
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) యూఏఈలో (UAE) అడుగు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్ఫుడ్ 30వ ఎడిషన్‌లో యూఏఈలో భారతీయ లెగసీ బ్రాండ్ కాంపాను అధికారికంగా ప్రారంభించింది.
2022లో కాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో దేశంలో తిరిగి ప్రవేశపెట్టిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1970, 80లలో భారతదేశంలో కల్ట్ హోదాను కలిగి ఉన్న ఈ హెరిటేజ్ బ్రాండ్‌ను విజయవంతంగా పునరుద్ధరించింది. యూఏఈలో ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటైన అగ్థియా గ్రూప్‌తో కలిసి కాంపా కోలాను ఇక్కడి వారికి పరిచయం చేస్తోంది.
"50 సంవత్సరాల క్రితం స్థాపించిన హెరిటేజ్ ఇండియన్ బ్రాండ్ అయిన కాంపాతో యూఏఈ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నాము. యూఏఈలో వినియోగదారులకు పానీయాల అనుభవాన్ని మార్చడానికి భాగస్వాములతో కలిసి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషిస్తున్నాము" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment