promoter
-
47వ అంతస్తు.. రూ.97 కోట్లు! ఖరీదైన ఫ్లాట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.రియల్ఎస్టేట్ సమాచార సంస్థ జాప్కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. వర్లీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.అపార్ట్మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్మెంట్లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది. -
కిమ్ కర్దాషియన్ క్రిప్టో వివాద సెటిల్మెంట్
న్యూయార్క్: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియాన్ .. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్ఈసీ)తో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్నూ ప్రచారం చేయబోనని కిమ్ తెలిపారు. వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతా ద్వారా కిమ్ ప్రమోట్ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్ కర్దాషియన్ సెటిల్మెంట్కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్ వెల్లడించారు. -
అమ్మకానికి ఏఐజీ హాస్పిటల్.. రంగంలోకి గోల్డ్‌మన్ శాక్స్
దేశంలోనే అతి పెద్ద గ్యాస్ట్రో ఎంటరాలజీ హస్పిటల్గా పేరొందిన ఏషియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రిలో వాటాల విక్రయానికి ప్రమోటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు వాటాల విక్రయం పనులు నిర్వహించేందుకు అంతర్జాతీయ సంస్థ గోల్డ్మన్శాక్స్కు అప్పగించారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ వార్తా కథనం ప్రచురించింది. వాటాల విక్రయానికి రెడీ ప్రముఖ వైద్యులు నాగేశ్వర్‌రెడ్డి ఏఐజీ ఆస్పత్రికి ప్రధాన ప్రమోటర్‌గా ఉన్నారు. హైదరాబాద్‌లో సోమాజిగూడలో 300 పడకలు గచ్చిబౌలిలో 800 పడకలతో రెండు ఆస్పత్రులు ఉన్నాయి. ఏఐజీ ఆస్పత్రిలో క్వాడ్రియా క్యాపిటల్ సంస్థకి 30 శాతం వాటాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రమోటర్లు తమ వంతు వాటాల విక్రయానికి సిద్ధమైనట్ట్టు సమాచారం. రూ.5,000 కోట్లు ప్రమెటర్లు తమ వాటాల్లో 60 నుంచి 70 శాతం వరకు విక్రయించి 30 నుంచి 40 శాతం వాటాలు అట్టి పెట్టుకోవచ్చని ఈటీ కథనంలో పేర్కొంది. ఈ వాటాల విక్రయం డీల్ విలువ రూ. 5000 కోట్లు ఉండవచ్చని అంచనా. ఆసక్తి చూపిస్తున్నారు ఏఐజీ ఆస్పత్రిలో వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సంస్థలు కార్లే, టీపీజీ, టెమాసెక్, బేరింగ్ పీఈ ఏషియా సంస్థలు రెడీగా ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వాటాల అమ్మకానికి సంబంధించి ఇటు ప్రమోటర్లు కానీ అటు ప్రైవేటు ఈక్విటీ ఫండ్ సంస్థలు కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మౌలిక సదుపాయాలు వైద్యపరంగా మౌలిక వసతులకు సంబంధించి ఇండియా చాలా వెనుకబడి ఉంది. ప్రతీ పది వేల మందికి 5 బెడ్లు 8 మంది డాక్టర్లతో ప్రపంచ వ్యాప్తంగా 155వ స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వైద్యరంగంలో మౌలిక సదుపాయలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఆర్బీఐ సైతం ఆస్పత్రులకు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వాలంటూ సూచించింది. సమాంతరంగా ప్రైవటే ఈక్విటీ సంస్థలు నిధులు గుమ్మరించేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో ఆస్పత్రుల ప్రమోటర్లు సైతం విస్తరణ బాట పట్టారు. అందులో భాగంగా వాటా విక్రయాలు చేస్తున్నారు. చదవండి: Wipro: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..! -
షేర్ల పతనం- కంపెనీల డీలిస్టింగ్ బాట
కోవిడ్-19 కారణంగా రెండు నెలల క్రితం స్టాక్ మార్కెట్లు పతనంకావడంతో పలు కంపెనీల షేర్లు చౌక ధరలకు దిగివచ్చాయి. దీంతో కొంతమంది ప్రమోటర్లు కంపెనీలను స్టాక్ ఎక్స్ఛేంజేల నుంచి డీలిస్ట్ చేసే సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా షేర్ల ధరలు తగ్గినప్పుడు కంపెనీల ప్రమోటర్లు వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కంపెనీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల కంపెనీలు డీలిస్టింగ్ బాట పట్టడంతో ఇన్వెస్టర్లు ఇందుకు అవకాశమున్న కంపెనీలపై దృష్టిసారిస్తున్నట్లు చెబుతున్నారు. బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా ఇప్పటికే డీలిస్టింగ్‌కు సిద్ధంకాగా.. ఇటీవల అదానీ పవర్, హెక్సావేర్ టెక్నాలజీస్ సైతం ఇదే బాటలో నడవనున్నట్లు తెలియజేశారు.. పలు కంపెనీల షేర్లు ఇటీవల నేలచూపులతో కదులుతుండటంతో మరింతమంది ప్రమోటర్లు ఈ బాట పట్టవచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు రవి సర్ధానా చెబుతున్నారు. తాజాగా సాఫ్ట్వేర్ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్‌ను డీలిస్ట్ చేసేందుకు హెచ్‌టీ ఐటీ గ్లోబల్ సొల్యూషన్స్ తెరతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇక కరోనా వైరస్ తలెత్తడంతో స్టాక్ మార్కెట్లతోపాటు వేదాంతా షేరు పతనమైంది. 52 వారాల గరిష్టం రూ. 180 నుంచి సగానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రమోటర్లు వేదాంతా డీలిస్టింగ్ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. 2008లో టెండర్ మార్గం ద్వారా ప్రమోటర్లు కంపెనీలలో వాటాలు పెంచుకోవడం లేదా స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేయడం వంటి ట్రెండ్ ఇంతక్రితం 2000, 2008లో కనిపించినట్లు మార్కెట్ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సాధారణంగా మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు ఇలాంటి ట్రెండ్ కనిపిస్తుంటుందని తెలియజేశాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తదుపరి మళ్లీ ఇటీవల ఈ ట్రెండ్ వేళ్లూనుకుంటున్నట్లు ఐఐఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్ నిపుణ్ గోయెల్ వివరించారు. కాగా.. డీలిస్టింగ్ ప్రకటించకముందు వేదాంతా షేరు రూ. 80 స్థాయికి చేరగా.. తదుపరి బలపడి రూ. 105ను తాకింది. అదానీ పవర్లో పబ్లిక్కు గల 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు గత వారం అదానీ గ్రూప్ పేర్కొంది. ఇందుకు రివర్స్ బుక్బిల్డింగ్ పద్ధతిని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఇక లిక్కర్ దిగ్గజం యునైటెడ్ స్పిరిట్స్‌ను డీలిస్ట్ చేసే యోచనలో బ్రిటిష్ మాతృ సంస్థ డియాజియో పీఎల్సీ ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. నిజానికి డీలిస్టింగ్‌కు ప్రీమియం ధరను చెల్లించవలసి ఉంటుందని, కోవిడ్-19 కారణంగా ఇటీవల షేర్ల ధరలు దిగిరావడంతో ఇందుకు అనువైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు వ్యాఖ్యానించారు. గతేడాది దేశీ అనుబంధ సంస్థ లిండేను డీలిస్ట్ చేసేందుకు యూకే ఇండస్ట్రియల్ దిగ్గజం బీవోసీ సైతం ప్రయత్నించిన విషయం ప్రస్తానార్హం. కాగా.. షేరు ఫ్లోర్ ధర రూ. 428.5తో పోలిస్తే ఇన్వెస్టర్లు నాలుగు రెట్లు అధికంగా రూ. 2025 ధరను అశించడంతో బీవోసీ వెనక్కి తగ్గిన విషయం విదితమే. -
ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్ల వాటా విక్రయం!
భారతీ ఎయిర్టెల్ ప్రమోటరైన భారతీ టెలిమీడియా మంగళవారం బ్లాక్‌డీల్ ద్వారా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన ఎయిర్టెల్ షేర్లను విక్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్‌డీల్‌లో భాగంగా 2.75 శాతం వాటాను టెలిమీడియా విక్రయించనుంది. ఈ డీల్‌కు జేపీమోర్గాన్ బ్యాంకర్‌గా వ్యవహరించనుందని, డీల్‌లో భాగంగా ఒక్కో షేరును రూ. 558 చొప్పున విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ ధర శుక్రవారం ముగింపు ధర కన్నా దాదాపు 6 శాతం తక్కువ. డీల్‌లో భాగంగా సుమారు 15కోట్ల షేర్లు చేతులు మారతాయి. విక్రయానంతరం ప్రమోటర్లకు 90 రోజుల లాక్ఇన్ వర్తించనుంది. విక్రయం ద్వారా వచ్చిన నిధులను అమ్ములు తీర్చేందుకు వినియోగిస్తారని సదరు వర్గాలు తెలిపాయి. డీల్ పూర్తయితే ఎయిర్‌టెల్‌లో ప్రమోటర్లైన భారతీ టెలికం, ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్, వృందావన్, పాస్టెల్ కంపెనీల వాటా 58.98 శాతం నుంచి 56.23 శాతానికి తగ్గనుంది. గత మూడేళ్లుగా ఎయిర్టెల్ వివిధ మార్గాలు వేగంగా నిధుల సమీకరణలు జరిపింది. అనంతరం ఏజీఆర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, టారిఫ్‌లు పెంచడం ద్వారా నిలదొక్కుకుంది. దీంతో ఇటీవల కాలంలో షేరు మంచి ర్యాలీ జరిపింది. -
ప్రమోటర్ల వాటా అప్: షేరు ధర డౌన్ ..!
స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రమోటర్లు తమ సొంత కంపెనీల్లో వాటాను పెంచుకునే అవకాశంగా మలుచుకుంటున్నారు. గడిచిన రెండు త్రైమాసికాల్లో ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల పద్దతిలో సుమారు 24కంపెనీల్లో ప్రమోటర్లు వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ లాక్డౌన్ విధింపుతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ... త్రైమాసిక ఫలితాలను ప్రకటించేందుకు కంపెనీలకు అదనపు సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్1 నుంచి జూన్30 వరకు కంపెనీల వాటాలనుప్రమోటర్లు, ఇతర ఇన్సైడర్లు కొనుగోలు చేయడంపై నిషేధం విధించింది. గడచిన 6నెలల్లో సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్, దీపక్ ఫెర్టిలైజర్స్, వైభవ్ గ్లోబల్, చంబల్ ఫెర్టిలైజర్, మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఏపిఎల్ అపోలో ట్యూబ్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ కంపెనీల ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు. సన్‌ఫార్మా(2 శాతం), దీపక్ ఫెర్టిలేజర్స్(3 శాతం), వైభవ్ గ్లోబల్(19 శాతం) షేర్లు తప్ప ప్రమోటర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 50శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో సెన్సెక్స్ 20శాతం క్షీణించింది. రెగ్యూలేటరీలు ఫార్మా కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఫార్మా రంగానికి కలిసొచ్చింది. అలాగే ఆదాయాల రికవరీపై ఆశలను పెంచింది. ఐదేళ్ల పనితీరు తర్వాత వాల్యూయేషన్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారితో ఈ రంగం చాలా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఫార్మా రీ-రేటెడ్ అవుతుందని మేము నమ్ముతున్నాము. కోటక్ పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఫండ్ మేనేజర్ అన్షుల్ సైగల్ నవ భారత్ వెంచర్స్, సైయెంట్, జామ్నా అటో, జెన్సార్ టెక్నాలజీస్, సెంట్రమ్ క్యాపిటల్, వక్రంజీ, గ్రేవీస్ కాటన్, జాగరణ్ ప్రకాశణ్, ఐఆర్బీ ఇన్ఫ్రా, వాలియంట్ కమ్యూనికేషన్స్, కమర్షియల్ సిన్ బ్యాగ్స్, సీసీఎల్ ప్రాడెక్ట్స్, కంపెనీల ప్రమోటర్లు అక్టోబర్-మార్చి నెలలో తమ సంస్థల్లో వాటాను పెంచుకున్నారు. ఈ కంపెనీల షేర్లు వార్షిక ప్రాతిపదికన 10-55శాతం నష్టాలను చవిచూశాయి. ప్రమోటర్లు సొంత కంపెనీల్లో వాటాను ఎప్పుడు పెంచుకుంటారు..? కంపెనీ స్టాక్ విలువ పెరుగుతుందని తెలిసినప్పుడు కంపెనీ లేదా సంబంధిత రంగంలో సానుకూల డెవలప్మెంట్ ఉన్నప్పుడు కొన్ని సార్లు కంపెనీ నియంత్రణ ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ప్రమోటర్లు తన కంపెనీలో వాటాను పెంచుకుంటాడు. ప్రమోటర్లు ఆకర్షణీయమైన ధరలకు వాటాలను పొందే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇలా సొంత కంపెనీలో వాటా కొనుగోలు అనేది వారి వ్యాపారాలపై విశ్వాసం చూపించడానికి ఒక మార్గం. అయినప్పటికీ, వారి ఇన్వెస్ట్మెంట్ పరిమాణం చిన్న ఇన్వెసర్ల కంటే ఎక్కువగా ఉన్నందున వాటిని గుడ్డిగా అనుసరించకూడదు అని షేర్‌ఖాన్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ గౌరవ్ దువా పేర్కోన్నారు. -
కాఫీ కింగ్ విషాదాంతం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : కాఫీకి కార్పొరేట్ హంగులద్ది కోట్లకు పడగలెత్తిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్దాపకుడు వీజీ సిద్ధార్ధ విషాదాంతం కార్పొరేట్ భారతాన్ని కలవరపరుస్తోంది. వేల కోట్ల టర్నోవర్‌తో పాటు కాఫీ తోటలు, భూములు, ఇతర వ్యాపారాలతో విస్తరించిన సీసీడీ సామ్రాజ్యాధినేత సిద్ధార్థ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరి మదినీ తొలిచేస్తోంది. అప్పులకు మించిన ఆస్తులున్నాయని యాజమాన్యం చెబుతుంటే డేరింగ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 మార్చి నాటికి సీసీడీ రుణభారం ఏకంగా రూ 6,547 కోట్లకు ఎగబాకిందని 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంస్థ వెల్లడించిన అన్‌ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. రుణభారం తగ్గించుకునేందుకు ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న వాటాలను రూ 3269 కోట్లకు విక్రయించి ఆ నిధులన్నింటినీ పూర్తిగా రుణాలు తీర్చేందుకు వెచ్చించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తమకు రూ 300 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా తమకు కేవలం రూ 46 కోట్లే చెల్లించారని ఆదాయ పన్ను శాఖ సీసీడీపై దాడులు చేపట్టింది. ఇక సిద్ధార్థ కుటుంబానికి సీసీడీ పేరెంట్ కంపెనీ కాఫీడే ఎంటర్ప్రైజెస్(సీడీఈ)లో 53.43శాతం వాటా ఉంది. దీనిలో 75శాతం వాటాలు తనఖా కింద ఉన్నాయి. వ్యక్తిగతంగా సిద్ధార్థకు సీడీఈలో ఉన్న 32.75 శాతం వాటాలో దాదాపు 70శాతం షేర్లు తనఖాలోనే ఉన్నాయి. అప్పులు పెరిగి.. వాటా కరిగి.. రుణభారంతో సతమతం కావడం, ముసురుతున్న సవాళ్లతో సీడీఈ మార్కెట్ షేర్ పతనం సిద్ధార్థ ధీమా సడలిపోయేందుకు సంకేతమైంది. మార్చిలో రూ.3,500 కోట్లుగా ఉన్న సీడీఈ ప్రమోటర్ల వాటా విలువ మైండ్‌ట్రీ విక్రయ ప్రక్రియ ముగిసిన తర్వాత రూ.2,600 కోట్లకు పతనమైంది. కంపెనీ షేర్లు క్రమంగా నేలచూపులు చూడటంతో తనఖాలో ఉన్న సింహభాగం షేర్ల విలువ సైతం దిగజారింది. దీంతో ఉన్న అప్పులకు తోడు తనఖాలో ఉన్న షేర్లకు భద్రతగా మరికొన్ని నిధులు, ఆస్తులను హామీగా చూపాల్సిన పరిస్థితి నెలకొంది. మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించినా అప్పులు కొలిక్కిరావడం, తనఖాలో ఉన్న షేర్ల విలువ తగ్గడంతో మరికొన్ని ఆస్తులను కుదువపెట్టాల్సిన పరిస్థతి సిద్ధార్ధపై ఒత్తిడి పెంచింది. కళ్లముందు లాభాలున్నా.. సీడీఈ ఏటా వెల్లడిస్తున్న ఆర్థిక ఫలితాల్లో నికర లాభం, మొత్తం రాబడి ఆకర్షణీయంగానే ఉన్నా పెరుగుతున్న అప్పులు, మార్కెట్లో ఎదురవుతున్న పోటీ సిద్ధార్ధను ఉక్కిరిబిక్కిరి చేసింది. కంపెనీ బోర్డు, ఉద్యోగులకు సిద్ధార్ధ రాసినట్టు చెబుతున్న లేఖలో తనను షేర్ల బైబ్యాక్‌పై ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడి చేస్తోందని ప్రస్తావించారు. సిద్ధార్ధపై ఒత్తిడి తీసుకువచ్చిన పీఈ సంస్ధ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. -
