Vijay Shekhar Sharma
-
'లాభాల్లోకి వస్తాం.. ఇదే మా సంకల్పం': పేటీఎం సీఈవో
న్యూఢిల్లీ: నిర్వహణ లాభం కంటే నికర లాభంపై పేటీఎం దృష్టి సారించినట్టు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈసాప్ (ఉద్యోగులకు స్టాక్స్) వ్యయాలకు ముందు ఎబిట్డా పాజిటివ్ సాధిస్తామని పేటీఎం గతంలో ప్రకటించడం గమనార్హం. ‘‘ఈసాప్కు ముందు ఎబిట్డా కంటే నికర లాభం గురించే చెప్పాలంటూ కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు నాకు సూచించారు. ఇప్పుడు ఈసాప్ వ్యయాలకు ముందు ఎబిట్డా ఒక్కటే కాకుండా, నికర లాభాన్ని నమోదు చేయాలని అనుకుంటున్నాం. ఇదే మా కొత్త సంకల్పం’’అని శర్మ తెలిపారు.పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వార్షిక సాధారణ సమావేశంలో భాగంగా వాటాదారులకు ఈ వివరాలు వెల్లడించారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో పేటీఎం రూ.840 కోట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.358 కోట్లుగా ఉంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను ఆర్బీఐ రద్దు చేయడం తదనంతర పరిణామాలతో కంపెనీల నష్టాలు పెరిగాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికంకృత్రిమ మేథ ప్రభావాన్ని ఈ సందర్భంగా శర్మ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో ఏఐ ఎన్నో మార్పులకు కారణమవుతోందంటూ.. వచ్చే ఐదేళ్లలో ఆటోమేటెడ్ కార్లు పెరిగిపోవచ్చన్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఎదిగిన భారత్, ఏఐ టెక్నాజీలోనూ ఇదే విధంగా అవకాశాలను సొంతం చేసుకోవాలన్నారు. రిస్క్ నిర్వహణలో ఏఐ సాంకేతికతకు పేటీఎం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు శర్మ చెప్పారు. -
'నా బిడ్డ ప్రమాదానికి గురైంది.. ఐసీయూలో ఉంది': పేటీఎం ఫౌండర్
పేటీఎం సంక్షోభం గురించి జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్లో సంస్థ ఫౌండర్ అండ్ ఎండీ 'విజయ్ శేఖర్ శర్మ' కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం ప్రమాదంలో పడి ఇప్పుడు ఐసీయూలో ఉన్న నా కుమార్తె లాంటిదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.పేటీఎం నాకు బిడ్డ లాంటిది. మేము కలిసి ఎదిగాము, లాభాలను చవిచూసాము, ఫ్రీ క్యాష్ కూడా జనరేట్ చేశాము. జీవితంలో నా బిడ్డ ఉన్నతమైన స్థానానికి చేరుతుందని భావించాను, కానీ ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష కోసం వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఐసీయూలో ఉందని అన్నారు.ఈ ఏడాది ప్రారంభంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ నిబంధనలను పాటించలేదని, తద్వారా మనీ ల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29 తరువాత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. డిపాజిట్, క్రెడిట్ సౌకర్యాలు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్-పెయిడ్ ఖాతాలపై టాప్ అప్ చేయకూడదని, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ & యూపీఐ లావాదేవీలు వంటి వాటిని కూడా ఆర్బీఐ నిషేదించింది.పేటీఎంపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కంపెనీ హోల్డర్లకు కూడా నష్టాన్నే మిగిల్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే పయనిస్తున్న పేటీఎం ఇప్పుడు కూడా సంక్షోభంలోనే నడుస్తోంది. -
ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (పీజీఐఎల్) సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.దీంతో ఇకపై పీజీఐఎల్ ఇన్సూరెన్స్ నేరుగా తన కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మేందుకు వీలు లేదు. థర్డ్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. అంటే ఇతర ఇన్సూరెన్స్ పాలసీల నిర్వహణ, అమ్మకాలు చేయొచ్చు. జనరల్ ఇన్సూరెన్స్ లైసెన్సు కోసం దరఖాస్తును ఉపసంహరించుకోవడం ద్వారా మాతృ సంస్థ రూ. 950 కోట్ల నగదును ఆదా చేసుకునేందుకు వీలు అవుతుందని పేటీఎం తెలిపింది. ఆ మొత్తాన్ని పీజీఐఎల్‌లో పెట్టుబడి పెట్టేందుకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. మరో అనుబంధ సంస్థ పేటీఎం ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం వినియోగదారులకు, చిరు వ్యాపారులకు ఇతర పరిశ్రమలకు ఇన్సూరెన్స్ సేవల్ని అందించడంపై దృష్టి సారిస్తామని తెలిపింది. -
పేటీఎంకు కేంద్రం భారీ షాక్
ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (ppbl)కు భారీ షాక్ తగిలింది. కేంద్ర ఆర్ధిక శాఖ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా(FIU-IND) పీపీబీఎల్‌కు భారీ జరిమానా విధించింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల ఉల్లంఘింపు కారణమే ఈ జరిమానా అని తెలిపింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా రూ.5.49 కోట్ల జరిమానా విధించింది . కేంద్ర ఆర్ధిక శాఖ మార్చి 1న విడుదల చేసిన ఒక ప్రకటనలో.. తన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ విభాగానికి ఆన్లైన్లో లావాదేవీలు, లావాదేవీలను సులభతరం చేయడంతో సహా కొన్ని సంస్థలు చట్ట విరుద్దంగా వ్యాపార కార్యకాలాపాలు చేస్తున్నాయంటూ పలు ప్రభుత్వ ఏజెన్సీల నుండి సమాచారం వచ్చింది. దీంతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టిసారించాం. తాము చేసిన విచారణలో పీపీబీఎల్‌లోని లొసుగులు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నుండి వచ్చిన డబ్బు అంటే అసాంఘీక కార్యకాలపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పలు సంస్థలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పలు అకౌంట్లకు మళ్ళించిటన్లు తాము గుర్తించామని’, కాబట్టే చర్యలు తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అందించిన పలు ఆధారాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐయూ-ఐఎన్డీ ఈ చర్యలకు ఉపక్రమించినట్లు కేంద్ర ఆర్ధిక వెల్లడించింది. -
పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మకు భారీ ఊరట!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అయితే, ఆ ఆంక్షలు పేటీఎంపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురుగావ్‌కు కేంద్రంగా బిజినెస్ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ కంపెనీ డేటామ్ (Datum Intelligence) ఇంటెలిజెన్స్.. పీపీబీఎల్‌పై ఆర్బీఐ చర్యలు పేటీఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయాయని తెలిపింది. ఇప్పటికీ 59 శాతం మంది వ్యాపారస్తులు పేటీఎంనే వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. డేటామ్ ఇంటెలిజెన్స్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 15 వరకు 12 నగరాల్లో 2వేల మందిని సర్వే చేసింది. అందులో ఈ ఫలితాలు వచ్చినట్లు పేర్కొంది. అంతేకాదు ఈ సర్వేలో పీపీబీఎల్‌పై ఆర్బీఐ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనని తెలుసుకునేందుకు 21శాతం మంది వ్యాపారస్థులు ఎదురు చూస్తున్నారు. 13 శాతం మంది పేటీఎం నుంచి ఇతర పేమెంట్ అప్లికేషన్లను వినియోగించేందుకు సిద్ధమయ్యారు. పేటీఎంకే మా మద్దతు దీంతో పాటు 76 శాతం మంది నగదు చెల్లింపుల కోసం పేటీఎంను ఉపయోగించేందుకు మద్దతు పలుకుతుండగా 41 శాతం మంది ఫోన్‌పే, 33 శాతం మంది గూగుల్‌పే, 18 శాతం మంది భారత్ పేని ఉపయోగిస్తున్నారు. సర్వే చేసిన 58 శాతం వ్యాపారులకు పేటీఎంకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత ఫోన్‌పేకి 23 శాతం, గూగుల్ పేకి 12 శాతం, మూడు శాతం భారత్‌పే వైపు మొగ్గు చూపుతున్నారు. పేటీఎంపై నమ్మకం.. కారణం అదే ఆర్బీఐ వరుస కఠిన నిర్ణయాలతో పేటీఎం భారీగా నష్టపోతుంది. అయినప్పటికీ ఆర్బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం ప్రతినిధులు వ్యాపారస్థులతో వరుసగా భేటీ అవుతున్నారు. దీంతో వ్యాపారుల్లో పేటీఎంపై నమ్మకం కొనసాగడానికి కారణమని సర్వే నివేదిక హైలెట్ చేసింది. పరిమితంగానే ప్రభావం ఇక 71 శాతం మంది వ్యాపారులు పేటీఎం ప్రతినిధిని సంప్రదించిన తర్వాత చెల్లింపుల కోసం పేటీఎంని ఉపయోగించడం కొనసాగించాలనే నమ్మకంతో ఉన్నారు. కేవలం 11 శాతం మంది మాత్రమే పేటీఎంపై నమ్మకం సన్నగిల్లింది. మిగిలిన 14 శాతం మంది ఇప్పటికీ మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు’ అని డేటామ్ ఇంటెలిజెన్స్ సర్వే తెలిపింది. దీన్ని బట్టి ఆర్బీఐ చర్యల ప్రభావం పేటీఎంపై పరిమితంగా ఉంది. నష్టాన్ని తగ్గించడానికి పేటీఎం వ్యాపారులతో మంతనాలు జరుపుతుండగా.. వ్యాపారులు సైతం ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకునే ముందు వేచి చూసే ధోరణి కొనసాగుతుంది. -
చైర్మన్ పదవికి పేటీఎం బాస్ రాజీనామా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీరే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థ ఫౌండర్ 'విజయ్ శేఖర్ శర్మ' తన వ్యాపారాన్ని ముగించడానికి ఇచ్చిన డేట్ ఇంకా పూర్తి కాకముందే తన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి స్వస్తి పలికారు. ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా పునర్నియమించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సేఖ్రీ సిబల్ ఉన్నట్లు సమాచారం. కాగా కంపెనీ త్వరలోనే కొత్త చైర్మన్‌ను నియమించనున్నట్లు వెల్లడించింది. కొత్త బోర్డు సభ్యుల నైపుణ్యం మా పాలనా నిర్మాణాలు, కార్యాచరణ ప్రమాణాలను పెంపొందించడంలో మాత్రమే కాకుండా.. మాకు మార్గనిర్దేశం చేయడంలో కూడా ఉపయోగపడుతుంద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ సురీందర్ చావ్లా తెలిపారు. ఫిబ్రవరి 29 తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్‌టెక్ సంస్థను ఆదేశించింది, కానీ ప్రస్తుతం ఈ గడువు 2024 మార్చి 15 వరకు పొడిగించింది. ఇదీ చదవండి: ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!.. సర్వేలో వెల్లడైన విషయాలు -
వినియోగదారులకు పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మ విజ్ఞప్తి!
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఫిబ్రవరి 29 విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్‌బాక్స్, కార్డ్ మెషిన్ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్ తెలిపారు. ఆర్బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు. మార్చి 15, 2024 వరకు ఏవైనా కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు మొదలైన వాటిలో డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్లు అనుమతించబడతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అంతకు ముందు ఈ గడువు తేదీ ఫిబ్రవరి 29, 2024 ఉండగా.. తాజాగా ఆ తేదీని మార్చి 15కి పొడిగించింది. Paytm QR, Soundbox and EDC (card machine) will continue to work like always, even after March 15. The latest FAQ issued by RBI on point #21 clarifies it unambiguously. Do not fall for any rumour or let anyone deter you to championing Digital India ! https://t.co/ts5Vqmr6qh — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 16, 2024 ‘పేటీఎం క్యూఆర్ కోడ్ , సౌండ్‌బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తూనే ఉంటాయి. తాజా జారీ చేసిన ఎఫ్ఏక్యూ (Frequently Asked Questions)పాయింట్ 21లో ఆర్బీఐ ఇదే స్పష్టం చేసింది. ఎటువంటి పుకార్లకు లొంగిపోకండి. మిమ్మల్ని డిజిటల్ ఇండియా ఛాంపియన్‌గా నిలబెట్టేందు చేసే ప్రయత్నాలకు మీరు అనుమతించకండి’ అంటూ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 అవధులు లేని మీ సపోర్ట్‌కు ఈ జనవరిలో ఆర్బీఐ పేటీఎంపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం బాస్ ఎక్స్.కామ్‌లో ట్వీట్ చేశారు. అవధులులేని మీ సపోర్ట్‌కు ధన్యవాదాలు. ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం యాప్ పనిచేస్తుందని యూజర్లకు హామీ ఇచ్చారు. ప్రతి సవాలుకు, ఒక పరిష్కారం ఉంది. ఫిన్ రంగం తరుపున దేశానికి సేవ చేసేందుకు మేం కట్టుబడి ఉన్నామని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. చదవండి👉 : పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
పేటీఎంకు భారీ ఊరట..ఆంక్షలపై ఆర్బీఐ మరో కీలక ప్రకటన!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం, ఆ సంస్థ అధినేత విజయ్ శేఖర్ శర్మకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ ఊరట ఇచ్చింది. ఇటీవల ఆర్బీఐ ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్’ (PPBL) 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 16న (ఇవాళ) ఆ గడువు తేదీని మార్చి 15, 2024కి పొడిగిస్తూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. మార్చి 15 తర్వాత నిబంధనలు అమల్లోకి వస్తాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. వినియోగదారులు అధికారిక వెబ్సైట్లో అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమాధానాలిస్తుంది. పేటీఎంపై ఆంక్షలు విధించిన తరుణంలో యూజర్ల అనుమానాల్ని ఆర్బీఐ నివృత్తి చేసింది. అందులో పలువురు యూజర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌ను వినియోగించొచ్చా? ఫాస్టాగ్‌లో ఉన్న మొత్తాన్ని మీరు టోల్ చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, మార్చి 15, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్‌లకు ఇకపై ఫైనాన్సింగ్ లేదా టాప్ అప్‌లకు అర్హత పొందలేవు. ఫాస్టాగ్ ప్రొడక్ట్‌లో క్రెడిట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఫీచర్ అందుబాటులో లేదు. కాబట్టి, మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ పాత ఫాస్టాగ్‌ను మూసివేసి, రీఫండ్ కోసం బ్యాంక్‌ని అభ్యర్థించాలి. మార్చి 15, 2024 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన మీ ఫాస్టాగ్‌ను రీఛార్జ్ చేయలేరు.ఈ ఇబ్బందుల నుంచి సురక్షితంగా ఉండేందుకు నిర్ధేశించిన గడువులోపు మరొక బ్యాంక్ జారీ చేసిన కొత్త ఫాస్టాగ్ పొందాలి అని ఆర్బీఐ సూచించింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్ ఎలా? మీరు వాలెట్లో ఉన్న నగదును ఉపయోగించడం, విత్ డ్రాయిల్ లేదా, బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయడం కొనసాగించవచ్చు. మార్చి 15, 2024 తర్వాత మీ పేటీఎం పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయలేరు. డిపాజిట్ చేయలేరు. అయితే, ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ వరకు యూపీఐ/ ఐఎంపీఎస్ ద్వారా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి మీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. నేను పీపీబీఎల్ వాలెట్‌ని మూసివేసి, బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో నా బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయవచ్చా? మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని సంప్రదించాలి. లేదంటే దాని బ్యాంకింగ్ యాప్‌ని ఉపయోగించి మీ వాలెట్‌ని బ్లాక్ చేయొచ్చు. కేవైసీ వాలెట్ల విషయంలో బ్యాలెన్స్‌ని మరొక బ్యాంక్‌లో ఉపయోగించే అకౌంట్‌కు బదిలీ చేసుకోవచ్చు. -
పేటీఎం బాస్ విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురు దెబ్బ!
న్యూఢిల్లీ : పేటీఎంపై నెలకొన్న అనిశ్చితి వేళ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (pbbl)కు వ్యతిరేకంగా మనీ ల్యాండరింగ్‌పై విచారణ చేపట్టినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ అధికారుల విచారణతో పేటీఎం బాస్‌కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చిందనే చెప్పాలి. గత నెలలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇటీవల ఆర్బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఆ తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 606వ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పీపీబీఎల్ పై ప్రకటించిన చర్యలను పునఃసమీక్షించే ప్రసక్తే లేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడంతో తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు విజయ్ శేఖర్ శర్మ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. తాజాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఈడీ అధికారులు విచారణ చేపట్టడం ఫిన్‌టెక్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చదవండి👉 పేటీఎంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు! -
ఆర్బీఐ ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పేటీఎం బాస్‌కు బంపరాఫర్!
పేటీఎంపై ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బంపరాఫర్ ఇచ్చింది. ఆర్బీఐ ఒప్పుకుంటే పేటీఎంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అమితాబ్ చౌదరి ప్రకటించారు. ‘వినియోగదారులు యూపీఐ పేమెంట్ కోసం పేటీఎంను వినియోగిస్తున్నారు. తద్వారా సంస్థ స్థూల విక్రయాల విలువ (గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ ) 75 శాతంగా ఉంది. సెంట్రల్ బ్యాంక్ అనుమతిస్తే పేటీఎంతో కలుస్తాం. వారితో కలిసి పని చేస్తాం’ అని అమితామ్ చౌదరి చెప్పారు. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ యూపీఐ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు ఏ బ్యాంక్‌తో కలిసి పనిచేయడం లేదు. కానీ ఆర్బీఐ పేటీంఎపై తీసుకున్న చర్యల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ యూపీఐ పేమెంట్స్‌పై దృష్టి సారించింది. కలిసి పనిచేసేందుకు పేటీఎంతో చర్చలు జరుపుతోంది. అయితే, చర్చలు సాధారణ వ్యాపారం కోసమేనని, ఇతర కార్యకలాపాలకు సంబంధించినవి కావని ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై ఆర్బీఐ, పేటీఎం అధినేత విజయ్ శేఖర్ శర్మ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. -
పేటీఎం ఈ–కామర్స్ ఇక పాయ్ ప్లాట్‌ఫామ్స్
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ పేరు పాయ్ ప్లాట్‌ఫామ్స్‌గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్‌లో ఎలివేషన్ క్యాపిటల్‌కు మెజారిటీ వాటా ఉంది. పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు సాఫ్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్డీసీలో టాప్ –3 సెల్లర్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం అసోసియేట్ పేమెంటు బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్ మాజీ సీఎండీ ఆర్ రామచంద్రన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. -
పేటీఎంలో సంక్షోభం..‘10 నిమిషాల్లో’ తేల్చి చెప్పిన నిర్మలా సీతారామన్!
ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎంపై ఆర్బీఐ విధించిన ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ సంస్థ సీఈఓ, కోఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తన సంస్థపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయ్ కుమార్ శర్మ.. కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్బీఐ ఆంక్షలతో పేటీఎంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. విజయ్ శేఖర్ శర్మ మాట్లాడిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే సాధ్యమైనంత వరకు సమస్య మరింత జఠిలం కాకుండా ఆర్బీఐతో మీరే మాట్లాడి పరిష్కరించుకుంటే బాగుంటుందనే సలహా కూడా ఇచ్చారని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేశాయి. ఆర్బీఐ అధికారులతో భేటీ అయిన విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తరువాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని జారీ చేసిన ఆదేశాల్ని పొడిగించాలని కోరినట్లు సమాచారం. పేటీఎం అధినేత విజ్ఞప్తిపై ఆర్బీఐ ఎలా స్పందించిందనే తెలియాల్సి ఉంది. ఆర్బీఐ-పేటీఎం వివాదం నేపథ్యంలో ఇటీవలే నిర్మలా సీతారామన్ ఓ కార్యక్రమంలో స్పందించారు. పేటీఎంపై విధించిన ఆంక్షలు గురించి పేటీఎం-ఆర్బీఐలు పరిష్కరించుకోవాల్సిన అంశంమని అన్నారు. -
ఫిబ్రవరి తర్వాత కూడా యథావిధిగా పేటీఎం సేవలు
న్యూఢిల్లీ: పేటీఎం సేవలు ఈ నెల (ఫిబ్రవరి) 29 తర్వాత కూడా యథావిధిగానే కొనసాగుతాయని డిజిటల్ పేమెంట్స్, సేవల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. నిబంధనలను పూర్తిగా పాటిస్తూ దేశానికి సేవలందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో శర్మ పోస్ట్ చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు గాను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబీఎల్) ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లు, టాపప్ వంటి పలు సర్వీసులను నిలిపివేయాలంటూ ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌కి (ఓసీఎల్) పీపీబీఎల్‌లో 49% వాటాలు ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల కారణంగా పేటీఎం కార్యకలాపాలపై కూడా ప్రభావం ఉంటుందని అంచనాలు నెలకొన్న నేపథ్యంలో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, పేటీఎం సౌండ్‌బాక్స్ వంటి సరీ్వసులు అందించే ఆఫ్‌లైన్ వ్యాపారులపై ఆర్బీఐ ఆదేశాల ప్రభావం ఉండబోదని పేటీఎం తెలిపింది. తమ ప్లాట్‌ఫాంపై కొత్త వ్యాపారులను చేర్చుకునే ప్రక్రియ య«థావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. -
ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పని చేయదా..! సీఈఓ ఏమన్నారంటే?
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm)కి చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాకిచ్చింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోకుండా నిషేధించింది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్‌లను స్వీకరించకూడదని ఆదేశించింది. దీనిపైన పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ కీలక ప్రకటనలు చేశారు. మీ ఫెవరేట్ పేటీఎం యాప్ ఎప్పటిలాగే పనిచేస్తుందని, తమకు మద్దతు తెలిపిన యూజర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువమంది దీనిని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ చాంపియన్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో 40 శాతం పడిన షేర్ ధర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యల ఫలితంగా పేటీఎం తీవ్ర అంతరాయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది, దీంతో సంస్థ షేర్స్ కూడా రెండు రోజుల్లో 40 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం 487 రూపాయల దగ్గర షేర్ డ్రేట్ అవుతుంది. ఫిబ్రవరి 2వ తేదీ ఒక్క రోజే పేటీఎం షేరు 20 శాతం అంటే 121 రూపాయలు తగ్గింది. ఫిబ్రవరి 1వ తేదీ కూడా 20 శాతం పడిపోయింది. జనవరి 31వ తేదీ 761 రూపాయలుగా ఉన్న ఒక్కో షేరు ధర.. ఫిబ్రవరి 2వ తేదీన 487 రూపాయలకు చేరింది. ఎన్ఎస్ఈలో నిన్న 19.99% నష్టపోయి లోయర్ సర్క్యూట్ రూ.609కు చేరి, అక్కడే ముగిసింది. ఫలితంగా పేటీఎం మార్కెట్ విలువ రూ.9,646.31 కోట్లు ఆవిరై రూ.38,663.69 కోట్లకు పరిమితమైంది. To every Paytmer, Your favourite app is working, will keep working beyond 29 February as usual. I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full… — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024 -
డేటా లోకలైజేషన్ వివాదంపై.. పేటీఎం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు సాగించే కంపెనీలు ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వ్యాఖ్యానించారు. పౌరుల డేటాను కాపాడాల్సిన బాధ్యత వాటికి ఉంటుందని స్పష్టం చేశారు. స్టార్టప్20 శిఖర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా డేటా లోకలైజేషన్ వివాదంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ సంఖ్యలో యూజర్లున్న భారత మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు. భారతీయ పౌరుల డేటాను పొందే టెక్ కంపెనీలు.. ఇక్కడి నియమ నిబంధనలను పాటించబోమనేందుకు ఆస్కారం ఉండబోదని ఆయన తెలిపారు. భారత యూజర్ల డేటాను దేశీయంగానే భద్రపర్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర దిగ్గజాలు వాదిస్తుండగా.. విదేశీ కంపెనీలు మాత్రం ఇతర దేశాల్లో భద్రపర్చే స్వేచ్ఛ కావాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌పరమైన లోపాలపై స్పందిస్తూ.. ఇది స్టార్టప్‌లకు మాత్రమే పరిమితం కాదని ప్రతి రంగంలోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు. స్టార్టప్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంపై మాట్లాడుతూ.. వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ఆవిష్కరణలు చేసే సంస్థలకు నిధుల కొరత లేదన్నారు. -
పేటీఎం నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్‌గా రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.778 కోట్లతో పోలిస్తే దాదాపు సగం తగ్గినట్టు తెలుస్తోంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోల్చి చూసినప్పుడు 42 శాతం పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. ఈసాప్ వ్యయాలు మినహాయించి చూస్తే డిసెంబర్ త్రైమాసికంలో నిర్వహణ లాభం లక్ష్యాన్ని చేరుకున్నట్టు (ఎబిటా బ్రేక్ ఈవెన్) పేటీఎం వ్యవస్థాపకుడు, సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో దీన్ని చేరుకుంటామని చెప్పగా, అంతకు మూడు త్రైమాసికాల ముందే సాధించినట్టు ప్రకటించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ ఫలితాలు విడుదలయ్యాయి. -
నష్టాల్లో పేటీఎం..లక్ష కోట్లు హాంఫట్!
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం భారీగా నష్టపోతుంది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ మంగళవారం స్టాక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.476.65లతో ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.477.1 వద్ద నిలిచింది. గత సెషన్‌తో పోలిస్తే 11 శాతానికి పైగా పేటీఎం షేర్ పతనమైంది. దీంతో గతేడాది నవంబర్18న స్టాక్ మార్కెట్లలో లిస్టయినప్పటి నుంచి రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ కేపిటల్ వ్యాల్యూని పోగొట్టుకుంది. ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటికి రూ.30,971 కోట్లగా ఉంది. -
లాభాలను చేరుకునే మార్గంలోనే పేటీఎం
న్యూఢిల్లీ: పేటీఎం పేరుతో డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవలను అందించే వన్97 కమ్యూనికేషన్స్.. లాభాలు, సానుకూల నగదు ప్రవాహాలను నమోదు చేసేందుకు సరైన మార్గంలోనే ప్రయాణం చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఈ మేరకు వాటాదారులకు ఒక లేఖ రాశారు. తద్వారా సంస్థ భవిష్యత్తు పనితీరుపై నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. అక్టోబర్ నెలలకు సంబంధించి పనితీరు గణాంకాలను తెలియజేశారు. దేశంలో ఎంతో అధిక డిమాండ్ ఉన్న రుణ వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్టు చెప్పారు. ‘‘ఏడాది క్రితం పబ్లిక్ మార్కెట్ (ఐపీవో, లిస్టింగ్)కు వచ్చాం. పేటీఎం విషయంలో ఉన్న అంచనాలపై మాకు అవగాహన ఉంది. లాభదాయకత, మిగులు నగదు ప్రవాహాల నమోదు దిశగా కంపెనీ సరైన మార్గంలో వెళుతోంది. మరింత విస్తరించతగిన, లాభదాయక ఆర్థిక సేవల వ్యాపారం ఇప్పుడే మొదలైంది’’అని తన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ త్రైమాసికానికి పేటీఎం రూ.571 కోట్ల నష్టాలను ప్రకటించడం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రయాణంపై ఎంతో ఆసక్తి ఉందంటూ, ఎబిట్డా లాభం, ఫ్రీక్యాష్ ఫ్లో సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో రుణాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. తక్కువ మందికే రుణ సదుపాయం చేరువ కావడం, రుణ వ్యాపారంలో ఉన్న కాంపౌండింగ్ స్వభావం దృష్ట్యా, దీనిపై మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం’’అని శర్మ తెలిపారు. -
పేటీఎమ్: 2023 సెప్టెంబర్‌కల్లా లాభాల్లోకి
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ 2023 సెప్టెంబర్ త్రైమాసికానికల్లా లాభాల్లోకి ప్రవేశించగలదని కంపెనీ ఎండీ, సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. గతంలో ప్రకటించినట్లే వచ్చే సెప్టెంబర్‌కల్లా కంపెనీ నిర్వహణా లాభాలు ఆర్జించగలదని 22వ వార్షిక సమావేశం సందర్భంగా వాటాదారులకు తెలియజేశారు. పేటీఎమ్ బ్రాండుతో డిజిటల్ చెల్లింపులను నిర్వహిస్తున్న కంపెనీ షేరు ధరను ప్రభావితం చేయబోమని, అయితే కంపెనీ లాభదాయకంగా మారేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. 2018–19 వరకూ కంపెనీ విస్తరణలో ఉన్నదని, 2019–20లో మానిటైజేషన్ బాట పట్టిందని తెలియజేశారు. షేరు ధరను తాము ప్రభావితం చేయబోమని, పలు అంశాలు ఇందుకు కారణమవుతుంటాయని వివరించారు. రూ. 2,150 ధరలో ఐపీవో చేపట్టగా వారాంతాన షేరు రూ. 771 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కాగా.. ఎండీ, సీఈవోగా మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు విజయ్ శేఖర్ శర్మను వాటాదారులు ఎంపిక చేసినట్లు కంపెనీ దాఖలు చేసిన స్క్రూటినైజర్ నివేదిక వెల్లడించింది. శర్మకు అనుకూలంగా 99.67 శాతం మంది వాటాదారులు ఓటు చేసినట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల సలహాదారు సంస్థ(ఐఐఏఎస్) శర్మ పునర్నియామకానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. -
అదే నా కొంప ముంచింది: పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ!
Paytm Share Decline Reason, న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎమ్ షేరు విలువ పతనంకావడానికి మార్కెట్ల ఆటుపోట్లే కారణమని వన్97 కమ్యూనికేషన్స్ సీఈవో విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌పై ఇటీవల మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపినట్లు పేర్కొన్నారు. రానున్న ఆరు త్రైమాసికాల్లోకంపెనీ లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరుకోగలదని అంచనా వేశారు. నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే స్థాయికి చేరగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అధిక వృద్ధికి వీలున్న స్టాక్స్‌లో మార్కెట్ ఒడిదుడుకులు ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు వాటాదారులకు రాసిన లేఖలో శర్మ పేర్కొన్నారు. పేటీఎమ్ బ్రాండుతో వన్97 కమ్యూనికేషన్స్ డిజిటల్ పేమెంట్ సర్వీసులందిస్తున్న సంగతి తెలిసిందే. నేలచూపుల్లో...: గతేడాది షేరుకి రూ. 2,150 ధరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన వన్97 కమ్యూనికేషన్స్ కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతూ వస్తోంది. ఇటీవల బీఎస్ఈలో రూ. 520 వద్ద జీవితకాల కనిష్టాన్ని చవిచూసింది. తాజాగా 5 శాతం బలపడి రూ. 637 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022) ఫలితాలు ప్రకటించవలసి ఉన్నదని, ప్రస్తుతం కంపెనీ బిజినెస్ అవకాశాలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని లేఖలో శర్మ ప్రస్తావించారు. ఇది కొనసాగనున్నట్లు భావిస్తున్నామంటూనే, ఏడాదిన్నర కాలంలో నిర్వహణ ఇబిటాను సాధించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. వెరసి 2023 సెప్టెంబర్‌కల్లా ఆశించిన ఫలితాలు అందుకోగలమని అభిప్రాయపడ్డారు. తద్వారా దీర్ఘకాలంలో వాటాదారులకు విలువ చేకూర్చనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మార్కెట్ విలువ ఐపీవో స్థాయికి చేరాకమాత్రమే తనకు జారీ అయిన షేర్లు తనకు సొంతమవుతాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్!
పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ ఫిన్ టెక్ వర్గాల్లో కలకలం రేపుతుంది. విజయ్ శేఖర్ శర్మను ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా సమాచారం ప్రకారం..ఫిబ్రవరి 22న విజయ్ శేఖర్ శర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీపీ బెనిటా మేరీ జాకర్ ను ఢీకొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే డీసీపీ కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్, కానిస్టేబుల్ దీపక్ కుమార్ విజయ్ ల్యాండ్ రోవర్ నంబర్‌ను గుర్తించి, వెంటనే డీసీపీకి సమాచారం అందించినట్లు సుమన్ నల్వా తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ల్యాండ్ రోవన్ కారును గుర్గావ్లోని ఒక కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు, ఆ కారు దక్షిణ ఢిల్లీలో నివసిస్తున్న పేటీఎం సీఈఓ విజయ్ శంకర్ శర్మదేనని పోలీసులు నిర్ధారించారు. ర్యాష్ డ్రైవ్ చేశారనే కారణంగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విజయ్ శేఖర్ శర్మను అరెస్టు చేశారు. అరెస్ట్ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారని సుమన్ నల్వా ధృవీకరించారు. కాగా, మార్చి 11న పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు ఆర్బీఐ నోటీసులు జారీ చేసింది. కొత్తగా వచ్చే ఖాతాదారుల్ని ఆన్ బోర్డింగ్ చేసుకోవడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకుకు చెందిన ఐటీ వ్యవస్థను సమగ్రంగా ఆడిట్ చేయడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విజయ్ శేఖర్ శర్మను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు హాట్ టాపిగ్గా మారాయి. చదవండి: కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు -
పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను వీడని కష్టాలు..!
ఐపీఓ లిస్టింగ్ టైమ్‌లో అదరగొట్టిన కొత్త తరం టెక్ కంపెనీలు, ప్రస్తుతం చతికలపడుతున్నాయి. ఈ కంపెనీల బ్రాండ్‌ను చూసో లేదా బిజినెస్ మోడల్‌ను చూసో వెంట పడిన ఇన్వెస్టర్లు, తాజాగా ఈ షేర్లను వదిలించుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో, పేటీఎమ్ సీఈవో విజయ్ శేఖర్ శర్మను కష్టాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 18న ఐపీఓకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఐపీఓకు వచ్చిన నాటి నుంచి షేర్ ధర పడిపోతూ వస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్లలో పేటీఎమ్ జాబితా చేసినప్పటి నుంచి సీఈవో విజయ్ శేఖర్ శర్మ రోజుకు సగటున రూ.128 కోట్లు కోల్పోయారు. పేటీఎమ్ ప్రతి షేరు ఐపీఓ ప్రారంభ ధర రూ.2150. అయితే, 3 నెలల తర్వాత ప్రతి షేరు షేర్ ధర ఇప్పుడు రూ.833 విలువతో ట్రేడ్ అవుతుంది. దీని అర్థం, కంపెనీలో దాదాపు 14 శాతం వాటా కలిగి ఉన్న విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత సంపద చివరి మూడు నెలల్లో 1.59 బిలియన్ డాలర్లు క్షీణించింది. అంటే, రోజుకు లెక్కిస్తే రూ.128 కోట్ల సంపద నష్ట పోయారు. పేటీఎమ్ స్టాక్ ధర రోజు రోజుకి భారీగా పడిపోతుంది. ఐపీఓ సమయంలో పేటిఎమ్ లో శర్మ వాటా సుమారు $2.6 బిలియన్లు ఉంటే, ఇప్పుడు అది కేవలం 998 మిలియన్ డాలర్లు. అయితే, ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం శర్మ మొత్తం మీద 1.3 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నారు. అతను పేటిఎమ్ కంపెనీలో 57.67 మిలియన్ షేర్లను కలిగి ఉన్నారు. పేటీఎమ్ మార్కెట్ క్యాప్ లిస్టింగ్ రోజు నుంచి చూస్తే రూ.45,597 కోట్లు తగ్గింది. లిస్టింగ్ రోజు ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.1,01,400 కోట్లకు చేరుకోగా, ప్రస్తుతం రూ.55,802 కోట్లకు దిగొచ్చింది. (చదవండి: వచ్చేస్తున్నాడు.. డోనాల్డ్ ట్రంప్.. దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా..!) -
పేటీఎం విజయ్ శేఖర్ శర్మకు అంతర్జాతీయ గుర్తింపు
న్యూఢిల్లీ: పేటీఎం వ్యవస్థాకుడు విజయ్ శేఖర్ శర్మ అంతర్జాతీయంగా ముఖ్యమైన గ్రూపులో చోటు సంపాదించుకున్నారు. యూనివర్సల్ యాసెప్టెన్స్ స్టీరింగ్ గ్రూపు (యూఏఎస్జీ).. శర్మను యూఏ (యూనివర్సల్ యాసెప్టెన్స్) అంబాసిడర్‌గా నియమించింది. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసీఏఎన్ఎన్) మద్దతుతో ఈ గ్రూపు పనిచేస్తుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అవకాశం లేని భాషలకు సంబంధించి స్క్రిప్ట్‌లకు ప్రమాణాలను ఈ గ్రూపు సిఫారసు చేస్తుంటుంది. ‘డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకెళ్లే బహుళ భాషల ఇంటర్నెట్ కోసం మేము కృషి చేస్తున్నాం. భాషల పరంగా ఉన్న అడ్డంకిని ఛేదించాలన్నది మా ఆలోచన. ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు మాట్లాడే వారిని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నాం. విజయ్ వంటి నాయకుడు యూఏ అంబాసిడర్‌గా ఉండడం మాకు గౌరవం’ అని యూఏఎస్జీ చైర్పర్సన్ అజయ్ డాటా పేర్కొన్నారు. ‘భారత్ విభిన్న బాషలకు నిలయం. భారతీయులకు వారికి సౌకర్యమైన భాషల్లో ఉత్పత్తులు, సేవలు అందించగలగడం మాకు గర్వకారణం. అందరికీ ఇంటర్నెట్ కోసం పనిచేసే యూఏతో కలసి పనిచేసే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది’ అని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. -
మాకు బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే బెంచ్‌మార్క్: పేటీఎం సీఈవో విజయ్‌శేఖర్ శర్మ
న్యూఢిల్లీ: చెల్లింపులు, మర్చంట్ ట్రాన్స్ఫర్ లావాదేవీలకు సంబంధించి టర్నోవర్ ప్రస్తుత(మార్చి) త్రైమాసికంలో 140 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు) ఉంటుందని, వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే 50-60 శాతం వృద్ధి నమోదవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌శేఖర్ శర్మ తెలిపారు. ఇండియా డిజిటల్ సదస్సులో భాగంగా శర్మ మాట్లాడారు. తదుపరి వ్యాపార ఇంజన్‌గా రుణాల మంజూరు విభాగాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం రుణాల సంఖ్య పరంగా ప్రముఖ ఎన్బీఎఫ్సీ(బజాజ్ ఫైనాన్స్)ని పేటీఎం అధిగమించినట్టు శర్మ తెలిపారు. మార్కెట్ సైజ్‌ను అర్థం చేసుకోవడం లేదు ‘‘మాది చెల్లింపుల కంపెనీ. చెల్లింపుల ఆదాయం శరవేగంగా వృద్ధి చెందుతోంది. కానీ, పేటీఎం విజయం ఆర్థిక సేవల విక్రయంపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో చెల్లింపుల నుంచి 100 మిలియన్ డాలర్లు (రూ.750కోట్లు) వస్తుందంటున్నాం. ఒక్క త్రైమాసికంలో ఇది గణనీయమైన మొత్తమే అవుతుంది. చెల్లింపుల వ్యాపారంలో మార్జిన్ 10 శాతం ఉంటుంది. దీనికి మర్చంట్ సేవలను (వర్తకులకు అందించే సేవలపై ఆదాయం) కూడా కలిపితే 140 మిలియన్ డాలర్లకు మొత్తం ఆదాయం చేరుతుంది. మార్జిన్లు 30-40 శాతం పెరుగుతాయి. చెల్లింపుల ఆదాయాన్ని (మార్కెట్ పరిమాణాన్ని) ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు’’ అని శర్మ వివరించారు. బుధవారం పేటీఎం షేరు బీఎస్ఈలో కనిష్ట స్థాయి రూ.1,075ని నమోదు చేసి చివరికి రూ.1,083 వద్ద ముగియడం గమనార్హం. పేటీఎం షేరు ధరపై శర్మ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా పేటీఎం పోటీ కంపెనీల షేర్లు గడిచిన ఆరు నెలల్లో 38-51 శాతం స్థాయిలో నష్టపోయినట్టు చెప్పారు. దక్షిణ అమెరికా కంపెనీల ధరలు అయితే ఏకంగా 70 శాతం పడిపోయినట్టు పేర్కొన్నారు. బజాజ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ.. పేటీఎం మూడేళ్ల కాలంలోనే బజాజ్ ఫైనాన్స్ కంటే ఎక్కువ రుణాలను మంజూరు చేస్తున్నట్టు శర్మ తెలిపారు. సగటు రుణ టికెట్ సైజు రూ.4,000గా ఉన్నట్టు చెప్పారు. భాగస్వాములు సైతం ఎంతో సంతోషంగా ఉన్నారని, మరింత మంది పేటీఎంలో భాగమయ్యేందుకు క్యూ కడుతున్నట్టు శర్మ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో రుణాల మంజూరు 4 రెట్లు పెరిగినట్టు పేటీఎం సోమవారం ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ 44 లక్షల రుణాలను జారీ చేసింది. వీటి మొత్తం విలువ రూ.2,180 కోట్లు. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో మంజూరు చేసిన రుణాలు 8.81 లక్షలు, విలువ రూ.470 కోట్లుగా ఉన్నట్టు పేటీఎం తెలిపింది. (చదవండి: ఐటీ ఫ్రెషర్లకు విప్రో తీపికబురు..!) -
Cryptocurrency: క్రిప్టోకరెన్సీ ఎక్కడికీ పోదు
కోల్‌కతా: క్రిప్టో కరెన్సీ ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్ శర్మ. సురక్షిత సమాచార సాంకేతికతల ఆధారంగా క్రిప్టోలు ఏర్పాటైనట్టు చెప్పారు. ఐసీసీ వర్చువల్‌గా నిర్వహించిన ఒక సమావేశాన్ని ఉద్దేశించి శర్మ మాట్లాడారు. ‘‘క్రిప్టో పట్ల నేను ఎంతో సానుకూలంగా ఉన్నాను. ఇంటర్నెట్ మన నిత్యజీవితంలో భాగమైనట్టుగా, కొన్నేళ్లలో ఇదొక ప్రధాన టెక్నాలజీగా అవతరిస్తుంది’’అని శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతానికి క్రిప్టోలను స్పక్యులేటివ్ విధానంలో వినియోగిస్తున్నట్టు చెప్పారు. క్రిప్టోల్లేని ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, క్రిప్టోలన్నవి సార్వభౌమ కరెన్సీలకు ప్రత్యామ్నాయం కాబోవని తేల్చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకూ పేటీఎంను తీసుకెళతామని చెప్పారు. ప్రస్తుతానికి జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో జపాన్‌లో అతిపెద్ద పేమెంట్ సిస్టమ్‌ను నిర్వహిస్తున్నామని, త్వరలో సొంతంగానే దీన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భారత సంస్థలను ఇక్కడి వారికంటే విదేశీ ఇన్వెస్టర్లే చక్కగా అర్థం చేసుకుంటారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
Paytm ఢమాల్.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్
Paytm Shares Downfall Continue: ఇండియన్ మార్కెట్లో పేటీఎం అట్టర్‌ప్లాప్ షో కొనసాగుతోంది. వరుసగా మూడు రోజుల సెలవు తర్వాత సోమవారం మొదలైన మార్కెట్లో పేటీఎం షేర్ల విలువ పతనాన్నే చవిచూస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి పేటీఎం మాతృక సంస్థ వన్97 one97 కమ్యూనికేషన్ షేర్ల విలువ 14 శాతం పతనంతో రూ.1,348.30 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా ఐపీఓ ఇష్యూ ప్రైస్‌తో(రూ.2,150) పోలిస్తే 36 శాతం పతనానికి గురైంది. ఇన్వెస్టర్ల 63 వేల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ కుదేలుతో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంపద భారీగా పతనం అయ్యింది. సుమారు 1.5 బిలియన్ డాలర్లు(పదివేల కోట్ల రూపాయలకు పైగా) సంపద కరిగిపోయనట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా 2.5 బిలియన్ డాలర్లకు చేరిన శర్మ సంపద.. సోమవారం ఉదయం నాటికి 781 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక పేటీఎంలో 9.1 శాతం వాటా కలిగి ఉన్న శర్మ.. ఆరుకోట్ల ఈక్విటీ షేర్లు, 2.1 కోట్ల ఆప్షన్స్ కలిగి ఉన్నారు. భారత్‌లోనే అతి పెద్ద ఐపీవోగా పేటీఎం ఇటీవల ప్రజల ముందుకు వచ్చిన సంగతి మనకు తేలిసిందే. అయితే ఐపీవో ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్లో లక్షా ఐదువేల కోట్లతో నిలిచిన పేటీఎం.. పతనం దిశగా వెళ్తూ సోమవారం నాటికి 87 వేల కోట్లకు చేరుకుంది. ఇక ఐపీవోలో రికార్డు సృష్టించిన పేటీఎం షేర్లు తొలిరోజు(గురువారం 18 నవంబర్, 2021) లిస్టింగ్ సందర్భంగా ఢమాల్ అన్నాయి. పేటీఎం షేర్లు ఇష్యూ ప్రైస్‌గా రూ.2150గా మార్కెట్లోకి ఎంటరైంది. లిస్టింగ్ సందర్భంగా పేటీఎం ఒక్క షేర్ ధర రూ.1950గా మొదలైంది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే షేర్ల ధర వేగంగా క్షీణించింది. అరంగేట్రంలోనే స్టాక్ 27 శాతం పడిపోవడంతో రూ.38 వేల కోట్ల పేటిఎమ్ పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. VIDEO: ఒక్కసారిగా కన్నీళ్లు కార్చిన విజయ్ శేఖర్ శర్మ! -
కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు
మనం జీవితంలో మంచి స్థాయిలోకి రాలేకపోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటాం. కానీ మనలాగే రకరకాల సమస్యల మధ్య నలిగిపోతునప్పటికీ అత్యున్నత స్థాయికి చేరుకున్నావారు ఎందురో ఉన్నారు. కానీ వాళ్లను మనం ఆదర్శంగా తీసుకుని కష్టపడటానికి ఇష్టంపడం. అచ్చం అలాంటి సందేశాన్ని వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా యువతకు తెలియజేశారు. (చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం) అసలు విషయంలోకెళ్లితే....వ్యాపార దిగ్గజం ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చరిత్రలో అతిపెద్ద ఐపీఓని ప్రారంభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంలే కుటుంబ నేపథ్యం, గొప్ప ఆంగ్ల పరిజ్ఞానం లేదా డబ్బు అవసరం లేదని చెప్పడానికి అతని కథే నిదర్శనం అంటూ విజయ్ శర్మని కొనియాడరు. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో పబ్లిక్ ఇష్యూ ఇన్వెస్టర్(ఐపీవో) ప్రారంభించిన నేపథ్యంలో గోయోంకా విజయ్ శేఖర్ శర్మను ప్రసంశిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు దాదాపు ఐదేళ్ల క్రితం డీమోనిటైజేషన్ ప్రకటించినప్పుడు శ్రీ శర్మ దాదాపు ఆనందంతో డ్యాన్స్ చేశాడన్న విషయాన్ని కూడా గోయెంకా ట్విట్టర్లో వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) -
తిరుమల శ్రీవారి సేవలో పేటిఎమ్ సీఈవో
న్యూఢిల్లీ: పేటిఎమ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) విజయ్ శేఖర్ శర్మ ఈ రోజు సంస్థ భారతదేశంలోనే ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కు వెళ్లే ముందు దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్లు సమీకరించేందుకు సిద్ద పడుతుంది. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో జూలైలో ప్రారంభ ఐపీఓ కింద రూ.9,375 కోట్లు సేకరించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. పేటిఎమ్ కు చైనీస్ టైకూన్ జాక్ మా యాంట్ గ్రూప్, జపాన్ సాఫ్ట్ బ్యాంక్, వారెన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్ వే మద్దతు ఉన్నాయి. తిరుపతి ఆలయ సందర్శనలో గురించి ఈ విధంగా ట్వీట్ చేశారు. "నేను @పేటిఎమ్ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం పొందడానికి ఇక్కడకు వచ్చాను. దర్శనంలో భాగంగా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం(#TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జవహర్ రెడ్డిని కలిశాను" అని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో కలిసి శర్మ ట్వీట్ చేశారు. పేటిఎమ్ ఐపీవో సబ్ స్క్రిప్షన్ నవంబర్ 9న ప్రారంభమైంది. నవంబర్ 10న ఈ ఐపీవో ముగుస్తుంది. కంపెనీ మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద ఐపీఓ నవంబర్ 10న ముగుస్తుంది. పేటీఎం షేర్ల ధర విషయానికొస్తే.. ఒక్కో షేరుకు రూ.2,080 నుంచి రూ.2,150గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు ఆరు, దాని గుణిజాల(6, 12, 18 ఇలా)లో బిడ్(bid) చేయాల్సి ఉంటుంది. దీనర్థం ఆరు షేర్లు కలిగివుండే ఒక్కొక్క లాట్(lot)ను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు కనీసం రూ. 12,840 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. Just met Sh. Jawahar Reddy Executive Officer, Tirumala Tirupati Devasthanams (#TTD) in Tirupati as I have come here to seek blessing of God for all of @Paytm family. 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/i7RIep8sLk — Vijay Shekhar Sharma (@vijayshekhar) November 8, 2021 -
పేటీఎం విలువ రూ. 1.48 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపు సేవల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 18,300 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. షేరు ధర శ్రేణి రూ. 2,080–2,150గా ఉంటుందని తెలిపింది. దీని ప్రకారం కంపెనీ వేల్యుయేషన్ దాదాపు రూ. 1.48 లక్షల కోట్లుగా ఉండనుంది. 2010లో ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా ఐపీవో (రూ. 15,200 కోట్లు) కన్నా పేటీఎం మరింత భారీ స్థాయిలో ఉండనుండటం గమనార్హం. నవంబర్ 8న ప్రారంభమై 10న పబ్లిక్ ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోకు ముందస్తు నిర్వహించిన కార్యక్రమంలో వన్97 కమ్యూనికేషన్స్ ఎండీ విజయ్ శేఖర్ శర్మ ఈ విషయాలు తెలిపారు. ‘పేటీఎం నిర్ణయించిన షేరు ధర శ్రేణిని చూస్తే కంపెనీ విలువ సుమారు 19.3–19.9 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ప్రస్తుత మారకం రేటు బట్టి ఇది రూ. 1.44 లక్షల కోట్లు–1.48 లక్షల కోట్లుగా ఉండవచ్చు‘ అని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్ ఎండీ సుదర్శన్ రామకృష్ణ తెలిపారు. ఇది భారత దశాబ్దం..: 2010–20 దశాబ్దం.. ఆసియాలోని చైనా, జపాన్ తదితర దేశాలకు చెందినదైతే.. 2020–30 దశాబ్దం మాత్రం పూర్తిగా భారత్‌దేనని శర్మ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత యుగం. మీది ప్రైవేట్ కంపెనీ కావచ్చు, కొత్త స్టార్టప్ కావచ్చు, లిస్టెడ్ కంపెనీ లేదా లిస్టయ్యే అవకాశాలు ఉన్న సంస్థ కావచ్చు. ప్రస్తుత తరుణంలో ప్రపంచం మీకు నిధులు అందిస్తుంది‘ అని ఆయన పేర్కొన్నారు. తాము ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించినప్పటి నుంచి దేశ, విదేశ బ్లూ చిప్ ఇన్వెస్టర్లు .. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని పేటీఎం ప్రెసిడెంట్ మధుర్ దేవరా తెలిపారు. ఐపీవోలో భాగంగా శర్మ రూ. 402.65 కోట్ల విలువ చేసే షేర్లు, కంపెనీలో ఇన్వెస్టరయిన యాంట్‌ఫిన్ హోల్డింగ్స్ రూ. 4,704 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నాయి. -
ఐపీవోకు పేటీఎమ్,రూ.16,600 కోట్లు సమీకరణే లక్ష్యంగా
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది.ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 16,600 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం రూ. 8,300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా జారీ చేయనుంది. మరో రూ. 8,300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు చైనీస్ గ్రూప్ అలీబాబా, తదితర సంస్థలు వాటాలను ఆఫర్ చేయనున్నాయి. నిధుల వినియోగం..: అలీబాబా కనీసం 5 శాతం వాటాను విక్రయించనుండగా.. సయిఫ్ 3 మారిషస్, సయిఫ్ పార్ట్నర్స్, బీహెచ్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఐపీవో నిధులలో రూ. 4,300 కోట్లను బిజినెస్ పటిష్టత, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేటీఎమ్ పేర్కొంది. గతేడాది(2020–21) రూ. 3187 కోట్ల ఆదాయం సాధించింది. 2019–20లో రూ. 3,541 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే తగ్గింది. అయితే ఇదే కాలంలో నష్టాలు రూ. 2,943 కోట్ల నుంచి రూ. 1,704 కోట్లకు తగ్గినట్లు ప్రాస్పెక్టస్‌లో తెలిపింది. చదవండి: నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు -
కోవిడ్ వ్యాక్సిన్: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయం డిజిటల్ చెల్లింపుల దిగ్గజ సంస్థ పేటీఎం తన యూజర్లకు తీపి కబురు అందించింది. దేశంలో కోవిడ్-19 వాక్సిన్ లభ్యత వివరాలను అందించేలా తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. తద్వారా కరోనా వ్యాక్స్‌న్ స్లాట్స్, లభ్యత వివరాలు వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే సంబధిత స్లాట్స్ అందుబాటులోకి వచ్చినపుడు తన వినియోగ దారులను అలర్ట్ చేస్తుంది కూడా. తమ యూజర్లు కరోనా వ్యాక్సిన్ స్లాట్ వివరాలను తెలుసుకునేందుకు ‘పేటీఎం వ్యాక్సిన్ స్లాట్ ఫైండర్’ అనే ఫీచర్‌ను కొత్తగా తీసుకొచ్చామని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. దీని ద్వారా వినియోగదారులు టీకా స్లాట్ బుక్ చేసుకోవడంతోపాటు తమ ప్రాంతంలో టీకా స్లాట్లు అందుబాటులో ఉన్నప్పుడు అలర్ట్స్ కూడా పొందవచ్చని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లభించే వ్యాక్సిన్ స్లాట్లను కంపెనీ రియల్ టైం ట్రాక్ చేస్తోందని, సుమారు 780 జిల్లాలలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా దేశంలో కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ 3 లక్షలకు పైగా కొత్త కేసులతో బెంబేలెత్తిస్తున్న కరోనా, గురువారం మరోసారి నాలుగు లక్షల మార్క్‌ను అధిగమించింది. దీంతో మాస్క్ ధరించడం, శానిటైజేషన్, భౌతిక దూరం లాంటి నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడంతో పాటు అర్హులైన వారంతా కరోనా నివారణకు వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు We are launching a new tool for users to find COVID Vaccine slots and set for alerts when new slots open up for their locality. @Paytm checks for availability real-time and alerts users via Paytm Chat when a new slot opens up.https://t.co/WvJa7CRxxO Pls spread awareness. — Vijay Shekhar Sharma (@vijayshekhar) May 6, 2021 -
వ్యాపారుల కోసం పేటీఎం ఆల్–ఇన్–వన్ క్యూఆర్
ముంబై: డిజిటల్ పేమెంట్స్ సేవల సంస్థ పేటీఎం దేశవ్యాప్తంగా వ్యాపారుల కోసం ఆల్–ఇన్–వన్ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. పేటీఎం వ్యాలెట్, రూపే కార్డులు, అన్ని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా జరిగే చెల్లింపులు నేరుగా వ్యాపారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. దీనికి ఎటువంటి ఫీజు ఉండదని పేర్కొన్నారు. దీనితో పాటు కస్టమర్ల లావాదేవీల వివరాలను పొందుపర్చే డిజిటల్ లెడ్జర్ ‘బిజినెస్ ఖాతా’ సర్వీసును కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. -
పేటీఎం మెసేజ్‌లు, సీఈవో హెచ్చరిక
సాక్షి, ముంబై: ప్రముఖ ఇ-వాలెట్ సంస్థపేటీఎం నకిలీ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా తన వినియోగదారులను హెచ్చరించింది. ఈ మేరకు పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. కెవైసీ వివరాలు అందించకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని, సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమంటూ వినియోగదారులకు మెసేజ్‌లు రావడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై స్పందించిన విజయ్ శేఖర్ కేవైసీ స్కాంపై కస్టమర్లను అలర్ట్ చేశారు. మీ పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ వివరాలకోసం ఏదైనా మెసేజ్ వచ్చిందా..అయితే అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆయన హెచ్చరించారు. పేటీఎం అలాంటి వివరాలను వినియోగదారులను కోరడం లేదని, అలాగే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని తాము సూచించమని వినియోగదారులకు స్పష్టం చేశారు. అలాంటి సందేశాలను, కాల్స్‌ను నమ్మవద్దని కోరారు. అలాగే భారీ బహుమతి, లక్కీ చాన్స్ అంటూ వచ్చే మెసేజ్‌ల మాయలో పడొద్దని కూడా ఆయన సూచించారు. మీ వివరాలను హ్యాక్ చేయడానికి మెసగాళ్లు చేసే పని ఇదని వారి వలలో పడకండి అంటూ ఆయన హెచ్చరించారు. ఇదో కుంభకోణమని పేర్కొన్న ఆయన దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మరోవైపు చాలామంది వినియోగదారులు తమకూ ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయని ట్విటర్లో షేర్ చేయడం గమనార్హం. pic.twitter.com/FgSAQFwLJv — Vijay Shekhar (@vijayshekhar) November 20, 2019 These or some SMS with some lucky draw are examples of fraudsters attempting to get your details. Don’t fall for them. pic.twitter.com/vyLUn5Z7Z7 — Vijay Shekhar (@vijayshekhar) November 19, 2019 -
4 కోట్లు కావాలని అడిగింది..
సాక్షి, న్యూఢిల్లీ: పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మను డబ్బుల కోసం బెదిరించిన కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేటీఎం వైస్ ప్రెసిడెంట్ సోనియా ధావన్‌తో పాటు ముగ్గురిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. రెండు నెలల క్రితమే కుట్రకు తెర లేపారని పోలీసులు తెలిపారు. ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో సోనియా ఈ బెదిరింపుల డ్రామాకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. పేటీఎం కార్పొరేట్ కమ్యూనికేషన్స్/పీఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సోనియా.. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ప్రాపర్టీ డీలర్ అయిన సోనియా భర్త రూపక్ జైన్, పేటీఎం అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగి దేవేంద్ర కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ శేఖర్, ఆయన సోదరుడు అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన రోహిత్ కోమల్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సొంత కంపెనీ ఏర్పాటుకు ప్లాన్ ‘ఇల్లు కొనుక్కోవడానికి రూ. 4 కోట్లు ఇవ్వాలని రెండు నెలల క్రితం తన యజమానిని సోనియా ధావన్ కోరింది. ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆయనను బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నించార’ని గౌతమ్‌బుద్ధ నగర్ ఎస్ఎస్పీ అజయ్‌పాల్ శర్మ తెలిపారు. ‘పేటీఎం కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉన్న సోనియాకు సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలు తెలుసు. దేవేంద్ర కుమార్ సహాయంతో ఏడాది క్రితం కీలక సమాచారాన్ని సంపాదించింది. ఈ సమాచారంతో సొంతంగా కంపెనీ పెట్టాలని కూడా ఆమె భావించినట్టు’ సెక్టార్ 20 ఎస్హెచ్ఓ మనోజ్ పంత్ చెప్పారు. మాకేమి తెలీదు విజయ్ శేఖర్‌ను బెదిరించిన వ్యవహారంతో తమకేమి సంబంధం లేదని సోనియా, ఆమె భర్త పేర్కొన్నారు. దేవేంద్ర మాత్రం తన ప్రమేయాన్ని ఒప్పుకున్నాడు. ‘కంపెనీకి సంబంధించిన డేటాను వారికి కాపీ చేసి ఇచ్చాను. అది ఎటువంటి సమాచారమే నాకు తెలియదు. నన్ను ఈ వివాదంలో ఇరికించిన వారిలో ఆమె(సోనియా) ఒకరు’ అని కోర్టు ప్రాంగణంలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో దేవెంద్ర చెప్పాడు. ముగ్గురు నిందితులకు గౌతమ్‌బుద్ధ నగర్‌లోని జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పదిశాతం ఇస్తామని చెప్పి... కోల్‌కతాకు చెందిన నాలుగో నిందితుడు రోహిత్.. దేవేంద్ర స్నేహితుడని పోలీసులు తెలిపారు. విజయ్ శేఖర్‌ను ఫోన్లో బెదిరించి రూ. 10 కోట్లు వసూలు చేస్తే అందులో 10 శాతం వాటా ఇస్తామని ఆశ చూపినట్టు వెల్లడించారు. అతడికి ఫోన్ నంబర్లు కూడా దేవేంద్ర సమకూర్చాడని, రోహిత్‌ను కలుసుకునేందుకు గత నెలలో పలుమార్లు కోల్‌కతాకు వెళ్లినట్టు చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఏముంది? విజయ్ శేఖర్ సోదరుడు అజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం 11.52 నిమిషాలకు పోలీసులు కేసు నమోదు చేశారు. పది కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే పేటీఎం సంబంధించిన రహస్య సమాచారం బయట పెడతామని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘అజయ్‌కు సెప్టెంబర్ 20న రోహిత్ ఫోన్ చేశాడు. తర్వాత విజయ్‌కు వాట్సప్ కాల్ చేసి రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడ’ని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే సోనియాను కుట్రపూరితంగా ఇరికించారని ఆమె తరపు న్యాయవాది ప్రశాంత్ త్రిపాఠి పేర్కొన్నారు. -
‘20 కోట్లు ఇవ్వకుంటే.. రహస్యాలన్నీ బయటపెడతా’
సొంత కంపెనీలో డాటా బ్రీచ్‌కు పాల్పడింది పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ వ్యక్తిగత కార్యదర్శి సోనియా ధావన్. అంతేకాకుండా 20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే ఆ సమాచారన్నంతా బహిర్గతం చేస్తానంటూ ఆయనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ విషయమై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నోయిడాలో కంపెనీ కార్యాలయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేటీఎం నోయిడా విభాగం ధ్రువీకరించింది. విచారణ పూర్తయ్యేంత వరకు పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొంది. బాస్ ఫోన్, లాప్టాప్ల నుంచి.. పేటీఎం స్థాపించిన నాటి నుంచి సోనియా ఆ సంస్థలోనే పనిచేస్తోంది. విజయ్ శేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆయన లాప్టాప్, మొబైల్, ఆఫీస్ కంప్యూటర్లను వినియోగించేది. ఈ క్రమంలోనే కంపెనీతో పాటు విజయ్ వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆమె దొంగిలించినట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన డేటా మొత్తాన్ని రోహిత్ కోమల్ అనే వ్యక్తికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అతడు విజయ్ సోదరుడు, పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మకు ఫోన్ చేశాడు. ‘20 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే డేటాను బహిర్గతం చేసి ప్రజల్లో పేటీఎంకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తామంటూ’ బెదిరింపులకు గురిచేశాడు. దీంతో ఈ విషయాన్ని అజయ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. కాగా సోనియా సహా ఆమెకు సహకరించిన వ్యక్తులపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. -
చౌకబారు ప్రచారం, పేటీఎం ఫౌండర్‌పై మండిపాటు
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మపై సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా ఆయన అందించిన సహకారం సోషల్ మీడియా యూజర్లలో మండిపాటుకు గురిచేసింది. సాయుధ దళాల వారోత్సవం సందర్భంగా తన వంతు సహకారంగా రూ.501ను అందిస్తున్నట్టు పేర్కొన్న విజయ్ శేఖర్ శర్మ, దాన్ని తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో షేర్ చేశారు. బిలియన్ డాలర్ కంపెనీకి అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ, కేవలం రూ.501నే సాయుధ దళాలకు అందించడంపై సోషల్ మీడియా యూజర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేవలం రూ.501ను అందించడమే కాకుండా.. తానేదో పెద్ద మొత్తంలో నగదు అందించిన మాదిరిగా ట్విట్టర్లో షేర్ చేయడాన్ని యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా చౌక బారు ప్రచారమని, ఈ రోజుల్లో సాధారణ గ్రామీణ ప్రజానీకమే సరస్వతి పూజకు రూ.500 విరాళంగా ఇస్తున్నారని, అలాంటిది ఒక పెద్ద టైకూన్ అయి ఉండి కేవలం రూ.501 అందించడంపై ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి సహకారం వస్తుందని అంచనా వేయడం లేదని పేర్కొంటున్నారు. కోట్లలో సంపద ఆర్జిస్తూ... కేవలం రూ.500నే విరాళంగా అందించడం చాలా చెత్తగా ఉందన్నారు. ఇది రక్షణ దళాలను కించపరచడమేనని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పేటీఎం భారీ ఎత్తున్న సంపదను ఆర్జించింది. 1.47 బిలియన్ డాలర్లకు అధిపతి అయిన విజయ్ శేఖర్ శర్మ సాయుధ దళాలకు కేవలం రూ.501నే అందించడంపై సోషల్ మీడియా ప్రశ్నలు కురిపించడం తప్పేమీ కాదంటున్నారు కొందరు. ఈ వారమంతా సాయుధ దళాల వారోత్సవంగా ఆర్మీ సెలబ్రేట్ చేస్తోంది. సాయుధ దళాల విలువను విశ్వవ్యాప్తం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ క్యాంపెయిన్‌ను లాంచ్చేసింది. Just sent ₹501 to Armed Forces Flag Day Fund. #🇮🇳 @DefenceMinIndia pic.twitter.com/B5KD7wcdb9 — Vijay Shekhar (@vijayshekhar) December 1, 2017 What a cheap publicity stunt. These days common rural citizens give this much money for Saraswati Pooja. Our tycoons are so miser. CSR must have a burden for you. Didn't expect this from you! https://t.co/FEEXnJRYIl — Mayank Shandilya (@ShandiMayank) December 2, 2017 This is somewhere an insult to the defence forces sir. You are owner of PayTM and 501 amount is just an Insult. Please put this tweet down. This will backfire sir. — Gaurav Pandey (@PandeyTweets) December 2, 2017 -
పేటీఎం బాస్ ఖరీదైన ఇల్లు.. ధరెంతో తెలుసా?
బెంగళూరు : నోట్ల రద్దు అనంతరం పేటీఎంకు పెరిగిన ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సంపద కూడా అంతే మొత్తంలో దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆయన దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ లో ఒకటైన న్యూఢిల్లీ గల్ఫ్ లింక్స్ లో ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారు. దీని విలువ దాదాపు రూ.82 కోట్లు. లుటియెన్స్ జోన్ లో కనీసం 6000 చదరపు అడుగుల ప్రాపర్టీపై ఎంఓయూ కుదుర్చుకున్నారని, ఇప్పటికే ఆయన కొంతమొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ లావాదేవీ రిజిస్ట్రర్ కాలేదు. ఫ్లిప్ కార్ట్ అనంతరం రెండో అత్యంత విలువైన ఎంటర్ ప్రైజ్ గా పేటీఎంకు పేరుంది. దీనికి వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మకు కూడా మార్కెట్లో మంచి పేరును సంపాదించారు. ఫోర్బ్స్ జాబితాలో అతిపిన్న భారత బిలీనియర్ గా శర్మ చోటుదక్కించుకున్నారు. ఈయన నికర సంపద 1.3 బిలియన్ డాలర్లు. గతేడాది శర్మ సంపద 162 శాతం పెరిగింది. ఇటీవల కాలంలో ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ, సచిన్ బన్సాల్ లు కూడా మల్టి-మిలియన్ డాలర్ రెసిడెన్షియల్ ఇన్వెస్ట్ మెంట్లు చేపట్టారు. శర్మ ఈ ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం అతిపెద్ద విషయమే కాక, లుటియెన్స్ జోన్ లో అడుగుపెట్టిన ఇంటర్నెట్ బిలియనర్ గా కూడా విజయ్ శేఖర్ శర్మ మార్క్ కొట్టేయనున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్పాయి. 1000 బంగ్లాలతో 3000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 70 ఎకరాలను మాత్రమే ప్రైవేట్ గా వాడతారు. -
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 23 నుంచి
-
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 23 నుంచి
న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంకు సేవల లైసెన్స్ పొందిన పేటీఎం తన కార్యకలాపాలను ఈ నెల 23 నుంచి ప్రారంభించనుంది. ఆర్బీఐ నుంచి తుది లైసెన్స్ లభించిందని, ఈ నెల 23 నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని పేటీఎం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. పేటీఎం వ్యాలెట్‌కు ప్రస్తుతం 21.8 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ వ్యాలెట్లన్నీ ఈ నెల 23 తర్వాత పేమెంట్స్ బ్యాంకుకు బదిలీ అవుతాయి. ఇది ఇష్టం లేని వారు ఆ విషయాన్ని 23వ తేదీలోపే తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు యూజర్ వ్యాలెట్‌లో ఉన్న నగదును వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ సంబంధిత వ్యాలెట్ గత ఆరు నెలలుగా ఏ విధమైన లావాదేవీలు లేకుంటే, కస్టమర్ ఆమోదం తర్వాతే వ్యాలెట్‌ను పేమెంట్స్ బ్యాంకుకు బదిలీ చేస్తారు. పేటీఏం పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు విజయ్ శేఖర్శర్మ(పేటీఎం మాతృసంస్థ వన్97 వ్యవస్థాపకుడు)కు ఆర్బీఐ 2015లో సూత్రపాత్ర ఆమోదం తెలియజేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మెజారిటీ వాటా విజయ్‌శేఖర్ శర్మ చేతిలో ఉండగా, మిగిలింది చైనా సంస్థ అలీబాబా గ్రూపునకు ఉంది. కాగా, పేటీఎం కొత్త సీఈవోగా రేణుసత్తిని నియమించినట్టు పేటీఎం తెలిపింది. త్వరలో ఆదిత్య బిర్లా...: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీఐ చిన్న ఫైనాన్స్ బ్యాంకు, పేమెంట్స్ బ్యాంకుల పేరుతో కొత్త అవకాశాలకు వీలు కల్పించింది. మొత్తం 21 సంస్థలకు ఆర్బీఐ గతేడాది సూత్రప్రాయ ఆమోదం తెలియజేయగా... వాటిలో 11 పేమెంట్స్ బ్యాంకులకు చెందినవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ మాత్రమే పేమెంట్స్ బ్యాంకులను ఆరంభించగా, త్వరలో ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్ బ్యాంకు రంగ ప్రవేశం చేయనుంది. -
‘టైమ్’ జాబితాలో మోదీ
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకూ స్థానం అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత్ నుంచి వీరిద్దరికే చోటు న్యూయార్క్: టైమ్ మేగజీన్ ఏటా ప్రచురించే ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాత్రమే చోటు సంపాదించారు. ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను టైమ్ మేగజీన్ గురువారం విడుదల చేసింది. ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి. ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త కుష్నెర్‌లకు ఇందులో చోటు లభించడం విశేషం. జాబితాలో ఇంకా పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజెస్, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే, వివాదాస్పద ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగొ డ్యుటెర్టె పేర్లు కూడా ఉన్నాయి. కాగా, టైమ్ మేగజీన్ నిర్వహించిన ఆన్లైన్ రీడర్స్ పోల్‌లో మోదీకి ఓట్లేవీ పడకపోయినా.. ‘టైమ్’ ఎడిటర్లు ఎంపిక చేసిన వందమంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఆయన చోటు పొందడం విశేషం. మోదీ ప్రభ మసకబారలేదు ఈ ‘టైమ్’ సంచికలో మోదీ ప్రొఫైల్‌ను రచయిత పంకజ్ మిశ్రా రాశారు. అందులో ‘గుజరాత్లో గోధ్రా అనంతరం చెలరేగిన ముస్లిం వ్యతిరేక హింసాకాండ నేపథ్యంలో ఆయనకు అమెరికా వీసా నిరాకరించింది. స్వదేశంలో ఆయన రాజకీయ అస్పృశ్యతను ఎదుర్కొన్నారు. సంప్రదాయ మీడియాను తోసిరాజని.. ప్రపంచీకరణ కారణంగా దెబ్బతిన్నామని భావిస్తున్న అణగారిన వర్గాల ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అవినీతిపరులు, స్వార్థపరుల్ని ఏరివేసి భారత్‌ను మరోసారి సమున్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు’ అని వివరించారు. మోదీ ప్రభ మసకబారలేదని, అస్తిత్వ భయాలు, సాంస్కృతిక అభద్రతలతో కొట్టుమిట్టాడే ప్రజలను రాజకీయంగా చేరదీసే కళలో ఆయన ఆరితేరిపోయారని మిశ్రా అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దుతో..: పేటీఎం వ్యవస్థాపకుడు శేఖర్ శర్మ(43) గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వివరిస్తూ.. నోట్లరద్దుతో నెలకొన్న పరిస్థితులను శర్మ తనకు అనుకూలంగా మలుచుకోగలిగారన్నారు. నోట్ల రద్దు అనంతర పరిస్థితుల్లో శర్మకు చెందిన డిజిటల్ చెల్లింపుల స్టార్టప్.. ‘పేటీఎం’ ఊపందుకుందని తెలిపారు. -
పేటీఎంకు లాభాలు మోదీకి విమర్శలా...
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల నేడు అత్యధికంగా లాభ పడుతోంది ‘పేటీఎం’ అనే చెల్లింపుల సంస్థ. పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటన చేసిన నవంబర్ 8 నాటికి దేశంలో దాదాపు 12 కోట్ల మంది యూజర్లను కలిగి ఉన్నప్పటికీ పేటీఎమ్ నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత కారణంగా నవంబర్ 10 నుంచి డిసెంబర్ 20 తేదీ మధ్య కంపెనీకి కొత్త వినియోగదారులు రెండు కోట్ల మంది పెరిగారు. ఆ తర్వాత పెరిగిన యూజర్ల లెక్కలు అందుబాటులో లేవుగానీ మొత్తంగా నేటికి యూజర్ల సంఖ్య 20 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని 120 నగరాలకు విస్తరించింది. 8.5 లక్షల దుకాణాలు, పెట్రోలు బంకులకు అనుసంధానమైంది. దేశంలోని 2.45 కోట్ల వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులు, 66.18 కోట్ల డెబిట్ కార్డులు ఒక్క రోజుకు నిర్వహిస్తున్న ఆర్థిక లావాదీవీలను ఇప్పుడు రోజుకు ఒక్క పేటీఎం కంపెనీయే నిర్వహిస్తోంది. అంటే బిజినెస్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. చుట్టుముడుతున్న వివాదాలు ఈ పేటీఎం కంపెనీ ఆవిర్భావం నుంచి వివాదాలున్నాయి. ‘స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా’ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజ్ఞాన కేంద్రంలో జనవరి 26వ తేదీన దేశంలో స్టార్టప్ కంపెనీల విధానాన్ని ప్రకంటించారు. ఇదే వేదికపై పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే భారత్‌ను సంపూర్ణ క్యాష్‌లెస్ సమాజంగా మార్చేస్తానని ప్రకటించారు. అంటే డిసెంబర్ 31లో మార్చేస్తానని చెప్పారు. జూలై 18 తేదీన కంపెనీ లోగో ప్రకటించారు. పేటీఎం గురించి ప్రచారం చేశారు. పెద్దగా కంపెనీ ఆర్థిక లావాదేవీలు ఊపందుకోలేదు. మోదీ ఫొటోతో విస్తృత ప్రచారం ఈలోగా నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రకటన చేశారు. ఆ మరుసటి రోజే పేటీఎం కంపెనీ కోట్లాది రూపాయలను వచ్చెంచి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. అనుమతి లేకుండా మోదీ ఫొటోను ప్రచురించడం పట్ల విమర్శులు తలెత్తాయి. మోదీ సొంత కంపెనీయా, మోదీ ఫొటోను ఉపయోగించారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆ తర్వాత వారం రోజులకు విడుదల చేసిన టీవీ యాడ్ ‘డ్రామా బంద్ కరో పేటిఎం కరో’ వివాదాస్పదమైంది. ఆ యాడ్‌లో పని మనిషి జీతం ఇవ్వాల్సిందిగా యజమానురాలిని అడుగుతోంది. ఇంట్లో డబ్బులు లేవే, బ్యాంకుకు వెళ్లాలి అని యజమానురాలు సమాధనం ఇవ్వడంతో పనిమనిషి ‘డ్రామా బంద్ కరో తనఖా పేటీఎం కరో’ అని చెప్పడం ఆ యాడ్‌లో ఉంటుంది. ఏటీఎం, బ్యాంకుల ముందు బారులు తీరి జనం ఉన్న నేపథ్యంలో ఈ యాడ్ రావడం, దానిపై విమర్శలు రేగడంతో పేటీఎం కంపెనీ యాడ్‌ను సవరించింది. పేటీఎంలో 40 శాతం వాటా చైనా కంపెనీదే భారత్ పట్ల శత్రు వైఖరి అవలంబిస్తూ పాకిస్తాన్ పట్ల మిత్రవైఖరి అవలంబిస్తున్న చైనాకు చెందిన ‘అలీబాబా’ కంపెనీకి పేటిఎంలో 40 శాతం వాటా వున్న విషయం తెల్సిందే. అలాంటి కంపెకీకి మోదీ సహకరిస్తున్నారంటూ సోషల్ మీడియాలు విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై శివసేన కూడా ఘూటుగా స్పందించింది. పేటీఎం కారణంగా మోదీపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. పేటీఎం కోసమే మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేశారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మోదీ ఇంకెంతమాత్రం చాయ్‌వాలా కాదు, ‘పేటీఎం వాలా’ అంటూ డిసెంబర్ 19వ తేదీన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఇప్పుడు లోగోపై వివాదం పెద్ద నోట్ల రద్దుతో దేశంలో పేటీఎం లావాదేవీలు ఒక్కసారిగా పెరగడంతో డిసెంబర్ 20, 21 తేదీల్లో పేటీఎం సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఆ రెండు రోజులు దాదాపు లావాదేవీలు నిలిచిపోయాయి. కొంత మంది వినియోగదారుల కంపెనీని ఆరు లక్షల రూపాయల వరకు మోసం చేశారని, ఈ విషయంలో తన కంపెనీ సిబ్బంది వినియోగదారులతో లాలూచి పడ్డారని కూడా కంపెనీ ఆరోపించింది. ఇప్పుడు తన కంపెనీ లోగోను పేటీఎం కాపీ కొట్టిందని ఆరోపిస్తూ కాలిఫోర్నియాకు చెందిన ‘పేపాల్’ అనే చెల్లింపుల సంస్థ కేసు పెట్టింది. ఇండియా ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కంపెనీ తన లోగోను అవిష్కరించిన తర్వాత నాలుగు నెలల వరకు అభ్యంతరాల కోసం నిరీక్షించాలి. పేటీఎం తన కంపెనీ లోగోను జూలై 18న ఆవిష్కరించిన తర్వాత సరిగ్గా గడువు ముగిసే రోజున పేపాల్ కంపెనీ ఇండియా ట్రేడ్‌మార్క్ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. చదవండి: (అసలు పెద్ద నోట్ల రద్దు ఎవరి కోసం?) -
పేటీఎంలో1% వాటా 325 కోట్లు
• వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ విక్రయం • ఈ నిధులు పేమెంట్ బ్యాంకుపై పెట్టుబడి • పేటీఎం పేమెంట్ బ్యాంకులో శర్మకు 51 శాతం వాటా న్యూఢిల్లీ: డిజిటల్ వ్యాలెట్ సేవలు, ఈ కామర్స్ సంస్థ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స)లో ఒక్క శాతం వాటాను ఆ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఏకంగా రూ.325 కోట్లకు విక్రరుుంచారు. దీంతో రూ.32,500 కోట్ల మార్కెట్ విలువ(అంచనా)తో పేటీఎం భారీ కంపెనీల సరసన నిలవనుంది. పేటీఎం మాతృ సంస్థ.. వన్97 కమ్యూనికేషన్‌సలో శర్మకు ఈ ఏడాది మార్చి నాటికి 21% వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 20%కి పరిమితం కానుంది. తాజా పరిణామంపై పేటీఎం అధికార ప్రతినిధి స్పం దిస్తూ.. పేటీఎం పేమెంట్ బ్యాంకు కార్యకలాపాల కోసమే వాటా విక్రయం జరిగినట్టు స్పష్టం చేశారు. కంపెనీలో ప్రస్తుత వాటాదారులే కొనుగోలు చేశారని తెలిపారు. అంతకు మించి వివరాలను మాత్రం వెల్లడించలేదు. పేటీఎం పేమెంట్ బ్యాంకులో విజయ్ శేఖర్ శర్మకు 51 శాతం, మిగిలిన వాటా వన్97 కమ్యూనికేషన్స చేతిలో ఉంది. పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు గతేడాది శర్మకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్బీఐ నుంచి తుది అనుమతి వచ్చిన వెంటనే పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించే సన్నాహాల్లో ఈ సంస్థ ఉంది. పేటీఎం వ్యాలెట్ వ్యాపారాన్ని ఇటీవలే పేమెంట్ బ్యాంకుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. వన్97 కమ్యూనికేషన్‌సలో 40 శాతం వాటాలు చైనాకు చెందిన అలీబాబా గ్రూపు, దాని అనుబంధ సంస్థ ఏఎంటీ ఫైనాన్షియల్ చేతిలో ఉన్నారుు. వీటితోపాటు సెరుుఫ్ పార్ట్నర్స్, ఇంటెల్ క్యాపిటల్, శాప్ వెంచర్స్ కూడా వాటాలు కలిగి ఉన్నారుు. బాధ్యతలన్నీ ఆయనవే... ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ విజయ్ శేఖర్ శర్మ స్వస్థలం. అక్కడే పదో తరగతి వరకు హిందీ మాతృభాషగా చదువు పూర్తి చేసిన ఆయన ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. 2005లో వన్97 కమ్యూనికేషన్సను స్థాపించారు. వార్తలు, క్రికెట్ స్కోర్, రింగ్టోన్లు, జోక్స్, పరీక్షా ఫలితాల వెల్లడి వంటి సేవలను ప్రారంభంలో ఈ సంస్థ అందించింది. పేమెంట్ సేవల కోసం 2010లో పేటీఎంను ప్రారంభించడం కీలక మలుపు. పేటీఎం చైర్మన్‌గా, ఎండీగా, సీఈవోగా అన్ని బాధ్యతలను చేపట్టి... కంపెనీ వ్యాపార వ్యూహాలు, విస్తరణ, అమలు వంటి కీలక వ్యవహారాల్ని నిర్వహిస్తున్నారు. కాలేజీ రోజుల్లోనే ఎక్స్ఎస్ కార్ప్ అనే వెంచర్‌ను ప్రారంభించిన ఆయన 1999లో దాన్ని న్యూజెర్సీకి చెందిన లోటస్ ఇంటర్వర్క్స్కు విక్రరుుంచారు. తనతోపాటు పేటీఎంను ఈ స్థారుుకి తీసుకెళ్లడానికి కృషి చేసిన బృందానికి 4 శాతం వాటాను కానుకగా ఇచ్చి తనలోని నాయకత్వ గుణాన్ని చాటుకున్నారు. -
ఈ ఏడాది 200 కోట్ల లావాదేవీలు: పేటీఎం
అమెరికా మార్కెట్‌పై కూడా దృష్టి బెంగళూరు: అంచనాలు మించి ప్రస్తుత సంవత్సరం 200 కోట్ల పైగా లావాదేవీలు నమోదు చేయనున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. గతంలో రోజుకు 25-30 లక్షల లావాదేవీలు జరిగేవని, డీమోనిటైజేషన్ పరిణామాల అనంతరం ప్రస్తుతం 50-60 లక్షల పైగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కూడా తోడైతే ప్రతి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ యాప్‌గా సేవలు అందించే స్థారుుకి ఎదగాలని నిర్దేశించుకున్నట్లు శర్మ విలేకరుల సమావేశంలో వివరించారు. టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాల రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని శర్మ సూచించారు. దీర్ఘకాలంలో అమెరికా మార్కెట్లో కూడాకి విస్తరించాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. మరోవైపు, పేమెంట్ బ్యాంక్ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోందని, మార్చ్ 2017లోగా దీన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.