
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం భారీగా నష్టపోతుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ మంగళవారం స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.476.65లతో ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.477.1 వద్ద నిలిచింది. గత సెషన్‌తో పోలిస్తే 11 శాతానికి పైగా పేటీఎం షేర్ పతనమైంది.
దీంతో గతేడాది నవంబర్18న స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ కేపిటల్ వ్యాల్యూని పోగొట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి రూ.30,971 కోట్లగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment