
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌లోని (అడాగ్) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్ సెంటర్ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్‌ను సైతం యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment