Consumer Products
-
ఇక రిలయన్స్ ‘స్నాక్స్’!
ముంబై: పంపిణీదార్లకు అధిక మార్జిన్లను అందిస్తూ క్యాంపాతో సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్లో సంచలనం సృష్టించిన రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా స్నాక్స్ మార్కెట్‌పైనా గురిపెట్టింది. చిప్స్, బిస్కెట్స్ మొదలైన వాటి విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. సూపర్ స్టాకిస్ట్స్‌లకు మిగతా బ్రాండ్స్ అందించే 3–5 శాతంతో పోలిస్తే (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కలిపి) దాదాపు రెట్టింపు ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ఆర్సీపీఎల్ 6.5 శాతం ట్రేడ్ మార్జిన్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో చూస్తే 8 శాతం మార్జిన్లతో పాటు అదనంగా 2 శాతం (పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు సహా) ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. సాధారణంగా డి్రస్టిబ్యూటర్లకు ఇతర స్నాక్ బ్రాండ్స్ 6–6.5 శాతం ఆఫర్ చేస్తుంటాయి. ఆర్సీపీఎల్ అటు రిటైలర్లకు ఏకంగా 20 మార్జిన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సెగ్మెంట్లో చాలాకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న బ్రిటానియా, పెప్సీకో, స్థానిక కంపెనీలు, ఇతర బ్రాండ్లు ఇచ్చేది 8–15 శాతంగా (మార్జిన్లు, స్కీములు కలిపి) ఉంటోంది. ఆర్సీపీఎల్ ప్రస్తుతం చిప్స్, నమ్కీన్స్ వంటి స్నాక్స్‌కి సంబంధించి అలాన్ బ్యూగుల్స్, స్నాక్‌ట్యాక్ బ్రాండ్లను, ఇండిపెండెన్స్ పేరిట బిస్కట్ బ్రాండ్‌ను విక్రయిస్తోంది.42 వేల కోట్ల మార్కెట్..అధ్యయనాల ప్రకారం దేశీయంగా స్నాక్స్ మార్కెట్ 2023లో సుమారు రూ. 42,695 కోట్ల స్థాయిలో ఉంది. ఇది వార్షికంగా 9.08 శాతం వృద్ధి చెందుతూ 2032 నాటికి రూ. 95,522 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఆర్సీపీఎల్ 2022లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి కంపెనీ క్రమంగా కోలా మార్కెట్లోకి చొచ్చుకుపోయే వ్యూహాలను అమలు చేయడం మొదలెట్టింది. పోటీ సంస్థలతో పోలిస్తే ఉత్పత్తులను తక్కువ ధరకే అందించడం, పంపిణీదార్లకు అధిక మార్జిన్లు ఇవ్వడం మొదలైనవి అమలు చేసింది. అమెరికాకు చెందిన అలాన్ బ్యూగుల్స్ బ్రాండ్‌ను భారత్‌కి తెస్తున్నట్లు గతేడది మే నెలలో ప్రకటించింది. సాల్టెడ్‌తో పాటు టొమాటో, చీజ్ తదితర ఫ్లేవర్లలో రూ. 10కే అందించనున్నట్లు పేర్కొంది. సాధారణంగా పెద్ద సంస్థలు మార్కెటింగ్ కోసం కేటాయించే దానిలో 10–15 శాతం కూడా ఖర్చు చేయకుండానే అమ్మకాలను పెంచుకునేందుకు సేల్స్ వ్యవస్థను కూడా ఆర్సీపీఎల్ పటిష్టం చేసుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ స్టోర్స్‌లో వినియోగదార్ల దృష్టిని ఆకర్షించేందుకు మరిన్ని లాంచ్ ప్రమోషన్లను ఆఫర్ చేస్తోందని పేర్కొన్నాయి. -
టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో మూడు సంస్థల విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్‌లో (టీసీపీఎల్) మూడు అనుబంధ సంస్థల విలీన ప్రక్రియ పూర్తయింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఇతరత్రా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావడంతో దీన్ని పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. విలీనమైన వాటిల్లో టాటా కన్జూమర్ సోల్‌ఫుల్, నరిష్ కో బెవరేజెస్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్ ఉన్నాయి. వ్యాపారాన్ని క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు టీసీపీఎల్ తెలిపింది. టీసీపీఎల్‌కు రూ. 15,206 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవరు ఉంది. టీ, కాఫీ, ఉప్పు, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, స్నాక్స్, మినీ మీల్స్ లాంటివి కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. టాటా టీ, టెట్లీ, టాటా కాఫీ గ్రాండ్ తదితర కీలక బెవరేజ్ బ్రాండ్స్‌ను విక్రయిస్తోంది. -
Loans: రుణ పడొద్దు!
సొంత కారు, అందమైన భవంతి, ఇంట్లో అన్ని రకాల సాధనాలు (మెషీన్లు).. ఎందులోనూ రాజీపడేది లేదన్నట్టుగా ఉంది నేటి యువతరం ధోరణి. ముందు పొదుపు, తర్వాతే ఖర్చు.. గతంలో మన పెద్దలు అనుసరించిన ధోరణి. ముందు ఖర్చు.. మిగిలితేనే పొదుపు అన్నట్టుగా ఉంది నేటి తీరు. ఏ అవసరం వచ్చినా ‘తగ్గేదే లే’ అన్న ధోరణి కనిపిస్తోంది. కొనుగోళ్ల నుంచి వైద్య చికిత్సల వరకు అన్నింటికీ రుణబాట పడుతున్నారు. తీర్చే సామర్థ్యం ఉంటేనే రుణం తీసుకోవాలి. ప్రాధాన్యత లేని వాటికి సైతం రుణాలను ఆశ్రయిస్తే తీర్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కారణం ఏదైనా సకాలంలో రుణం వాయిదా చెల్లించలేకపోతే, ఎదుర్కోవాల్సిన పరిణామాలు చాలానే ఉంటాయి. చివరికి ఉద్యోగ అన్వేషణకు సైతం దూరం కావాల్సి రావచ్చు. గతంలో బ్యాంకుల రుణ వృద్ధిలో కార్పొరేట్ రుణాలదే పైచేయిగా ఉండేది. మొదటిసారి 2020 (కరోనా విపత్తు కాలంలో) నవంబర్‌లో బ్యాంకుల రుణాల్లో కార్పొరేట్లను కాదని రిటైల్ రుణాలు ముందుకు వచ్చేశాయి. అప్పటి నుంచి 2023 నవంబర్ 17 నాటికి చూస్తే రిటైల్ రుణాలు 79 శాతం పెరగ్గా.. కార్పొరేట్ రుణాల్లో వృద్ధి 28 శాతానికి పరిమితమైంది. 2023లో రెండో త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లోనూ రిటైల్ రుణాల్లో వృద్ధి 15 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాల్లో కన్జ్యూమర్ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం తీసుకునేవి (విలువ పరంగా) 20 శాతం పెరిగాయి. ద్విచక్ర వాహన రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకునే రుణాలు 12 శాతం పెరిగాయి. ఆటో రుణాలు 13 శాతం పెరిగితే, ఇంటి రుణాలు విలువ పరంగా మైనస్ 6 శాతంగా ఉన్నాయి. వినియోగ రుణాలు ఎక్కువగా ఉంటున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, అదే సమయంలో రుణ ఎగవేతల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రుణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంది. 2023 జూలై నాటికి క్రెడిట్ కార్డ్ రుణాలు రూ.2.13 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం కంటే 31 శాతం పెరిగాయి. రిటైల్ రుణాలన్నీ కూడా అన్సెక్యూర్డ్. రుణ గ్రహీత చేతులు ఎత్తేస్తే అది బ్యాంకింగ్ వ్యవస్థపై భారాన్ని మోపుతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ వ్యక్తిగత, అన్ సెక్యూర్డ్, క్రెడిట్ కార్డ్ రుణాలకు రిస్క్ వెయిటేజీ పెంచుతూ, వీటికి బ్యాంకులు మరిన్ని నిధులను పక్కన పెట్టేలా గత నవంబర్‌లో ఆదేశాలు తీసుకొచి్చంది. క్రెడిట్ స్కోర్‌కు విఘాతం తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించలేకపోయినా, రుణాన్ని ఎగవేసినా అది క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా తగ్గించేస్తుంది. కరోనా అనంతరం రిటైల్ రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిపోగా, అదే సమయంలో అంతకుముందు తీసుకున్న రుణాలకు సంబంధించి ఎగవేతలు కూడా పెద్ద మొత్తంలోనే నమోదయ్యాయి. దీంతో బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేయాల్సి వచి్చంది. ఈ పరిణామాలతో చాలా మంది రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడింది. నేడు ప్రతి రుణానికి సంబంధించి చెల్లింపుల చరిత్రతో క్రెడిట్ బ్యూరోలు రికార్డులను నిర్వహిస్తున్నాయి. రుణం సకాలంలో చెల్లించకపోయినా, ఎగ్గొట్టినా, సెటిల్మెంట్ చేసుకున్నా, రుణం కావాలంటూ విచారణలు చేసినా, అవన్నీ సంబంధిత వ్యక్తి పేరిట రికార్డుగా నమోదవుతాయి. వీటి ఆధారంగానే క్రెడిట్ బ్యూరోలు స్కోర్‌ను కేటాయిస్తుంటాయి. 750, అంతకుమించి క్రెడిట్ స్కోర్ ఉంటే అది మెరుగైనది. రుణం సులభంగా వస్తుంది. మెరుగైన రేటుకు వస్తుంది. 750కంటే తక్కువ ఉంటే రుణం పొందడం కష్టమవుతుంది. ఒకవేళ రుణం లభించినా, అది అధిక వడ్డీ రేటుపై తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించాలి. నేడు దాదాపు అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు క్రెడిట్ స్కోర్ ఆధారంగానే అన్సెక్యూర్డ్ రుణాలు మంజూరు చేస్తున్నాయి. తదుపరి పరిణామాలు.. బకాయి చెల్లించాలంటూ రుణగ్రహీతను రుణం ఇచి్చన సంస్థలు కోరతాయి. గడువు తీరిన 30 రోజులకూ చెల్లింపులు చేయకపోతే అప్పుడు ఆయా రుణగ్రహీతల సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తుంటాయి. 30–60 రోజుల పాటు చెల్లింపులు చేయకపోతే అది క్రెడిట్ స్కోరును దెబ్బతీస్తుంది. ఇక రుణ వాయిదా 60 రోజులు దాటినా చెల్లించలేని వారి క్రెడిట్ స్కోర్ మరింత తగ్గిపోతుంది. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో రుణానికి ద్వారాలు మూసుకుపోతాయి. అత్యవసరంలో రుణం కావాల్సి వస్తే నిరాకరణ ఎదురుకావచ్చు. డిజిటల్‌గా రుణాలు ఇచ్చే సంస్థలు కనీసం ఒక్క రోజు ఆలస్యం చేసినా,ఎగవేతదారుల జాబితాలో చేరాల్సి వస్తోంది. 650–750 మధ్య స్కోర్ ఉన్న వారికి గృహ రుణం కావాలంటే, మెరుగైన స్కోర్ ఉన్న వారితో పోలిస్తే 2 శాతం అధిక రేటు చెల్లించాల్సి వస్తుంది. రూ.50 లక్షల రుణం 20 ఏళ్ల కాలవ్యవధికి కావాలంటే, తక్కువ స్కోర్ కారణంగా వడ్డీ రూపంలో అదనంగా రూ.12 లక్షల వరకు భారాన్ని మోయాల్సి రావచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మధ్య ఈ రేటు వ్యత్యాసం మారుతుంది. రుణం ఎగ్గొట్టడం సివిల్ నేరం కిందకు వస్తుంది. రుణ గ్రహీత ఇచి్చన చెక్కుల ద్వారా వసూలు చేసుకునే చర్యలను ఆరి్థక సంస్థలు ప్రారంభిస్తాయి. గడువు ముగిసిన 90 రోజుల్లోపు కూడా రుణ గ్రహీత చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, నోటీసు వస్తుంది. 180 రోజులు (ఆరు నెలలు) ముగిసినా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు నెగోషియబుల్ ఇనుస్ట్రుమెంట్ యాక్ట్, 1881లోని సెక్షన్ 138 కింద రుణం ఇచి్చన సంస్థ కేసు దాఖలు చేస్తుంది. చెల్లించే సామర్థ్యం ఉన్నా, చెల్లించకపోతే ఉద్దేశపూర్వక ఎగవేతదారు అనే ముద్ర పడుతుంది. సరైన కారణంతో రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రుణం ఇచి్చన సంస్థతో చర్చలు నిర్వహించి పరిష్కారానికి, పరస్పర అంగీకారానికి రావచ్చు. హోమ్‌లోన్ లేదా ప్రాపర్టీ లోన్ లేదా బంగారంపై రుణం వంటి సెక్యూర్డ్ రుణాల్లో రుణ గ్రహీత చెల్లింపుల్లో చేతులు ఎత్తేస్తే.. తనఖాగా ఉంచిన ఆస్తులను బ్యాంకులు వేలం వేస్తుంటాయి. అలాగే, ఆటోమొబైల్ రుణాల్లోనూ వాహనాన్ని జప్తు చేసి, చెల్లింపులకు తగినంత వ్యవధి ఇస్తాయి. అప్పటికీ చెల్లించకపోతే వాహనాన్ని వేలం వేసి రుణంలో సర్దుబాటు చేసుకుంటాయి. బ్యాంక్ జాబ్ కష్టమే! బలహీన క్రెడిట్ స్కోర్ ఉందంటూ ఉద్యోగ దరఖాస్తు తిరస్కరించే అధికారం బ్యాంకుల బోర్డులకు ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 650 క్రెడిట్ స్కోర్ ఉండాలన్న నిబంధనను ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విధించింది. బా«ధ్యతాయుత ఆరి్థక నడవడిక ఉండాలన్నది దీని వెనుక ఉద్దేశం. ఎంతో విలువైన లావాదేవీల వ్యవహారాల బాధ్యతలను బ్యాంకుల ఉద్యోగులు చూస్తుంటారు. అందుకే ఈ నిబంధన ప్రవేశపెట్టారు. అందుకే బ్యాంకు ఉద్యోగాలకు ప్రయతి్నంచే వారు మెరుగైన స్కోర్ కోసం ముందు నుంచే తగిన జాగ్రత్త చర్యలను పాటించడం మంచిది. కొన్ని బహుళజాతి సంస్థలు కూడా ఉద్యోగం కోరుతున్న వారి క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తుంటాయి. 