దేశంలోనే అతి పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హస్పిటల్‌గా పేరొందిన ఏషియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో వాటాల విక్రయానికి ప్రమోటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు వాటాల విక్రయం పనులు నిర్వహించేందుకు అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మన్‌శాక్స్‌కు అప్పగించారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ వార్తా కథనం ప్రచురించింది.
వాటాల విక్రయానికి రెడీ
ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డి ఏఐజీ ఆస్పత్రికి ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో సోమాజిగూడలో 300 పడకలు గచ్చిబౌలిలో 800 పడకలతో రెండు ఆస్పత్రులు ఉన్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో క్వాడ్రియా క్యాపిటల్ సంస్థకి 30 శాతం వాటాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రమోటర్లు తమ వంతు వాటాల విక్రయానికి సిద్ధమైనట్ట్టు సమాచారం.
రూ.5,000 కోట్లు
ప్రమెటర్లు తమ వాటాల్లో 60 నుంచి 70 శాతం వరకు విక్రయించి 30 నుంచి 40 శాతం వాటాలు అట్టి పెట్టుకోవచ్చని ఈటీ కథనంలో పేర్కొంది. ఈ వాటాల విక్రయం డీల్ విలువ రూ. 5000 కోట్లు ఉండవచ్చని అంచనా.
ఆసక్తి చూపిస్తున్నారు
ఏఐజీ ఆస్పత్రిలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థలు కార్లే, టీపీజీ, టెమాసెక్, బేరింగ్ పీఈ ఏషియా సంస్థలు రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వాటాల అమ్మకానికి సంబంధించి ఇటు ప్రమోటర్లు కానీ అటు ప్రైవేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మౌలిక సదుపాయాలు
వైద్యపరంగా మౌలిక వసతులకు సంబంధించి ఇండియా చాలా వెనుకబడి ఉంది. ప్రతీ పది వేల మందికి 5 బెడ్లు 8 మంది డాక్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా 155వ స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఆర్బీఐ సైతం ఆస్పత్రులకు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వాలంటూ సూచించింది. సమాంతరంగా ప్రైవటే ఈక్విటీ సంస్థలు నిధులు గుమ్మరించేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆస్పత్రుల ప్రమోటర్లు సైతం విస్తరణ బాట పట్టారు. అందులో భాగంగా వాటా విక్రయాలు చేస్తున్నారు.
చదవండి: Wipro: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!
Comments
Please login to add a commentAdd a comment