fashion sector
-
Jayanthi Chauhan: బాధ్యతను సవాల్‌గా తీసుకుంది
మహిళలు ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. అంతకన్నా సమర్థతంగా తమ సత్తా ఏంటో నిరూపించగలరు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ తండ్రి అమ్మాలనుకున్న కంపెనీ బాధ్యతలను చేపట్టి కార్పొరేట్ దిగ్గజాలకు దీటుగా ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టిన మహిళ జయంతి చౌహాన్. ఎవరీమే..? అనేవారికి ఆమె ప్రతిభే ఆమెను పరిచయం చేస్తుంది. రెండేళ్ల క్రితం వరకు జయంతి చౌహాన్ తనకు నచ్చిన రంగమైన ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన ఓ అంతర్జాతీయ కంపెనీని విజయవంతంగా నడిపిస్తూ ఉండేది. ఆమె తండ్రి భారతీయ బహుళజాతి కంపెనీ అయిన బిస్లరీకి రమేష్ చౌహాన్ చైర్మన్. కూతురిని మొదట ఈ వ్యాపార రంగంలోకి రమ్మని అడిగాడు. కానీ, వ్యాపార రంగంలో ఆసక్తి లేక ఆమె నిరాకరించింది. రమేష్ చౌహాన్ వయసు పై బడుతుండటం, ఎవరి మద్దతూ లేక΄ోవడంతో కంపెనీని అమ్మాలని పెద్ద పెద్ద కార్పోరేట్ కంపెనీల యజమానులతో చర్చలు జరిపారు. 2022లో చేసిన చర్చలు సఫలం అయ్యాయి. కానీ, డీల్ అమలు కాలేదు. ఆ సమయంలో జయంతి చౌహాన్ తన తండ్రి కంపెనీకి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చింది. బిస్లరీ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కంపెనీలో పెద్ద మార్పు కనిపించింది.ఫ్యాషన్ ఐకాన్ఢిల్లీ, ముంబయ్ నగరాలలో జయంతి బాల్యం గడిచింది. ఆ తర్వాత ఫ్యాషన్ రంగం అంటే ఉన్న ఇష్టంతో ఆమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ నుంచి స్టైలింగ్‌లో పట్టా ΄÷ందింది. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్‌లో ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తనదైన స్టైల్ మార్క్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు ΄÷ందింది. స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్‌లో బిఏ కూడా చేసింది.కొత్త పానీయాల పరిచయంబిస్లరీ కంపెనీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన మార్క్‌ను చూపింది. వాటర్ కంపెనీ నుంచి కార్బొనేటెడ్ డ్రింక్స్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఉత్పత్తులు సంస్థకు మరింత లాభదాయకంగా మారాయి. డిజిటల్, సోషల్ మీడియా ΄్లాట్ఫారమ్ల ద్వారా ప్రచారం కూడా ఉత్పత్తి వృద్ధిని పెంచింది. శీతల పానీయాల పరిశ్రమలోని దిగ్గజ కంపెనీలకు బిస్లరీ ప్రవేశం ఓ సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు భావించేంతగా కృషి జరిగింది. దీంతో టాటా గ్రూప్‌తో డీల్ కుదిరి, మినరల్ వాటర్ బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. ఇతర కార్పోరేట్ కంపెనీలతో జయంతి చౌహాన్‌కు చెందిన బిస్లరీ ఇంటర్నేషనల్ ΄ోటీపడుతోంది. జయంతి తన 42 ఏళ్ల వయసులో వైస్ చైర్పర్సన్ హోదాతో కంపెనీని దిగ్విజయంగా నడిపిస్తోంది. సేల్స్, మార్కెటింగ్ బృందానికి కూడా నాయకత్వం వహిస్తోంది. వ్యాపార రంగంలో తన నైపుణ్యాలను చూపలేనేమో అని సందేహించి తొలుత వెనకడుగు వేసినా, తండ్రి మీద ప్రేమతో తీసుకున్న బాధ్యతను మరింత దిగ్విజయంగా నడిపిస్తూ కార్పోరేట్ దిగ్గజాలకే ఔరా అనిపిస్తోంది. ‘సమస్య మనదే, సవాల్ కూడా మనదే’ అని నవ్వుతూ సమాధానమిచ్చే జయంతి లాంటి వ్యక్తులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. -
సిటీలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్.. నిఫ్ట్
హైటెక్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి.. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ - నిఫ్ట్’. హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ సమీపంలోని నిఫ్ట్ క్యాంపస్ కూడా జాతీయ స్థాయిలో సుపరిచితమైన సంస్థ. ఫ్యాషన్ రంగంలో వినూత్న కోర్సుల్లో శిక్షణకు కేరాఫ్ ఈ ఇన్స్టిట్యూట్. ఫ్యాషన్ టెక్నాలజీలో యాక్సెసరీస్ డిజైన్ మొదలు నిర్వహణ నైపుణ్యాలు అందించే ఫ్యాషన్ మేనేజ్మెంట్ వరకు పలు కోర్సులను అందిస్తున్న నిఫ్ట్ విశేషాలు.. ఆధునిక ప్రపంచం.. అత్యాధునిక అభిరుచులు.. కాళ్లకు ధరించే షూస్ నుంచి కళ్లజోడు వరకు వినూత్నమైన డిజైన్లను కోరుకుంటున్న వినియోగదారులు. వ్యక్తుల రోజువారీ అవసరాల్లో భాగంగా మారిన అనేక వస్తువుల డిజైనింగ్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో శిక్షణనందిస్తున్న సంస్థ... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర టెక్స్టైల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్గా 1986లో ఢిల్లీలో ప్రధాన క్యాంపస్‌గా ఏర్పాటైంది. ఇప్పుడు ఈ విద్యాసంస్థ దేశవ్యాప్తంగా 15 క్యాంపస్‌ల ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను అందిస్తోంది. 1995లో ప్రారంభమైన నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీ నుంచి పీజీ వరకు పలు కోర్సులను అందిస్తూ ఫ్యాషన్ రంగ ఔత్సాహికులకు చక్కటి వేదికగా నిలుస్తోంది. కలర్‌ఫుల్ కెరీర్‌కు మార్గం వేస్తోంది. బ్యాచిలర్ టు పీజీ: ప్రస్తుతం నిఫ్ట్ - హైదరాబాద్ క్యాంపస్‌లో.. డిజైన్ విభాగంలో అయిదు కోర్సులు (ఫ్యాషన్ డిజైన్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్; ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్ యాక్సెసరీస్; ఫ్యాషన్ కమ్యూనికేషన్; నిట్ వేర్ డిజైన్).. టెక్నాలజీ విభాగంలో ఒక కోర్సు( బీటెక్ - అపరెల్ ప్రొడక్షన్) బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫ్యాషన్ కమ్యూనికేషన్ కోర్సు వినూత్నమైందిగా పేర్కొనవచ్చు. ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రంగాల్లో రాణించడానికి అవసరమైన స్కిల్స్ అందించే ఈ స్పెషలైజేషన్‌ను పూర్తి చేస్తే డిజైన్ రంగంతోపాటు ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ జర్నలిజం, గ్రాఫిక్ డిజైన్ తదితర కమ్యూనికేషన్ విభాగాల్లోనూ మంచి కెరీర్‌ను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. పీజీ స్థాయిలో ఎంబీఏకు తత్సమానమైన మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సు కూడా నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్‌లో ఉంది. బోధనలో సృజనాత్మకత: ఫ్యాషన్ టెక్నాలజీ అంటే సృజనాత్మకతకు పెద్దపీట వేసే రంగం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్ట్-హైదరాబాద్ క్యాంపస్‌లో బోధనలోనూ సృజనాత్మకత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులే కొత్త డిజైన్లను ఆవిష్కరించేలా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కల్పించే విధంగా శిక్షణనిస్తున్నారు. ఈ క్రమంలో స్టూడెంట్-ఫ్యాకల్టీ నిష్పత్తిని 20:1గా నిర్దేశించి ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం: ఫ్యాషన్, డిజైన్ రంగాల్లో అకడమిక్ శిక్షణ మిగతా కోర్సులతో పోల్చితే భిన్నమైంది. విద్యార్థులు నిరంతరం సృజనాత్మకత, పరిశీలన దృక్పథంతో అడుగులు వేయాలి. కేవలం క్లాస్ రూం, లైబ్రరీ, లేబొరేటరీలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా నిఫ్ట్ ప్రాధాన్యమిస్తోంది. నిరంతరం కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్యాషన్ షోలను నిర్వహిస్తోంది. ఆర్ అండ్ డీ ప్రాజెక్ట్: నిఫ్ట్- హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను కూడా చేపడుతోంది. కేంద్ర చేనేత శాఖ ఆమోదం పొందిన పాలరాతి బొమ్మల రూపకల్పన; సిల్వర్ ఫిల్‌గ్రీ ప్రాజెక్ట్ వంటివి ఇందుకు ఉదాహరణలు. అంతేకాకుండా ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని పలు పరిశ్రమలకు అవసరమైన లోగో డిజైన్, ఉద్యోగుల యూనిఫాం డిజైన్ వంటి మరెన్నో ప్రాజెక్ట్‌లు కూడా చేపట్టింది. వీటిలో ప్రత్యక్షంగా పాల్పంచుకునేందుకు విద్యార్థులకూ అవకాశం కల్పిస్తోంది. ప్లేస్‌మెంట్స్ ఖాయం: నిఫ్ట్‌లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ ఖాయం. ప్రతి ఏటా నవంబర్ / డిసెంబర్లో నిర్వహించే క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్‌లో అర్వింద్ మిల్స్, రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్, స్నాప్ డీల్, టాటా ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ కంపెనీలెన్నో పాల్గొంటున్నాయి. లక్షల్లో వార్షిక వేతనాలను అందిస్తున్నాయి. 2013 ప్లేస్‌మెంట్స్‌లో పీజీ ప్రోగ్రామ్ అభ్యర్థుల్లో అత్యధికంగా రూ.15 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లలో అత్యధికంగా రూ.9 లక్షల వార్షిక వేతన ప్యాకేజీని నిఫ్ట్ - హైదరాబాద్ సెంటర్ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. సగటున పీజీ బ్యాచ్‌లో రూ.3.69 లక్షలు, బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో 2.99 లక్షల వార్షిక వేతనం లభించింది. ఫ్యాషన్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణులకు ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే వంటి మీడియా సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభించాయి. అత్యాధునిక సదుపాయాలు: టీచింగ్, లెర్నింగ్ కోణంలో నిఫ్ట్-హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఆడియో-విజువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లేబొరేటరీ, లైబ్రరీల ద్వారా విద్యార్థులకు నిరంతర అధ్యయన మార్గాలను అందిస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ రంగంలోని అత్యంత ఆదరణ పొందుతున్న డిజైన్ల రూపకల్పన శైలిని ప్రత్యక్షంగా తెలుసుకునే విధంగా ఆయా వస్తువులను రిసోర్స్ సెంటర్లో అందుబాటులో ఉంచుతోంది. ప్రవేశానికి మార్గం.. నిఫ్ట్ ఎంట్రెన్స్: నిఫ్ట్ 15 క్యాంపస్‌లలో ప్రవేశాల కోసం ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిఫ్ట్ ఎంట్రెన్స్ (యూజీ/పీజీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత కౌన్సెలింగ్ విధానంలో క్యాంపస్‌లు, సీట్ల కేటాయింపు ఉంటుంది. వెబ్సైట్: www.nift.ac.in/hyderabad/ సృజనాత్మకత ఉంటే.. ‘‘ఫ్యాషన్ రంగంలో అవకాశాలు కోరుకునే వారికి, తగిన సృజనాత్మకత ఉన్న వారికి సరైన వేదిక నిఫ్ట్. హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటైన కొన్నేళ్లలోనే జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందుతోంది. విద్యార్థులకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లభించడానికి అనువైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. నగరంలోని విభిన్న జీవన శైలులు గల వ్యక్తులు, అభిరుచులను ప్రత్యక్షంగా వీక్షించి.. తద్వారా తాజా పరిస్థితులకు సరితూగే విధంగా డిజైన్లు రూపొందించే అవకాశం విద్యార్థులకు లభిస్తోంది’’ - ప్రొఫెసర్ ఎన్. రాజారాం, డెరైక్టర్, నిఫ్ట్ - హైదరాబాద్ -
ఫిట్ 2 హిట్
పిజ్జాల నుంచి ఫెంగ్‌షుయ్ దాకా సిటీలో ఎందెందు వెదికినా అందందే కనబడే విదేశీ ‘కళ’.. ఇప్పుడు ఫిట్నెస్ రంగానికీ జతయింది. వెస్ట్రన్ కంట్రీస్ నుంచి తరలి వస్తున్న కండల వీరులు సిటీవాసుల ఫిజిక్‌లను చూడముచ్చటగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. సంపన్నుల దేహాలను చక్కదిద్దుతూ.. భారీ మొత్తంలో చెక్‌లు అందుకుంటున్నారు. టాలీవుడ్ హీరోల నుంచి సిటీ సెలిబ్రిటీల వరకూ.. కొత్త సోకుల వెనుక విదేశీ హస్తాల పనితనం ఉంది. ప్రసిద్ధ ఫిట్నెస్ నిపుణుల గురించి నెట్లో ఆరా తీసి మరీ సిటీకి రప్పిస్తున్నారు మనవాళ్లు. ఫ్యాషన్ రంగంలో దూసుకొచ్చిన ఫారిన్ తళుకులు.. ఫిట్నెస్ విషయంలోనూ స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. తమ శరీరాకృతి అందరూ మెచ్చే విధంగా ఉండాలని బలంగా ఫిక్సయిన యంగ్ తరంగ్‌లు విదేశీ నిపుణులకు జై కొడుతున్నారు. వారిని పర్సనల్ ట్రైనర్లుగా నియమించుకుంటున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ బాలీవుడ్లో జాన్ అబ్రహాం, హృతిక్‌రోషన్, ప్రియాంక చోప్రా.. ఇలా టాప్ సెలిబ్రిటీలందరూ విదేశీ కోచ్‌లను పర్సనల్ ట్రైనర్స్‌గా నియమించుకున్నారు. అదే ఒరవడిని టాలీవుడ్ అందిపుచ్చుకుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, నాగచైతన్య, రామ్‌చరణ్, నవదీప్.. ఇంకా ఫుల్ ఎంట్రీ ఇవ్వని అఖిల్ అక్కినేని సహా హీరోలంతా విదేశీయుల దగ్గరే ట్రైనప్ అవుతున్నారు. వీరినే స్ఫూర్తిగా తీసుకుంటున్న సిటీలోని సంపన్నులు కూడా అదే బాట పడుతున్నారు. నెలకు రూ.50 వేలు మొదలు రూ.10 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునే విదేశీ ట్రైనర్లు సిటీలో ఉన్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. పొలిటికల్ హీరోలూ.. మంత్రులు, రాజకీయ ప్రముఖులు, వారి వారసులు, బిజినెస్మెన్.. సమాజంలో కాస్త స్టేటస్ ఉన్న వారంతా ఇప్పుడు ఫిజికల్ పర్సనాలిటీపై కన్నేశారు. కాస్త అందంగా.. ఇంకాస్త ఆకర్షణీయంగా కనిపించాలనే వారి కోరిక.. విదేశీ ట్రైనర్ల వైపు మొగ్గు చూపేలా చేస్తోంది. దీంతో ఐదారేళ్లుగా సిటీకి విదేశీ ఫిట్నెస్ నిపుణుల రాక పుంజుకుంది. రెడ్ కార్పెట్.. ఈ విదేశీ ఫిట్నెస్ శిక్షకులు సెలిబ్రిటీలకు మాత్రమే పరిమితం కాలేదు.. వారి సేవలు జిమ్‌ల వరకూ విస్తరించాయి. ఫారిన్ ట్రైనర్లకు పెరుగుతున్న క్రేజ్ గమనించిన జిమ్, ఫిట్నెస్ సెంటర్స్ నిర్వాహకులు విదేశీ కోచ్‌లకు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. మాదాపూర్‌లోని ప్రొటెన్స్ జిమ్‌లో విదేశీయులే ట్రైనర్లు. ‘జిమ్ ప్రారంభించిన కొత్తలో అమెరికాకు చెందిన జంటను శిక్షకులుగా నియమించుకున్నాం. ప్రస్తుతం అమెరికాకే చెందిన ట్రైనర్ కేలబ్ మా దగ్గర ట్రైన్ చేస్తున్నారు. క్రాస్‌ఫిట్ వంటి వర్కవుట్స్‌పై విదేశీ ట్రైనర్సే పక్కాగా శిక్షణ ఇవ్వగలరు’ అని చెప్పుకొచ్చారు ప్రొటెన్స్ జిమ్ నిర్వాహకుడు రాము. మనకు సెట్ కాదు.. ఓ వైపు విదేశీ ట్రైనర్లకు ఆదరణ పెరుగుతుంటే.. మరో వైపు సిటీలైఫ్ స్టైల్‌కు ఫారిన్ సరుకు సెట్ కాదంటున్నారు లోకల్ ట్రైనర్లు. ‘ఇక్కడివారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను, జెనిటిక్స్ను, బోన్స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడంలో విదేశీయులకు సరైన అవగాహన ఉండద’ని సిటీలో తొలి సర్టిఫైడ్ ట్రైనర్‌గా, సెలబ్రిటీ స్పెషలిస్ట్‌గా పేరొందిన హెలియోస్ జిమ్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. ఈయన అభిప్రాయాలతో మరికొందరు సిటీ ట్రైనర్లు కూడా ఏకీభవిస్తున్నారు. ఇప్పటి వరకు స్థానిక ట్రైనర్ల పర్యవేక్షణలోనే హీరోలు సిక్స్‌ప్యాక్స్ సాధించారని గుర్తు చేస్తున్నారు. విదేశీ ట్రైనర్ల రాకతో ఈ రంగంలో యువత ఉపాధి అవకాశాలకు గండిపడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల సిటీలో ఊపందుకున్న విదేశీ ట్రైనర్ల హవా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. - ఫ్లోరిడా నుంచి వచ్చిన అంబర్, షూమేట్ల జంట గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్‌ని తీర్చిదిద్దుతున్నారని సమాచారం. - మహేష్‌బాబు ట్రైనర్‌గా ఫేమస్ అయిన క్రిస్ గెథిన్ నెలకు రూ.7 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఛార్జ్ చేస్తాడట. ముంబై నుంచి నగరానికి రాకపోకలు సాగించే ఈ సెలబ్రిటీ ట్రైనర్ ఇక్కడ తన స్వంత జిమ్ కూడా ప్రారంభించే పనిలో ఉన్నాడు. - హీరో రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు చెందిన సమీర్జోరాను ట్రైనర్‌గా నియమించుకున్నారట - సినీనటుడు నవదీప్, మోడల్ శిల్పారెడ్డి వంటి వారికి డేనియల్ మెక్కీ ట్రైనర్‌గా చేశారు. అపోలో ఆస్పత్రికి అనుబంధంగా ప్రారంభించిన జిమ్‌లోనూ వర్కవుట్స్‌ని ఈయన డిజైన్ చేశారు. - ప్రస్తుతం మాదాపూర్‌లోని ప్రొటెన్స్లో ట్రైనర్‌గా ఉన్న అమెరికా వాసి కెలబ్ క్రాస్‌ఫిట్ ట్రైనింగ్‌కు పేరొందారు. - ఎస్.సత్యబాబు -
ఫ్యాషన్ రంగం.. అవకాశాలు అపారం
గెస్ట్ కాలమ్ ఫ్యాషన్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి ఉండాల్సిన లక్షణాలపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)-హైదరాబాద్ డెరైక్టర్, డాక్టర్ ఎన్.జె. రాజారామ్. భవితకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు.. ఫ్యాషన్ హబ్: ఫ్యాషన్ ప్రపంచంలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉంది. నిఫ్ట్ కేంద్రాల్లో హైదరాబాద్ క్యాంపస్ది ప్రముఖ స్థానం. దీంతో హైదరాబాద్ క్యాంపస్‌లో చేరేందుకు అధిక శాతం యువత ఆసక్తిచూపుతుంటారు. ఈ క్యాంపస్‌లో యూజీ, పీజీ కోర్సులతోపాటు యువతులు, గృహిణులకు ఉపయోగపడేలా ప్రత్యేక కోర్సులను కూడా నిర్వహిస్తున్నాం. ఆలోచనాధోరణి మారాలి: చదువంటే కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ అనే ధోరణి మారాలి. మారుతున్న అవసరాలకనుగుణంగా విద్య, ఉపాధి అవకాశాల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలా వచ్చిన రంగమే ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ రంగంలో మన మార్కెట్‌కు డిమాండ్ క్రమేణా పెరుగుతోంది. మన దేశం నుంచి 20 బిలియన్ల ఫ్యాషన్ ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో టెక్స్టైల్స్ రంగం శర వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఈ రంగంలో మన దేశంలో విసృత స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా, సింగపూర్, జపాన్ తదితర దేశాల్లో కూడా ఫ్యాషన్ నిపుణులకు చక్కని డిమాండ్ ఉంది. డిజైన్ ఒక్కటే కాదు: ఫ్యాషన్ కోర్సులు అంటే.. కేవలం దుస్తులను డిజైన్ చేయటం ఒక్కటే అనే భావన ఉంది. వాస్తవానికి.. మార్కెట్లోకి విడుదల చేసే నూతన డిజైన్లు పోటీని తట్టుకుని నిలవాలంటే.. వాటికంటూ ఎటువంటి ప్రత్యేకత ఉండాలి? ఈ క్రమంలో సృజనాత్మకతను జోడించి వినూత్నమైన ఆలోచనలకు రూపమివ్వటం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఆభరణాలు, హస్తకళా వస్తువులకు రూపమిచ్చే విధంగా కూడా శిక్షణ ఉంటుంది. యూజీ-పీజీ: ఫ్యాషన్ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి సృజనాత్మకత.. కళల పట్ల అభిరుచి ఉండాలి. నిఫ్ట్‌లో డిజైనింగ్, ఇంటీరియర్, అపెరల్ తదితర విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. యూజీ కోర్సులకు అర్హత ఇంటర్మీడియెట్. రాతపరీక్ష, ఆప్టిట్యూడ్, సృజనాత్మకత అంశాల్లో నిర్వహించే పరీక్షల ఆధారంగా ప్రవేశం ఉంటుంది, పీజీ కోర్సులకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలుంటాయి. వీటిలో ప్రవాస భారతీయు (ఎన్ఆర్ఐ)లకు ప్రతి విభాగంలో ఐదు సీట్లు ఉన్నాయి. ఫీజు సెమిస్టర్‌కు రూ. 81 వేలు. ఎన్ఆర్ఐలకు రూ. 4.75 లక్షలు. అర్హులైన విద్యార్థులు బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంది. సంప్రదాయానికి ఆధునికత: ఎంతటి కళా నైపుణ్యం ఉన్నప్పటికీ దానికి ఆధునికతను జోడిస్తే తప్ప మార్కెట్లో నిలదొక్కుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ భారతీయ సంప్రదాయానికి ఆధునికతను జోడించేలా శిక్షణ ఉంటుంది. తరగతి గదికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా ఐదారు నెలలు ప్రాజెక్టు వర్క్ చేయాలి. అందులో భాగంగా వారసత్వంగా సంక్రమించిన హస్తకళలే జీవనాధారంగా సాగుతున్న.. ఏటికొప్పాక, కొండపల్లి, మచిలీపట్నం వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి కళాకారులకు ఆధునికతపై అవగాహన కల్పిస్తారు. యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా విదేశాల్లో జరిగే ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనే అవకాశం కూడా నిఫ్ట్ విద్యార్థులకు ఉంది. ఈ ఏడాది జపాన్‌లో నిర్వహించిన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు మన దేశం నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికైతే.. వారిలో ఇద్దరు హైదరాబాద్ నిఫ్ట్ విద్యార్థులే కావడం విశేషం. ప్రత్యేక కోర్సులు: ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్, ఫ్యాబ్రిక్స్ మహిళలు ఆసక్తి చూపే రంగాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిఫ్ట్‌లో ప్రత్యేకంగా గార్మెంట్స్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైనింగ్, లేడీ వేర్ వంటి మూడు కోర్సులు నిర్వహిస్తున్నాం. వీటికి మంచి స్పందన లభిస్తోంది. కిచెన్, బెడ్ రూమ్, లివింగ్ రూమ్.. ఇలా మొత్తంగా ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు.. కావాల్సిన అంశాల కలయికగా కోర్సులను అందించడంతోపాటు వృథా వస్తువులనూ సద్వినియోగం చేసేలా కూడా శిక్షణను ఇవ్వాలని యోచిస్తున్నాం. అవకాశాలు అనేకం: ప్రపంచీకరణ కారణంగా అనుకరణ పెరుగుతోంది. డిజైనర్ దుస్తుల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. సినిమాలు, సీరియల్స్ల్లో నటీనటుల వస్త్రాలంకరణలో డిజైనర్లూ కీలకంగా మారారు. కార్పొరేట్ స్కూల్స్ కూడా తమ యూనిఫామ్ డిజైన్ కోసం సంబంధిత నిపుణులను ఆశ్రయిస్తున్నాయి. షాపింగ్‌మాల్స్.. డ్రెస్ కౌన్సిలర్లుగా డిజైనర్లను నియమించుకుంటున్నాయి. ఈనేపథ్యంలో డిజైనర్లకు అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. స్వయం ఉపాధి దిశగా ఆలోచన ఉంటే సొంతంగా బొటిక్, డిజైన్ స్టూడియో ఏర్పాటు చేసుకోవచ్చు. రిమైండర్స్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా-రూర్కెలా వివిధ విభాగాల్లో 231 పోస్టులు దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29, 2013 వెబ్సైట్: http://sail.shine.com నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్‌కార్పొరేషన్ ట్రైనీ ఇంజనీర్ పోస్టులు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 11, 2013 వెబ్సైట్: www.nhpcindia.com సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ వివిధ విభాగాల్లో 1427 పోస్టులు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2013 వెబ్సైట్: http://ccl.gov.in ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 29, 2013 వెబ్సైట్: http://indianarmy.nic.in/ ఐఐఐటీ-హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ విభాగాల్లో రీసెర్చ్ కోర్సులు దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 25, 2013. వెబ్సైట్: http://admissions.iiit.ac.in బిట్స్-పిలానీ కోర్సు: ఎంబీఏ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2014. వెబ్సైట్: www.bitsadmission.com