మాట్లాడుతున్న ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికమార్
చిత్తూరు(కార్పొరేషన్) :
జిల్లాలోని మన్నవరం వద్ద నిర్మిస్తున్న భెల్ పరిశ్రమను త్వరగా పూర్తి చెయ్యాలని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. శుక్రవారం ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భెల్ పరిశ్రమ వల్ల జిల్లాలో దాదాపు నాలుగువేల మందికి నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు. మన జిల్లాలో ఆలస్యమవుతున్న పరిశ్రమలను వెంటనే పూర్తి చేస్తే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే బాధ ఉండదన్నారు. భెల్ పరిశ్రమ త్వరగా పూర్తిచెయ్యాలని ఈనెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు, ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు.