ముంబై: బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ నుంచి నిర్వహణలో ఉన్న నాలుగు రహదారి ప్రాజెక్టులను ఇండ్‌ఇన్‌ఫ్రావిట్ ట్రస్ట్ సొంతం చేసుకుంది. పూర్తి నగదు రూపేణా జరిగిన డీల్ విలువ బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,200 కోట్లు)కాగా.. కొనుగోలును పూర్తి చేసినట్లు ఇండ్‌ఇన్‌ఫ్రావిట్ తాజాగా వెల్లడించింది. బ్రూక్‌ఫీల్డ్ నిర్వహణలోని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్, కైనెటిక్ హోల్డింగ్స్ నుంచి ఐదు ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే నాలుగు ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
జాబితాలో సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై– నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే, కోసి బ్రిడ్జి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేరాయి. ఇక గోరఖ్‌పూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నియంత్రణ సంస్థల అనుమతులను పొందవలసి ఉండటంతోపాటు.. కొన్ని నిబంధనలు పాటించవలసి ఉన్నట్లు తెలియజేసింది.
నిధులను రూపాయలలో కాలావ ధి రుణం, మార్పిడిరహిత డిబెంచర్లు, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్, ఓఎంఈఆర్‌ఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో యూనిట్ల జారీ ద్వారా ఏర్పాటు చేసింది. సొంతం చేసుకున్న ప్రాజెక్టులలో మూడు టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒక యాన్యుటీ రహదారిగా కంపెనీ తెలియజేసింది. ఇండ్‌ఇన్‌ఫ్రావిట్ ట్రస్ట్‌ను ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment