Jayanti Chauhan
-
Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్
గత కొన్ని రోజులుగా ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్ చౌహాన్ స్పష్టం చేశారు. నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది. జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు. (ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..) జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని 'ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్ డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు. (ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు) జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్‌పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. -
ఇక బిస్లెరీకి బాస్ ఆమే...
ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార దిగ్గజం బిస్లెరీని ఇక ఆ కంపెనీ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహాన్ నడిపించనున్నారు. బిజినెస్ కొనుగోలుకి బిస్లెరీ ఇంటర్నేషనల్‌తో చేపట్టిన చర్చలకు చెక్ పడినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(టీసీపీఎల్) వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో బిస్లెరీ కంపెనీకి ఇక జయంతి చౌహాన్ అధిపతిగా ఉంటారని ఆమె తండ్రి సంస్థ చైర్మన్ రమేష్ చౌహాన్ తాజాగా తెలిపారు. ఇదీ చదవండి: Rs 2000 notes: రూ.2వేల నోట్లపై కేంద్రం కీలక ప్రకటన! ది ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమేష్ చౌహాన్ మాట్లాడుతూ.. తమ వ్యాపార సంస్థను తాము అమ్మడం లేదని, తమ కూతురు జయంతి చౌహాన్ ఇక మీదట సంస్థను నడిపిస్తారని చెప్పారు. 42 ఏళ్ల జయంతి చౌహాన్ ప్రస్తుతం ఆమె తండ్రి స్థాపించి తీర్చిదిద్దిన బిస్లెరీ కంపెనీలో వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. ఆమె కంపెనీ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ బృందంతో కలిసి పని చేస్తారు. జయంతి చౌహాన్ కంపెనీ వ్యాపార వ్యవహారాల్లో అప్పుడప్పుడు పాలుపంచుకుంటున్నారు. అయితే బిస్లరీ పోర్ట్‌ఫోలియోలో భాగమైన వేదిక బ్రాండ్‌పైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. టాటా సంస్కృతి, విలువలు నచ్చడంతో తాను తన వ్యాపార సంస్థ బిస్లెరీని వారికి అమ్మదలిచానని, ఇతర సంస్థలు బిస్లెరీ కొనుగోలుకు ఎంత ప్రయత్నించినా తాను పట్టించుకోలేదని రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. ఇదీ చదవండి: Apple Watch: ప్రాణం కాపాడిన యాపిల్ వాచ్!.. ఎలాగంటే... టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు బిస్లరీ కంపెనీ వాల్యుయేషన్‌పై భిన్నాభిప్రాయాల కారణంగా అటకెక్కాయి. అయితే చర్చలు విఫలం కావడానికి వాల్యుయేషన్ కాకుండా వేరే కారణాలు ఉన్నట్లు ఎకనమిక్స్ టైమ్స్ పేర్కొంటోంది. కంపెనీ ప్రమోటర్లు భవిష్యత్తులో తమ ఆలోచనలను మార్చుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే..
వేల కోట్లు సంపాందించిన వ్యాపారవేత్తలు తమ తదనంతరం వ్యాపార సామ్రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్.. తనకు ఆ భాగ్యం కలగడం లేదని, తన కూతురు జయంతి చౌహాన్ వారసత్వంగా కంపెనీ వ్యాపారాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అప్పట్లో తెగ బాధపడిపోయారు. ఎవరీ జయంతి చౌహాన్? జయంతి చౌహాన్... బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్ ఒక్కగానొక్క కూతురు. రూ. 7వేల కోట్ల సంస్థను నడపడానికి ఆసక్తి చూపడం లేదని వెల్లడించడంతో ఆ మధ్య వార్తల్లో నిలిచారు. తన తర్వాత వ్యాపారాన్ని నడిపే వారు ఎవరూ లేనందున పూర్తి టేకోవర్ డీల్ కోసం టాటా గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు రమేష్ చౌహాన్ అప్పట్లో చెప్పారు. అయితే కంపెనీ వాల్యుయేషన్ విషయంలో ఒప్పందం కుదురకపోవడంతో ఆ చర్చలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆసక్తి.. తాజాగా బిస్లరీ కంపెనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అధికారిక హైడ్రేషన్ పార్టనర్‌గా మారింది. ఈ ఒప్పందం కుదరడంలో జయంతి చౌహాన్ కీలక పాత్ర పోషించారు. అంటే ఆమె కంపెనీ వ్యాపార వ్యవహారాలపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతోందని అర్థమవుతోంది. ఇదీ చదవండి: Microsoft: మరీ దారుణం భయ్యా! టీం అంతటినీ పీకేశారు.. టెక్కీ ఆవేదన దేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమలో బిస్లరీ అగ్రగామి సంస్థ. 50 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి 128 ప్లాంట్లు ఉన్నాయి. థమ్స్ అప్, గోల్డ్ స్పాట్, లిమ్కా వంటి బ్రాండ్లను స్థాపించడం వెనుక రమేష్ చౌహాన్ ఉన్నారు. ఆయనకు ఇప్పుడు 82 ఏళ్లు. వయసు పైబడం.. కూతురు వారసత్వంగా కంపెనీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో కంపెనీని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. జయంతి చౌహాన్ ప్రస్తుతం బిస్లరీ సంస్థకు వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కంపెనీ నిర్ణయాలు, రోజువారీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ, ఆమె ఆసక్తి అంతా ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీలో ఉంది. ఆమె ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ వంటి సంస్థలను నిర్వహిస్తోంది. ఇదీచదవండి: వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే! -
రూ.7వేల కోట్ల బిజినెస్ వద్దన్న కుమార్తె, కంపెనీని అమ్మకానికి పెట్టిన తండ్రి
దేశీయ దిగ్గజ ప్యాకేజ్డ్ వాటర్ సంస్థ బిస్లెరీని ఆ సంస్థ అధినేత రమేష్ చౌహాన్ అమ్మేస్తున్నారు. వృద్దాప్యం దృష్ట్యా రూ.7వేల కోట్ల విలువైన బిస్లెరీ బాధత్యల్ని తన కుమార్తె జయంతి చౌహాన్ (జేఆర్సీ) కు అప్పగించాలని అనుకున్నారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బిస్లెరీని అమ్మేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సుమఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో వేల కోట్ల కంపెనీని వదులుకుంటున్న జయంతి చౌహాన్ పేరు చర్చాంశనీయంగా మారగా..ఆమె గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ►ప్రస్తుతం బిస్లెరీ వైస్ ఛైర్మన్‌గా ఉన్న జయంతి చౌహాన్ బాల్యాన్ని ఢిల్లీ, బాంబే, న్యూయార్క్ సిటీలో గడిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె లాస్ ఏంజెలెస్‌లోని ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ (ఎఫ్ఐడీఎం)లో ప్రొడక్ట్ డెవలప్మెంట్,మారంగోని మిలన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ స్టైలింగ్ పూర్తి చేశారు. ► బిస్లెరీ అఫిషీయల్ వెబ్సైట్లో పేర్కొన్నట్లుగా.. 24ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి రమేష్ చౌహాన్ అడుగు జాడల్లో నడుస్తూ బిస్లెరీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ►ఢిల్లీ ఆఫీస్ బాధ్యతల్ని బుజాలకెత్తుకున్న ఆమె సంస్థ రూట్ లెవల్ నుంచి ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ఆటోమెషిన్ టెక్నాలజీని వినియోగించేలా పునరుద్ధరించారు. వీటితో పాటు హెచ్ఆర్, సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో నిష్ణాతులైన సిబ్బందిని తయారు చేశారు. 2011లో ముంబై ఆఫీస్ బాధ్యతల్ని స్వికరించారు. ►బిస్లెరీ మినరల్ వాటర్, హిమాలయా పర్వతాల్లో లభించే నీటితో తయారు చేసిన వేదిక నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ ఫ్యాక్టరీలకు చెందిన ప్రొడక్షన్, సర్వీస్,డిస్టిబ్యూషన్, మేనేజ్మెంట్ విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు బిస్లెరీ సంస్థ అడ్వటైజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డెవలప్మెంట్ విభాగాల్లో చురుగ్గా పనిచేశారు. ►బిస్లెరీ బ్రాండ్ వ్యాల్యూని పెంచుతూ సేల్స్, మార్కెటింగ్ టీమ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. బిస్లెరీ బ్రాండ్ ఇమేజ్,పెరుగుతున్న పోర్ట్‌ఫోలియో వెనుక ఆమె వ్యాపార నైపుణ్యం దాగి ఉందని బిస్లెరీ తన వెబ్సైట్లో పేర్కొంది.