2022 మార్చిలో ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం జారీ చేసిన ప్రకటనలో.. బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తీసుకున్న ఏ రుణం చెల్లింపుల్లో అయినా విఫలం అయినట్టయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలు సకాలంలో చెల్లింపులు చేయకపోతే అటువంటి వారు నియామకానికి అర్హులు కాదని స్పష్టంగా పేర్కొంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఉద్యోగార్థుల క్రెడిట్ రిపోర్ట్‌లను పరిశీలించడం సర్వసాధారణమని.. దీనివల్ల ఆర్థికంగా ఎంత బాధ్యతాయుతంగా ఉంటారనేది తెలుస్తుందని డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఫైబ్ హెచ్ఆర్ హెడ్ మోనికా మిశ్రా తెలిపారు. ఇది సంస్థలో మోసాలు, చోరీల అవకాశాలను తెలియజేస్తుందన్నారు. ఆర్థిక అంశాల నిర్వహణలో బాధ్యతారహితంగా ఉండే వ్యక్తి, కంపెనీ ఆరి్థక వ్యవహారాల నిర్వహణకు సరైన వ్యక్తి కాదని మిశ్రా వివరించారు. ఏ రుణంలో ప్రతికూలతలు ఎలా..? రుణం కోసం రుణం... తీసుకున్న రుణాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో మరో రుణం తీసుకుని చెల్లించే ఆలోచనలు సరికాదు. ముందు తీసుకున్న రుణంపై అధిక వడ్డీ రేటు ఉండి, చాలా తక్కువ రేటుకే మరో సంస్థ రుణం ఇవ్వడానికి ముందుకు వస్తే అప్పుడు ఆలోచించొచ్చు. తక్కువ రేటుపై రుణం తీసుకుని అధిక రేటుతో కూడిన రుణాన్ని తీర్చివేయవచ్చు. వ్యక్తిగత రుణాలపై 14–15 శాతం మేర వడ్డీ రేటు ఉంటే, మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 12 శాతానికే లభిస్తుంది. అలాంటప్పుడు పరిశీలించొచ్చు. అంతేకానీ, చెల్లింపుల సమస్య నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని ఆశ్రయిస్తే సమస్యను పెంచుకున్నట్టు అవుతుంది. అలాగే, క్రెడిట్ కార్డ్‌పై 3–4 రూపాయల వడ్డీ పడుతుంది. వ్యక్తిగత రుణాన్ని తీసుకుని క్రెడిట్ కార్డ్ రుణాన్ని తీర్చివేయవచ్చు. రుణ గ్రహీత ముందున్న మార్గం రుణం తీసుకుని, చెల్లింపులు సకాలంలో చేయకపోయినా.. రుణం ఇచ్చిన సంస్థలు గౌరవప్రదంగా, పారదర్శకంగానే వ్యవహరించాలి కానీ, వేధించడం, బెదిరించడం చేయకూడదని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్‌శెట్టి తెలిపారు. రుణం 90 రోజులకు మించి చెల్లింపులు లేకపోతే, అప్పటికీ చెల్లించేందుకు 60 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూర్డ్ రుణం చెల్లించనప్పుడు, తనఖాలో ఉంచిన ఆస్తులు లేదా వాహనాలను విక్రయించగా, వచ్చే మొత్తం నుంచి రుణం మినహాయించుచుని మిగిలినది తిరిగి రుణ గ్రహీతకు ఇచ్చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించలేనప్పుడు మారటోరియం లేదా వన్‌టైమ్ పరిష్కారం కోసం డిమాండ్ చేయవచ్చు. రుణం చెల్లించలేకపోవడం వెనుక సహేతుక కారణాలు ఉంటే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంస్థను సంప్రదించాలి. చెల్లించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరొచ్చు. మీరు చెప్పిన కారణాల్లో వాస్తవికత ఉందని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ భావిస్తే రుణ చెల్లింపులపై స్వల్పకాలం పాటు మారటోరియం (విరామం) కలి్పస్తాయి. లేదంటే రుణ కాల వ్యవధిని పెంచి, ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డు రుణం క్రెడిట్ కార్డ్ బిల్లు మొత్తం చెల్లించలేని సందర్భాల్లో, మినిమం డ్యూ (బిల్లులో నిరీ్ణత శాతం) చెల్లించినా సరిపోతుంది. ఈ మినిమం డ్యూని కూడా చెల్లించనట్టయితే ఆరు నెలలు వేచి చూసిన తర్వాత డిఫాల్ట్‌గా ఖరారు చేస్తారు. డిపాజిట్‌ను సెక్యూరిటీగా ఉంచి క్రెడిట్ కార్డు తీసుకుంటే, బకాయి పడిన సందర్భంలో డిపాజిట్‌ను రద్ధు చేసి రుణం కింద సర్దుబాటు చేసుకుంటారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పొందిన క్రెడిట్‌కార్డు అయితే, బకాయి వసూలు బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగిస్తాయి క్రెడిట్ కార్డు కంపెనీలు. రుణ గ్రహీత నుంచి రుణాన్ని రప్పించే ప్రయత్నాలను ఏజెన్సీలు చేస్తాయి. అప్పటికీ ఫలితం లేకపోతే కోర్టులో కేసు దాఖలవుతుంది. బ్యాంక్‌లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు బ్లాక్ లిస్ట్‌ను నిర్వహిస్తుంటాయి. చెల్లింపులు చేయని వారిని బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తాయి. విద్యా రుణం విద్యా రుణం ఈఎంఐ చెల్లింపులు సాధారణంగా కోర్సు ముగిసి, ఉద్యోగంలో చేరిన నాటి నుంచి మొదలవుతాయి. కానీ, కొన్ని కారణాల వల్ల కోర్స్‌లో సకాలంలో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగం రాదు. కోర్సు పూర్తి చేసినా కానీ వెంటనే అందరికీ ఉపాధి లభిస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. లేదంటే ఉద్యోగం వచి్చనప్పటికీ, అది కోల్పోయి ఖాళీగా ఉండాల్సి వచి్చన సందర్భాల్లో రుణ ఈఎంఐ చెల్లించలేకపోతే, తదుపరి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంటనే ఉద్యోగం లభించకపోయినా, వచ్చిన ఉద్యోగం కోల్పోయినా బ్యాంకులను సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేయాలి. మరింత గడువు కోరాలి. లేదంటే బ్యాంక్‌లు నిర్ణీత కాలం పాటు వేచి చూసి మిగిలిన రుణాల మాదిరే నోటీసు జారీ ద్వారా తదుపరి చర్యలు ప్రారంభిస్తాయి. విద్యా రుణానికి సంబంధించి డిఫాల్టర్‌గా మారితే భవిష్యత్‌లో ఎన్నో రుణాలకు అవరోధంగా మారొచ్చు. రూ.4–10 లక్షల వరకు విద్యా రుణాలకు బ్యాంక్‌లు ఎలాంటి సెక్యూరిటీని కోరవు. అంతకుమించితే మరో వ్యక్తిని గ్యారంటర్‌గా, లేదా ప్రాపరీ్టని తనఖాగా ఉంచాలని కోరతాయి. సకాలంలో చెల్లించలేకపోతే గ్యారంటర్ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. వ్యక్తిగత రుణం వ్యక్తిగత రుణం వాయిదా గడువు ముగిసిన 30 రోజుల వరకు చెల్లించకపోతే డిఫాల్ట్‌గా పరిణిస్తాయి. ఇదే విషయాన్ని క్రెడిట్ బ్యూరోలకు తెలియజేస్తాయి. ఇలా వరుసగా మూడు వాయిదాల్లో విఫలమైతే అప్పుడు రుణంపై అదనపు వడ్డీ రేటును (పీనల్ ఇంటరెస్ట్) వడ్డిస్తాయి. 30 నుంచి 60 రోజుల్లోపు రుణ వాయిదాను వడ్డీ, అన్ని చార్జీలతో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై స్వల్ప ప్రభావమే పడుతుంది. 90 రోజులకు కూడా చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్‌పై ఎక్కువ ప్రభావం పడుతుంది. 180 రోజుల తర్వాత కూడా చెల్లింపులు రాకపోతే అప్పుడు రుణ గ్రహీతపై కేసులు దాఖలవుతాయి. వినియోగ రుణం కన్జ్యూమర్ ఉత్పత్తుల కోసం తీసుకునే రుణాలు, వాహన రుణాలు అయినా గడువులోపు చెల్లించకపోతే ఒకటి రెండుసార్లు నోటీసును జారీ చేస్తాయి. 30 రోజుల్లోగా చెల్లించకపోతే అప్పుడు ముందుగా సమర్పించిన చెక్కులను నగదుగా మార్చుకునే చర్యలు మొదలు పెడతాయి. చెక్కులు బౌన్స్ అయితే కోర్టులో కేసు దాఖలు చేస్తాయి. వాహనం లేదా ఉత్పత్తిని స్వా«దీనం చేసుకుంటాయి. వడ్డీసహా రుణ మొత్తాన్ని చెల్లించి సమస్య నుంచి బయటపడవచ్చు. గృహ రుణం ఇంటిపై పొందే మార్ట్గేజ్ రుణం చెల్లించకపోతే ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. గడువు ముగిసిన తర్వాత 30 రోజుల్లోపు చెల్లింపులు లేకపోతే దాన్ని డిఫాల్ట్ (బకాయిపడినట్టు)గా పరిగణిస్తారు. వరుసగా మూడు ఈఎంఐలు కూడా చెల్లించకపోతే, అప్పుడు బకాయిలను 60 రోజుల్లోగా సెటిల్ చేసుకోవాలంటే లీగల్ నోటీసు పంపిస్తాయి. ఆ గడువులోపు స్పందించకపోతే, సర్ఫేసీ చట్టం కింద ఇంటి జప్తు ప్రక్రియను మొదలు పెడతాయి. ఆ తర్వాత కూడా కొల్లేటరల్ (తాకట్టు) విలువ, వేలం తేదీ తదితర వివరాలతో ఒక నోటీసు పంపిస్తాయి. అప్పుడు స్పందించినా, బ్యాంక్‌లు పరిష్కారానికి అవకాశం ఇస్తాయి. చివరి ఆప్షన్‌గా ఇంటిని వేలం నిర్వహిస్తాయి. దీనివల్ల ఇంటిని కోల్పోవడంతోపాటు, క్రెడిట్ రిపోర్ట్‌లో కొన్నేళ్లపాటు దీని ప్రభావం కనిపిస్తుంది. -
లైటింగ్ పరిశ్రమలో అగ్ర స్థానంపై విప్రో కన్ను
న్యూఢిల్లీ: లైటింగ్ పరిశ్రమలో అగ్రగామిగా అవతరించాలనే లక్ష్యంతో విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఉంది. 2024–25 నాటికి టాప్–3 కంపెనీల్లో ఒకటిగా అవతరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ద్రవ్యోల్బణం, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ క్షీణత తదితర సవాళ్లు ఉన్నప్పటికీ, తాము పరిశ్రమ సగటు కంటే వేగంగా వృద్ధిని సాధిస్తున్నట్టు తెలిపింది. విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఏడాది క్రితమే గృహోపకరణాల విభాగంలోకి అడుగు పెట్టింది. మధ్యస్థ ప్రీమియం శ్రేణిలో ఉత్పత్తులను విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్లో ఈ కామర్స్ చానళ్లపై లభిస్తున్నాయని, ఆఫ్లైన్లోనూ (భౌతిక దుకాణాఅల్లో) విక్రయించనున్నట్టు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో విప్రో కన్జ్యూమర్ కేర్ రూ.1,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. డిమాండ్ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ పరిశ్రమకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలమని గుప్తా తెలిపారు. అందుకే టాప్–3లోకి చేరాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు చెప్పారు. విప్రో లైటింగ్ వ్యాపారంలో 60 శాతం వాటా బీటూసీ నుంచి వస్తుంటే, 40 శాతం బీటూబీ నుంచి లభిస్తోందని.. ద్రవ్యోల్బణం, ఇతర అంశాల వల్ల గత ఏడాది కాలంలో బీటూసీ విభాగంలో వ్యాపారం నిదానించినట్టు తెలిపారు. కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా బీటూబీ వ్యాపారం మంచి పనితీరు సాధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీటూసీ అంటే నేరుగా కస్టమర్‌కు విక్రయించేవి. బీటూబీ అంటే వ్యాపార సంస్థలకు విక్రయించేవి. గృహోపకరణాల విభాగంలో విస్తరణ గృహోపకరణాల విభాగంలో తమకు మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు సంయజ్ గుప్తా వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేము పరీక్షించే దశలో ఉన్నాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర చానళ్లపై విక్రయిస్తున్నాం. గృహోపకరణాలు, లైటింగ్ ఉత్పత్తుల మధ్య పోలిక ఉంది. ఒకే రకమైన రిటైల్ చానళ్లలో వీటిని విక్రయిస్తుంటారు. దేశంలో లైటింగ్ ఉత్పత్తులు విక్రయించే చాలా మంది రిటైలర్లు గృహోపకరణాలను కూడా అమ్ముతుంటారు’’అని గుప్తా తమ మార్కెటింగ్ విధానాన్ని వివరించారు. ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ కెట్టెల్, ఎగ్ బాయిలర్, పాపప్ టోస్టర్, శాండ్విచ్ మేకర్లు, ఇండక్షన్ కుక్‌టాప్స్, మిక్సర్ గ్రైండర్లను విప్రో ప్రస్తుతం విక్రయిస్తోంది. ఈ విభాగంలో టీటీకే ప్రెస్టీజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ఫిలిప్స్ తదితర సంస్థలతో పోటీ పడుతోంది. వాటర్ గీజర్లు, కూలింగ్ ఉత్పత్తుల వంటి విభాగాల్లోకి ప్రవేశించే ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించగా.. చిన్నపాటి గృహోపకణాలకే పరిమితం అవుతామని గుప్తా స్పష్టం చేశారు. చిన్న గృహోపకరణాల మార్కెట్ ఇంకా విస్తరించాల్సి ఉన్నందున వృద్ధికి అవకాశాలున్నట్టు తెలిపారు. బీటూసీ స్మార్ట్ లైటింగ్‌లో తాము మార్కెట్ లీడర్‌గా ఉన్నట్టు చెప్పారు. -
సౌత్‌లో మాస్టర్ ప్లాన్! విస్తరణ బాటలో టాటా కన్జ్యూమర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ దక్షిణాది మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారుల చానల్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్టు సంస్థ ప్రకటించింది. ‘‘దక్షిణ భారత్ అంతటా మేము విస్తరిస్తున్నాం. టీ, కాఫీ, ఉప్పు, మసాలా దినుసులను దక్షిణాది కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని విడుదల చేస్తున్నాం’’అని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. కాఫీ, టీ ఉత్పత్తుల్లో ఈ సంస్థ దక్షిణాదిన మార్కెట్ వాటా పెంచుకుంటోంది. టీ విభాగంలో చక్రాగోల్డ్, కనన్ దేవాన్ బ్రాండ్ల వాటా క్రమంగా పెరుగుతుండగా.. టాటా కాఫీ గ్రాండ్ నూతన ప్యాకేజింగ్ డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ‘‘గ్రామీణ మార్కెట్లో అవకాశాలున్నట్టు గుర్తించాం. గ్రామీణ, చిన్న పట్టణాల్లో పంపిణీదారులను నియమించుకుంటున్నాం’’అని వివరించింది. ఇక టాటా సంపన్న్ బ్రాండ్ కింద మసాలా దినుసులను ప్రత్యేకంగా విడుదల చేసింది. ప్రస్తుత విభాగాల్లో అగ్రగామి ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదగడంతోపాటు, కొత్త విభాగాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నట్టు వాటాదారులకు తెలిపింది. 2022–23లో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ 15 శాతం పెరిగి, దేశవ్యాప్తంగా 1.5 మిలియన్ అవుట్లెట్లకు చేరుకుంది. మరిన్ని సంఖ్యలో రిటైల్ స్టోర్లకు సంస్థ ఉత్పత్తులను చేరువ చేయడానికి ఇది సాయపడింది. సంస్థ ఈ కామర్స్ అమ్మకాల చానల్ వేగంగా వృద్ధి చెందుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆధునిక అంగళ్లు ద్వారా అమ్మకాలు 21 శాతం పెరిగాయి. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లోకి రిలయన్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించింది. గ్లిమర్ బ్యూటీ సోప్‌లు, ప్యూరిక్ హైజీన్ సబ్బులు, డోజో డిష్ వాష్ లిక్విడ్లు, హోమ్‌గార్డ్ టాయిలెట్.. ఫ్లోర్ క్లీనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఈ ఉత్పత్తులతో ఆయా విభాగాల్లో దిగ్గజాలైన హెచ్‌యూఎల్, పీ అండ్ జీ, రెకిట్ మొదలైన వాటితో రిలయన్స్ పోటీపడనుంది. నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా వీటిని ఆవిష్కరించినట్లు ఆర్సీపీఎల్ ప్రతినిధి తెలిపారు. -
బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్ తెలియజేసింది. ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?! ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది. కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్ విక్రయానికి టీసీపీఎల్తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్ చౌహాన్ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్ కు ఇప్పటికే హిమాలయన్ బ్రాండుతో బాటిల్డ్ వాటర్ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి. -
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
అపుడు 4 లక్షలు, ఇపుడు 7 వేల కోట్లు: ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?
సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) 1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ ► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది. ►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు. ► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట. ► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది. ►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి. ►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్‌లో నిలబడింది ► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు. ► కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ►తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్. ►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. ► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. -
కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను
సాక్షి, ముంబై : కెఫే కాఫీ డే యజమాని సిద్ధార్థ సంచలన ఆత్మహత్య సంక్షోభంలో పడిన సంస్థ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.కాఫీడే కంపెనీకి చెందిన కాఫీ వెండింగ్ మెషిన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యోచిస్తోంది. దీనికి సంబందించిన చర్చల అనంతరం, ఈ ప్రతిపాదనకు టాటా బోర్డు అనుమతినిచ్చినట్టు విశ్వసీనయ వర్గాల సమాచారం. కాఫీడే వెండింగ్ వ్యాపారం రూ. 2 వేల కోట్లు (271 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. భారతదేశపు అతిపెద్ద కాఫీ తయారీ సంస్థ కాఫీ డే, వ్యవస్థాపకుడు సిద్ధార్థ అనూహ్య మరణం తరువాత అప్పులు చెల్లించేందుకు కంపెనీతీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతోంది. అలాగే గతంలో కార్పొరేట్ బిజినెస్ పార్కును బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఇంక్‌కు విక్రయించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్ఫోన్లు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఎవరి చేతులో చూసిన ఒక చైనీస్ స్మార్ట్‌ఫోన్ కనిపించాల్సిందే అన్న చందాగా మారిపోయింది. చైనీస్ కంపెనీలు షావోమి, ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్‌లు చూసిన తర్వాత మరో చైనీస్ కంపెనీ కూడా మన మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. షావోమి ప్రత్యర్థి గోమ్ ఎలక్ట్రానిక్స్ భారత్‌లో తన ప్రొడక్ట్‌లను మెగా లాంచ్ చేయబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ కంపెనీకి చైనాలో 1700 స్టోర్లు ఉన్నాయి. గోమ్ ఎలక్ట్రానిక్స్, గోమ్ టెలికాం ఈక్విప్మెంట్కు సబ్సిడరీ. ఈ కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. తొలుత గోమ్ ఎలక్ట్రానిక్స్ రూ.10వేల తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతుంది. పండుగ సీజన్‌ను క్యాష్చేసుకునేందుకు ఈ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను మల్టి బ్రాండ్ స్టోర్లు, ఆన్లైన్ల ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కూడా గోమ్ చర్చలు జరుపుతోంది. స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం మల్టి బ్రాండ్ స్టోర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో శాంసంగ్, టీసీఎల్, గోద్రెజ్, బజాజ్ లాంటి కంపెనీలకు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది. భారత్ కార్యకలాపాల కోసం 2018 మార్చిలో పీయూష్ పురిని గోమ్ ఎలక్ట్రానిక్స్, భారత అధినేతగా నియమించింది. పురి, అంతకముందు మూడేళ్లు అమెరికా మల్టినేషనల్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఇన్-హౌజ్ బ్రాండ్ ఇన్‌ఫోకస్‌కు దేశీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇన్ఫోకస్ మొబైల్ బ్రాండ్‌ను భారత్‌లో లాంచ్ చేయించింది కూడా ఈయనే. ఇన్ఫోకస్ తన ఆన్లైన్ విస్తరణ మరింత విస్తృతం చేసుకోవడానికి అమెజాన్‌తో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైన్‌కు మరో బ్రాండ్ అంబాసిడర్‌గా రన్వీర్ సింగ్‌ను నియమించింది. -
రాష్ట్రంలో మరో 8 బజాజ్ సెంటర్స్
హైదారబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ప్రకటించింది. ఇందుకోసం ‘బజాజ్ వరల్డ్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్) పి.ఎస్.టాండన్ తెలిపారు. తాము ఉత్పత్తి చేసే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ వస్తువులన్నీ ఒకే చోట ఉండే విధంగా బజాజ్ వరల్డ్ పేరుతో ప్రత్యేక షోరూంలు ఏర్పాటు చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలోనే తొలి కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాదిలోగా మరో ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే నెలరోజుల్లో హైదరాబాద్‌లో బజాజ్ వరల్డ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65 బజాజ్ వరల్డ్ స్టోర్స్ ఉన్నాయని, రెండు నెలల్లో ఈ సంఖ్య 75కి చేరుతుందన్నారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో డీలర్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ ఎలక్ట్రికల్ విభాగంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ప్రెషర్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్స్ వంటి నాన్ ఎలక్ట్రికల్ విభాగంలోకి ఏడాదిన్నర క్రితం ప్రవేశించామని, ఈఏడాది రూ. 100 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈ ఏడాది బజాజ్ ఎలక్ట్రికల్స్ మొత్తం ఆదాయం రూ.4,200 కోట్లకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5,000 కోట్లు దాటుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్అండ్డీ కేంద్రం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి ముంబైలో రూ.50-60 కోట్లతో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు టండన్ తెలిపారు. ఇది మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, అలాగే నాసిక్‌లో రూ.25 కోట్లతో వాటర్ హీటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా విస్తరించడంతోపాటు ఎగుమతులపై కూడా దృష్టిసారిస్తున్నామని, ప్రస్తుతం మొత్తం అమ్మకాల్లో ఒక శాతం వాటాగా ఉన్న ఎగుమతులు విలువ వచ్చే ఏడాది రెట్టింపు అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది రూ.40 కోట్లు, వచ్చే ఏడాది రూ.100 కోట్ల అమ్మకాలు ఎగుమతులు ద్వారా వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.