భెల్‌ లాభం 42 శాతం అప్‌ | BHEL Q2 Profit slumps 36persant to Rs 119 crore | Sakshi
Sakshi News home page

భెల్‌ లాభం 42 శాతం అప్‌

Published Thu, Nov 14 2019 5:42 AM | Last Updated on Thu, Nov 14 2019 5:42 AM

BHEL Q2 Profit slumps 36persant to Rs 119 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్‌ సంస్థ, భెల్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) సెప్టెంబర్‌ క్వార్టర్లో 42 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.121 కోట్లకు పెరిగినట్లు భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,934 కోట్ల నుంచి రూ.6,360 కోట్లకు తగ్గింది. ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ కంపెనీకి నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌– సెప్టెంబర్‌ కాలానికి రూ.125 కోట్ల నికర లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.98 కోట్ల నికర నష్టాలు (కన్సాలిడేటెడ్‌) వచ్చాయని భెల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం కూడా రూ.13,050 కోట్ల నుంచి రూ.11,033 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో భెల్‌ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.54.55 వద్ద ముగిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement