![IOC signs 7 9 billion long term LNG import deal with UAE firm](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/ioc.jpg.webp?itok=bg_SkWqC)
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను (ఎల్‌ఎన్‌జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్‌ఓసీ గ్యాస్‌తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఏడీఎన్‌ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.
ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్‌ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్‌ఎన్‌జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్ చేతులు కలిపింది.
బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్‌కు చెందిన పెట్రోబ్రాస్‌తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్‌తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బీహెచ్‌ఈఎల్‌కు రూ.6,700 కోట్ల ఆర్డర్
ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.
ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్‌ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్‌ను బీహెచ్‌ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment