share holders
-
యాపిల్‌పై షేర్ హోల్డర్ల విమర్శలు, టిమ్‌కుక్ శాలరీ తగ్గింపు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అందించే వేతనం ఈ ఏడాది భారీగా తగ్గిపోనుంది. యాపిల్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో టిమ్‌కుక్ వేతనం తగ్గించాలని చర్చకు వచ్చింది. షేర్ హోల్డర్లతో జరిపిన సమావేశం అనంతరం వేతన తగ్గింపు నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. పెట్టుబడిదారుల అభిప్రాయం మేరకు తన వేతనాన్ని సర్దుబాటు చేయమని కుక్ స్వయంగా అభ్యర్థించారు.కాబట్టే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఆయన వేతనం 40శాతం పైగా తగ్గించి 49 మిలియన్లను మాత్రమే ముట్టజెప్పనుంది. 2023లో కుక్కు ఇచ్చే శాలరీ మార్పులు, యాపిల్ పనితీరుతో ముడిపడి ఉన్న స్టాక్ యూనిట్ల శాతం 50 నుంచి రానున్న రోజుల్లో 75శాతానికి పెరుగుతుందని పేర్కొంది. 2022లో కుక్ 99.4 మిలియన్ల మొత్తాన్ని శాలరీ రూపంలో తీసుకోగా, ఇందులో 3 మిలియన్ల బేసిక్ శాలరీ, సుమారు 83 మిలియన్లు స్టాక్ అవార్డ్లు, బోనస్‌లు ఉన్నాయి. కుక్ వేతనంపై యాపిల్ సంస్థ స్పందించింది. సంస్థ అసాధారణమైన పనితీరు, సీఈవో సిఫార్స్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా, యాపిల్ సంస్థ టిమ్ కుక్కు ఇచ్చే ప్యాకేజీపై వాటాదారులకు అభ్యంతర వ్యక్తం చేశారు. అదే సమయంలో కుక్ పట్ల యాపిల్ ప్రదర్శిస్తున్న విధేయతపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టిమ్‌కుక్ శాలరీ విషయంలో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో ప్రముఖ అడ్వైజరీ సంస్థ ఐఎస్ఎస్ (Institutional Shareholder Services) సైతం 2026లో టిమ్‌కుక్ రిటైర్ కానున్నారు. అప్పటివరకు ఈ ప్రోత్సహాకాలు ఇలాగే కొనసాగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. -
ఎన్డీటీవీలో అదానీ పైచేయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఇచ్చిన ఓపెన్ ఆఫర్లో భాగంగా ఇన్వెస్టర్లు 53.27 లక్షల షేర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపినట్లు ఎన్డీటీవీ తాజాగా వెల్లడించింది. దీంతో మీడియా సంస్థలో అదానీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. ఎన్డీటీవీలో పరోక్షంగా 29.18 శాతం వాటాను పొందిన అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. షేరుకి రూ. 294 ధరలో 1.67 కోట్ల షేర్ల కొనుగోలుకి సిద్ధపడింది. శుక్రవారం(2న) ముగింపు ధర రూ. 415తో పోలిస్తే ఆఫర్ ధర 41 శాతం తక్కువకాగా.. షేర్ల కొనుగోలు నేడు(5న) ముగియనుంది. కార్పొరేట్ ఇన్వెస్టర్లు సై ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం కార్పొరేట్ ఇన్వెస్టర్లు 39.34 లక్షల షేర్లు, రిటైలర్లు 7 లక్షలకుపైగా, అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) 6.86 లక్షల షేర్లు చొప్పున టెండర్ చేశారు. ఇవి ఆఫర్లో 32 శాతంకాగా.. 8.26 శాతం వాటాను అదానీ గ్రూ ప్ సొంతం చేసుకోనుంది. వెరసి ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 37.44 శాతానికి బలపడనుంది. తద్వారా ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణవ్ రా య్, ఆయన భార్య రాధికా రాయ్‌ల సంయుక్త వా టా 32.26 శాతాన్ని మించనుంది. దీంతో చైర్మన్ పదవికి అదానీ గ్రూప్ అభ్యర్థిని నియమించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. చైర్మన్సహా ఇద్దరు డైరెక్టర్లను నియమించవచ్చని తెలియజేశాయి. ప్రస్తుతం ఎన్డీటీవీకి ప్రణవ్ రాయ్ (15.94 శాతం వాటా) చైర్‌పర్శన్‌గా, రాధిక(16.32 శాతం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వాటాల రీత్యా వీరిరువురూ డైరెక్టర్లుగా కొనసాగేందుకు వీలుంది. -
దివాలా సంస్థల్లో షేర్ హోల్డర్లకు రక్షణగా సెబీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న లిస్టెడ్ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను కాపాడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్‌కు సంబంధించిన చర్చాపత్రాన్ని రూపొందించింది. కంపెనీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చే రిజల్యూషన్ దరఖాస్తుదారుకు ఇచ్చే అవకాశాలనే మైనారిటీ షేర్హోల్డర్లకు కూడా కల్పించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం కొత్త సంస్థలో కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ శాతాన్ని (ప్రస్తుతం 25 శాతం) కొనుగోలు చేసేందుకు ప్రస్తుత పబ్లిక్ ఈక్విటీ షేర్హోల్డర్లకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. రిజల్యూషన్ దరఖాస్తుదారు విషయంలో అంగీకరించిన ధరపరమైన నిబంధనలే వారికీ వర్తింపచేయాలని సూచించింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలున్న చర్చాపత్రంపై సంబంధిత వర్గాలు నవంబర్ 24లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
ఎన్ఎస్ఈ సీఈఓగా ఆశిష్ కుమార్ నియామకానికి ఆమోదం
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ అశిష్‌కుమార్ చౌహాన్ నియామకానికి షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. ‘‘ఆగస్టు 11వ తేదీన నిర్వహించిన అసాధారణ స్వర్వసభ్య సమావేశం(ఈఓజీఎం)లో చౌహాన్ నియామకానికి మద్దతుగా 99.99 శాతం ఓట్లతో షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు’’ అని ఎక్స్ఛేంజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 16తో ముగిసిన నేపథ్యంలో., ఈ పదవికి చౌహాన్ ఎంపికయ్యారు. సెబీ జూలై 18న ఆమోదం తెలిపింది. అదే నెల 27 తేదీన ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే! -
భారత్‌లో పెట్టుబడులను తగ్గించట్లేదు: గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధితోనే తమ సంస్థల పురోగతి ముడిపడి ఉందని పారిశ్రామిక గ్రూప్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఎన్నడూ తగ్గించలేదని, మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ 70 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఊతంతో భారత్.. ఆయిల్, గ్యాస్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి పరిశుభ్రమైన ఇంధనాలను ఎగుమతి చేసే దేశంగా మారగలదని అదానీ ధీమా వ్యక్తం చేశారు. ‘భారత్‌లో ఇన్వెస్ట్ చేయడం నుంచి మేము ఎప్పుడూ తప్పుకోలేదు. మా పెట్టుబడులు ఎన్నడూ నెమ్మదించలేదు. మా వ్యాపారాల స్థాయి, పనితీరుతో ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమన్న ధీమా మాకు ఉంది’ అని గ్రూప్ కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చదవండి: యూజర్లకు షాక్, భారీగా పెరిగనున్న అమెజాన్ ప్రైమ్ ధరలు..ఎక్కడంటే -
Elon Musk: ఎలన్ మస్క్-ట్విటర్ భారీ డీల్‌లో ట్విస్ట్
డెలావేర్: ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో పరిణామం చోటు చేసుకుంది. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో ట్విట్టర్ ను సొంతం చేసుకోవాలన్న ప్రయత్నానికి అడ్డంకి ఏర్పడింది. ఈ డీల్‌ను వ్యతిరేకిస్తూ ట్విట్టర్ వాటాదారు అయిన ‘ఫ్లోరిడా పెన్షన్ ఫండ్’.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2025లోపు ట్విట్టర్ ను ఎలన్ మస్క్ కొనుగోలు చేయకుండా అడ్డుకోవాలంటూ డెలావేర్ చాన్సెరీ కోర్టులో(యూఎస్) పిటిషన్ దాఖలు చేసింది ఎఫ్‌పీఎఫ్. అంతేకాదు.. త్వరిత విలీనాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరింది. ట్విట్టర్ లో ఇతర పెద్ద వాటాదారులతో మస్క్ ఒప్పందం కుదుర్చుకున్నారని.. ట్విట్టర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేతోపాటు, తనకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్న మోర్గాన్ స్టాన్లే కూడా ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఇరువురికీ ట్విట్టర్ లో వాటాలుండడం గమనార్హం. మోర్గాన్ స్టాన్లేకి 8.8 శాతం వాటా ఉండగా, జాక్ డోర్సేకి 2.4 శాతం వాటా ఉంది. ఎలన్ మస్క్ కు 9.6 శాతం వాటాలు ఉన్నాయి. ఎలన్ మస్క్ కాకుండా, చట్ట ప్రకారం ఇతర షేర్లలో మూడింట రెండొంతులు ఆమోదం లభించేంత వరకు, మూడేళ్ల పాటు డీల్ ను నిలిపివేయాలని ఫ్లోరిడా పెన్షన్ ఫండ్ న్యాయస్థానాన్ని కోరింది. న్యాయపరమైన ఈ చిక్కుల్ని ట్విటర్, ఎలన్ మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చదవండి: ట్విటర్.. టెస్లా ఒక్కటి కాదు - బిల్‌గేట్స్ -
చేతులు మారిన ల్యూమినస్ ఎలక్ట్రికల్!
న్యూఢిల్లీ: ల్యూమినస్ పవర్‌కు చెందిన హోమ్ ఎలక్ట్రికల్ బిజినెస్(హెచ్ఈబీ)ను కొనుగోలు చేసినట్లు వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్ఆర్ కేబుల్ తాజాగా పేర్కొంది. ఫ్రెంచ్ ఇంజినీరింగ్ దిగ్గజం ష్నీడర్ నుంచి ల్యూమినస్ హెచ్ఈబీని సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. తద్వారా తమ కన్జూమర్ ఎలక్ట్రికల్ గూడ్స్ బిజినెస్ మరింత పటిష్టంకానున్నట్లు టీపీజీ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఆర్ఆర్ కేబుల్ అభిప్రాయపడింది. ల్యూమినస్ పోర్ట్‌ఫోలియోలో ఫ్యాన్లు, లైట్లు, అప్లయెన్సెస్ తదితరాలున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఐపీవోకు వచ్చే యోచనలో ఉన్నట్లు ఆర్ఆర్ కేబుల్ ఎండీ శ్రీగోపాల్ కాబ్రా విలేకరుల వర్చువల్ సమావేశంలో తెలియజేశారు. ల్యూమినస్ పవర్ డీల్ ఈ ఏడాది మే నెలకల్లా పూర్తికావచ్చని అంచనా వేశారు. అటు ల్యూమినస్, ఇటు ఆర్ఆర్ అన్‌లిస్టెడ్ కంపెనీలు కావడంతో డీల్ విలువను వెల్లడించలేమన్నారు. ల్యూమినస్ కొనుగోలు ద్వారా ఫ్యాన్లు, లైట్లు తదితరాల ప్రీమియం విభాగంలోకి ప్రవేశించినట్లు వివరించారు. బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం నాలుగేళ్లపాటు ల్యూమినస్ను ప్రొడక్టులకు వినియోగించుకునే వీలున్నట్లు వెల్లడించారు. ల్యూమినస్ పవర్లో 74% వాటాను ష్నీడర్ 2011లో కొనుగోలు చేసింది. 2017లో మిగతా 26% వాటా సొంతం చేసుకుంది. -
అమ్మకానికి ఏఐజీ హాస్పిటల్.. రంగంలోకి గోల్డ్‌మన్ శాక్స్
దేశంలోనే అతి పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హస్పిటల్గా పేరొందిన ఏషియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో వాటాల విక్రయానికి ప్రమోటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు వాటాల విక్రయం పనులు నిర్వహించేందుకు అంతర్జాతీయ సంస్థ గోల్డ్మన్శాక్స్కు అప్పగించారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ వార్తా కథనం ప్రచురించింది. వాటాల విక్రయానికి రెడీ ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డి ఏఐజీ ఆస్పత్రికి ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో సోమాజిగూడలో 300 పడకలు గచ్చిబౌలిలో 800 పడకలతో రెండు ఆస్పత్రులు ఉన్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో క్వాడ్రియా క్యాపిటల్ సంస్థకి 30 శాతం వాటాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రమోటర్లు తమ వంతు వాటాల విక్రయానికి సిద్ధమైనట్ట్టు సమాచారం. రూ.5,000 కోట్లు ప్రమెటర్లు తమ వాటాల్లో 60 నుంచి 70 శాతం వరకు విక్రయించి 30 నుంచి 40 శాతం వాటాలు అట్టి పెట్టుకోవచ్చని ఈటీ కథనంలో పేర్కొంది. ఈ వాటాల విక్రయం డీల్ విలువ రూ. 5000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఆసక్తి చూపిస్తున్నారు ఏఐజీ ఆస్పత్రిలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థలు కార్లే, టీపీజీ, టెమాసెక్, బేరింగ్ పీఈ ఏషియా సంస్థలు రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వాటాల అమ్మకానికి సంబంధించి ఇటు ప్రమోటర్లు కానీ అటు ప్రైవేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మౌలిక సదుపాయాలు వైద్యపరంగా మౌలిక వసతులకు సంబంధించి ఇండియా చాలా వెనుకబడి ఉంది. ప్రతీ పది వేల మందికి 5 బెడ్లు 8 మంది డాక్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా 155వ స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఆర్బీఐ సైతం ఆస్పత్రులకు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వాలంటూ సూచించింది. సమాంతరంగా ప్రైవటే ఈక్విటీ సంస్థలు నిధులు గుమ్మరించేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆస్పత్రుల ప్రమోటర్లు సైతం విస్తరణ బాట పట్టారు. అందులో భాగంగా వాటా విక్రయాలు చేస్తున్నారు. చదవండి: Wipro: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..! -
పేటీఎం కోటీశ్వరులు.. ఒక్కరోజులో 350 మంది జీవితాల్లో మార్పు
దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్‌గా ఇటీవల సంచలనం సృష్టించిన పేటీఎం ఐపీవో ఎంతమంది సామాన్యుల జీవితాలను మార్చేసింది. జీవితంలో ఎప్పుడూ చూడనంత సంపదను వారికి సొంతం చేసింది. వాటాలే జీతం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆలిఘడ్‌కి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విజయ్ శేఖర్ శర్మ 2010లో పేటీఎంని స్టార్టప్‌గా ప్రారంభించారు. పేటీఎం మొదలైన కొత్తలో సరైన నిధులు వనరులు లేకపోవడంతో తన స్నేహితులు, ఇతర టెక్నోక్రాట్లను భాగస్వాములగా చేసుకుని ఈ స్టార్టప్‌ని వృద్ధి చేశారు. ఇలా పేటీఎం ప్రారంభ దశలో జీతాలు ఇచ్చేందుకు కూడా కటకటలాడే పరిస్థితి ఉండటంతో ఇందులో పని చేసిన అనేక మందికి కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. బ్రేక్ ఇవెన్ పేటీఎం బ్రేక్ ఇవెన్‌కి వచ్చే సరికి సుమారు వెయ్యి మంది అందులో ఉద్యోగులుగా ఉన్నారు. ఇందులో 350 మంది ఆ కంపెనీలో పార్ట్‌నర్లుగానే కొనసాగారు. ఒక్కసారి పేటీఎం బ్రేక్ ఇవెన్‌కి రావడంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులకు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది మంచి వేతనాలకు ఇతర కంపెనీల్లో జాయిన్ అయ్యారు. అయితే చాలా మంది పేటీఎంలో తమ వాటాలను అట్టిపెట్టుకున్నారు. కలిసి వచ్చిన నోట్ల రద్దు నోట్లరద్దు తర్వాత పేటీఎం అనూహ్య రీతిలో వృద్ధి చెందింది. బ్యాంకింగ్, షాపింగ్, టిక్కెట్ బుకింగ్, ట్రావెల్ ఇలా అనేక రంగాలకు విస్తరించింది. పది వేల మందికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థగా ఎదిగింది. 2017లోనే అత్యంత పిన్న వయసులో బిలియనీర్‌గా గుర్తింపు పొందారు విజయ్ శేఖర్ శర్మ. ఒక్క రోజులో కోటీశ్వరులు తాజాగా స్టాక్‌మార్కెట్లలో పేటీఎం లిస్టయ్యింది. సుమారు రూ. 18,300 కోట్ల నిధులు సమీకరించడం లక్ష్యంగా ఐపీవో ఇష్యూ చేసింది. రికార్డు స్థాయిలో ఈ కంపెనీ షేరు ధర రూ. 2,150గా పలికింది. దీంతో పేటీఎం ప్రారంభంలో ఉద్యోగులుగా, భాగస్వామ్యులుగా ఉన్న 350 మంది ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు. ఇందులో అతి తక్కువ వాటాలు కలిగిన వ్యక్తి ఖాతాలో 1,34,401 డాలర్లు వచ్చి చేరాయి. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడు. లగ్జరీగా పేటీఎం ఐపీవో వల్ల అకస్మాత్తుగా కోటీశ్వరులగా మారిన చాలా మంది ప్రస్తుతం ఆ సంస్థలో లేరు. కొందరు ఇతర సంస్థల్లో పని చేస్తుండగా మరికొందరు రెగ్యులర్ వ్యాపారాల్లో తలామునకలై ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిపడిన సంపదతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ‘చాన్నాళ్లుగా నా తల్లిదండ్రులను ఏదైనా టూర్‌కి తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. అది సాధ్యపడలేదు. పేటీఎంతో నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. మా పేరెంట్స్‌ని ఉదయ్‌పూర్‌కి తీసుకెళ్తాను, లగ్జరీ హోటళ్లలోనే వాళ్లకి బస ఏర్పాటు చేస్తాను’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని పేటీఎం మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. చదవండి:చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. ఇప్పుడు బిలియనీర్ -
ఎలన్ మస్క్ నెత్తిన పిడుగు.. 70వేల కోట్ల ఫైన్!
Elon Musk Solarcity Lawsuit: టెక్ మేధావి ఎలన్ మస్క్‌కి భారీ షాక్ తగలనుందా?. అదీ సొంత ప్రాజెక్టు సోలార్ సిటీ నుంచే!. అవుననే అంటున్నాయి కొన్ని మీడియా కథనాలు. సోలార్ సిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్న మస్క్.. అందులో మేజర్ షేర్ హోల్డర్ కూడా. ఈ క్రమంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. తాజాగా ఓ ఇన్వెస్టర్ ఆయన మీద కోర్టుకు ఎక్కగా.. ఆ ఆరోపణలు రుజువైతే 9.4 బిలియన్ డాలర్ల భారీ జరిమానా మస్క్ చెల్లించాల్సి వస్తుందట!. బ్లూమరాంగ్ కథనం ప్రకారం.. సోలార్సిటీకి సంబంధించిన ఇన్వెస్టర్ ఒకరు మస్క్‌కు వ్యతిరేకంగా కాలిఫోర్నియా కోర్టులో దావా వేశారు. షేర్ హోల్డర్స్ అభిప్రాయాలు, సమ్మతి తీసుకోకుండానే ఎలన్ మస్క్ సుమారు 2.6 బిలియన్ డాలర్ల డీల్ ఒకటి కుదుర్చుకున్నాడనేది ఇన్వెస్టర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు షేర్ హోల్డర్స్ ప్రాధాన్యం తగ్గిస్తూ.. లాభాలన్నీ తన ఖాతాలోనే వేసుకుంటున్నాడని, తన వరకు తనకు సంబంధించిన వాటా కోసం కోర్టును ఆశ్రయించినట్లు సదరు షేర్‌హోల్డర్ పేర్కొన్నాడు. ఇక ఈ దావాకు మిగతా షేర్ హోల్డర్స్‌లో కొందరు మద్దతు ప్రకటించడం విశేషం. ఒకవేళ ఆరోపణలు రుజువైతే మస్క్ 9.4 బిలియన్ డాలర్ల జరిమానా(మన కరెన్సీలో దాదాపు 70 వేల కోట్లదాకా) చెల్లించాల్సి వస్తుందని బ్లూమరాంగ్ పేర్కొంది. ఇంతకుముందు కూడా.. గతంలో సోలార్ సిటీలో మస్క్ స్టాక్ షేర్ 2.4 మిలియన్గా ఉండేది. అయితే స్టాక్స్ పంపకం తర్వాత ఇప్పుడది 12 మిలియన్‌కు చేరుకుంది. దీంతో మస్క్ షేర్ విలువ 9.56 బిలియన్ డాలర్లగా ఉంది. ఇక టెస్లా సీఈవో హోదాలో ఉండి అన్నివ్యవహారాల్లో ఎలాగైతే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడో.. ఇటు సోలార్ సిటీ స్టాక్ హోల్డర్స్‌ను ఎలన్ మస్క్ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే 2017లో టెస్లా షేర్ హోల్డర్స్ అంతా కలిసి మస్క్ మీద దావా కూడా వేశారు. కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహించడం, అధిక వాటాను లాగేసుకోవడం, సమర్థవంతులను పక్కకు తోసేయడం లాంటివి చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి మస్క్‌పై. అయితే మస్క్ సంపాదన తప్పుడు దోవలో లేదని, 85 శాతం షేర్ హోల్డర్స్ ఈ ఆర్జనను ఆమోదిస్తున్నారని మస్క్ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. చదవండి: చైనా బ్యాన్.. మస్క్ షాకింగ్ కామెంట్స్ -
బాంబే హైకోర్టుకి చేరిన జీ టీవీ వివాదం
జీ టీవీ యాజమాన్యానికి దానిలో పెట్టుబడిదారులకు మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. వివాదం పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు సుముఖంగా లేవు. దీంతో రెండు వైపులా వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. బాంబై హైకోర్టులో అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్లు పంపిన నోటీసులు చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జీ టీవీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించలేమంటూ ఇన్వెస్కో , ఓఎఫ్‌ఐలకు జీ టీవీ తెలియజేసింది. ముదిరిన వివాదం జీ టీవీలో ఇన్వెస్కోతో పాటు ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు సంస్థలు దాదాపు 18 శాతం వాటాతో జీ టీవీలో మేజర్ షేర్‌హోల్డర్లుగా ఉన్నాయి. సెప్టెంబరు 4న జీ టీవీ సీఈవోగా పునీత్ గోయెంకాను తొలగించాలంటూ మేజర్ షేర్ హోల్డర్లు జీ మేనేజ్మెంట్ని కోరారు. దీనిపై చర్చలు జరుగుతుండగానే షేర్ హోల్డర్లను సంప్రదించకుండా సోనీ టీవీలో జీ టీవీని విలీనం చేశారు. ఈ రెండు సంస్థలకు సంయుక్తంగా సీఈవోగా పునీత్ గోయెంకాను నియమించారు. వెనక్కి తగ్గట్లేదు మేజర్ షేర్ హోల్డర్ల నిర్ణయాలను పక్కన పెట్టి విలీనం చేయడమే కాకుండా తాము కోరినట్టుగా సీఈవో మార్పు చేయకపోవడంతో అత్యవరసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ మరోసారి ఇన్వెస్కో జీని కోరింది. అయితే జీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్టోబరు 4న విచారణ జీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఇన్వెస్కో సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. వెనువెంటనే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించేలా జీ మేనేజ్మెంట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అక్టోబరు 4న దీనిపై విచారణ జరగనుంది. దీంతో అక్టోబరు 2నే జీ యాజమాన్యం బాంబే హై కోర్టును ఆశ్రయించింది. చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని -
సెబీ కేసులో శిల్పాశెట్టికి ఊరట
న్యూఢిల్లీ: షేర్‌హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్‌హోల్డింగ్ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెడితే 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్)కి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద కేటాయించింది. ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో వియాన్ ఇండస్ట్రీస్ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల షేర్‌హోల్డింగ్ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది. -
లక్ష్మీ విలాస్ షేరు పతనానికి కారణం?
ముంబై, సాక్షి: సుమారు మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రయివేట్ రంగ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంకు(ఎల్వీబీ).. సింగపూర్ ప్రభుత్వ అనుబంధ సంస్థ డీబీఎస్ బ్యాంకులో విలీనమయ్యే అవకాశముంది. ఇందుకు వీలుగా ముసాయిదా ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) మంగళవారం ప్రకటించింది. వెరసి ఆర్థికంగా పరిపుష్టమైన డీబీఎస్ బ్యాంకు ద్వారా ఎల్వీబీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే దేశీయంగా కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్ బ్యాంకు ఇందుకు ఆసక్తిని వ్యక్తం చేయడంతోపాటు.. అవరసమైతే ఎల్వీబీని పటిష్టం చేసేందుకు అదనపు నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎల్వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాటాదారులకు నిల్ సాధారణంగా బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ ఆర్బీఐ నిబంధనల కారణంగా ఖాతాదారులకు పెద్దగా సమస్యలు ఎదురుకావని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. అయితే బ్యాంకు షేర్లను కొనుగోలుచేసిన వాటాదారులపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నాయి. సాధారణంగా బిజినెస్‌లు వృద్ధిలో ఉన్న సంస్థల షేర్లు లాభపడినట్లే.. నష్టాల బాట పట్టిన కౌంటర్లు పతనమవుతుంటాయని మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంకు నెట్‌వర్త్ మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో వాటాదారులకు నష్టం వాటిల్లడం సహజమేనని వివరించారు. సెప్టెంబర్‌కల్లా బ్యాంకు కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్) -2.85 శాతానికి చేరగా.. మార్చి నుంచి టైర్-1 క్యాపిటల్ ప్రతికూలంగా నమోదవుతోంది. ప్రస్తుతం -4.85 శాతానికి జారింది. సెప్టంబర్తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ. 397 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ నేపథ్యంలో షేరు తాజాగా 20 శాతం కుప్పకూలి రూ. 12.5కు చేరింది. ఈ షేరు 2017 జూన్‌లో రూ. 187 స్థాయిలో ట్రేడ్‌కావడం ప్రస్తావించదగ్గ విషయం! వాటాదారుల జాబితా లక్ష్మీవిలాస్ బ్యాంకులో ఎన్బీఎఫ్సీ.. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.99 శాతం వాటాను కలిగి ఉంది. గతంలో ఎల్వీబీ విలీనానికి ఐబీ హౌసింగ్ ప్రయత్నించి విఫలమైన విషయం విదితమే. కాగా.. ఎల్‌వీబీలో శ్రేఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్‌కు 3.44 శాతం, కాప్రి గ్రూప్ హోల్డింగ్స్‌కు 3.82 శాతం వాటా, ఎల్ఐసీకి 1.6 శాతం చొప్పున వాటాలు ఉన్నాయి. ఇదేవిధంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు 1.83 శాతం, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌కు 2.73 శాతం చొప్పున వాటా ఉంది. ప్రమోటర్ల వాటా 6.8 శాతానికి పరిమితమైనట్లు తెలుస్తోంది. -
అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ కల నెరవేరింది. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ అప్పులు లేని సంస్థగా అవతరించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. (ధనాధన్ జియో) అంచనాలను అధిగమించడం మా డీఎన్ఏలోనే ఉంది 2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను అప్పులు లేని కంపెనీగా మారుస్తామని వాటాదారులకు ఇచ్చిన వాగ్దానాన్ని చాలా ముందుగానే నేరవేర్చామని ప్రకటించేందుకు చాలా ఆనందంగా ఉందని అంబానీ తెలిపారు. ఇది గర్వించదగ్గ సందర్భం...వాటాదారుల అంచనాలను మళ్లీ మళ్లీ అధిగమించిడం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉందని పేర్కొన్నారు. అలాగే రిలయన్స్ వ్యవస్థాపకులు, తన తండ్రి ధీరూబాయి అంబానీ ఆశయాల సాధన, దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధిలో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించడమే కాదు.. వాటిని సాధిస్తామంటూ అంబానీ భరోసా ఇచ్చారు. కాగా రిలయన్స్ టెలికాం విభాగం జియో ప్లాట్ ఫాంలోకి ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి ఇటీవల భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం. దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది. కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకోవడంతో రిలయన్స్ నిర్దేశిత లక్ష్యం నెరవేరింది. మార్చి 31, 2020 నాటికి గ్రూప్ నికర అప్పు 1,61,035 కోట్ల రూపాయలుగా ఉంది. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా అవతరించనున్నామని గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 1,684 రూపాయల వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది.(మరో మెగా డీల్ : అంబానీ కల నెలవేరినట్టే!) -
రిలయన్స్ చాట్‌బోట్ సర్వీస్
న్యూఢిల్లీ : భారతీయ స్టాక్ మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంది. దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన షేర్ హోల్డర్ల కోసం శనివారం ఏఐ శక్తితో కూడిన చాట్‌బోట్‌ను ప్రారంభించింది. దీనిని జియో ప్లాట్‌ఫామ్ అనుబంధ సంస్థ హాప్టిక్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. ఇది భారతదేశ చరిత్రలో అతి పెద్దది. హిందీ, మరాఠీ, కన్నడ, గుజరాతీ, బంగ్లా వంటి భాషల్లో లభించనుంది. ఆర్ఐఎల్లో దాదాపు రూ. 53,125 కోట్ల రూపాయల హక్కులు కలిగిన తన షేర్ హోల్డర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చాట్‌బోట్ ద్వారా సమాధానాలు ఇవ్వనుంది. ఇకపై షేర్ హోల్డర్స్ చాట్‌బోట్ సేవలను వాట్సప్ ద్వారా పొందవచ్చు. చాట్‌బోట్ సర్వీస్‌ను వినియోగించాలంటే '7977111111' జియో నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపగానే ఆటోమెటిక్‌గా యాక్టివ్ అవుతుంది. వాట్సప్‌లో వినియోగదారులు ఏంచుకునే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానమిచ్చేందుకు చాట్‌బోట్ ఎంతగానో ఉపయోగపడనుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో షేర్ హోల్డర్ల ప్రశ్నలకు సమాధానాలందించేందుకు రిలయన్స్ బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, కాల్ సెంటర్లకు చాట్‌బాట్ విరివిగా సేవలు అందించనుంది. చాట్‌బోట్ ఎలా వినియోగించాలి.. చెల్లింపు పద్దతులు.. ఫారమ్‌లను ఎలా యాక్సెస్ చేయాలి.. లీడ్ మేనేజర్స్‌ను హెల్ప్‌లైన్ ద్వారా ఏ విధంగా సంప్రదించాలనే దానిపై రిలయన్స్ డాట్ కామ్‌లో తెలుసుకోవచ్చు. మనుషుల మాదిరిగానే చాట్‌బోట్ 24*7 తన సేవలను అందించనుంది. -
రూ.పది లక్షల కోట్లు హాంఫట్
-
ఇన్ఫోసిస్‌కు మరో షాక్
ఇన్ఫోసిస్‌పై దావా వేయనున్నట్లు లాస్ ఏంజిల్స్‌కు చెందిన షాల్ లా ఫర్మ్ (షేర్ హోల్డర్స్ హక్కుల సంస్థ) ప్రకటించింది. స్వల్పకాలిక లాభాలను అర్జించడానికి ఇన్ఫోసిస్ తప్పుడు ప్రకటనలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. అకౌంటింగ్ సమీక్షలను ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ దాటవేస్తున్నాడని తెలిపింది. అకౌంటింగ్ వివరాలను మేనేజ్మెంట్ ఒత్తిడితో ఫైనాన్స్ విభాగం దాచిందని ఫిర్యాదులో తెలిపింది. ఇన్ఫోసిస్‌కు సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్కెట్లో ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్లు నష్టపోయారని వెల్లడించింది. జులై 7 2018 నుంచి అక్టోబర్ 20, 2019 వరకు సెక్యూరిటీస్ కొన్న ఇన్వెస్టర్లు షాల్ లా ఫర్మ్ సంస్థను సంప్రదించవచ్చని పేర్కొంది. షాల్ లా ఫర్మ్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వాటాదారులు, షేర్ హోల్డర్స్ హక్కుల కోసం పోరాడుతున్న విషయం విదితమే. గత కొంత కాలంగా ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌పై విజిల్ బ్లోయర్ల (ప్రజావేగుల) ఫిర్యాదుల పరంపర కొనసాగింది. కానీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలేవంటూ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అంబానీపై దావా వేస్తా.. చరిత్ర సృష్టిస్తా
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీకి మరో పెద్ద చిక్కొచ్చి పడేటట్టుంది. వార్షిక వాటాదారుల సమావేశం సందర్భంగా కంపెనీ ప్రస్తుత పరిస్థితిపై వాటాదారులు ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ అంబానీ సంస్థల పేలవమైన పనితీరు, రేటింగ్ డౌన్‌గ్రేడ్ కారణంగా ఎంతో నష్టపోయామని గ్రూపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక వాటాదారుడు. పెద్దమొత్తంలో సంపదను కోల్పోయానని చెప్పిన సదరు వాటాదారుడు ఇందుకు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల యాజమాన్యంపై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని హెచ్చరించారు. సమస్యలను వచ్చే రెండు-మూడు నెలల్లో పరిష్కరించకపోతే, గ్రూప్ కంపెనీలపై ఫస్ట్ క్లాస్ యాక్షన్ దావా వేయడం ద్వారా చరిత్ర సృష్టిస్తానని కార్పొరేట్ న్యాయవాదిగా చెప్పుకున్న వాటాదారుడు పేర్కొన్నారు. 2005 నుంచి మూడు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో మూడింటిలో 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా, విలువలో 90 శాతానికి పైగా నష్టపోయానని ఆయన చెప్పారు. ప్రధానంగా ఛైర్మన్ అనిల్ అంబానీ తన షేర్లలో 80 శాతానికి పైగా షేర్లను బ్యాంకుల వద్ద తనఖాగా పెట్టి రుణం తీసుకోవడమే సంక్షోభాన్నిమరింత పెంచిందని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తనను నాశనం చేసిందని వాపోయారు. కష్టపడి సంపాదించిన డబ్బును ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. కేర్ రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ రేటింగ్ ఇచ్చిన రోజే 37లక్షల రూపాయలను పోగొట్టుకున్నానన్నారు. ఈ నేపథ్యంలోతన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించకపోతే, రాబోయే రెండు-మూడు నెలల్లో ఆర్పవర్పై క్లాస్ యాక్షన్ దావా వేస్తానని అని ఆయన హెచ్చరించారు. అంతేకాదు ఇందుకు మిగతా 10 శాతం వాటాదారులను కూడా కూడగడతానని తెలిపారు. మరోవైపు ఏజీఓంలో వాటాదారులకు అనిల్ సమాధానం చెబుతూ సలహాలలన్నింటినీ పరిశీలిస్తామనీ, లేవనెత్తిన సమస్యలనులోతుగా ఆలోచించి, వాటిని పరిష్కరించడానికి తమవంతు కృషి చేస్తామని హామీ వచ్చారు. అనిల్ సారధ్యంలోని రిలయన్స్ అడాగ్ గ్రూప్ కంపెనీల సంయుక్త విలువ ఆరంభంలో రూ లక్ష కోట్లు దాటింది. కానీ ప్రస్తుతం ఈ గ్రూప్ అన్ని కంపెనీల మార్కెట్ విలువ కేవలం రూ 18,525 కోట్లకు పడిపోయింది. ఇందులో రిలయన్స్ నిప్పాన్ ఏఎంసీ ఒక్క కంపెనీ విలువే రూ 16,000 కోట్లుగా ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ విలువు రూ 212 కోట్లుగా ఉంది. 2008 లో 72 రేట్లు అధిక బిడ్లు లభించి మార్కెట్ నుంచి రూ 11,563 కోట్లు సమీకరించిన రిలయన్స్ పవర్ ప్రస్తుత విలువ రూ 617 కోట్లకు పడిపోయింది. కాగా కంపెనీ యాక్ట్ 2013లోని ఒక సెక్షన్ ప్రకారం వాటాదారులు సంబంధిత కంపెనీలు క్లాస్ యాక్షన్ సూట్‌ను దాఖలు అవకాశం కల్పిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ నిబంధన ప్రకారం ఎటువంటి కేసు నమోదు కాలేదు. చదవండి : అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై -
అపోలో టైర్స్ ఎండీకి షాక్ : వేతనాల కోత
సాక్షి,ముంబై: దేశంలోనే అతిపెద్ద టైర్ల పరిశ్రమ అపోలో టైర్స్ కంపెనీకి అపోలో టైర్స్ లిమిటెడ్ ఛైర్మన్ ఒంకార్ కన్వర్, ఆయన కుమారుడు, ఎండీ, కంపెనీ ఉపాధ్యక్షుడు నీరజ్ కన్వర్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. కంపెనీ వీరికి చెల్లించే చెల్లింపుల్లో 30శాతం కోత పడింది. అలాగే మేనేజింగ్ డైరెక్టర్‌గా నీరజ్ పునః నియామకాన్ని కూడా కంపెనీ తిరస్కరించింది. అపోలో టైర్స్ బోర్డుకు చెందిన నామినేషన్స్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి వారి మొత్తం పరిహారాన్ని 30 శాతం తగ్గించాలని ప్రతిపాదించింది. ప్రమోటర్ల వేతనాలు పన్ను చెల్లించే ముందు లాభంలో 7.5 శాతం పరిమితి ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. పనితీరు ఆధారిత వేతనం మొత్తం పరిహారంలో సుమారు 70 శాతంగా ఉండాలి, ప్రమోటర్ల వార్షిక ఇంక్రిమెంట్స్ కూడా కంపెనీ సీనియర్ నిపుణులకి అనుగుణంగా ఉండాలని ప్యానెల్ స్పష్టం చేసింది. అపోలో టైర్స్ ఎండీ నీరజ్ కన్వర్ కొనసాగింపునకు కంపెనీలో మైనార్టీ వాటా కలిగిన షేర్ హోల్డర్స్ ససేమిరా అన్నారు. ఈ షాకింగ్ పరిణామంతో కంపెనీలో మేజర్ వాటా కలిగిన నీరజ్ కు షేర్ హోల్డర్స్ చేతిలో అతి పెద్ద ఒటమి ఎదురైనట్టైంది. నీరజ్ వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువ పరిహారాలను తీసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆయన ఎండీగా కొనసాగడానికి అర్హుడు కాదని అపోలో టైర్స్ షేర్ హోల్డర్స్ అభిప్రాయ పడ్డారు. సెప్టెంబరు 12న జరిగిన ఓటింగ్ లో కంపెనీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా నీరజ్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. 2016 లో రు. 30 కోట్లు హౌజ్ అలవెన్స్‌గా తీసుకున్న నీరజ్ 2017లో ఆయన నిర్వాహణలో కంపెనీ లాభాలు గత సంవత్సరం 34 శాతం తగ్గి రు.622 కోట్లకే పరిమితమైనప్పటికీ , 41 శాతం పెంపుతో 42.8 కోట్లను డ్రా చేశారు నీరజ్. పే-టు-లాభం నిష్పత్తి పరంగా నీరజ్‌కు అందినపరిహారం దాదాపు రెట్టింపు అయ్యింది. అదేవిధంగా, గత ఆర్థిక సంవత్సరానికి తండ్రీకొడు కుల జీతం-లాభం నిష్పత్తి రెండింతలైందిట. ఇదే షేర్ హోల్డర్స్ లో నీరజ్ పై అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
ఐసీఐసీఐపై భగ్గుమన్న షేర్ హోల్డర్స్
వడోదర : ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబుక్కింది. ఐసీఐసీఐ-వీడియోకాన్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈవో చందా కొచర్‌ను ఏజీఎం తీసుకు రావాలని వాటాదారులు డిమాండ్ చేశారు. చందా కొచర్, ఆమె కుటుంబ సభ్యులు వీడియోకాన్‌కు రుణాలు జారీ చేసే విషయంలో ‘క్విడ్ ప్రో క్వో’ కు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలపై, కొచర్ తమకు సమాధానం చెప్పాలని అన్నారు. బోర్డు పారదర్శకంగా వ్యవహరించలేదని వాటాదారులు మండిపడ్డారు. కొచర్, ప్రస్తుతం వీడియోకాన్ రుణ వివాద విచారణ పూర్తయ్యేంత వరకు సెలవులో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె నేడు(బుధవారం) జరిగిన 24వ వార్షిక సాధారణ సమావేశానికి హాజరు కాలేదు. ఐసీఐసీఐ నూతన చైర్మన్ చతుర్వేది ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఈ సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశంలో వాటాదారులు ఆగ్రహం పెల్లుబికింది. తమ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం దొరకడం లేదని వాటాదారుల మండిపడ్డారు. బ్యాంక్‌లో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదంటూ వాటాదారులు హెచ్చరించారు. తమ ముందుకు వచ్చి చందా కొచర్ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. కొచర్ జాబ్‌ను బోర్డు నిర్వహించలేదన్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ తన ఏజీఎంను ఆగస్టు 10నే చేపట్టాల్సి ఉంది. కానీ బ్యాంక్ సీఈవోపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో, స్వతంత్ర విచారణకు ఆదేశించేందుకు ఈ సమావేశాన్ని నెల పాటు వాయిదా వేసింది. త్వరలోనే కొచర్‌కు, ఆమె భర్త దీపక్ కొచర్‌కు సెబీ సమన్లు జారీ చేయనున్నట్లు తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కొంతమంది బ్యాంక్ టాప్ అధికారులు కూడా, కొచర్ భర్తతో భాగస్వామ్యమై లబ్ది పొందినట్టు తెలిసింది. వారిని వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్
ఆస్తుల పరంగా రెండో అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫలితాల్లో అదరగొట్టింది. నేడు(శనివారం) వెల్లడించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో బ్యాంకు నికర లాభాలు 20 శాతం జంప్ చేసి రూ.4799 కోట్లగా రికార్డైనట్టు వెల్లడించింది. కాగ గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.3990 కోట్లగా ఉన్నాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు భారీ డివిడెంట్ ప్రకటించింది. 2 రూపాయల గల ఒక్కో షేరుకు 13 రూపాయల డివిడెంట్ ఇచ్చేందుకు బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఇది షేర్ల ఫేస్ విలువకు 650 శాతం అధికం. గతేడాది ఇదే క్వార్టర్లో 11 రూపాయల డివిడెంట్ ప్రకటించింది. వచ్చే వార్షిక సాధారణ సమావేశంలో పెట్టుబడిదారులు దీన్ని ఆమోదించనున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.4,838 కోట్ల లాభాలను ఆర్జిస్తుందని తెలిసింది. కానీ విశ్లేషకుల అంచనాలకు కాస్త దగ్గర్లోనే బ్యాంకు తన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు నికర ఆదాయాలు ఏడాది ఏడాదికి 17.7 శాతం పెరిగి రూ.10,657.71 కోట్లగా ఉన్నాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉన్నట్టు హెచ్డీఎఫ్సీ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.30 శాతంగా ఉన్నాయి. అంతేకాక నికర ఎన్పీఏలు గత డిసెంబర్ క్వార్టర్లో 0.44 శాతంగా ఉంటే, ఈ మార్చి క్వార్టర్లో 0.40 శాతంగా నమోదయ్యాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా శుక్రవారం హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.98 శాతం పెరిగి, రూ.1,960.95 వద్ద ముగిశాయి. -
వేదాంతలో కెయిర్న్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ ఇండియా... వేదాంత ఇండియాలో విలీనం కానుంది. విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు ఆమోదముద్ర వేశాయి. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా డీల్ పూర్తి కావొచ్చని భావిస్తున్నారు. విలీనానికి సంబంధించి డీల్ పూర్తిగా షేర్ల రూపంలో ఉండనుంది. కెయిర్న్‌ఇండియా షేర్హోల్డర్లకు వేదాంత (గతంలో సెసా స్టెరిలైట్) షేర్లు లభించనున్నాయి. విలీనానికి శ్రీకారం చుట్టే దిశగా వేదాంత ఇటీవలే.. గ్రూప్‌లో భాగమైన ట్విన్ స్టార్ మారిషస్ హోల్డింగ్స్ నుంచి సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2011లో వేదాంత 8.67 బిలియన్ డాలర్లు వెచ్చించి కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31 దాకా గణాంకాల ప్రకారం వివిధ వ్యాపార విభాగాల ద్వారా కెయిర్న్ ఇండియాలో వేదాంతకు 59.9 శాతం వాటాలు ఉన్నాయి.