గత కొన్ని రోజులుగా ప్యాకేజ్‌డ్ వాటర్ బిజినెస్ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు.
నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది.
జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు.
(ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..)
జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని 'ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు.
(ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు)
జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్‌పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్‌తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్‌లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment