
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కంపెనీ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) బంగ్లాదేశ్‌లో నెలకొల్పిన మైత్రీ సూపర్ థర్మల్ పవర్‌ప్రాజెక్టులో యూనిట్–2ను పూర్తి చేసింది.
660 మెగావాట్ల సామర్థ్యంగల యూనిట్–2లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు బుధవారం ప్రకటించింది. బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్, ఎన్‌టీపీసీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన బంగ్లాదేశ్–ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ కోసం బీహెచ్‌ఈఎల్ ఈ ప్రాజెక్టును చేపట్టింది.