పేటీఎం సంక్షోభం గురించి జేఐఐఎఫ్ ఫౌండేషన్ డే ఈవెంట్‌లో సంస్థ ఫౌండర్ అండ్ ఎండీ 'విజయ్ శేఖర్ శర్మ' కీలక వ్యాఖ్యలు చేశారు. పేటీఎం ప్రమాదంలో పడి ఇప్పుడు ఐసీయూలో ఉన్న నా కుమార్తె లాంటిదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
పేటీఎం నాకు బిడ్డ లాంటిది. మేము కలిసి ఎదిగాము, లాభాలను చవిచూసాము, ఫ్రీ క్యాష్ కూడా జనరేట్ చేశాము. జీవితంలో నా బిడ్డ ఉన్నతమైన స్థానానికి చేరుతుందని భావించాను, కానీ ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష కోసం వెళుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఐసీయూలో ఉందని అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కేవైసీ నిబంధనలను పాటించలేదని, తద్వారా మనీ ల్యాండరింగ్ జరిగే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావించింది. దీంతో 2024 ఫిబ్రవరి 29 తరువాత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. డిపాజిట్, క్రెడిట్ సౌకర్యాలు, ప్రీపెయిడ్ అండ్ పోస్ట్-పెయిడ్ ఖాతాలపై టాప్ అప్ చేయకూడదని, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ & యూపీఐ లావాదేవీలు వంటి వాటిని కూడా ఆర్‌బీఐ నిషేదించింది.
పేటీఎంపై ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది కంపెనీ హోల్డర్లకు కూడా నష్టాన్నే మిగిల్చింది. ఐపీఓలోనే ఈ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఆ తరువాత క్రమంగా నష్టాల్లోనే పయనిస్తున్న పేటీఎం ఇప్పుడు కూడా సంక్షోభంలోనే నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment