సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీకి మరో పెద్ద చిక్కొచ్చి పడేటట్టుంది. వార్షిక వాటాదారుల సమావేశం సందర్భంగా కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై వాటాదారులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ అంబానీ సంస్థల పేలవమైన పనితీరు, రేటింగ్ డౌన్‌గ్రేడ్ కారణంగా ఎంతో నష్టపోయామని గ్రూపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక వాటాదారుడు. పెద్దమొత్తంలో సంపదను కోల్పోయానని చెప్పిన సదరు వాటాదారుడు ఇందుకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల యాజమాన్యంపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని హెచ్చరించారు. సమస్యలను వచ్చే రెండు-మూడు నెలల్లో పరిష్కరించకపోతే, గ్రూప్ కంపెనీలపై ఫస్ట్ క్లాస్ యాక్షన్ దావా వేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని కార్పొరేట్ న్యాయవాదిగా చెప్పుకున్న వాటాదారుడు పేర్కొన్నారు.
2005 నుంచి మూడు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో మూడింటిలో 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా, విలువలో 90 శాతానికి పైగా నష్టపోయానని ఆయన చెప్పారు. ప్రధానంగా ఛైర్మన్ అనిల్ అంబానీ తన షేర్లలో 80 శాతానికి పైగా షేర్లను బ్యాంకుల వద్ద తనఖాగా పెట్టి రుణం తీసుకోవడమే సంక్షోభాన్నిమరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తనను నాశనం చేసిందని వాపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చిన రోజే 37లక్షల రూపాయలను పోగొట్టుకున్నానన్నారు. ఈ నేపథ్యంలోతన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోతే, రాబోయే రెండు-మూడు నెలల్లో ఆర్‌పవర్‌పై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని అని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఇందుకు మిగతా 10 శాతం వాటాదారులను కూడా కూడగడతానని తెలిపారు.
మరోవైపు ఏజీఓంలో వాటాదారులకు అనిల్ సమాధానం చెబుతూ సలహాలలన్నింటినీ పరిశీలిస్తామనీ, లేవనెత్తిన సమస్యలనులోతుగా ఆలోచించి, వాటిని పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామని హామీ వచ్చారు. అనిల్ సారధ్యంలోని రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ ఆరంభంలో రూ లక్ష కోట్లు దాటింది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ అన్ని కంపెనీల మార్కెట్ విలువ కేవలం రూ 18,525 కోట్లకు పడిపోయింది. ఇందులో రిలయన్స్ నిప్పాన్ ఏఎంసీ ఒక్క కంపెనీ విలువే రూ 16,000 కోట్లుగా ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువు రూ 212 కోట్లుగా ఉంది. 2008 లో 72 రేట్లు అధిక బిడ్లు లభించి మార్కెట్ నుంచి రూ 11,563 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ ప్రస్తుత విలువ రూ 617 కోట్లకు పడిపోయింది.
కాగా కంపెనీ యాక్ట్ 2013లోని ఒక సెక్షన్ ప్రకారం వాటాదారులు సంబంధిత కంపెనీలు క్లాస్ యాక్షన్ సూట్‌ను దాఖలు అవకాశం కల్పిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ నిబంధన ప్రకారం ఎటువంటి కేసు నమోదు కాలేదు.
చదవండి : అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment