ముంబై: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ తాజాగా ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ ఇంటర్నేషనల్‌లో వాటాలు దక్కించు కోవడంపై దృష్టి సారించింది. ముందుగా కొంత కొనుగోలు చేసి, క్రమంగా వాటాలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి బిస్లరీ యాజమాన్యానికి టాటా గ్రూప్ సంస్థ టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) ఇప్పటికే ఆఫర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీల్ కుదిరే విషయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నాయి.
ఈ డీల్ కుదిరితే, వేగంగా విస్తరిస్తున్న బాటిల్ వాటర్ మార్కెట్‌లో పోటీ పడేందుకు టాటా గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఎంసిజి విభాగానికి ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టు లభించినట్టేనని పరిశీలకులు పేర్కొన్నారు. కాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికే హిమాలయన్ బ్రాండ్‌తో ప్యాకేజ్ చేయబడిన మినరల్ వాటర్‌ను, హైడ్రేషన్ విభాగంలో టాటా కాపర్ ప్లస్ వాటర్,టాటా గ్లూకో+ వంటి బ్రాండ్‌లతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment