పేటీఎం కోటీశ్వరులు.. ఒక్కరోజులో 350 మంది జీవితాల్లో మార్పు | Paytms IPO creates new millionaires in India | Sakshi
Sakshi News home page

పేటీఎం ఐపీవో.. ఒక్కరోజులో కోటీశ్వరులైన 350 మంది

Published Fri, Nov 12 2021 5:40 PM | Last Updated on Fri, Nov 12 2021 5:48 PM

Paytms IPO creates new millionaires in India - Sakshi

దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌గా ఇటీవల సంచలనం సృష్టించిన పేటీఎం ఐపీవో ఎంతమంది సామాన్యుల జీవితాలను మార్చేసింది. జీవితంలో ఎప్పుడూ చూడనంత సంపదను వారికి సొంతం చేసింది. 

వాటాలే జీతం
ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఆలిఘడ్‌కి చెందిన దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన విజయ్‌ శేఖర్‌ శర్మ 2010లో పేటీఎంని స్టార్టప్‌గా ప్రారంభించారు. పేటీఎం మొదలైన కొత్తలో సరైన నిధులు వనరులు లేకపోవడంతో తన స్నేహితులు, ఇతర టెక్నోక్రాట్లను భాగస్వాములగా చేసుకుని ఈ స్టార్టప్‌ని వృద్ధి చేశారు. ఇలా పేటీఎం ప్రారంభ దశలో జీతాలు ఇచ్చేందుకు కూడా కటకటలాడే పరిస్థితి ఉండటంతో  ఇందులో పని చేసిన అనేక మందికి కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చారు. 

బ్రేక్‌ ఇవెన్‌
పేటీఎం బ్రేక్‌ ఇవెన్‌కి వచ్చే సరికి సుమారు వెయ్యి మంది అందులో ఉద్యోగులుగా ఉన్నారు. ఇందులో 350 మంది ఆ కంపెనీలో పార్ట్‌నర్లుగానే కొనసాగారు. ఒక్కసారి పేటీఎం బ్రేక్‌ ఇవెన్‌కి రావడంతో అందులో పని చేస్తున్న ఉద్యోగులకు డిమాండ్‌ ఏర్పడింది. చాలా మంది మంచి వేతనాలకు ఇతర కంపెనీల్లో జాయిన్‌ అయ్యారు. అయితే చాలా మంది పేటీఎంలో తమ వాటాలను అట్టిపెట్టుకున్నారు.

కలిసి వచ్చిన నోట్ల రద్దు
నోట్లరద్దు తర్వాత పేటీఎం అనూహ్య రీతిలో వృద్ధి చెందింది. బ్యాంకింగ్‌, షాపింగ్‌, టిక్కెట్‌​ బుకింగ్‌, ట్రావెల్‌ ఇలా అనేక రంగాలకు విస్తరించింది. పది వేల మందికి పైగా ఉద్యోగులు కలిగిన సంస్థగా ఎదిగింది. 2017లోనే అత్యంత పిన్న వయసులో బిలియనీర్‌గా గుర్తింపు పొందారు విజయ్‌ శేఖర్‌ శర్మ.

ఒక్క రోజులో కోటీశ్వరులు
తాజాగా స్టాక్‌మార్కెట్లలో పేటీఎం లిస్టయ్యింది. సుమారు రూ. 18,300 కోట్ల నిధులు సమీకరించడం లక్ష్యంగా ఐపీవో ఇష్యూ చేసింది. రికార్డు స్థాయిలో ఈ కంపెనీ షేరు ధర రూ. 2,150గా పలికింది. దీంతో పేటీఎం ప్రారంభంలో ఉద్యోగులుగా, భాగస్వామ్యులుగా ఉన్న 350 మంది ఒక్క రోజులోనే కోటీశ్వరులు అయ్యారు. ఇందులో అతి తక్కువ వాటాలు కలిగిన వ్యక్తి ఖాతాలో 1,34,401 డాలర్లు వచ్చి చేరాయి. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడు. 

లగ్జరీగా
పేటీఎం ఐపీవో వల్ల అకస్మాత్తుగా కోటీశ్వరులగా మారిన చాలా మంది ప్రస్తుతం ఆ సంస్థలో లేరు. కొందరు ఇతర సంస్థల్లో పని చేస్తుండగా మరికొందరు రెగ్యులర్‌ వ్యాపారాల్లో తలామునకలై ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిపడిన సంపదతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ‘చాన్నాళ్లుగా నా తల్లిదండ్రులను ఏదైనా టూర్‌కి తీసుకెళ్లాలని అనుకుంటున్నా.. అది సాధ్యపడలేదు. పేటీఎంతో నా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. మా పేరెంట్స్‌ని ఉదయ్‌పూర్‌కి తీసుకెళ్తాను, లగ్జరీ హోటళ్లలోనే వాళ్లకి బస ఏర్పాటు చేస్తాను’ అంటూ పేరు చెప్పడానికి ఇష్టపడని పేటీఎం మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. 

చదవండి:చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్‌ రాదు.. ఇప్పుడు బిలియనీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement