Bisleri water
-
Jayanthi Chauhan: బాధ్యతను సవాల్‌గా తీసుకుంది
మహిళలు ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అంతకన్నా సమర్థతంగా తమ సత్తా ఏంటో నిరూపించగలరు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ తండ్రి అమ్మాలనుకున్న కంపెనీ బాధ్యతలను చేపట్టి కార్పొరేట్ దిగ్గజాలకు దీటుగా ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మహిళ జయంతి చౌహాన్. ఎవరీమే..? అనేవారికి ఆమె ప్రతిభే ఆమెను పరిచయం చేస్తుంది. రెండేళ్ల క్రితం వరకు జయంతి చౌహాన్ తనకు నచ్చిన రంగమైన ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఓ అంతర్జాతీయ కంపెనీని విజయవంతంగా నడిపిస్తూ ఉండేది. ఆమె తండ్రి భారతీయ బహుళజాతి కంపెనీ అయిన బిస్లరీకి రమేష్ చౌహాన్ చైర్మన్. కూతురిని మొదట ఈ వ్యాపార రంగంలోకి రమ్మని అడిగాడు. కానీ, వ్యాపార రంగంలో ఆసక్తి లేక ఆమె నిరాకరించింది. రమేష్ చౌహాన్ వయసు పై బడుతుండటం, ఎవరి మద్దతూ లేక΄ోవడంతో కంపెనీని అమ్మాలని పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల యజమానులతో చర్చలు జరిపారు. 2022లో చేసిన చర్చలు సఫలం అయ్యాయి. కానీ, డీల్ అమలు కాలేదు. ఆ సమయంలో జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీకి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చింది. బిస్లరీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పు కనిపించింది.ఫ్యాషన్ ఐకాన్ఢిల్లీ, ముంబయ్ నగరాలలో జయంతి బాల్యం గడిచింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఉన్న ఇష్టంతో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టైలింగ్‌లో పట్టా ΄÷ందింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తనదైన స్టైల్ మార్క్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు ΄÷ందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో బిఏ కూడా చేసింది.కొత్త పానీయాల పరిచయంబిస్లరీ కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్‌ను చూపింది. వాటర్ కంపెనీ నుంచి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ΄్లాట్ఫారమ్ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి జరిగింది. దీంతో టాటా గ్రూప్‌తో డీల్ కుదిరి, మినరల్ వాటర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇతర కార్పోరేట్ కంపెనీలతో జయంతి చౌహాన్‌కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ ΄ోటీపడుతోంది. జయంతి తన 42 ఏళ్ల వయసులో వైస్ చైర్పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా, తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పోరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. ‘సమస్య మనదే, సవాల్ కూడా మనదే’ అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. -
Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్
గత కొన్ని రోజులుగా ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు. నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది. జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..) జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని 'ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్‌పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
బిస్లెరీని విక్రయించం: రమేష్ చౌహాన్
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్‌లో టాటా కన్జూమర్సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్‌ను ఇకపై ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయవలసి ఉన్నట్లు చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్ వాటర్ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్ వాటర్‌ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్ చేస్తోంది. సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్ దిగ్గజం కోకకోలాకు చౌహాన్ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్ బాటిల్డ్ వాటర్ విభాగంలో బిజినెస్‌ను కలిగి ఉంది. గ్రూప్ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కలయికతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆవిర్భవించింది. హైడ్రేషన్ విభాగంలోని టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే. -
ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహాన్ నడిపించనున్నారు. బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్ రమేష్ చౌహాన్ తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! ది ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు. 42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్‌పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బిస్లెరీతో చర్చలకు ‘టాటా’: అసలేమైంది?
