take over
-
ఈజ్ మై ట్రిప్ చేతికి ‘చెకిన్’
హైదరాబాద్: ఆన్లైన్ ట్రావెల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అయిన ఈజ్‌మైట్రిప్ ‘చెకిన్’ కంపెనీలో 55 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. చెకిన్ అన్నది పర్యాటకులు ఎలాంటి బేరమాడే అవసరం లేకుండా హోటల్ బుకింగ్‌లపై డిస్కౌంట్‌కు వీలు కల్పించే రియల్‌టైమ్ మార్కెట్ ప్లేస్. ఆల్గోరిథమ్ ఆధారితంగా టాప్–5 హోటల్ చెకిన్ ఆఫర్లను ఇది అందించగలదు. చెల్లింపులు మాత్రం హోటల్ వద్దే చేయవచ్చు. మరోవైపు చెకిన్ యాప్ యాక్సెస్‌ను హోటల్ వారికి ఈజ్‌మైట్రిప్ అందించనుంది. దీని ద్వారా వారు ఎప్పటికప్పుడు త మ బుకింగ్‌లు, డిమాండ్ తీరును తెలుసుకుని, ధరలను నియంత్రించుకోవచ్చని ఈజ్‌మైట్రిప్ తెలిపింది. తద్వారా తమ ప్రాపర్టీలను వేగంగా విక్రయించుకోగలరని (బుకింగ్‌లు) పేర్కొంది. చదవండి: Union Budget 2023: కేవలం 800 పదాల్లో బడ్జెట్‌ను ముగించిన ఆర్థిక మంత్రి.. ఎవరో తెలుసా! -
సాగర్ సిమెంట్స్ చేతికి ఆంధ్రా సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ ఇక సాగర్ సిమెంట్స్ పరం కానుంది. ఈ మేరకు విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. జేపీ గ్రూప్ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్స్ ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. సాగర్ సిమెంట్స్ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు అనుకూలంగా ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీవోసీ) మెజారిటీతో ఓటు వేసింది. సాగర్ సిమెంట్స్ ప్రణాళికను సీవోసీ ఆమోదించింది. పృథ్వీ అసెట్ రీకన్స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్ కంపెనీ లిమిటెడ్ పిటిషన్ ఆధారంగా ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గతేడాది ఏప్రిల్‌లో ఆదేశించింది. ఆంధ్రా సిమెంట్స్‌కు దాచేపల్లి సమీపంలో, అలాగే విశాఖపట్నం వద్ద ఒక్కో ప్లాంటు ఉంది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
అపుడు 4 లక్షలు, ఇపుడు 7 వేల కోట్లు: ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?
సాక్షి,ముంబై: భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు కొనుగోలు చేసిన బిస్లరీ ఇపుడు 7 వేల కోట్లకు చేరింది. 1969లో 28 ఏళ్ల చౌహాన్ నేతృత్వంలో ని పార్లే ఎక్స్‌పోర్ట్స్ ఇటాలియన్ వ్యాపారవేత్త నుండి బిస్లరీ కొనుగోలు చేశారు. అపుడు దీని రూ. 4 లక్షలు. బిస్లరీని టాటాలకు 6-7వేల కోట్ల రూపాయలకు విక్రయించనున్నారు. ఈ నేపథ్యంలో 1969-2022ల వరకు బిస్లరీ జర్నీని ఒకసారి చూద్దాం. (Bisleri చైర్మన్ సంచలన నిర్ణయం: రూ. 7 వేల కోట్ల డీల్) 1969-2022 బిస్లరీ సక్సెస్ జర్నీ ► బిస్లరీ ఒక ఇటాలియన్ కంపెనీ, దీనిని 1965లో ఫెలిస్ బిస్లరీ స్థాపించారు. అలా కంపెనీకి ఆ పేరు స్థిరపడింది. ►1969లో ఇటాలియన్ వ్యాపారవేత్త ఫెలిస్ బిస్లరీనుంచి చౌహాన్ కొనుగోలు చేశారు. ► Bisleriని తొలుత భారతదేశంలో గాజు సీసాలలో, బబ్లీ, స్టిల్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేశారు. ► తమ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ స్పాట్ వంటి బ్రాండ్లు ఉన్నాయి కానీ సోడా లేదు. అందుకే పాపులర్ బిస్లరీ సోడాను కొనుగోలు చేశానని చౌహాన్ చెప్పారు. అంతేకాదు అసలు నీళ్ల వ్యాపారంపై దృష్టి లేదట. ► 60వ -70వ దశకం ప్రారంభంలో ఫైవ్ స్టార్ హోటళ్ల నుండి సోడాకు మంచి డిమాండ్ ఉంది. 1993లో తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను రూ. 186 కోట్లకు కోకాకోలాకు విక్రయించినప్పుడు మాత్రమే అతని దృష్టి బాటిల్ వాటర్ పరిశ్రమపై పడింది. ►ప్రారంభంలో రవాణాదారులు నీటిని రవాణా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే తానే స్వయంగా రవాణా చేయాలని చౌహాన్ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే బిస్లరీకి ఇప్పుడు 4,500 డిస్ట్రిబ్యూటర్లు ,వాటర్ బాటిళ్లను రవాణా చేసే 5,000 ట్రక్కులు ఉన్నాయి. ►2000ల ప్రారంభంలో టాటాకు చెందిన హిమాలయన్ బ్రాండ్‌తో మౌంట్ ఎవరెస్ట్ మినరల్ వాటర్‌తో బిస్లరీకి గట్టి పోటీ ఎదురైంది. ఇంకా అక్వాఫినా, కిన్లీ వంటి పోటీదారుల గట్టి పోటీ ఉన్నా తట్టుకొని టాప్‌లో నిలబడింది ► కోకా-కోలా (కిన్లే), పెప్సికో (ఆక్వాఫినా), కింగ్‌ఫిషర్ , నెస్లే వంటి పోటీదారుల మాదిరిగా కాకుండా, చౌహాన్‌కు ఇదొక్కటే ప్రధాన వ్యాపారం. అందుకే పట్టుదలగా సక్సెస్‌ను నిలుపుకున్నారు. ► కస్టమర్‌కు మెరుగైన విలువ, ప్యాకేజింగ్ లేదా పంపిణీని అందించే బ్రాండ్లు లేవు. ఏ బిజినెస్‌లోనైనా ముందు వచ్చినవారికే సక్సెస్.అయితే రెండవ లేదా మూడవ స్థానంలో వచ్చినట్లయితే, డిఫరెన్సియేటర్‌గా ఉంటే మంచిది. సో.. ఫస్ట్-మూవర్‌గా బ్రాండ్కోసం చాలా కష్టపడ్డాను అని 2007లో ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌహాన్ వెల్లడించారు. (షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్?) ►తన శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఎందుకు విక్రయించారని అడిగినప్పుడు, మాజా, సిట్రా, గోల్డ్ స్పాట్ ,రిమ్-జిమ్ వంటి బ్రాండ్లను ప్రకటనలకు తన వద్ద అంత డబ్బులేదు. అందుకే బాటిలర్లపై ఎక్కువగా ఆధారపడేవాడినంటారు చౌహాన్. ►కానీ వయసు,ఆరోగ్యం క్షీణించడంతోపాటు, అతని కుమార్తె జయంతికి వ్యాపారంలోఆసక్తి లేకపోవడంతో, కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు విక్రయించే నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీతో విడిపోవడం బాధాకరమైన నిర్ణయమే, కానీ టాటాలు దానిని చాలా జాగ్రత్తగా కాపాడతారనే విశ్వాసాన్ని ప్రకటించారు చౌహాన్. ► కంపెనీని నడపాలన్న ఉద్దేశం లేని కారణంగా మైనారిటీ వాటాను ఉంచుకోనని, పర్యావరణం , స్వచ్ఛంద కార్యక్రమాలపై దృష్టి పెడతానని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. -
టాటాల గూటికి ‘మహారాజా’ చేరేది అప్పుడే
న్యూఢిల్లీ: వేలంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం.. టాటా గ్రూప్‌నకు అప్పగించడంలో జాప్యం జరగనుంది. నిర్దిష్ట ప్రక్రియలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టేస్తుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అప్పగింత ప్రక్రియ జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. రూ.18,000 కోట్ల డీల్ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను వేలంలో టాటా గ్రూప్ సంస్థ టాలేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది సుమారు రూ. 18,000 కోట్ల డీల్. ఇందులో రూ. 2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. కొనుగోలు ఒప్పందం ప్రకారం 8 వారాల్లోగా (డిసెంబర్ ఆఖరులోగా) అప్పగింత ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇరు పక్షాల అంగీకారం మేరకు దీన్ని మరికాస్త పొడిగించుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో ఇదే జరుగుతోందని సంబంధిత అధికారి వివరించారు. రుణభారం రూ.61,562 కోట్లు హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయితే టాటా గ్రూప్.. నగదు భాగాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2007–08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీని గట్టెక్కించడానికి గత దశాబ్ద కాలంలో రూ. 1.10 లక్షల కోట్లపైగా నగదు, రుణాల గ్యారంటీల రూపంలో ప్రభుత్వం అందించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్‌నకు కంపెనీని అప్పగించడానికి ముందు ఇందులో 75 శాతాన్ని (దాదాపు రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు బదలాయిస్తారు. టాటాలకు 141 ఎయిరిండియా విమానాలు దక్కుతాయి. అయితే, ప్రధాన వ్యాపారేతర అసెట్స్ మాత్రం లభించవు. చదవండి: ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు -
కూరగాయలమ్మే పొలిమేరాస్.. రూ.250 కోట్ల డీల్ !
కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్ల అమ్మకాలు సాగించే పొలిమేరాస్ రికార్డు సృష్టించింది. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల రూపాయల విలువైన మార్కెట్ వ్యాల్యూని సృష్టించుకుంది. స్టార్టప్‌గా మొదలై హైదరాబాద్, బెంగళూరులలో విస్తరించిన పొలిమేరాస్‌ని హైదరాబాద్‌కి చెందిన జీఎస్ఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ రూ.250 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. పొలిమేరాస్‌లో వంద శాతం వాటాలను దక్కించుకుంది. పొలిమేరాస్‌కి బెంగళూరు, హైదరాబాద్‌లలో కలిసి ప్రస్తుతం 70 వరకు స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీకి నెలకు 21వేల మంది కస్టమర్ బేస్ ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టోర్ల సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించారు. అతి త్వరలోనే టెక్నాలజీ ఉపయోగిస్తూ యాప్ ద్వారా డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నారు. -
ఆస్ట్రేలియా సంస్థను టేకోవర్ చేసిన ఇండియన్ కంపెనీ
ముంబై: ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) కంపెనీ అప్‌గ్రాడ్ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన గ్లోబల్ స్టడీ పార్ట్నర్స్ (జీఎస్పీ)ని కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 16 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లుగా ఉంటుందని (సుమారు రూ. 85 కోట్లు), మరో 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ. 53.5 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. 2015లో ఏర్పాటైన జీఎస్పీకి ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికాలో దాదాపు 600 పైగా కేంద్రాల నెట్వర్క్ ఉంది. 1,300 మంది రిక్రూట్మెంట్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇదే ప్రథమం ఒక అంతర్జాతీయ సంస్థను అప్‌గ్రేడ్ కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. సమగ్ర ఎడ్టెక్ దిగ్గజం గా 18–50 ఏళ్ల మధ్య వయస్సు గల వారి అభ్యాసకుల విద్యావసరాలను తీరుస్తున్నామని, విదేశాలకూ కార్యకలాపాలను విస్తరించడానికి జీఎస్పీ కొనుగోలు తోడ్పడగలదని అప్‌గ్రేడ్ వ్యవస్థాపకుడు చైర్మన్ రోనీ స్క్రూవాలా తెలిపారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి సంబంధించిన సర్వీసులు అందించే విభాగం ద్వారా వచ్చే మూడేళ్లలో 100 మిలియన్ డాలర్ల ఆదాయం అంచనా వేస్తున్నట్లు అప్‌గ్రేడ్ ప్రెసిడెంట్ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: అప్‌గ్రేడ్ సంస్థకు యూనికార్న్ హోదా -
గ్రేట్ లెర్నింగ్.. ఇకపై బైజూస్ ఆధ్వర్యంలో
ఇండియాలో మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ యాప్‌గా పేరొందిన బైజూస్ తన సేవలను మరింతగా విస్తరించనుంది. ఇప్పటి వరకు అకడామిక్ ఓరియెంటెండ్ సర్వీసెస్‌పై ఎక్కువగా ఫోకస్ చేయగా.. రాబోయే రోజుల్లో ప్రొఫెషనల్, సర్టిఫికేట్ కోర్సులపై కూడా దృష్టి సారించనుంది. అందులో భాగంగా గ్రేట్లెర్నింగ్ను స్వంతం చేసున్నట్టు ప్రకటించింది. బిలియన్ డాలర్లు ఉన్నత విద్యకు సంబంధఙంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న గ్రేట్ లెర్నింగ్‌ను బైజూస్ సొంతం చేసుకోనుంది. సుమారు 600 మిలియన్ డాలర్లతో గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేసింది. అంతేకాదు హైయ్యర్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన సెగ్మెంట్లో భారీగా విస్తరించేందుకు మరో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. మొత్తంగా ఉన్నత విద్య, కెరీర్ స్కిల్ డెవలప్మెంట్ రంగంలో వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడికి బైజూస్ సిద్ధమైంది. ఇండిపెండెంట్‌గానే బైజూస్ స్వంతం చేసుకున్నప్పటికీ గ్రేట్ లెర్నింగ్ యాప్‌ను ఇండిపెండెంట్‌గానే కొనసాగనుంది. బైజూస్ నేతృత్వంలో గ్రేట్ లెర్నింగ్ ఫౌండర్ మోహన్ లక్ష్మణరాజు, కో ఫౌండర్లు హరి నాయర్, అర్జున్ నాయర్లు గ్రేట్ లెర్నింగ్‌ను ఇకపై ముందుకు తీసుకెళ్లనున్నారు. పైగా బైజూస్ నుంచి భారీగా పెట్టుబడులు రానుండటంతో మరింత సమర్థంగా గ్రేట్ లెర్నింగ్‌ను తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నత విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేట్ లెర్నింగ్ ఆన్లైన్లో అందిస్తోంది. ఈ యాప్‌కు 15 లక్షల మంది వినియోగదారులు 170 దేశాల్లో ఉన్నారు. గ్రేట్లెర్నింగ్కి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, నేషనల్ యూనివర్సిటీ సింగపూర్, ఐఐటీ బొంబాయి వంటి ప్రముఖ సంస్థల సహాకారం అందిస్తున్నాయి. అవకాశాలు సృష్టిస్తాం గ్రేట్ లెర్నింగ్‌ను కొనుగోలు చేయడంపై బైజూస్ ఫౌండర్, సీఈవో బైజూ రవీంద్రన్ స్పందిస్తూ..‘ నేర్చుకోవడం, నేర్చుకోకపోవడం, తిరిగి నేర్చుకోవడం అనేవి ముఖ్యమైన నైపుణ్యాలు. మాకు ఎందులో అయితే ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడ అవకాశాలు సృష్టిస్తాం, కొత్త దారులు వేస్తాం. మాకు ఎక్కడ అనుభవం లేదో కూడా తెలుసు. అక్కడ అనుభవం ఉన్న వారితో అవకాశాలు సృష్టిస్తాం’ అంటూ పేర్కొన్నారు. -
'టేక్ ఓవర్' పేరుతో మహిళా కమిషన్ వినూత్న కార్యక్రమం
సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 'టేక్ ఓవర్' పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాధ పిల్లలను మహిళా కమిషన్ చైర్మన్, మెంబర్లను సీట్లో కూర్చోబెట్టి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ 'టేక్ ఓవర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. పిల్లలో ఏం ఊహించుకుంటున్నారో వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టి వారిలో భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని అన్నారు. ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే') నవజీవన్ బాలభవన్, కేర్ అండ్ షేర్ అనాధాశ్రమం నుంచి విద్యార్థుల్ని తీసుకువచ్చామని తెలిపారు. జ్యోత్స్న చైర్మన్‌గాను, మిగిలిన పిల్లలు నెంబర్లుగానూ వారి సీట్లలో కూర్చున్నట్లు పేర్కొన్నారు. జ్యోత్స్న 30 అవార్డులతో పాటు విలువిద్యలో రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యార్థిని అని తెలిపారు. అటువంటి విద్యార్థిని మహిళా కమిషన్ చైర్మన్ కుర్చీలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వాళ్లంతా మహిళల రక్షణ కోసం నిలబడతాం పాటుపడతారని చెప్పారు. ఇది మహిళా కమిషన్ తొలి అడుగు మాత్రమే అని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ వివరించారు. ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్ సీఎం జగన్') -
యస్ బ్యాంకు స్వాధీనంలోకి అనిల్ అంబానీ కార్యాలయం
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌లోని (అడాగ్) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్ సెంటర్ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్‌ను సైతం యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. -
జెట్‌ను ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి
ముంబై: నిధుల సంక్షోభంతో కార్యకలాపాలు నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 22,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఇది అవసరమని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. దెబ్బతిన్న విమానయాన సంస్థకు మరిన్ని నిధులిచ్చే దిశగా బ్యాంకులను ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధానికి రాసిన లేఖలో ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. జెట్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరింది. తాజాగా నిధులిచ్చేందుకు బ్యాంకులు నిరాకరించడంతో జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘‘జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు బ్యాంకులు బిడ్లను ఆహ్వానించాయని తెలిసింది. ఒకవేళ ఇది సఫలం కాకపోతే జెట్ ఎయిర్వేస్ను మీరే స్వాధీనం చేసుకోవాలి. దాంతో 22,000 మంది ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి’’ అని ఏఐబీఈఏ లేఖలో కోరింది. జెట్ ఎయిర్వేస్కు తాజా నిధుల సాయం చేయాలని బ్యాంకులపై ఒత్తిడి తీసుకురావడాన్ని కూడా వ్యతిరేకించింది. బ్యాంకులు యజమానులు కావడంతో ప్రతి ఒక్కరూ జెట్ బెయిలవుట్ కోసం వాటివైపే చూస్తున్నారని పేర్కొంది. ‘‘నరేష్ గోయల్ ఇప్పటికీ సంస్థ ప్రమోటర్‌గా 51 శాతం వాటా కలిగి ఉన్నారు. కంపెనీని నడిపించడమా లేక వేరొకరికి అమ్మేయడమా అన్నది అతని సమస్య’’ అని ఏఐబీఈఏ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం మొత్తానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నరేష్ గోయల్ అని పేర్కొంది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. -
‘డీసీ’ టేకోవర్ రేసులో 9 కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్)ను టేకోవర్ చేయడానికి 9 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, బెన్నెట్–కోల్మెన్ అండ్ కో లిమిటెడ్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), హిందుస్థాన్ టైమ్స్ (హెచ్‌టీ), ఐ ల్యాబ్స్ హైదరాబాద్ టెక్నాలజీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ (టీవీ 9), అడోనిస్ లిమిటెడ్, ఆర్మ్ ఇన్ఫ్రా అండ్ యుటిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్సెల్ గ్రూపు), అస్సెట్ రీస్ట్రక్షన్ కంపెనీ ఇండియా లిమిటెడ్, ఫ్యూచర్ గ్రామింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, శ్రేయ్ మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్–విజన్ ఇండియా ఫండ్లు ఉన్నాయి. డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియలో భాగంగా దివాలా పరిష్కార నిపుణులు (ఐఆర్పీ) మమతా బినానీ జారీ చేసిన పత్రికా ప్రకటనకు స్పందించిన ఈ కంపెనీలు ఆసక్తిని తెలియపరిచాయి. అలాగే డీసీహెచ్ఎల్ ఆస్తుల మదింపు కోసం శుభ సిండికేట్, సర్వెల్ కృష్ణా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లను నియమించారు. ప్రముఖ ఆడిట్ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్‌ను సలహాదారుగా రుణదాతల కమిటీ నియమించింది. ఈ వివరాలతోపాటు డీసీహెచ్ఎల్ దివాలా ప్రక్రియపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ మమతా బినానీ ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన ఎన్సీఎల్టీ సభ్యులు విత్తనాల రాజేశ్వర్‌రావు.. పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు మరింత గడువునిచ్చారు. తమ వద్ద తీసుకున్న రుణాన్ని డీసీహెచ్ఎల్ తిరిగి చెల్లించలేదని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కెనరా బ్యాంకు గతేడాది ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఓవర్టేక్ తెచ్చిన ప్రమాదం
పూడూరు: వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. చన్గోముల్ ఎస్ఐ నాగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌కు చెందిన మదన్, మౌలాలికి చెందిన విశాల్, అరుణ్, సుమన్‌లు స్నేహితులు. సుమన్ కొండాపూర్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో పనిచేస్తుండగా మిగిలిన ముగ్గురు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి మంగళవారం కారులో వికారాబాద్ సమీపంలోని ఓ రిసార్టుకు బయలు దేరారు. అరుణ్ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పూడూరు మండలం అంగ డిచిట్టంపల్లి కాటన్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే ముందుగా ఉన్న లారీని ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వీరి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టి సమీపంలోని పొలాల్లోకి ఎగిరి పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రైతులు వెంటనే అక్కడికి పరుగెత్తుకొచ్చారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. అప్పటికే మదన్(28) మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో సుమన్(27) మృతి చెందాడు. అరుణ్ పరిస్థితి విషమంగా ఉంది. విశాల్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు పూర్తిగా దెబ్బతింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాలను వికారాబాద్ మార్చూరీకి తరలించారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
=మరొకరికి తీవ్ర గాయాలు =మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం దుండిగల్, నూస్లైన్: అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఓవర్టేక్ చేయబోయిన ఆటో ముందు వస్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్న ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా తిమ్మాపురానికి చెందిన భార్యాభర్తలు వెంకటేశ్, రాజేశ్వరి (30), రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూర్‌కు చెందిన దంపతులు నర్సింహ, చిట్టెమ్మ(34) నగరంలోని నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్నారు. కాగా డ్వాక్రా గ్రూపు రాజీవ్‌గాంధీ పొదుపు జ్యోతి సంఘానికి రాజేశ్వరి, చిట్టెమ్మ టీమ్ లీడ్లరుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం గండిమైసమ్మలోని ఎస్బీహెచ్ బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు రాజీవ్‌గృహకల్పలో ఆటో ఎక్కారు. అది బౌరంపేట సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన కంటైనర్‌ను ఢీ కొట్టింది. లారీ ఎదురుగా వేగంగా ఢీకొట్టడంతో పాటు సుమారు 20 అడుగుల వరకు ఆటోను లాక్కెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరి, చిట్టెమ్మలతో పాటు బాచుపల్లి సాయినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహ(40) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింహ అల్లుడు నరేశ్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి, చిట్టెమ్మల తలలు నుజ్జునుజ్జయ్యాయి. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దుండిగల్ సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపులో ఉంది. రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు రాజేశ్వరి, చిట్టెమ్మల మృతితో నిజాంపేట రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్వాక్రా గ్రూపునకు లీడర్లుగా వ్యహరిస్తూ ఎంతో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో ఆ ప్రాంత మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. రాజేశ్వరి, చిట్టెమ్మలు దినసరి కూలీలుగా పని చేస్తుండగా.. వీరిద్దరికీ ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కాగా చిట్టెమ్మ భర్త నర్సింహ మానసిక స్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు. -
ప్రభుత్వం చేతుల్లోకి ఆర్టీసీ!
ఆర్టీసీని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. విభజన తర్వాత పూర్తిగా నష్టాల్లో కూరుకొని పోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వమే విలీనం చేసుకోవాలంటూ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) చేసిన విజ్ఞప్తికి రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. రాష్ట్ర విభజనకు ముందే ఆర్టీసీ ప్రభుత్వపరం అవుతుంది. వైద్యం, విద్య తరహాలనే ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ప్రభుత్వం నేరుగా రవాణా సౌకర్యాల కల్పన బాధ్యతను భుజం మీద వేసుకోకుండా ఆర్టీసీని ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సంస్థను ఏర్పాటు చేసినా పెత్తనమంతా పరోక్షంగా ప్రభుత్వానిదే. చార్జీల పెంపు మొదలు ఏ రకమైన విధాన నిర్ణయం తీసుకోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆర్టీసీ చైర్మన్, ఎండీ నియామకాలను కూడా ప్రభుత్వమే చూస్తోంది. నష్టాలను మాత్రం సంస్థకే అంటగడుతున్నారు. డీజిల్ ధర పెరిగినప్పుడు నిర్వహణ వ్యయం గణనీయం గా పెరుగుతోంది. ఆ మేరకు చార్జీలు పెంచుకొనే అధికారం ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం అనుమతిస్తేనే చార్జీలు పెంచుకోవాల్సి ఉంటుంది. డీజిల్ ధర పెరిగిన వెంటనే చార్జీలు పెంచుకొనే అవకాశం లేకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయి. ఆర్టీసీ కొంటున్న డీజిల్, బస్సుల విడిభాగాల మీద ప్రభుత్వం ఒక్కపైసా కూడా పన్ను రాయితీ ఇవ్వడం లేదు. డీజిల్, విడిభాగాల మీద వ్యాట్ రూపంలో ఆర్టీసీపై ఏటా రూ.300 కోట్ల భారం పడుతోంది. రూ.450 కోట్ల మేర మోటారు వాహనాల పన్ను చెల్లించాల్సి వస్తోంది. విద్యార్థులు, వయోవృద్ధులకు ఇచ్చే పాసుల రాయితీల భారాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా భరించడం లేదు. బస్సులు కొనడానికి గ్రాంటుల రూపంలో నిధులు ఇవ్వడం మినహా... ఆర్టీసీని ఏ రకంగానూ ఆదుకోవడం లేదు. రుణాలు, నష్టాలు కలిపి ఆర్టీసీపై ప్రస్తుతం రూ.5 వేల కోట్లకుపైగా భారం ఉంది. తమిళనాడు, కర్ణాటకలో ప్రభుత్వమే రవాణా సంస్థలను నడుపుతోంది. కర్ణాటక ఆర్టీసీకి ఆ రాష్ట్ర రవాణా మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డీజిల్ ధరలు పెరిగినప్పుడు చార్జీలు పెంచుకొనే అధికారం కర్ణాటక ఆర్టీసీకి ఉంది. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీని నడిపితే.. సంస్థ ఆస్తులు, అప్పులు ప్రభుత్వానికే చెందుతాయి. ఉద్యోగులకు 010 పద్దు కింద ప్రభుత్వ ఉద్యోగుల తరహాలే జీతాలు అందుతాయి. వేతన సవరణ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీని ప్రభుత్వమే నేరుగా నిర్వహణ చేపట్టడానికి మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అప్పులను తీర్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ఎన్ఎంయూ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.