సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్)
1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ
► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది.
►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు.
► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్‌లలో లాంచ్ చేశారు.
► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట.
► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది.
►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి.
►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్‌లో నిలబడింది
► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు.
► కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్‌లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్‌కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?)
►తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్‌లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్.
►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్.
► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment