
సాక్షి, హైదరాబాద్: రామచంద్రాపురంలోని బీహెచ్‌ఈఎల్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్ చౌదరి హాజరై చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడిపారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన బాల్యంలో తాను చదువుకున్న రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు.
జూబ్లీక్లబ్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో వివేక్‌చౌదరి సహాధ్యాయి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment