న్యూఢిల్లీ: పేటిఎమ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) విజయ్ శేఖర్ శర్మ ఈ రోజు సంస్థ భారతదేశంలోనే ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కు వెళ్లే ముందు దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్లు సమీకరించేందుకు సిద్ద పడుతుంది. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో జూలైలో ప్రారంభ ఐపీఓ కింద రూ.9,375 కోట్లు సేకరించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. పేటిఎమ్ కు చైనీస్ టైకూన్ జాక్ మా యాంట్ గ్రూప్, జపాన్ సాఫ్ట్ బ్యాంక్, వారెన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్ వే మద్దతు ఉన్నాయి.
తిరుపతి ఆలయ సందర్శనలో గురించి ఈ విధంగా ట్వీట్ చేశారు. "నేను @పేటిఎమ్ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం పొందడానికి ఇక్కడకు వచ్చాను. దర్శనంలో భాగంగా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం(#TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జవహర్ రెడ్డిని కలిశాను" అని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో కలిసి శర్మ ట్వీట్ చేశారు.
పేటిఎమ్ ఐపీవో సబ్ స్క్రిప్షన్ నవంబర్ 9న ప్రారంభమైంది. నవంబర్ 10న ఈ ఐపీవో ముగుస్తుంది. కంపెనీ మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద ఐపీఓ నవంబర్ 10న ముగుస్తుంది. పేటీఎం షేర్ల ధర విషయానికొస్తే.. ఒక్కో షేరుకు రూ.2,080 నుంచి రూ.2,150గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు ఆరు, దాని గుణిజాల(6, 12, 18 ఇలా)లో బిడ్(bid) చేయాల్సి ఉంటుంది. దీనర్థం ఆరు షేర్లు కలిగివుండే ఒక్కొక్క లాట్(lot)ను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు కనీసం రూ. 12,840 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
Just met Sh. Jawahar Reddy Executive Officer, Tirumala Tirupati Devasthanams (#TTD) in Tirupati as I have come here to seek blessing of God for all of @Paytm family. 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/i7RIep8sLk
— Vijay Shekhar Sharma (@vijayshekhar) November 8, 2021
Comments
Please login to add a commentAdd a comment