రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలతో సతమతమవుతున్న డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంస్థ ఫౌండర్ 'విజయ్ శేఖర్ శర్మ' తన వ్యాపారాన్ని ముగించడానికి ఇచ్చిన డేట్ ఇంకా పూర్తి కాకముందే తన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి స్వస్తి పలికారు.
ఇప్పటికే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను కూడా పునర్నియమించింది. ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేబేంద్రనాథ్ సారంగి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ గార్గ్, మాజీ ఐఏఎస్ అధికారి రజనీ సేఖ్రీ సిబల్ ఉన్నట్లు సమాచారం. కాగా కంపెనీ త్వరలోనే కొత్త చైర్మన్‌ను నియమించనున్నట్లు వెల్లడించింది.
కొత్త బోర్డు సభ్యుల నైపుణ్యం మా పాలనా నిర్మాణాలు, కార్యాచరణ ప్రమాణాలను పెంపొందించడంలో మాత్రమే కాకుండా.. మాకు మార్గనిర్దేశం చేయడంలో కూడా ఉపయోగపడుతుంద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ సురీందర్ చావ్లా తెలిపారు.
ఫిబ్రవరి 29 తర్వాత బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్‌టెక్ సంస్థను ఆదేశించింది, కానీ ప్రస్తుతం ఈ గడువు 2024 మార్చి 15 వరకు పొడిగించింది.
ఇదీ చదవండి: ఫుడ్ కోసం తగ్గిన ఖర్చు.. అంతా వాటికోసమే!.. సర్వేలో వెల్లడైన విషయాలు
Comments
Please login to add a commentAdd a comment