Anil Ambani group
-
ఇక అనిల్ కంపెనీల జోరు
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ వృద్ధి బాటలో సాగనున్నాయి. ఇటీవల ఉమ్మడిగా రూ. 17,600 కోట్ల పెట్టుబడులు సమీకరించే ప్రణాళికలకు తెరతీయడంతో వృద్ధి వ్యూహాలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు వారాలుగా ఇరు కంపెనీలు ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించడంతోపాటు.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వర్డే పార్ట్నర్స్ నుంచి రూ. 7,100 కోట్లు అందుకునేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ఈక్విటీ ఆధారిత దీర్ఘకాలిక ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. పదేళ్ల ఈ విదేశీ బాండ్లకు 5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేయనున్నాయి. వీటికి జతగా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా రూ. 3,000 కోట్లు చొప్పున సమీకరించనున్నట్లు ఇరు కంపెనీల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బోర్డు ఆమోదించిన పలు తీర్మానాలపై ఈ నెలాఖరుకల్లా వాటాదారుల నుంచి అనుమతులు లభించగలవని తెలియజేశాయి. వెరసి నిధుల సమీకరణ ద్వారా గ్రూప్ కంపెనీల విస్తరణకు అనుగుణమైన పెట్టుబడులను వినియోగించనున్నట్లు వివరించాయి. -
ఈవీ రంగంలోకి రిలయన్స్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఎలక్ట్రిక్ కార్లు (ఈవీ), బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలకు సంబంధించి వ్యయాలపరంగా సాధ్యా సాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా దిగ్గజం బీవైడీ ఇండియా మాజీ హెడ్ సంజయ్ గోపాలకృష్ణన్‌ను కన్సల్టెంటుగా నియమించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇన్ఫ్రా ప్రాథమికంగా ఏటా 2,50,000 ఈవీలతో మొదలుపెట్టి 7,50,000 వాహనాలకు ఉత్పత్తిని పెంచుకోవాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే 10 గిగావాట్ అవర్స్ (జీడబ్లూహెచ్) సామర్థ్యంతో బ్యాటరీల తయారీ ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు వివరించాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రిలయన్స్ ఇన్ఫ్రా జూన్‌లోనే వాహన రంగానికి సంబంధించి కొత్తగా రెండు అనుబంధ సంస్థలను ప్రారంభించింది. రిలయన్స్ ఈవీ ప్రైవేట్ లిమిటెడ్ వీటిలో ఒకటి. అధిక రుణభారం, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కంపెనీ ఈ కొత్త ఈవీ ప్రాజెక్టులకు నిధులెలా సమకూర్చుకుంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
అనిల్ అంబానీ అదృష్టం తారుమారు
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నులకు సంబంధించి 2008లో వెలువడిన జాబితాలో ఆరవస్థానంలో నిలిచిన అనిల్ అంబానీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ గ్రూప్ సంస్థల్లో ఒకటైన– ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు(డీఏఎంఈపీఎల్) అనుకూలంగా గతంలో వచ్చిన ఆర్బిట్రేషన్ అవార్డును సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ– డీఏఎంఈపీఎల్ అలాగే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మధ్య కుదిరిన ‘‘రాయితీ ఒప్పందం’’ విషయంలో తలెత్తిన ఒక వివాదానికి సంబంధించి రూ.8,000 కోట్ల అవార్డుతో ఆయన కష్టాలు కొంత గట్టెక్కుతాయన్న అంచనాలను తాజా పరిణామం దెబ్బతీసింది. ఆర్బిట్రేషన్ అనుగుణంగా గతంలో డీఎంఆర్సీ చెల్లించిన రూ.3,300 కోట్లను వాపసు చేయాలని సుప్రీం డీఏఎంఈపీఎల్ని ఆదేశించింది. అయితే తీర్పు వల్ల తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేర్కొంది. అటు డీఎంఆర్సీ నుంచి కానీ ఇటు గ్రూప్ సంస్థ డీఏఎంఈపీఎల్ నుంచి తనకు ఎటువంటి డబ్బూ అందలేదని వివరించింది. -
అంబానీ ఆస్తులపై అదానీ కన్ను !?
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితర 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి వీలుగా బిడ్స్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకూ గడువు పెంచారు. తొలుత ఇందుకు మార్చి 11చివరి తేదీగా ప్రకటించారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్ పాలనా సంబంధ సమస్యల నేపథ్యంలో గతేడాది నవంబర్ 29న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రద్దు చేసింది. 2021 సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 40,000 కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది. మూడో పెద్ద కంపెనీ ఇటీవల ఆర్బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా రిలయన్స్ క్యాప్ నిలుస్తోంది. ఇప్పటికే ఐబీసీ పరిధిలోకి చేరిన సంస్థల జాబితాలో శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) చేరిన విషయం విదితమే. కాగా.. రిలయన్స్ క్యాప్ కొనుగోలు పట్ల ఆసక్తి కలిగిన కంపెనీలు బిడ్స్ దాఖలుకు మరింత గడువును కోరడంతో పాలనాధికారి తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో ఇప్పటికే ఆర్ప్ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్ ఫండ్, నిప్పన్ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్‌ఫీల్డ్, ఓక్ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్‌స్టోన్, హీరో ఫిన్‌కార్స్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. కొనుగోలుదారులకు రెండు అవకాశాలు కొనుగోలుదారులకు రెండు అవకాశాలున్నాయి. కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితరాలున్నాయి. దివాలా చర్యలలో భాగంగా వై.నాగేశ్వరరావును ఆర్బీఐ పాలనాధికారిగా నియమించింది. -
రిలయన్స్ ఇన్ఫ్రా.. గాడిన పడేనా
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తన సంస్థలను మళ్లీ గాడిన పెట్టేందుకు అనిల్ అంబానీ సిద్ధమవుతున్నారు. భారీ ఎత్తున కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా నిధుల సమీకరణ చేస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఇన్‌ఫ్రాలోకి రూ. 550 కోట్ల నిధులు అనిల్ తెచ్చారు. ప్రమోటర్ల నుంచి ప్రమోటర్లకు వాటాలు విక్రయించడం ద్వారా రూ, 550.56 కోట్లు నిధులు సమీకరించేందుకు రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డు ఆమోదం తెలిపింది. ప్రిఫెరెన్షియల్ ఎలాట్మెంట్ ద్వారా 8.88 కోట్ల షేర్లను ప్రమోటర్లుగా ఉన్న వీహెచ్‌ఎస్‌ఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇవ్వనుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రా దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. జాతీయ రహదారులు, పవర్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టింది. ఈ పనుల్లో ఎక్కువ శాతం బీవోటీ పద్దతిలోనే రిలయన్స్ ఇన్ఫ్రా చేపడుతోంది. చదవండి : Vijaya Diagnostic: పబ్లిక్ ఇష్యూకి సిద్ధం -
అనిల్ అంబానీకి ‘సుప్రీం’ ఊరట
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల రికవరీకి సంబంధించి ఆయనపై వ్యక్తిగత దివాలా చర్యలు చేపట్టడానికి అనుమతించాలని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న స్టేను తొలగించాలనీ ఎస్బీఐ చేసిన విజ్ఞప్తికి న్యాయమూర్తులు ఎల్ఎన్ రావు, హేమంత్ గుప్తా, ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. అయితే ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా, తదుపరి విచారణలు ఏమీ లేకుండా అక్టోబర్ 6న కేసు విచారణను చేపట్టి తుది తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ హై కోర్టుకు సూచించడం ఈ కేసులో మరో కీలకాంశం. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏదైనా మార్పు కోరుకుంటే, సంబంధిత న్యాయస్థానాన్నే ఆశ్రయించవచ్చని కూడా ఎస్బీఐకి ధర్మాసనం సూచించింది. వివరాల్లోకి వెళ్తే..: ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్‌టీఐఎల్)కు 2016 ఆగస్టులో ఎస్బీఐ రుణం మంజూరు చేసింది. ఆర్‌కామ్‌కు రూ. 565 కోట్లు, ఆర్‌టీఐఎల్‌కు రూ. 635 కోట్లు రుణం అందింది. ఈ రుణం మొండిబకాయిగా మారడంతో, అనిల్ అంబానీ ఇచ్చిన వ్యక్తిగత పూచీకత్తును ఎస్బీఐ రుణ బాకీల కింద జప్తు చేసుకోవాలని నిర్ణయించింది. తదుపరి అనిల్ అంబానీకి నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ స్పందన రాలేదు. దీనితో ఎన్సీఎల్టీ, ముంబై బెంచ్‌ని ఆశ్రయించింది. గ్యారంటర్‌పైనా విచారణ జరపవచ్చని నిబంధనల్లో స్పష్టంగా ఉందని తన వాదనల్లో పేర్కొంది. దీంతో ఏకీభవిస్తూ, ఎన్సీఎల్టీ అనిల్ ఆస్తులపై దివాలా ప్రక్రియకు వీలుగా మధ్యంతర పరిష్కార నిపుణుడి (ఆర్పీ)ని నియమి స్తూ ఆగస్టు 21న ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు అదేనెల 27న స్టే ఇస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ స్టే ఉత్తర్వు్యను ఎస్బీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
యస్ బ్యాంకు స్వాధీనంలోకి అనిల్ అంబానీ కార్యాలయం
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ముంబైలోని శాంతాక్రజ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. బ్యాంకుకు రూ.2,892 కోట్లు బాకీ పడడమే ఇందుకు కారణం. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌లోని (అడాగ్) దాదాపు అన్ని ప్రధాన కంపెనీల కార్యకలాపాలు ఈ రిలయన్స్ సెంటర్ నుంచే సాగుతున్నాయి. బాకీలను చెల్లించేందుకై 21,432 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని ఈ ఆఫీసును లీజుకు ఇవ్వాలని కంపెనీ గతేడాది ప్రయత్నించింది. రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన రెండు ఫ్లాట్స్‌ను సైతం యస్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. -
రిలయన్స్ ఇన్ఫ్రాకు యస్ బ్యాంక్ నోటీసులు
రుణాల రికవరీ బాటలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీన పరచుకునేందుకు వీలుగా యస్ బ్యాంక్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని శాంతాక్రజ్‌లోగల ప్రధాన కార్యాలయంతోపాటు.. మరో ఇతర రెండు ఆఫీసులను దాఖలు పరచమంటూ నోటీసులు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 2892 కోట్ల రుణాల రికవరీ కోసం ఈ చర్యలు చేపడుతున్నట్లు యస్ బ్యాంక్ నోటీసులో పేర్కొంది. వీటిలో భాగంగా నాగిన్ మహల్‌లోని రెండు ఫ్లోర్లను యస్ బ్యాంక్ సొంతం చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మొండిబకాయిల సమస్యలతో కొద్ది రోజులక్రితం యస్ బ్యాంక్ దివాళా పరిస్థితికి చేరిన విషయం విదితమే. తదుపరి ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఈక్విటీ పెట్టుబడుల ద్వారా యస్ బ్యాంకులో మెజారిటీ వాటాను పొందింది. తద్వారా యస్ బ్యాంక్ కార్యకలాపాలను ఎస్బీఐ తిరిగి గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అనిల్ అంబానీ గ్రూప్‌నకు యస్ బ్యాంక్ సుమారు రూ. 12,000 కోట్ల రుణాలు అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాయి. బీఎస్ఈఎస్ నుంచి శాంతాక్రజ్‌లోని ప్రధాన కార్యాలయాన్ని బీఎస్ఈఎస్ నుంచి రెండు దశాబ్దాల క్రితం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొంతం చేసుకుంది. బీఎస్‌ఈఎస్‌ను అనిల్ గ్రూప్ కొనుగోలు చేశాక రిలయన్స్ ఎనర్జీగా మార్పుచేసి తదుపరి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో విలీనం చేసినట్లు పరిశ్రమవర్గాలు వివరించాయి. 2018లో ముంబైలోని ప్రధాన కార్యాలయానికి అనిల్ అంబానీ గ్రూప్ తరలివెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాయి. గ్రూప్‌లోని ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రిలయన్స్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. జనరల్ ఇన్సూరెన్స్ తదితర వివిధ విభాగాలు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇటీవల పలు కార్యాలయాలను ఏకంచేయడం ద్వారా కార్యకలాపాలను నార్త్ వింగ్‌లో కన్సాలిడేట్ చేసినట్లు మీడియా పేర్కొంది. కాగా.. మే 5న రుణాలను చెల్లించమంటూ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రెండు నెలల గడువుతో యస్ బ్యాంక్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ రుణ చెల్లింపులను చేపట్టకపోవడంతో ఆస్తులను సొంతం చేసుకునే సన్నాహాలు యస్ బ్యాంక్ చేస్తున్నట్లు మీడియా తెలియజేసింది. -
అంబానీపై దావా వేస్తా.. చరిత్ర సృష్టిస్తా
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీకి మరో పెద్ద చిక్కొచ్చి పడేటట్టుంది. వార్షిక వాటాదారుల సమావేశం సందర్భంగా కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై వాటాదారులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ అంబానీ సంస్థల పేలవమైన పనితీరు, రేటింగ్ డౌన్‌గ్రేడ్ కారణంగా ఎంతో నష్టపోయామని గ్రూపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక వాటాదారుడు. పెద్దమొత్తంలో సంపదను కోల్పోయానని చెప్పిన సదరు వాటాదారుడు ఇందుకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల యాజమాన్యంపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని హెచ్చరించారు. సమస్యలను వచ్చే రెండు-మూడు నెలల్లో పరిష్కరించకపోతే, గ్రూప్ కంపెనీలపై ఫస్ట్ క్లాస్ యాక్షన్ దావా వేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని కార్పొరేట్ న్యాయవాదిగా చెప్పుకున్న వాటాదారుడు పేర్కొన్నారు. 2005 నుంచి మూడు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో మూడింటిలో 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా, విలువలో 90 శాతానికి పైగా నష్టపోయానని ఆయన చెప్పారు. ప్రధానంగా ఛైర్మన్ అనిల్ అంబానీ తన షేర్లలో 80 శాతానికి పైగా షేర్లను బ్యాంకుల వద్ద తనఖాగా పెట్టి రుణం తీసుకోవడమే సంక్షోభాన్నిమరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తనను నాశనం చేసిందని వాపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చిన రోజే 37లక్షల రూపాయలను పోగొట్టుకున్నానన్నారు. ఈ నేపథ్యంలోతన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోతే, రాబోయే రెండు-మూడు నెలల్లో ఆర్పవర్పై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని అని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఇందుకు మిగతా 10 శాతం వాటాదారులను కూడా కూడగడతానని తెలిపారు. మరోవైపు ఏజీఓంలో వాటాదారులకు అనిల్ సమాధానం చెబుతూ సలహాలలన్నింటినీ పరిశీలిస్తామనీ, లేవనెత్తిన సమస్యలనులోతుగా ఆలోచించి, వాటిని పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామని హామీ వచ్చారు. అనిల్ సారధ్యంలోని రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ ఆరంభంలో రూ లక్ష కోట్లు దాటింది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ అన్ని కంపెనీల మార్కెట్ విలువ కేవలం రూ 18,525 కోట్లకు పడిపోయింది. ఇందులో రిలయన్స్ నిప్పాన్ ఏఎంసీ ఒక్క కంపెనీ విలువే రూ 16,000 కోట్లుగా ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువు రూ 212 కోట్లుగా ఉంది. 2008 లో 72 రేట్లు అధిక బిడ్లు లభించి మార్కెట్ నుంచి రూ 11,563 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ ప్రస్తుత విలువ రూ 617 కోట్లకు పడిపోయింది. కాగా కంపెనీ యాక్ట్ 2013లోని ఒక సెక్షన్ ప్రకారం వాటాదారులు సంబంధిత కంపెనీలు క్లాస్ యాక్షన్ సూట్‌ను దాఖలు అవకాశం కల్పిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ నిబంధన ప్రకారం ఎటువంటి కేసు నమోదు కాలేదు. చదవండి : అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై -
బిలియనీర్ క్లబ్‌నుంచి అంబానీ ఔట్
సాక్షి, ముంబై : అడాగ్ గ్రూపు అధినేత, అనిల్ అంబానీ బిలియనీర్ క్లబ్‌నుంచి కిందికి పడిపోయారు. 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6 వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్కాంతోపాటు ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది. ముఖ్యంగా మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ రిలయన్స్ నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్లో బ్యాంకులు 43 శాతం వాటాలను విక్రయించడం షాకింగ్ పరిమాణం. అలాగే రుణాలను తీర్చేందుకు ప్రధాన ఆస్తులు వ్యాపారాల అమ్మకంతో అనిల్ అంబానీ సంపద బాగా క్షీణించింది. కాగా ఇటీవల ఆస్తులను అమ్మిఅయినా మొత్త రుణాలను తీరుస్తామని అనిల్అంబానీ హామీ ఇచ్చారు. గత గత 14 నెలల్లో రూ .35 వేల కోట్లకు పైగా రుణాలు తీర్చామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్ డాలర్లనుంచి 0.5 బిలియన్ డార్లకు పడిపోయింది. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. -
రేటింగ్ సెగ : కుప్పకూలిన అడాగ్ షేర్లు
సాక్షి,ముంబై : అనిల్ అంబానీకి చెందిన అడాగ్ షేర్లకు రేటింగ్‌షాక్ తగిలింది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన కంపెనీల షేర్లు 20 శాతానికిపైగా నష్టపోయాయి. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ కౌంటర్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. రేటింగ్ సంస్థలు కంపెనీల షేర్లపై రేటింగ్‌ను డౌన్లోడ్ చేయడం, ఆయా కంపెనీలు ఎదుర్కోంటున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రిలయన్స్ పవర్ 20 శాతం నష్టపగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 18 శాతం, రిలయన్స్ క్యాపిటల్ 12 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 10 శాతం, రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్స్ 6 శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ 7 శాతం నష్టపోయాయి. రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి. మొన్నటి ట్రేడింగ్ సెషన్లో జరిగిన ఓ 5 బ్లాక్ డీల్స్ ద్వారా 80లక్షల రిలయన్స్ పవర్ షేర్లు చేతులు మారినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పలితంగా నేటి ట్రేడింగ్‌లో దాదాపు 20.17శాతం నష్టంతో రిలయన్స్ పవర్ స్టాక్స్ ఆల్ టైం కనిష్టానికి పడిపోయాయి. కేర్, ఇక్రా రేటింగ్ సంస్థలు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ కు డిఫాల్ట్ రేటింగ్‌ను ఇవ్వడంతో ఈ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో పదిశాతం క్షీణించాయి. -
బాకీ కట్టకపోతే జైలు శిక్షే!
న్యూఢిల్లీ: ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్, వ్యాపారవేత్త అనిల్ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో బుధవారం తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... రూ.550 కోట్ల బకాయి చెల్లించకుండా తన ఉత్తర్వులను ఉల్లంఘించారని, ఇది పూర్తిగా ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రూ.453 కోట్లు కనక ఎరిక్సన్కు చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆర్‌కామ్ చైర్మన్ అనిల్‌తో పాటు రిలయన్స్ టెలికం చైర్మన్ సతీశ్ సేథ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ చిరహా విరాణికి కూడా సుప్రీంకోర్టు ఇదే హెచ్చరికలు చేసింది. తన మునుపటి ఉత్తర్వులకు సంబంధించి ఇచ్చిన హామీలను వీరు నిలబెట్టుకోలేదని, తద్వారా ముగ్గురూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘‘ఉద్దేశపూర్వకంగానే వీరు ఎరిక్సన్కు నిధులివ్వలేదని భావించాల్సి వస్తోంది’’ అని సుప్రీం పేర్కొంది. ధర్మాసనం ఈ హెచ్చరిక చేస్తున్న సమయంలో అనిల్ అంబానీ సహా ముగ్గురూ కోర్టు హాల్లోనే ఉన్నారు. అనిల్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. రూ.453 కోట్లు చెల్లించడం ద్వారా ‘కోర్టు ధిక్కరణ’ వేటు నుంచి తప్పుకోగలుగుతారని న్యాయమూర్తులు ఎఫ్ఎఫ్ నారిమన్, వినీత్ సరన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టంచేసింది. రిలయన్స్ ఎటువంటింటి బేషరతు క్షమాపణలు చెప్పినా, దాన్ని ఆమోదించాల్సిన పనిలేదని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. కోటి డిపాజిట్ చేయకపోతే మరో నెల జైలు ఆర్‌కామ్, రిలయన్స్ టెలికమ్యూనికేషన్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ రూ.కోటి చొప్పున 4 వారాల్లో రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని కూడా ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. లేదంటే ఈ కంపెనీల చైర్ పర్సన్లు మరో నెల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రిలయన్స్ గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.118 కోట్లను వారం రోజుల్లో ఎరిక్సన్కు పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘రూ.550 కోట్లు ఎరిక్సన్కు చెల్లించడానికి మూడు రిలయన్స్ కంపెనీలకూ 120 రోజుల గడువిచ్చాం. తర్వాత దీనిని మరో 60 రోజులూ పొడిగించాం. అయినా దీనిని కంపెనీలు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి రూ.118 కోట్లు చెల్లిస్తామనడం సరికాదు. బకాయి మొత్తం కట్టాల్సిందే.’’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయపాలనకు అడ్డంకులని పేర్కొంది. సుప్రీం ఉత్తర్వుల్ని గౌరవిస్తాం: రోహత్గీ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొద్ది నిమిషాల తరువాత అనిల్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విలేకరులతో మాట్లాడుతూ, ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపట్ల గౌరవం ఉంది. ఎరిక్సన్కు బకాయిలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను గ్రూప్ పాటిస్తుందన్న విశ్వాసం ఉంది. బకాయిల చెల్లింపుల విషయంలో ఇబ్బందులున్నా, ఉన్నత న్యాయస్థానం తన ఆదేశాలను తాను ఇచ్చింది’’ అని అన్నారు. జియోతో ఒప్పందం వైఫల్యంవల్లే: అనిల్ తనకు రావాల్సిన డబ్బుపై ఎరిక్సన్ తీవ్ర విమర్శలే చేసింది. రిలయన్స్ గ్రూప్‌కు రఫేల్ జెట్ డీల్‌లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఉందికానీ, తన రూ.550 కోట్ల బకాయి తీర్చడానికి మాత్రం లేదని విమర్శించింది. అయితే అనిల్ గ్రూప్ దీనిని తీవ్రంగా ఖండించింది. తన సోదరుడు ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ జియోతో తన ఆస్తుల విక్రయ ఒప్పందం విఫలమైందని, తన కంపెనీ దివాలా ప్రొసీడింగ్స్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. ఎరిక్సన్కు బకాయిలు చెల్లిండానికి చేయాల్సిందంతా చేసినా, ఫలితం రాలేదని తెలిపారు. గ్రూప్ షేర్ల పతనం తాజా పరిణామంతో రిలయన్స్ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ కమ్యూనికేషన్: రూ.5.45– రూ.6.15 కనిష్ట, గరిష్ట స్థాయిల్లో తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.17 శాతం (0.25పైసలు) నష్టపోయి రూ.5.75 వద్ద ముగిసింది. రిలయన్స్ క్యాపిటల్: రూ.135.10–రూ.152.50 మధ్య తిరిగిన ఈ షేర్ ధర చివరకు 4.30 శాతం నష్టంతో చివరకు 144.95 వద్ద ముగిసింది. నష్టపోయిన ఇతర షేర్లను చూస్తే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (4.07 శాతం), రిలయన్స్ నావెల్ అండ్ ఇంజనీరింగ్ (2.34 శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (2.29 శాతం), రిలయన్స్ పవర్ (0.92 శాతం) ఉన్నాయి. ఈ స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 10.3 శాతం వరకూ కూడా పడటం గమనార్హం. కేసు క్రమం ఇదీ... ►ఆర్‌కామ్ దేశవ్యాప్త టెలికం నెట్వర్క్ నిర్వహణకు అనిల్ గ్రూప్‌తో 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1,500 కోట్లకుపైగా బకాయిలు చెల్లించలేదని ఆరోపించింది. ► రూ.47,000 కోట్లకుపైగా రుణ భారంలో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, తనకు బకాయిలు చెల్లించలేకపోవడంతో, ఎరిక్సన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది మే నెలలో ఈ పిటిషన్‌ను ట్రిబ్యునల్ అడ్మిట్ చేసుకుంది. ► అయితే ఈ కేసును ఆర్‌కామ్ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంది. ఇందుకు వీలుగా రూ.550 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చింది. 2018 సెప్టెంబర్ 30 లోపు ఈ చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. ► ఈ హామీకి కట్టుబడకపోవడంతో ఎరిక్సన్ సెప్టెంబర్‌లో సుప్రీంను ఆశ్రయించింది. ► ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలపై గతేడాది అక్టోబర్ 23న ఆర్‌కామ్‌కు అత్యున్నత న్యాయస్థానం చివరి అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 15లోపు బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. జాప్యం జరిగితే ఇందుకు సంబంధించి మొత్తంపై 12 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. ►డిసెంబర్ 15లోపు ఆర్‌కామ్ బకాయిలు చెల్లించలేకపోతే, ఎరిక్సన్ కోర్టు ధిక్కరణ కేసు ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించవచ్చని సూచించింది. ►అయితే ఆ లోపూ బకాయిలు చెల్లించలేకపోవడంతో జనవరి 4న ఎరిక్సన్ మళ్లీ సుప్రీం కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ► దీనిపై బుధవారం సుప్రీం కోర్టు తన తీర్పును ప్రకటించింది. -
అనిల్ అంబానీకి భారీ ఊరట
సాక్షి, ముంబై : చుట్టూ సమస్యలతో సతమతమవుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపునకు భారీ ఊరట లభించింది. తనఖా పెట్టిన షేర్లను విక్రయించకుండా రుణదాతలతో అనిల్ అంబానీ గ్రూప్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అడాగ్ గ్రూపు షేర్లు లాభాల పరుగందుకున్నాయి.. సెప్టెంబర్‌వరకూ తనఖా షేర్లను విక్రయించకుండా 90 శాతం రుణదాతలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అడాగ్ తాజాగా వెల్లడించింది. ఇందుకువీలుగా రుణాలకు సంబంధించిన వాయిదా చెల్లింపులను సమయానుగుణంగా చెల్లించే విధంగా అడాగ్ రుణదాతలకు హామీ ఇచ్చింది. దీంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా ఇటీవల భారీ నష్టాలను మూటగట్టుకున్న అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు నష్టాల మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఏకంగా 12 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 12 శాతం, రిలయన్స్ కేపిటల్ దాదాపు 10 శాతం దూసుకెళ్లింది. రిలయన్స్ పవర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ రిలయన్స్ నిప్పన్ లైఫ్ సైతం లాభాల బాటపట్టడం విశేషం. కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఊరట లభించింది. ప్రమోటర్ తనఖా పెట్టిన షేర్లను ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ విక్రయించకుండా రుణదాతలతో ఒక ఒప్పందాన్ని రిలయన్స్ గ్రూప్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి రుణదాతల్లో దాదాపు 90 శాతం సంస్థలు అంగీకరించాయి. -
ఆర్‌కాం సంచలన నిర్ణయం : షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) సంచలన నిర్ణయం తీసుకుంది. దివాళా పిటిషన్ దాఖలు చేయాలని అనూహ్యంగా నిర్ణయించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరనున్నామని కంపెనీ రెగ్యులేటరీ సమాచారంలో తెలియజేసింది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(అడాగ్) కంపెనీ షేర్లకు భారీ షాక్ తగిలింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో అన్ని షేర్లు భారీగా నష్టపోతున్నాయి. సుమారు రూ.40వేల కోట్ల మేర రుణ పరిష్కారాలకు సంబంధించిన అంశంలో 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్‌కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కార అంశం ముందుకు సాగలేదని ఆర్‌కామ్ తెలిపింది. దీంతో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించనున్నట్లు పేర్కొంది. దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇతర గ్రూపు కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళన కారణంగా నెలకొన్న అమ్మకాలతో ముఖ్యంగా ఆర్‌కామ్ షేరు 48 శాతం పతనమైంది. ఒక దశలో54.3 శాతం కుప్పకూలి, 5.30 రూపాయల వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. దీంతోపాటు అడాగ్ గ్రూప్‌లోని రిలయన్స్ కేపిటల్ (12.5శాతం), రిలయన్స్ పవర్ (13శాతం), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్, రిలయన్స్ నావల్ తదితర కౌంటర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. -
జూనియర్ అంబానీ మ్యాజిక్: జాక్‌పాట్
సాక్షి ముంబై: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ (26) ఫస్ట్ డీల్లోనే అదరహో అనిపించుకున్నారు. 25 రెట్ల లాభాలతో ఫస్ట్ ఫండ్ రైజింగ్ డీల్లోనే జాక్‌పాట్ కొట్టేశారు. రిలయన్స్ గ్రూపు అధికార ప్రతినిధి ఈ లావాదేవీని ధృవీకరించారు. కోడ్‌మాస్టర్స్ సంస్థలోని వాటాను యూరోప్, యూకేకు చెందిన 30కి పైగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సంస్థ వెల్లడించింది. ఇందుకు గాను సుమారు రూ.5 వేల కోట్ల వరకూ బిడ్లు దాఖలైనట్టు తెలిపారు. బ్రిటీష్ గేమింగ్ డెవలప్మెంట్ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో రిలయన్స్ 60 శాతం వాటాను రూ.1700 కోట్లకు విక్రయించారు. ఏకంగా 25 రెట్లకు పైగా లాభానికి ఈ వాటాను అమ్మారు. దీంతో ముఖ్యంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులుపడుతున్న అనిల్ అంబానీ పుత్రుడి విజయంతో సంతోషంగా ఉన్నారు. ఎఫ్ 1 సిరీస్ వీడియో గేమ్స్‌ను తయారీ దిగ్గజ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో 2009లో మెజార్టీ వాటాను అడాగ్ గ్రూప్ సంస్థ సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ వాటాను కేవలం 60శాతం వాటాను 17వందల కోట్ల రూపాయలకు విక్రయించడం వ్యాపార వర్గాల్లో విశేషంగా నిలిచింది. కాగా ఈ డీల్ తరువాత కోడ్‌మాస్టర్స్ లో రూ.850 కోట్లు విలువైన 30 శాతం వరకూ వాటా అడాగ్ గ్రూప్ రిలయన్స్ సొంతం. 1986లో కోడ్ మాస్టర్స్ ఏర్పాటైంది. సుమారు 500మంది ఉద్యోగులతో ఇంగ్లాండ్‌లో మూడు, మలేషియాలో ఒక కార్యాలయంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2016 నాటికి, 31 మిలియన్ పౌండ్లుగా ఉన్న కోడ్‌మాస్టర్స్ ఆదాయం2018 ఆర్థిక సంవత్సరం నాటికి 64 మిలియన్ పౌండ్లతో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. అలాగే కోడ్‌మాస్టర్స్ తో పాటు హాలీవుడ్ ఫిలిం స్టూడియో డ్రీమ్ వర్క్స్‌లో కూడా రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. -
కాంగ్రెస్ నేతపై అనిల్ అంబానీ దావా
అహ్మదాబాద్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీపై రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ పరువునష్టం దావా దాఖలు చేసింది. తమ గ్రూప్‌పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను అనిల్ అంబానీ తరఫు ప్రతినిధులు సింఘ్వీకి వ్యతిరేకంగా రూ.5000 కోట్లకు పరువునష్టం దావా వేశారు. గుజరాత్ హైకోర్టులో తమ దావాను దాఖలు చేశారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సింఘ్వీ, అనిల్ అంబానీ కంపెనీకి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు కంపెనీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అందుకే రూ.5000 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నాయి. గత నెలలో సింఘ్వీ ఓ సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని విమర్శిస్తూ పలు ఆరోపణలు చేశారు. ఇటీవల ప్రభుత్వం రూ.1.88 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొన్నారు. 50 మంది కోటీశ్వరులు దాదాపు రూ.8.35 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులకు చెల్లించాల్సి ఉందన్నారు. గుజరాత్‌కు చెందిన రిలయన్స్(అనిల్ అంబానీ గ్రూప్), అదానీ, ఎస్సార్ సంస్థలు బ్యాంకులకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ రుణాలన్నింటిన్నీ జైట్లీ ఎన్పీఏగా చూపిస్తున్నారని సింఘ్వీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల అనిల్ అంబానీ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
గతవారం బిజినెస్
ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్! అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఐసీఈఎక్స్).. డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్స్ ఎక్సే్ఛంజ్‌గా నిలిచింది. నిఫ్టీ–50లోకి బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్ నిఫ్టీ–50 ఇండెక్స్‌లో కొత్తగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్ పాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్)లు ప్రవేశించనున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇప్పటివరకూ భాగమైన ఏసీసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టాటా పవర్ షేర్లను నిఫ్టీ–50 నుంచి తొలగించనున్నారు. ఈ మార్పులు సెప్టెంబర్ 29నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే నిఫ్టీ నెక్ట్స్–50 నుంచి బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్స్, హెచ్‌పీసీఎల్, యునైటెడ్ స్పిరిట్స్లను తొలగించి.. ఏసీసీ, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎంఆర్ఎఫ్, టాటా పవర్లను చేర్చారు. బీఎస్ఎన్ఎల్.. లక్ష వై–ఫై స్పాట్స్!! ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ’బీఎస్ఎన్ఎల్’ దేశవ్యాప్తంగా 2019 మార్చి నాటికి లక్ష వై–ఫై స్పాట్స్‌ను ఏర్పాటు చేయనుంది. వీటిల్లో 25,000 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్,ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. జూలైలో లక్ష్యాన్ని దాటిన జీఎస్టీ వసూళ్లు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలి నెల జూలైలో లక్ష్యాలను అధిగమించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ వసూళ్ల మొత్తం రూ.92,283 కోట్లని పేర్కొన్నారు. 59.57 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ విధానం కింద రిజిస్టర్ అయ్యారని, వీరిలో ఇప్పటివరకూ 64.4 శాతం మంది నుంచి పన్ను వసూళ్లు జరిగాయని వివరించారు. కాగా మొత్తంగా రూ.91,000 కోట్లు మాత్రమే జూలైలో జీఎస్టీ ద్వారా లభిస్తాయని వార్షిక బడ్జెట్ అంచనా వేసింది. హచిసన్‌కు పన్ను నోటీసులు బ్రిటన్ సంస్థ వొడాఫోన్‌కు టెలికం వ్యాపార విక్రయ డీల్‌కు సంబంధించి రూ. 32,320 కోట్లు పన్ను కట్టాలంటూ హాంకాంగ్‌కి చెందిన హచిసన్ సంస్థకు ఆదాయ పన్ను శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇందులో పన్ను రూపంలో రూ. 7,900 కోట్లు, వడ్డీ కింద రూ. 16,430 కోట్లు, జరిమానా కింద మరో రూ. 7,900 కోట్లు కట్టాలంటూ సూచించింది. అనుబంధ సంస్థ హచిసన్ టెలికమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ (హెచ్టీఐఎల్)కి ఈ మేరకు నోటీసులు వచ్చినట్లు బిలియనీర్ లీ కాషింగ్కి చెందిన సీకే హచిసన్ హోల్డింగ్స్ హాంకాంగ్ స్టాక్ ఎక్సే్ఛంజీకి తెలియజేసింది. విప్రో బైబ్యాక్‌కు షేర్ హోల్డర్ల అనుమతి దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీ విప్రో ప్రతిపాదించిన రూ. 11,000 కోట్ల బైబ్యాక్‌కు షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. షేరుకు రూ. 320 ధరతో 34.37 కోట్ల షేర్ల కొనుగోలుకు గత నెలలో విప్రో బైబ్యాక్ ప్రతిపాదనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనకు మెజారిటీ షేర్హోల్డర్లకు పోస్టల్ బ్యాలెట్, ఈ–ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. పెద్ద కార్లపై సెస్సుకు గ్రీన్ సిగ్నల్ పెద్ద కార్లపై సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి గరిష్టంగా 25 శాతానికి పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో మధ్య, పెద్ద కార్లు, లగ్జరీ వాహనాలు, హైబ్రీడ్ వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ మొదలైన వాటి రేట్లు పెరగనున్నాయి. సెస్సు రేటును పెంచేందుకు జీఎస్టీ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తగు సవరణలు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 31 వరకు ఆధార్–పాన్ అనుసంధానం కేంద్ర ప్రభుత్వం ఆధార్–పాన్ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్ 31 వరకు ఆధార్, పాన్ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు సమయమిచ్చినట్లు పేర్కొంది. నోట్ల రద్దు.. ఓ ఫ్లాప్ షో!! నల్లధన నియంత్రనే లక్ష్యంగా ప్రధాని మోదీ అనూహ్యంగా ప్రకటించిన డీమోనిటైజేషన్ పెద్ద ఫ్లాప్ షోగా మిగిలింది. పెద్ద నోట్ల రద్దు నాటికి చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లలో రద్దు తర్వాత దాదాపు 99 శాతం వెనక్కి వచ్చేశాయి. మొత్తంగా రూ.15.44 లక్షల కోట్ల విలువైన నోట్లు రద్దు కాగా.. అందులో రూ.15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి. కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే డిపాజిట్ కాలేదు. వృద్ధి చక్రాలు వెనక్కి..! 2017–18 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి కేవలం 5.7 శాతంగా నమోదయ్యింది. విలువ రూపంలో చూస్తే ఇది రూ.31.10 లక్షల కోట్లు. 2014 జనవరి–మార్చి మధ్య 4.6 శాతం కనిష్ట వృద్ధి రేటు నమోదు కాగా... ఆ తర్వాత అత్యంత తక్కువ ఇదే. గతేడాది ఇదే కాలంలో నమోదైన వృద్ధి రేటు ఏకంగా 7.9 శాతం కావటం గమనార్హం. గతేడాది 4వ త్రైమాసికంలోనూ 6.1 శాతం నమోదయ్యింది. డీల్స్.. దేశీ అతిపెద్ద టెలికం ఆపరేటర్ ’భారతీ ఎయిర్టెల్’.. సెమాంటెక్ కార్పొరేషన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్‌లోని కంపెనీలకు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను అందించడమే ఈ ఒప్పందం లక్ష్యం. అల్జీరియా సంస్థ సెవిటాల్ గ్రూప్‌కు చెందిన అఫెర్పీ స్టీల్ మిల్లును కొనుగోలు చేయాలని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ యోచిస్తోంది. ఇందుకోసం సుమారు 100 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు, సెవిటాల్ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. æ సోలార్, విండ్‌పవర్ వ్యాపారంలో నిమగ్నమైన తమ గ్రూప్ కంపెనీ సెంబ్‌కార్ప్ గ్రీన్ ఎనర్జీ (ఎస్జీఐ)లో మిగిలిన వాటాను ఐడీఎఫ్సీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ నుంచి రూ. 1,410 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తెలిపింది. æ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ దిశగా స్వీడన్‌కి చెందిన దిగ్గజ సంస్థ శాబ్‌తో అదానీ గ్రూప్ చేతులు కలిపింది. భారతీయ వైమానిక దళాలకు కావాల్సిన సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్ కాంట్రాక్టు దక్కించుకోవడం లక్ష్యంగా ఇరు సంస్థలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. నియామకాలు ♦ నీతి ఆయోగ్ కొత్త వైస్‌చైర్మన్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ♦ ప్రపంచపు అతిపెద్ద కోల్ మైనింగ్ కంపెనీ ’కోల్ ఇండియా’కు సీఎండీ నియామకం జరిగింది. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) చీఫ్ గోపాల్ సింగ్.. కోల్ ఇండి యా తాత్కాలిక సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ♦ ప్రభుత్వ రంగ హిందుస్తాన్ కాపర్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంతోష్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ♦ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సెక్రటరీ జనరల్‌గా సంజయ బారు బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇదివరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (2004–08)కి మీడియా అడ్వైజర్‌గా వ్యవహరించారు. -
ప్రపంచంలో తొలి డైమండ్ ఫ్యూచర్స్!
ట్రేడింగ్ ప్రారంభించిన ఐసీఈఎక్స్ ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన ఇండియన్ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఐసీఈఎక్స్) సోమవారం డైమండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రపంచంలోనే డైమండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌ను ప్రారంభించిన మొట్టమొదటి డెరివేటివ్స్ ఎక్సే్ఛంజ్‌గా నిలిచింది. ‘‘కంపల్సరీ డెలివరీతో తొలి దశలో 1 క్యారెట్ పరిమాణంలో కాంట్రాక్ట్స్ను ప్రారంభించాం. డైమండ్ లావాదేవీలు నిర్వహించేవారికి ఇది పూర్తి పారదర్శకమైన కొత్త మార్కెట్‌ను సృష్టిస్తుంది. వివిధ కొనుగోలుదారులకు తమ సర్టిఫైడ్ డైమండ్స్‌ను అమ్మకందారులు తప్పనిసరిగా డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది’’అని ఐసీఈఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజిత్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. తరువాత తప్పనిసరి డెలివరీతో 30 సెంట్లు, 50 సెంట్ల కాంట్రాక్టులు ప్రారంభించాలన్నది ఐసీఈఎక్స్ ప్రణాళిక. ఇందుకు ఇప్పటికే మార్కెట్ రెగ్యులేటర్– సెబీ ఆమోదముద్ర వేసింది. ట్రేడింగ్ పరిమాణం రోజుకు దాదాపు రూ.5,000 కోట్ల మేర ఉండే వీలుందని ప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ రోజు వరకూ 100 మంది సభ్యులు, 4,000 మంది క్లెయింట్లు ఎక్సే్ఛంజ్‌లో రిజిస్టర్ చేయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. కమోడిటీ మార్కెట్ల తదుపరి పురోగతిదిశలో ఇది తాజా ముందడుగని రత్నాలు, ఆభరణ ఎగుమతి మండలి చైర్మన్ ప్రవీణ్ శంకర్ పాండ్య తెలిపారు. -
ఐవోటీ సేవల్లోకి ‘అడాగ్’
సిస్కోతో జట్టు కట్టిన అనిల్ అంబానీ గ్రూపు ముంబై: సిస్కో జాస్పర్ భాగస్వామ్యంతో అనిల్ అంబానీ గ్రూపు (అడాగ్) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స (ఐవోటీ/ఇంటర్నెట్ ఆధారిత పరికరాల) సేవలను ‘అన్‌లిమిట్’ పేరుతో మంగళవారం ముంబైలో ప్రారంభించింది. ఈ వెంచర్ కింద దేశవ్యాప్తంగా కంపెనీలకు ఐవోటీ సేవలు అందించనుంది. ఇందు కోసం సిస్కో జాస్పర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో ఐవోటీ సేవలకు అవకాశాలు అపరిమితమని అడాగ్ ఎండీ అమితాబ్ జున్‌జున్‌వాలా ఈ సందర్భంగా అన్నారు. ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాలు 20 కోట్ల నుంచి 2020 నాటికి 300 కోట్లకు, మార్కెట్ రూ.37 వేల కోట్ల స్థారుు రూ.లక్ష కోట్లకు వృద్ధి చెందే అవకాశాలున్నాయని చెప్పారు. అన్‌లిమిట్ దేశంలో స్మార్ట్ సిటీ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తుందని అడాగ్ గ్రూప్ పేర్కొంది. భారత వృద్ధిలో ఐవోటీ కీలకమని ‘అన్‌లిమిట్’ సీఈవో జుర్గెన్హేస్ పేర్కొన్నారు. సిస్కో జాస్పర్‌కు ప్రపంచ వ్యాప్తంగా 120 మొబైల్ నెట్‌వర్క్‌లతో భాగస్వామ్యం ఉన్నందున దేశీయ కంపెనీలు తమ సేవలను ఇతర దేశాలకు విస్తరించుకునే అవకాశం కలుగుతుందన్నారు. కాగా, ఇజ్రాయెల్‌లో ఐవోటీ ఇంక్యుబేటర్ ఏర్పాటుకు టాటా గ్రూపు జీఈ, మైక్రోసాఫ్ట్‌తో జట్టుకట్టడం తెలిసిందే. -
ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ విలీనం!
► మొబైల్ వ్యాపారాల విలీనానికి ఇరు కంపెనీల చర్చలు ► ఎంటీఎస్‌ను విలీనం చేసుకోనున్నట్లు ఇప్పటికే చెప్పిన ఆర్‌కామ్ ► మూడింటినీ కలిపి కొత్త సంస్థను ఏర్పాటు చేసే యోచన... ► 20 కోట్ల యూజర్లతో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించే అవకాశం.. న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమవుతోంది. అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌తో విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. రెండు కంపెనీల మొబైల్/వైర్లెస్ వ్యాపారాలను విలీనం చేయడానికి ఎయిర్‌సెల్ వాటాదారులతో చర్చలు జరుపుతున్నట్లు ఆర్‌కామ్ మంగళవారం ప్రకటించింది. ప్రతిపాదిత విలీనానికి సంబంధించిన చర్చల కోసం ఎయిర్‌సెల్ మెజారిటీ వాటాదారు అయిన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హార్డ్ (ఎంసీబీ), మరో వాటాదారు సిండ్యా సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లతో 90 రోజుల ప్రత్యేక గడువు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కూడా ఆర్‌కామ్ తెలియజేసింది. సిస్టెమా శ్యామ్ కూడా... ఎంటీఎస్ బ్రాండ్‌తో దేశీయంగా టెలికం సేవలు అందిస్తున్న సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ భారతీయ వ్యాపారాన్ని విలీనం చేసుకునే ప్రక్రియలో ఆర్‌కామ్ నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్, ఎంటీఎస్, ఎయిర్‌సెల్.. మూడు సంస్థల మొబైల్ వ్యాపార కార్యకలాపాలనూ కలిపి ఆర్‌కామ్ నేతృత్వంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ డీల్ రూపంలో ఈ విలీన సంస్థను నెలకొల్పనున్నారని... ఆర్‌కామ్ వాటాదారులు తమ వద్దనున్న ఒక్కో షేరుకి కొత్తగా ఆవిర్భవించే సంస్థలో మూడు షేర్లను ఆశిస్తున్నట్లు కూడా ఆయా వర్గాల సమాచారం. టవర్ల విభాగం అమ్మకం తర్వాత ఆర్‌కామ్ మొత్తం రుణ భారం రూ.10 వేల కోట్ల దిగువకు చేరుతుందని అంచనా. కొత్తగా ఏర్పాటయ్యే సంస్థకు ఈ రుణాన్ని బదలాయించడం ద్వారా రుణ రహిత సంస్థగా మారాలనేది ఆర్‌కామ్ ప్రణాళికగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అనుకున్నట్లు జరిగితే ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, ఎంటీఎస్‌ల వైర్లెస్ వ్యాపారాలను కలపడం ద్వారా ఆవిర్భవించే కొత్త సంస్థ బ్రాండ్ ఇతర వివరాలు కొద్ది రోజుల్లో ఖరారయ్యే అవకాశాలున్నాయి. వైర్లెస్ వ్యాపారాన్ని కొత్త సంస్థకు బదలాయించాక ఆర్‌కామ్ మున్ముందు పూర్తిగా ఎంటర్ప్రైజ్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. అతిపెద్ద స్పెక్ట్రం వాటా... ఈ మూడు కంపెనీల మొబైల్ వ్యాపారాన్ని విలీనం చేసి కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే... మొత్తం దేశీ టెలికం పరిశ్రమకు కేటాయించిన స్పెక్ట్రంలో 19.3% ఈ కొత్త సంస్థ గుప్పిట్లోకి వస్తుంది. అప్పుడు దేశంలో అత్యధిక స్పెక్ట్రం వాటా కలిగిన సంస్థ ఇదే అవుతుంది. 2జీ, 3జీ, 4జీ సర్వీసులన్నింటిలోనూ (అన్ని బ్యాండ్విడ్త్లూ) ఈ ప్రతిపాదిత కొత్త సంస్థకు స్పెక్ట్రం ఉంటుంది. కాగా, నిర్వహణ వ్యయాలు, మూలధన పెట్టుబడుల విషయంలో మెరుగైన సమన్వయంతో పాటు ఆదాయాలను పెంచుకునేందుకు కూడా ఈ విలీనం ఉపకరిస్తుందని ఆర్‌కామ్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల స్థాయిలోనే(నాన్-బైండింగ్) ఉన్నాయని.. పూర్తిస్థాయి మదింపు, నియంత్రణ సంస్థల అనుమతి, వాటాదారులు, సంబంధిత పక్షాల(థర్డ్‌పార్టీ) ఆమోదాలకు లోబడే విలీన లావాదేవీ జరుగుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని కూడా ఆర్‌కామ్ పేర్కొంది. విలీన వార్తల నేపథ్యంలో ఆర్‌కామ్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో 2.39 శాతం లాభపడి రూ.85.70 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ.87.10 గరిష్టాన్ని కూడా తాకింది. నంబర్ 2 టెల్కోగా.. ఈ డీల్ పూర్తయితే దేశంలో రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా నిలిచే అవకాశం ఉంది. తాజా విలీనం ప్రతిపాదన కార్యరూపం దాల్చితే యూజర్ల సంఖ్యాపరంగా దేశంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్‌గా కొత్త సంస్థ ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం ఆర్‌కామ్ 11 కోట్ల మంది యూజర్లతో దేశంలో నాలుగో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ఎయిర్‌సెల్ 8.4 కోట్ల మంది సబ్స్క్రయిబర్లతో అయిదో స్థానంలో ఉంది. ఇక ఆర్‌కామ్ విలీనం చేసుకోనున్నట్లు ప్రకటించిన సిస్టెమా శ్యామ్‌కు భారత్‌లో 83.6 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ మూడూ కలిస్తే కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ యూజర్లు దాదాపు 20 కోట్లకు చేరుతారు. టవర్ల వ్యాపారానికి సంబంధం లేదు.. ఆర్‌కామ్ మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ మౌలిక సదుపాయాలకు ఈ ప్రతిపాదిత విలీనంతో సంబంధం లేదని కంపెనీ తెలియజేసింది. టవర్ల విభాగాన్ని విక్రయిస్తున్నట్లు ఈ నెల 4న ఆర్‌కామ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు తిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, టీపీజీ ఆసియా ఇంక్‌లతో నాన్-బైండింగ్ ఒప్పందంపై ఆర్‌కామ్ సంతకాలు కూడా చేసింది. ఈ డీల్ విలువ దాదాపు రూ.30 వేల కోట్లుగా అంచనా. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడం కోసం ఆర్‌కామ్ ఉపయోగించుకోనుంది. -
రిలయన్స్ ఎంఎఫ్ చేతికి గోల్డ్‌మన్ శాక్స్ ఫండ్
డీల్ విలువ రూ.243 కోట్లు ముంబై: అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ అంతా నగదు రూపేణా జరగనున్నది. రూ.13 లక్షల కోట్ల భారత మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నుంచి తాజాగా మరో విదేశీ సంస్థ, గోల్డ్‌మన్ శాక్స్ వైదొలుగుతోంది. ఈ డీల్‌కు రెండు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపాయని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్సీఏఎం) మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ బీమా, బ్రోకరేజ్, వెల్త్ మేనేజ్మెంట్ తదితర ఆర్ధిక సేవలనందిస్తోంది. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీ 2011లో రూ. 120 కోట్లకు బెంచ్‌మార్క్ మ్యూచువల్ ఫండ్‌ను కొనుగోలు చేయడం ద్వారా భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత మ్యూచువల్ ఫండ్ రంగం నుంచి నిష్ర్కమిస్తున్నాయి. స్టాండర్ట్ చార్టర్డ్ సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి, ఫెడిలిటి సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ఎల్ అండ్ టీ ఫైనాన్స్‌కు 2012లో విక్రయించాయి. మోర్గాన్ స్టాన్లీ ఫండ్ వ్యాపారాన్ని హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ కొనుగోలు చేయగా, ఐఎన్జీ మ్యూచువల్ ఫండ్‌ను బిర్లా సన్‌లైఫ్, పైన్‌బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కోటక్ ఎంఎఫ్, డాయిష్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని అమెరికా కొనుగోలు చేశాయి. ప్రస్తుతం భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో 40కు పైగా సంస్థలు ఉన్నాయి. -
రిలయన్స్ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయం పూర్తి
ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ మీడియా వర్క్స్ తమ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయ ప్రక్రియ పూర్తయినట్లు మంగళవారం తెలిపింది. దీని వల్ల మాతృసంస్థకు రూ. 700 కోట్ల రుణ భారం తగ్గుతుందని వివరించింది. మరోవైపు రియల్ ఎస్టేట్‌ను కూడా రూ. 200 కోట్లకు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయని కంపెనీ మాతృసంస్థ రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. గతేడాది డిసెంబర్లో కార్నివాల్ సినిమాస్‌కు రిలయన్స్ మీడియా వర్క్స్ తమ మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో సంస్థకు బిగ్ సినిమాస్ పేరిట దాదాపు 250 స్క్రీన్స్ ఉండేవి. ఈ డీల్ ఫలితంగా 300 పైచిలుకు స్క్రీన్స్‌తో దేశంలోనే మూడో అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా కార్నివాల్ నిల్చింది. -
ఫాంటమ్ ఫిల్మ్స్‌తో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ జట్టు
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్(అడాగ్)నకు చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్.. ఫాంటమ్ ఫిల్మ్స్‌తో జట్టు కట్టింది. తమ సినిమా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార విభాగం ఈ మేరకు భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుందని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. జాయింట్ వెంచర్(జేవీ)లో చెరో 50 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది. ఫాంటమ్ ఫిల్మ్ ్స కంపెనీని ప్రముఖ డెరైక్టర్లు అనురాగ్ కాశ్యప్, వికాశ్ బహల్, విక్రమాధిత్య మోత్వానే, మధు మాంటెనాలు నెలకొల్పారు. భారత్, విదేశాల్లో సినిమాల పంపిణీతోపాటు ఏటా కనీసం 5-6 సినిమాలు నిర్మించాలనేది ఈ జేవీ ప్రణాళిక.