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) తాజాగా వెల్లడించింది. ఇటీవల కొద్ది రోజులుగా బిస్లెరీ బ్రాండును టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్లు అంచనాలు పెరిగిన నేపథ్యంలో చర్చలు నిలిపివేసినట్లు నియంత్రణ సంస్థలకు టాటా కన్జూమర్ తెలియజేసింది. ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో ఎలాంటి తప్పనిసరి ఒప్పందాలు కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?! ఇందుకు ఎలాంటి కట్టుబాట్లనూ ఏర్పాటు చేసుకోలేదని తెలియజేసింది. అయితే వ్యాపార విస్తరణ, వృద్ధి అవకాశాలకున్న వ్యూహాత్మక అంశాలపై దృష్టి కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇకపైనా బిస్లెరీ ఇంటర్నేషనల్ సహా వివిధ సంస్థలతో చర్చలు నిర్వహించే వీలున్నట్లు వెల్లడించింది. కాగా.. బిస్లెరీ ఇంటర్నేషనల్ విక్రయానికి టీసీపీఎల్తోపాటు పలు కొనుగోలుదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ప్రమోటర్, వెనుకటితరం పారిశ్రామిక వేత్త రమేష్ చౌహాన్ గతేడాది పేర్కొన్నారు. మరోవైపు మరిన్ని మార్కెట్లలో విస్తరించేందుకు అనువుగా టీసీపీఎల్ పలు కంపెనీలను కొనుగోలు చేస్తూ వస్తోంది. టీసీపీఎల్ కు ఇప్పటికే హిమాలయన్ బ్రాండుతో బాటిల్డ్ వాటర్ విభాగంలో కార్యకలాపాలు ఉన్నాయి. -
రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే..
వేల కోట్లు సంపాందించిన వ్యాపారవేత్తలు తమ తదనంతరం వ్యాపార సామ్రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్.. తనకు ఆ భాగ్యం కలగడం లేదని, తన కూతురు జయంతి చౌహాన్ వారసత్వంగా కంపెనీ వ్యాపారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అప్పట్లో తెగ బాధపడిపోయారు. ఎవరీ జయంతి చౌహాన్? జయంతి చౌహాన్... బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్ ఒక్కగానొక్క కూతురు. రూ. 7వేల కోట్ల సంస్థను నడపడానికి ఆసక్తి చూపడం లేదని వెల్లడించడంతో ఆ మధ్య వార్తల్లో నిలిచారు. తన తర్వాత వ్యాపారాన్ని నడిపే వారు ఎవరూ లేనందున పూర్తి టేకోవర్ డీల్ కోసం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. అయితే కంపెనీ వాల్యుయేషన్ విషయంలో ఒప్పందం కుదురకపోవడంతో ఆ చర్చలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆసక్తి.. తాజాగా బిస్లరీ కంపెనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అధికారిక హైడ్రేషన్ పార్టనర్‌గా మారింది. ఈ ఒప్పందం కుదరడంలో జయంతి చౌహాన్ కీలక పాత్ర పోషించారు. అంటే ఆమె కంపెనీ వ్యాపార వ్యవహారాలపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతోందని అర్థమవుతోంది. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన దేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమలో బిస్లరీ అగ్రగామి సంస్థ. 50 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి 128 ప్లాంట్లు ఉన్నాయి. థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా వంటి బ్రాండ్లను స్థాపించడం వెనుక రమేష్ చౌహాన్ ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 82 ఏళ్లు. వయసు పైబడం.. కూతురు వారసత్వంగా కంపెనీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో కంపెనీని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. జయంతి చౌహాన్ ప్రస్తుతం బిస్లరీ సంస్థకు వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ నిర్ణయాలు, రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, ఆమె ఆసక్తి అంతా ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీలో ఉంది. ఆమె ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ వంటి సంస్థలను నిర్వహిస్తోంది. ఇదీచదవండి: వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే! -
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
రూ.7వేల కోట్ల బిజినెస్ వద్దన్న కుమార్తె, కంపెనీని అమ్మకానికి పెట్టిన తండ్రి
దేశీయ దిగ్గజ ప్యాకేజ్డ్ వాటర్ సంస్థ బిస్లెరీని ఆ సంస్థ అధినేత రమేష్ చౌహాన్ అమ్మేస్తున్నారు. వృద్దాప్యం దృష్ట్యా రూ.7వేల కోట్ల విలువైన బిస్లెరీ బాధత్యల్ని తన కుమార్తె జయంతి చౌహాన్ (జేఆర్సీ) కు అప్పగించాలని అనుకున్నారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బిస్లెరీని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సుమఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో వేల కోట్ల కంపెనీని వదులుకుంటున్న జయంతి చౌహాన్ పేరు చర్చాంశనీయంగా మారగా..ఆమె గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►ప్రస్తుతం బిస్లెరీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న జయంతి చౌహాన్ బాల్యాన్ని ఢిల్లీ, బాంబే, న్యూయార్క్ సిటీలో గడిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె లాస్ ఏంజెలెస్‌లోని ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ (ఎఫ్ఐడీఎం)లో ప్రొడక్ట్ డెవలప్మెంట్,మారంగోని మిలన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ స్టైలింగ్ పూర్తి చేశారు. ► బిస్లెరీ అఫిషీయల్ వెబ్సైట్లో పేర్కొన్నట్లుగా.. 24ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి రమేష్ చౌహాన్ అడుగు జాడల్లో నడుస్తూ బిస్లెరీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ►ఢిల్లీ ఆఫీస్ బాధ్యతల్ని బుజాలకెత్తుకున్న ఆమె సంస్థ రూట్ లెవల్ నుంచి ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ఆటోమెషిన్ టెక్నాలజీని వినియోగించేలా పునరుద్ధరించారు. వీటితో పాటు హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నిష్ణాతులైన సిబ్బందిని తయారు చేశారు. 2011లో ముంబై ఆఫీస్ బాధ్యతల్ని స్వికరించారు. ►బిస్లెరీ మినరల్ వాటర్, హిమాలయా పర్వతాల్లో లభించే నీటితో తయారు చేసిన వేదిక నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ ఫ్యాక్టరీలకు చెందిన ప్రొడక్షన్, సర్వీస్,డిస్టిబ్యూషన్, మేనేజ్మెంట్ విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు బిస్లెరీ సంస్థ అడ్వటైజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ విభాగాల్లో చురుగ్గా పనిచేశారు. ►బిస్లెరీ బ్రాండ్ వ్యాల్యూని పెంచుతూ సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. బిస్లెరీ బ్రాండ్ ఇమేజ్,పెరుగుతున్న పోర్ట్‌ఫోలియో వెనుక ఆమె వ్యాపార నైపుణ్యం దాగి ఉందని బిస్లెరీ తన వెబ్సైట్లో పేర్కొంది. -
అపుడు 4 లక్షలు, ఇపుడు 7 వేల కోట్లు: ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?
సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) 1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ ► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది. ►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు. ► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట. ► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది. ►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి. ►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్‌లో నిలబడింది ► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు. ► కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ►తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్. ►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. ► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. -
బిస్లరీ చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్
సాక్షి, ముంబై: టాటా గ్రూపు మరో బిగ్గెస్ట్ డీల్‌ను కుదుర్చుకోనుంది. భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ మేకర్ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రూ. 7 వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. బిస్లరీ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ వ్యాఖ్యలని ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. సంచలన బ్రాండ్ బిస్లరీ థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కా ఆవిష్కర్త రమేశ్ చౌహాన్ మూడు దశాబ్దాల క్రితం (1993) ఏరేటెడ్ డ్రింక్స్ బ్రాండ్లను కోకోకోలాకు విక్రయించారు. తాజాగా బిస్లరీని సైతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. టాటా కన్జూమర్స్ సంస్థ బిస్లరీ బ్రాండ్ ను రూ. 7వేల కోట్లకు కొనుగోలు చేయనుంది. విక్రయ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత నిర్వహణ రెండేళ్ల పాటు కొనసాగనుంది. కుమార్తె జయంతి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 82 ఏళ్ల చౌహాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత సెప్టెంబరులోనే బిస్లరీ అమ్మకానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సహా పలు కంపెనీలు టాటాతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ,టాటా కన్స్యూమర్ సీఈఓ సునీల్ డిసౌజాతో సమావేశం తర్వాత రమేశ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధాకరమైన నిర్ణయమే..కానీ, బిస్లరీ విక్రయం ఇప్పటికీ బాధాకరమైన నిర్ణయమే అయినప్పటికీ టాటా గ్రూప్ టాటా గ్రూపు మరింత అభివృద్ది చేసి, ఇంకా బాగా చూసుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ నిజాయితీ, జీవిత విలువలను గౌరవించే సంస్కృతి తనకిష్టమనీ, అందుకే ఆసక్తిగల కొనుగోలుదారుల దూకుడును పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ డీల్ కేవలం డబ్బుకు సంబంధించినది కాదని, ఎంతో ప్రేమ, అభిరుచితో నిర్మించుకున్న వ్యాపారం, ఇప్పుడు అదే ఉత్సాహంతో ఉద్యోగులు నడుపుతున్నారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే కంపెనీలో మైనారిటీ వాటా కూడా ఉంచుకోకపోవడంపై చైర్మన్ చౌహాన్ మాట్లాడుతూ, కంపెనీలో చురుగ్గా తానేమీ చేయలేనపుడు దీని వలన పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. మరోవైపు బిస్లరీ విక్రయం తర్వాత, చౌహాన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, పేదలకు వైద్య సహాయం లాంటి పర్యావరణ, స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి సారించాలని యోచిస్తున్నారట. -
టాటా గ్రూప్ సరికొత్త ప్లాన్స్, ఇక ఆ రంగంలోకి కూడా
ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్‌లో వాటాలు దక్కించు కోవడంపై దృష్టి సారించింది. ముందుగా కొంత కొనుగోలు చేసి, క్రమంగా వాటాలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బిస్లరీ యాజమాన్యానికి టాటా గ్రూప్ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కుదిరే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాయి. ఈ డీల్ కుదిరితే, వేగంగా విస్తరిస్తున్న బాటిల్ వాటర్ మార్కెట్లో పోటీ పడేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసిజి విభాగానికి ప్రీమియం సెగ్మెంట్లో పట్టు లభించినట్టేనని పరిశీలకులు పేర్కొన్నారు. కాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాకేజ్ చేయబడిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్ వాటర్,టాటా గ్లూకో+ వంటి బ్రాండ్లతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిన బిస్లెరీ..! 24x7 ఇంటి వద్దకే డెలివరీ..!
ప్యాకేజ్డ్ వాటర్ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్ డీ2సీ(డైరక్ట్ టూ కన్స్యూమర్) కాన్స్ప్ట్ను ప్రోత్సహిస్తూ Bisleri@ Doorstep అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ సహాయంతో వినియోగదారులు నేరుగా ప్యాకేజ్డ్ వాటర్‌ను ఇంటికి డెలివరీ పొందే సౌకర్యాన్ని బిస్లెరీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చును. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో బిస్లెరీ డోర్ డెలివరీ సేవలను కంపెనీ అందిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్, అహ్మాదాబాద్, చెన్నై తదితర నగరాల్లో అందుబాటులో ఉంది. బిస్లెరీ మినరల్ వాటర్‌ను నిరంతరాయంగా సరఫరా పొందడం కోసం కస్టమర్లు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. 122 ఆపరేషనల్ ప్లాంట్, 4500 డిస్ట్రిబ్యూటర్స్‌తో దేశ వ్యాప్తంగా ఆయా నగరాల్లో 24X7 ప్యాకేజ్డ్ వాటర్‌ను డెలివరీ చేయనున్నట్లు బిస్లెరీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్-19 రాకతో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ డెలివరీ సేవలను ప్రారంభించినట్లు బిస్లెరీ సీఈవో అంజెలో జార్జ్ వెల్లడించారు. చదవండి: రెండు నెలల్లో రూ.15 లక్షల కోట్ల సంపద హాంఫట్..! -
కోకాకోలా, బిస్లేరి, రామ్‌దేవ్‌బాబాకు షాక్: కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. పర్యావరణ సమతుల్యత దెబ్బతినేలా వ్యవహరిస్తున్న కంపెనీలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మూడు పెద్ద కంపెనీలపై చర్యలకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ బ్యాగులు, బాటిళ్ల సేకరణకు సంబంధించి సమాచారం ఇవ్వకపోవడంతో కోక్, పెప్సీ, బిస్లేరీ కంపెనీలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ మూడు కంపెనీలకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ఆ మూడు కంపెనీలకు కలిపి దాదాపు రూ.72 కోట్ల జరిమానా విధిస్తూ కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో బిస్లేరీ సంస్థకు రూ.10.75 కోట్లు, పెప్సీకి రూ.8.7 కోట్లు, కోకాకోలా కంపెనీకి రూ.50.66 కోట్ల జరిమానా విధించింది. వీటితో పాటు రాందేవ్ బాబాకు చెందిన పతాంజలి సంస్థకు రూ. కోటి, మరో సంస్థకు రూ.85.9 లక్షల జరిమానా వేసింది. జరిమానాలను 15 రోజుల్లోగా చెల్లించాలని పీసీబీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్స్‌బిలిటీ (ఈపీఆర్) అనేది పాలసీ కొలత. దీని ఆధారంగా ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే కంపెనీలు ఉత్పత్తులను పారవేసేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బిస్లేరి: ఈ కంపెనీ ప్లాస్టిక్ వ్యర్థాలు కేవలం 9 నెలల్లో సుమారు 21,500 టన్నులుగా తేలింది. టన్నుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10.75 కోట్లు జరిమానా విధించింది. పెప్సీ: 11,194 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. కోకాకోలా బెవరేజెస్ సంస్థలో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 4,417 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. ఈపీఆర్ లక్ష్యం లక్షా 5 వేల 744 టన్నుల వ్యర్థాలు. ఈ విధంగా ఒక్కో సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను బట్టి జరిమానాను కాలుష్య నియంత్రణ మండలి విధించింది. మేం బాధ్యతతో ఉన్నాం: బిస్లేరి అయితే ఈ వార్తలపై తాజాగా బిస్లేరీ యాజమాన్యం స్పందించింది. తాము బాధ్యతతో ఉన్నామని.. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. ‘‘కాలుష్య నియంత్రణ మండలి ఇతర పర్యావరణ సంస్థల నియమనిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాం. ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన పత్రాలు సమర్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మేం నిబద్ధతతో పని చేస్తున్నాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేరు చేయు విధానంపై మేం సమాజంలో అవగాహన కల్పిస్తున్నాం. పాఠశాలలతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాపై వచ్చిన ఫిర్యాదులను మా బృందం పరిశీలిస్తోంది. వాటిని వీలైనంత త్వరగా పరిష్కారం లభిస్తుంది’’ బిస్లేరీ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఆ వాటర్ బాటిళ్లనూ అమ్మొచ్చు
బిస్లరీనే కాదు... బీఎస్ఐ ప్రమాణాలున్నా విక్రయించవచ్చు: హైకోర్టు సాక్షి, హైదరాబాద్: బస్టాండుల్లో కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లే కాక భారత ప్రమాణాల సంస్థ (బీఎస్ఐ), భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలను పాటించే కంపెనీల వాటర్ బాటిళ్లను కూడా విక్రయించవచ్చునని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బస్టాండ్లలోని వాటర్ బాటిళ్ల విక్రేతలకు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే బిస్లరీయేతర బాటిళ్లను (బీఎస్ఐ, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలున్నవి) అదనపు లైసెన్స్ రుసుము చెల్లించి అమ్ముకోవచ్చునంది. ఒకవేళ ఎవరైనా వ్యాపారులు నాణ్యాత ప్రమాణాలు లేని వాటర్ బాటిళ్లను విక్రయిస్తే వారిపై టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవచ్చంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ అధికారులు కేవలం బిస్లరీ కంపెనీ వాటర్ బాటిళ్లనే, అది కూడా నిర్ధిష్టంగా ఓ పంపిణీదారు నుంచే కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలంటూ డి.జాహెద్‌బాషా, మరో 19 మంది దుకాణదారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జ్... దుకాణదారుల పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ దుకాణదారులు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు.