న్యూఢిల్లీ: దేశ అభివృద్ధితోనే తమ సంస్థల పురోగతి ముడిపడి ఉందని పారిశ్రామిక గ్రూప్ దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఎన్నడూ తగ్గించలేదని, మరింతగా ఇన్వెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. తమ 70 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఊతంతో భారత్.. ఆయిల్, గ్యాస్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి పరిశుభ్రమైన ఇంధనాలను ఎగుమతి చేసే దేశంగా మారగలదని అదానీ ధీమా వ్యక్తం చేశారు.
‘భారత్‌లో ఇన్వెస్ట్ చేయడం నుంచి మేము ఎప్పుడూ తప్పుకోలేదు. మా పెట్టుబడులు ఎన్నడూ నెమ్మదించలేదు. మా వ్యాపారాల స్థాయి, పనితీరుతో ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా నెగ్గుకురాగలమన్న ధీమా మాకు ఉంది’ అని గ్రూప్ కంపెనీల వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
చదవండి: యూజర్లకు షాక్, భారీగా పెరిగనున్న అమెజాన్ ప్రైమ్ ధరలు..ఎక్కడంటే
Comments
Please login to add a commentAdd a comment