ఎస్ఎఫ్ఐవో ఫస్ట్ యాక్షన్: భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్ అరెస్ట్
న్యూఢిల్లీ: బ్యాంకులసీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) భూషణ్ స్టీల్ మాజీ ప్రమోటర్, వైస్ ఛైర్మన్ నీరాజ్ సింఘాల్‌ను ఢిల్లీలో గురువారం అరెస్ట్ చేసింది. దాదాపు 2వేల కోట్ల మోసపూరిత కార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఆయన్నుఅరెస్ట్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. అనంతరం ఆయన్నుకోర్టులో ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ఆగస్టు 14వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు చెప్పింది. దేశీయ బ్యాంకింగ్ రంగ మొండి బకాయిల్లో 25 శాతానికి పైగా చెల్లించాల్సి ఉన్న 12 కంపెనీల్లో భూషణ్ స్టీల్ లిమిటెడ్ కూడా ఒకటి . వేలకోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసిన కంపెనీలపై దివాలా కోడ్ ప్రయోగించాలని గతంలో బ్యాంకులను ఆర్బిఐ ఆదేశించింది. గత ఏడాది దివాలా చట్టం తీసుకొచ్చిన తరువాత ఎస్ఎఫ్ఐఓ అరెస్ట్ చేసిన తొలి వ్యక్తి సింఘాల్. అప్పటి మేనేజ్మెంట్ ద్వారా సేకరించిన వేలాది కోట్ల రూపాయలను సంస్థ ప్రమోటర్లు మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందనీ, అలాగే డైరెక్టర్లు, ప్రమోటర్లు విచారణకు సహకరించడంలేదని ఆరోపించింది. ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా నీరజ్ సింఘాల్ అక్రమాలతో భూషణ్ స్టీల్ లిమిటెడ్కంపెనీ దివాలాకు కారకుడయ్యాడని , 80పైగా నకిలీ కంపెనీలతో పేరుతో నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలున్న సంగతి తెలిసిందే. -
దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుపై స్పష్టత
♦ ప్రమోటర్లకు ఊరట ♦ అసలైన లావాదేవీలకు పన్ను మినహాయింపు న్యూఢిల్లీ: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలో ప్రమోటర్లకు, ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను చెల్లించకుండా జరిగే లావాదేవీలపై పన్ను విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది. కంపెనీల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఉద్యోగులకు ఇచ్చే స్టాక్ ఆప్షన్లు, మార్కెట్ వెలుపల జరిగే లావాదేవీలు... వీటికి ఆర్బీఐ, సెబీ, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం ఉంటే మూలధన లాభాల పన్ను ఉండదని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. 2004 అక్టోబర్ 1 తర్వాత కొనుగోలు చేసిన షేర్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను చెల్లించి ఉంటేనే పన్ను మినహాయింపు వర్తిస్తుందని బడ్జెట్లో పేర్కొనగా... ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు, ఎఫ్‌డీఐలకు ఇది వర్తించదని తాజా నోటిఫికేషన్లో స్పష్టతనిచ్చారు. ఐపీవోలు, లిస్టెడ్ కంపెనీ జారీచేసే బోనస్‌లు, రైట్స్ ఇష్యూలు, మెర్జర్, డీమెర్జర్ లావాదేవీలు, ఎఫ్‌డీఐ నిబంధనల కింద ఎన్ఆర్ఐలు చేసే పెట్టుబడులకూ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కల్పించారు. -
నేడు కళాకారులకు ప్రోత్సాహక సత్కారం
హన్మకొండ కల్చరల్ : ప్రఖ్యాత మైమ్ కళాకారుడు కె.కళాధర్ స్థాపించిన కళాధర్ మైమ్ అకాడమీ చారిటబుల్ ట్రస్టు అధ్వర్యాన ముగ్గురు కళాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందజేసి సన్మానించనున్నారు. హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్రాంధ్ర భాషానిల యంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గు జ్జారి రమేష్, ఆర్.సదాశివ్ తెలిపారు. ఈ సందర్భంగా నాటకరంగ దర్శకు డు జ్యోతిజయాకర్రావు, మిమిక్రీ కళాకారుడు కొండపల్లి మనోజ్‌కుమార్, రాజా క్రియేషన్స్ నిర్వాహకుడు ఆలేటి శ్యాంసుందర్‌ను సన్మానించిన రూ.10 వేల చొప్పున నగదు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కళాభిమానుల, కళాకారులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
డీఎల్‌ఎఫ్‌పై సెబీ మూడేళ్ల నిషేధం
ప్రమోటర్ కేపీ సింగ్,టాప్ ఎగ్జిక్యూటివ్‌లపై కూడా * స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు చెక్ * ఐపీవోలో తప్పుడు సమాచార ఫలితం ముంబై: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌తోపాటు, ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్ తదితర ఆరుగురు అత్యున్నత అధికారులపై నిషేధం వేటు పడింది. మూడేళ్లపాటు క్యాపిటల్ మార్కెట్లలో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టడానికి వీలులేకుండా నిషేధిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీచేసింది. పబ్లిక్ ఆఫర్ సమయంలో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా కంపెనీ అవకతవకల సమాచారాన్ని ప్రకటించడమే దీనికి కారణమని సెబీ జీవితకాల సభ్యులు రాజీవ్ అగర్వాల్ తెలిపారు. నిషేధానికి గురైన ఎగ్జిక్యూటివ్‌లలో కేపీ సింగ్ కుమారుడు రాజీవ్ సింగ్(డీఎల్ఎఫ్ వైస్‌చైర్మన్), కుమార్తె పియా సింగ్ (హోల్‌టైమ్ డెరైక్టర్) సహా టీసీ గోయల్(ఎండీ), కామేశ్వర్ స్వరూప్(అప్పటి సీఎఫ్‌వో), రమేష్ శంకా(అప్పటి ఈడీ, లీగల్) సైతం ఉన్నారు. సెబీ నిషేధంవల్ల వాటాల విక్రయం, కొనుగోలు, నిధుల సమీకరణ వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుండదు. ప్రమోటర్లకు కంపెనీలో దాదాపు 75% వాటా ఉంది. నిబంధనల ఉల్లంఘన...: వివరాల వెల్లడి, ఇన్వెస్టర్ల రక్షణ(డీఐపీ) మార్గదర్శకాలతోపాటు, మోసం, అవకతవకల కార్యకలాపాల నిరోధం(పీఎఫ్‌యూటీపీ) వంటి సెబీ నిబంధనలను డీఎల్ఎఫ్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఉల్లంఘించారని రాజీవ్ పేర్కొన్నారు. ఈ కేసులో జరిగిన నిబంధనల ఉల్లంఘన వల్ల సెక్యూరిటీల మార్కెట్ రక్షణ, విలువలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. కిమ్సుక్ కృష్ణ సిన్హా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు, సెబీకి సైతం కంపెనీపై ఫిర్యాదు చేయడంతో 2010లో సెబీ డీఎల్‌ఎఫ్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది. 2007లో పబ్లిక్ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ వద్ద డీఎల్ఎఫ్ 2007 జనవరిలో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఆపై 2007 మే నెలలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 9,187 కోట్లను సమీకరించింది. స్టాక్ ఎక్స్ఛేం జీలలో జూలై 2007లో లిస్టయ్యింది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు 3.7% పతనమై రూ. 147 వద్ద ముగిసింది. సెబీ నుంచి నోటీస్ అందుకున్నామని, ఈ అంశాన్ని న్యాయ సలహాదారులతో సమీక్షిస్తున్నామని డీఎల్ఎఫ్ బీఎస్ఈకి తెలిపింది. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది.