్యాంకర్ ప్లేట్లు అమరుస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు సమాచారం. -
17,950 కోట్లతో ‘యాదాద్రి’
* దామరచర్లలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్‌ప్లాంట్ నిర్మాణం * బీహెచ్ఈఎల్, టీ.జెన్కోల మధ్య కుదిరిన ఒప్పందం * వివరాలను వెల్లడించిన మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘యాదాద్రి’ థర్మల్ విద్యుత్కేంద్రాన్ని నిర్మించేందుకు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో), బీహెచ్ఈఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం సచివాలయంలో జెన్కో, బీహెచ్ఈఎల్ మధ్య చర్చలు జరిగాయి. రూ.17,950 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టును నిర్మించేం దుకు బీహెచ్ఈఎల్ సమ్మతించింది. చర్చల అనంతరం జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, బీహెచ్ఈఎల్ చైర్మన్ ప్రసాదరావుతో కలసి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 థర్మల్ పవర్ ప్లాంట్లను దామరచర్లలో నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ర్టవ్యాప్తంగా నిర్మిస్తున్న దాదాపు 6వేల కోట్ల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.27,367 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. -
భెల్ లాభం తగ్గింది
ఒక్కో షేర్‌కు రూ.0.62 డివిడెండ్ న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్ నికర లాభం(స్టాండ్‌లోన్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 52% తగ్గింది. 2013- 14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,845 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.888 కోట్లకు తగ్గిందని భెల్ పేర్కొం ది. నికర అమ్మకాలు రూ.14,755 కోట్ల నుంచి 16% క్షీణించి రూ.12,368 కోట్లకు పడిపోయాయని తెలిపింది. 31% డివిడెండ్(ఒక్కో షేర్‌కు రూ.0.62) ఇవ్వాలని తమ డెరైక్టర్ల బోర్డ్ రికమెండ్ చేసిందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 59% క్షీణించి రూ.1,419 కోట్లకు తగ్గిపోయిందని పేర్కొంది. నికర అమ్మకాలు రూ. 38,389 కోట్ల నుంచి 23% క్షీణించి రూ.29,542 కోట్లకు తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో భెల్ షేరు ధర మంగళవారం ఎన్ఎస్ఈలో 2.8% లాభంతో రూ.214 వద్ద ముగిసింది. -
భెల్ నికర లాభం 62 శాతం డౌన్
మార్కెట్ మందగమనమే కారణమంటున్న కంపెనీ న్యూఢిల్లీ: విద్యుత్ రంగ పరికరాలు తయారు చేసే భెల్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించింది. ప్రభుత్వ నియమనిబంధనల కారణంగా మార్కెట్ మందగమనంగా ఉండటమే దీనికి కారణమని వివరించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,461 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 62 శాతం క్షీణించి రూ.1,314 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. మొత్తం టర్నోవర్ రూ.40,338 కోట్ల నుంచి రూ.30,806 కోట్లకు తగ్గిందని వివరించింది. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు లభ్యత విషయంలో అడ్డంకులు, నిధుల లభ్యత సరిగ్గా లేకపోవడం, భూ సమీకరణ, పర్యావరణ అనుమతులు, తదితర అంశాలు లాభంపై ప్రభావం చూపాయని పేర్కొంది. ఆర్డర్ బుక్ రూ. లక్ష కోట్లపైనే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో వచ్చిన ఆర్డర్లు 10 శాతం వృద్ధి చెంది రూ.30,794 కోట్లకు పెరిగాయని వివరించింది.. విద్యుత్‌రంగంలో ఆర్డర్లు రూ.24,873 కోట్లుగా, పరిశ్రమల విభాగం నుంచి రూ.5,201 కోట్లుగా, ఎగుమతుల అర్డర్లు రూ.720 కోట్లుగా ఉన్నాయని వివరించింది. మొత్తం మీద ఆర్డర్ బుక్ రూ.1,01,159 కోట్లుగా ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్లాంట్: కాగా ఈ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవలనే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5,000 కోట్లు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మణుగూరులో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో ఇక్కడ విద్యుదుత్పత్తి చేయాలనేది ఈ ఒప్పందం లక్ష్యం. కాగా తెలంగాణ రాష్ట్రంలో 6,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిమిత్తం టీఎస్‌జెన్‌కోతో భెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
వచ్చే నెల బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) కోసం ప్రభుత్వం కంపెనీల జాబితాను సిద్ధం చేసింది. దీని ప్రకారం ఏప్రిల్‌లో ముందుగా బీహెచ్ఈఎల్లో వాటాలు విక్రయించనుంది. తద్వారా రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తోంది. ఇప్పటికే బీహెచ్ఈఎల్లో వాటాల విక్రయానికి సంబంధించి లండన్, సింగపూర్, హాం కాంగ్‌లలో డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం రోడ్‌షోలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కంపెనీ షేరు ధర సుమారు రూ. 260 చొప్పున చూస్తే 12.23 కోట్ల షేర్లను విక్రయిస్తే రూ. 3,200 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వానికి బీహెచ్ఈఎల్లో 63.06 శాతం వాటాలు ఉన్నాయి. అటు ఎన్ఎండీసీ, నాల్కో, ఐవోసీ తదితర కంపెనీల్లో తలో పది శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2015-16లో పీఎస్‌యూల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. వివిధ పీఎస్‌యూల్లో మైనారిటీ వాటాల అమ్మకం ద్వారా రూ. 41,000 కోట్లు, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ. 28,500 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. -
స్వల్ప లాభంతో సరి
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం, విదేశీ ఫండ్స్ లాభాలు స్వీకరించడం తదితర పరిణామాలతో మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా పెరిగాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్ తదితర షేర్లు లాభపడటం .. సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ పెరగడానికి దోహదపడ్డాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 83 పాయింట్లు పెరిగినప్పటికీ.. లాభాల స్వీకర ణ కారణంగా మళ్లీ తగ్గింది. గరిష్టంగా 27,478, కనిష్టంగా 27,312 పాయింట్ల స్థాయులను తాకి చివరికి 27,404 వద్ద ముగిసింది. నిఫ్టీ 8,248 వద్ద ముగిసింది. స్థల సేకరణ నిబంధనల సరళతరంతో మంగళవారం ట్రేడింగ్ సానుకూలంగానే మొదలైనప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితులు నెలకొనడం, కమోడిటీల్లో అమ్మకాలు వెల్లువెత్తడం, గ్రీస్‌లో రాజకీయ అనిశ్చితి మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయని విశ్లేషకులు తెలిపారు. రిఫైనరీ, విద్యుత్, మెటల్ సంస్థల స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు సెన్సెక్స్‌ను మించి బలపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఇటు ఈక్విటీ, అటు డెట్ మార్కెట్లలోనూ తమ పొజిషన్లను తగ్గించుకుంటున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ తెలిపారు. ఎన్ఎస్ఈలో స్టాక్స్‌లో రూ. 10,868 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 98,728 కోట్ల టర్నోవరు నమోదైంది. అటు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ. 278 కోట్లు, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ. 161 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. -
జెన్కోతో బీహెచ్ఈఎల్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ జెన్కో.. బీహెచ్ఈఎల్తో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం టీఎస్జెన్కో సీఎండీ ప్రభాకరరావుతో బీహెచ్ఈఎల్ సీఎండీ ప్రసాదరావు భేటీ అయ్యారు. మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని రెండేళ్లలో.. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల ఏడో యూనిట్‌ను మూడేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని టీఎస్ జెన్కో లక్ష్యంగా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
కొత్త విద్యుత్‌ప్లాంట్లపై కోటి ఆశలు
సత్వర వెలుగునిచ్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడి కేటీపీపీ రెండోదశ పూర్తికి రూ.300 కోట్లు కొత్తగూడెం కొత్త ప్లాంట్‌కు రూ.300 కోట్లు బీహెచ్ఈఎల్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెంక్కించేందుకు వచ్చే డిసెంబర్ నాటికి పూర్తయ్యే ప్రాజెక్టులకు సర్కార్ మొదటి ప్రాధాన్యమివ్వనుంది. ఇందుకోసం కొత్త కేంద్రాలపైనే ఆశలు పెట్టుకుంది. తెలంగా ణ జెన్కో సారథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్న థర్మల్ప్లాంట్లను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరిం చింది. బడ్జెట్లో టీఎస్ జెన్కోలో పెట్టుబడికి నిర్దేశించిన రూ.1000 కోట్లను ఈ కొత్తప్లాంట్ల కోసం ఖర్చు చేయనుంది. భూపాలపల్లిలో నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్టు రెండో దశకు రూ. 300 కోట్లు, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఏడోదశలో తలపెట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టుకు మరో రూ. 300 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. మిగతా రూ. 400 కోట్లను బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకునే థర్మల్ ప్రాజెక్టులకు కేటాయించనుంది. 2012లోనే పూర్తికావాల్సింది.. భూపాలపల్లి ప్లాంట్‌కు ఆర్ఈసీ రూ.2170 కోట్ల రుణం మంజూరీ చేసింది. గత నెలాఖరు వరకే దాదాపు రూ.2565 కోట్లు దీనికి ఖర్చయినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2009 ఫిబ్రవరిలో ఈ ప్లాంట్ పని ప్రారంభమైంది. ఒప్పందం ప్రకారం 2012లోనే పూర్తి కావాలి. కాంట్రాక్టర్ల జాప్యంతో రెండేళ్లు ఆలస్యమైంది. అంతేకాక గతనెలలో భారీయంత్రాలు అమర్చే క్రేన్ విరగడంతో బాయిలర్ నిర్మాణం మధ్యలో ఆగింది. దీంతో నెలరోజులు పనులన్నీ నిలిచిపోయాయి. ఇటీవలే టీఎస్జెన్కో ఛైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకరరావు అక్కడికివెళ్లి పనుల పురోగతిని పరిశీలించారు. ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని తెలిపారు. దీంతో పాటు మణుగూరులో 1080 మెగావాట్ల (2704 యూనిట్లు) థర్మల్ విద్యుత్కేంద్ర నిర్మాణంపై జెన్కో దృష్టి సారించింది. దీనిని ఈపీసీ విధానంలో బీహెచ్ఈఎల్ కంపెనీకి అప్పగించనుంది. మణుగూరులో 1031.19 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, 270 మెగావాట్ల ఉత్పత్తికి అవసరమయ్యే టర్బైన్లు, జనరేటర్లు బీహెచ్ఈఎల్ దగ్గర అందుబాటులో ఉండడంతో రెం డేళ్ల వ్యవధిలోనే పూర్తిచేసేందుకు అంగీకారం కుదిరిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు జెన్కో ఏర్పాట్లు చేస్తోంది. వీటికితోడు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జల విద్యుత్కేంద్రాలు వచ్చే ఏడాది చివరినాటికి ఉత్పత్తిచేసే దశకు చేరుకుంటాయని అధికారులు అంచనా వేశారు. లోయర్ జూరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు (640), పులిచింతల ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్లు (430) ఉత్పత్తి చేసే యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డిసెంబర్ 15 వరకు ఈ యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుందని జెన్కో అంచనా వేసింది.