మహిళలు ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అంతకన్నా సమర్థతంగా తమ సత్తా ఏంటో నిరూపించగలరు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ
తండ్రి అమ్మాలనుకున్న కంపెనీ బాధ్యతలను చేపట్టి కార్పొరేట్ దిగ్గజాలకు దీటుగా ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మహిళ జయంతి చౌహాన్. ఎవరీమే..? అనేవారికి ఆమె ప్రతిభే ఆమెను పరిచయం చేస్తుంది.
రెండేళ్ల క్రితం వరకు జయంతి చౌహాన్ తనకు నచ్చిన రంగమైన ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఓ అంతర్జాతీయ కంపెనీని విజయవంతంగా నడిపిస్తూ ఉండేది. ఆమె తండ్రి భారతీయ బహుళజాతి కంపెనీ అయిన బిస్లరీకి రమేష్ చౌహాన్ చైర్మన్. కూతురిని మొదట ఈ వ్యాపార రంగంలోకి రమ్మని అడిగాడు. కానీ, వ్యాపార రంగంలో ఆసక్తి లేక ఆమె నిరాకరించింది.
రమేష్ చౌహాన్ వయసు పై బడుతుండటం, ఎవరి మద్దతూ లేక΄ోవడంతో కంపెనీని అమ్మాలని పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల యజమానులతో చర్చలు జరిపారు. 2022లో చేసిన చర్చలు సఫలం అయ్యాయి. కానీ, డీల్ అమలు కాలేదు. ఆ సమయంలో జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీకి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చింది. బిస్లరీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పు కనిపించింది.
ఫ్యాషన్ ఐకాన్
ఢిల్లీ, ముంబయ్ నగరాలలో జయంతి బాల్యం గడిచింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఉన్న ఇష్టంతో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి స్టైలింగ్‌లో పట్టా ΄÷ందింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తనదైన స్టైల్ మార్క్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు ΄÷ందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో బిఏ కూడా చేసింది.
కొత్త పానీయాల పరిచయం
బిస్లరీ కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్‌ను చూపింది. వాటర్ కంపెనీ నుంచి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ΄్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి జరిగింది. దీంతో టాటా గ్రూప్‌తో డీల్ కుదిరి, మినరల్ వాటర్ బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టింది.
ఇతర కార్పోరేట్ కంపెనీలతో జయంతి చౌహాన్‌కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ ΄ోటీపడుతోంది. జయంతి తన 42 ఏళ్ల వయసులో వైస్ చైర్‌పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా, తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పోరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. ‘సమస్య మనదే, సవాల్ కూడా మనదే’ అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment