Tirumal Tirupati Devastanam
-
‘జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం’
సాక్షి, తిరుమల: తిరుమనలో జనవరి 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాటాట్లాడుతూ.. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని చెప్పారు. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమల: 2023 డిసెంబర్ నెలలో లక్షలాది మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం, లడ్డులా విక్రయాలు, తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు.. దర్శనం: శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య.. 19.16 లక్షలు. హుండీ : హుండీ కానుకలు.. రూ.116.73 కోట్లు. లడ్డూలు : విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య .. ఒక కోటి 46 వేలు. అన్నప్రసాదం : అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య .. 40.77 లక్షలు. కల్యాణకట్ట : తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.. 6.87 లక్షలు. చదవండి: రామాయపట్నం 'రెడీ' -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం
సాక్షి, తిరుమల: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంటటేశర్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. आज सवेरे आंध्र प्रदेश के तिरुमाला पर्वत स्थित उत्कृष्ट शिल्प कौशल के अद्भुत उदाहरण एवं भक्ति, विश्वास और श्रद्धा के प्रतीक भगवान श्री तिरुपति बालाजी मंदिर में सपरिवार पूजा-अर्चना व दिव्य दर्शन कर सकारात्मक ऊर्जा एवं आशीर्वाद प्राप्त किया तथा गर्भगृह में विराजमान भगवान वेंकटेश्वर… pic.twitter.com/dtJhGlxe4s — Tejashwi Yadav (@yadavtejashwi) December 9, 2023 ఈ సందర్భంగా.. ‘అద్భుతమైన శిల్పకళ, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుపతి బాలాజీ ఆలయంలో నా కుటుంబంతో కలిసి పూజలు చేసి, దైవ దర్శనం చేసుకోన్నాం. వెంకటేశ్వర స్వామి నుంచి సానుకూల శక్తిని, ఆశీర్వాదాలను పొందాను’ అని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. ఈ రోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. సప్తగిరులు భక్తసిరులతో నిండిపోతున్నాయి. తిరుమాడ వీధులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక సరాగాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుద్దీప కాంతులు మంత్రముగ్దులను చేస్తున్నాయి. విరబూసిన అందాలు భక్తులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దేవదేవుని దివ్య స్పర్శతో పునీతమవుతున్నాయి. పుష్పక విమానం తిరుమల: తిరుమలలో శుక్రవారం బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడింది. మలయప్ప మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హనుమంత వాహన సేవలో టీడీపీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి నేటి వాహన సేవలు ►ఉదయం సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ కనువిందు చేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. ►రాత్రి చంద్రప్రభ వాహనం:రాత్రి తెల్లటి వ్రస్తాలు, పుష్ప మాలలు ధరించి చల్లని వాతావరణంలో తిరువీధుల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు. (చదవండి: తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?) -
తిరుమలలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
-
తిరుమల: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. రంగనాయకుల మండపంలో సీఎంకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం నూతన పరకామణి భవనం ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత నూతన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభించారు. రూ.22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పరకామణి భవనం నిర్మించారు. భక్తుల మధ్య శ్రీవారి కానుకలు లెక్కించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువ్రస్తాలను సమర్పించటం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన తిరునామం పెట్టుకుని.. పంచెకట్టు, కండువాతో శ్రీవారికి పట్టు వ్రస్తాలను తీసుకొచ్చారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ ఇలా శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించడం ఇది నాలుగవసారి. అంతకుముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం.. అక్కడ అర్చకులు ఆలయ సంప్రదాయం మేరకు సీఎం తలకు పరివట్టం చుట్టారు. చదవండి: శ్రీవారి సేవలో సీఎం పట్టువస్త్రాలను తలపై పెట్టుకున్న ముఖ్యమంత్రి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, ఆశ్వ, గజరాజులు వెంటరాగా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. బలిపీటానికి, ధ్వజస్తంభానికి మొక్కుకుని వెండివాకిలి మీదుగా బంగారువాకిలి చేరుకుని గరుడాళ్వార్‌ను దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సన్నిధిలో అర్చకులకు పట్టువస్త్రాలను అందజేసి స్వామిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారి సేవలో సీఎం జగన్ (ఫొటోలు)
-
శ్రీవారి వాహన సేవలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్
Live Updates: ► పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న సీఎం జగన్. రాత్రికి అక్కడే బస. ► పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు. కాగా, శ్రీవారి వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ► 2023 టీటీడీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్. ► శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ►సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి. ► శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్. సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి. ►శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్. పట్టు వస్త్రంతో సీఎం జగన్ తలకు పరివట్టం కట్టిన అర్చకులు. ► ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జగన్ ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో శ్రీవారి భక్తులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ► సీఎం వైఎస్ జగన్.. గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, సీఎం జగన్‌కు అర్చకులు వేదాశీర్వచనం అందించారు. 18:10 ► గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► సీఎం జగన్‌కు మంత్రి పెద్దిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పలువురు ఘన స్వాగతం పలికారు. 17:48 PM ► శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ► సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం కొనసాగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 17:10 PM ► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 15:02 PM ► తిరుమల పర్యటనకు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్ సాక్షి, తాడేపల్లి: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజులపాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక, పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకోనున్నారు. అనంతరం, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోన్నారు. పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు. -
CM Jagan Tirumala Tour: సీఎం జగన్ పర్యటన పూర్తి వివరాలిలా..
సాక్షి, తిరుపతి: జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల వైఎస్సార్ చేయూత మూడో విడత కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని విపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా ప్రారంభించి అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రెండు రోజులపాటు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలనున్నారు. మంగళవారం తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని చరిత్ర సృష్టించనున్నారు. రాజుల కాలం నుంచి వస్తున్న ఆచారవ్యవహారాల మేరకు ముందుగా గంగమ్మను దర్శించి తిరుమల కొండకు బయలుదేరి వెళ్లే పురాతన సంప్రదాయానికి నాందిపలకనున్నారు. అదేరోజు రాత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని పునీతులుకానున్నారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొని తరించనున్నారు. ఆ రోజు రాత్రికి కొండపైనే బసచేసి, మరుసటిరోజు బుధవారం ఉదయం మళ్లీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇదిలావుండగా ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ సహకారంతో పేరూరుబండపై పునఃనిర్మించిన శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేస్తుండటంతో ఆధ్యాత్మికత కొత్త పుంతలు తొక్కుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ►27వ తేదీ మంగళవారం సాయంత్రం 3.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి 3.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►3.45గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 4.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేస్తారు. ►సాయంత్రం 5.20 గంటలకు తిరుపతిలోని గంగమ్మ ఆలయానికి చేరుకొని పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ►6 నుంచి 6.15గంటల వరకు అలిపిరి టోల్గేట్ వద్ద విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. ►6.40కు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. ►7.45 నుంచి7.55 వరకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ►8.05 గంటలకు ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. ►8.05 నుంచి 8.20 గంటల వరకు పట్టువస్త్ర సమర్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. ►8.20 నుంచి 8.30 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుంటారు. ►8.30 నుంచి 8.40 గంటల వరకు వకుళమాత దర్శనం, ప్రదక్షిణం, వెండివాకిలి రంగనాయక మండపం కార్యక్రమంలో పాల్గొంటారు. ►8.40 నుంచి 8.50 వరకు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం పొందుతారు. ►8.55 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలో వస్త్ర మండలం పెద్దశేష వాహనం కార్యక్రమంలో పాల్గొంటారు. ►9.10కి వాహన మండపం నుంచి పద్మావతి గెస్ట్‌హౌస్‌కు బయలుదేరుతారు. ►9.15 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 28వ తేదీ ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ►ఉదయం 6 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి శ్రీవారి ఆలయానికి బయలుదేరుతారు. ►6.05 నుంచి 6.30 వరకు శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో పాల్గొంటారు. ►6.45 నుంచి 7.05 వరకు పరకామని భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ►రాత్రి 7.05కు పరకామని నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. ►7.10కి తిరిగి పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ►7.10 నుంచి 7.30 గంటలకు లక్ష్మి వీపీఆర్ అతిథిగృహాన్ని ప్రారంభిస్తారు. ►7.35కు పద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు. ►8.35కి పద్మావతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరుతారు. ►9.55కి రేణిగుంట నుంచి గన్నవరానికి బయలుదేరి వెళ్లనున్నారు. -
టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేశామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని, కోవిడ్ కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. టీటీడీకి సంబంధించిన 960 స్థిర ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, ఆస్తుల విలువ రూ 85 వేల 705 కోట్లు ఉంటుందని ఆయన ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్న ఆయన, తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయం పెంపుపై నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసీ-5 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామన్నారు. తిరుమలలోని గదుల్లో గీజర్లు ఏర్పాటుకు రూ.7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయించుకున్నామని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి 6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేసామని,టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేసాంమని, భవిష్యత్తు అవసరాల కోసం రూ.25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. టైం స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరణ చేసి పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వ దర్శనం టోకన్లు జారీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యథావిధిగా కొనసాగుతుందన్నారు. విఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని బోర్డు కీలక నిర్ణయం తీసుకుందని, ఉదయం 10 గంటల తరువాత విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పూర్తి స్ధాయిలో బ్రేక్ దర్శనాలపై ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తామని తెలిపారు. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలని యోచనలో ఉన్నామని, బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగత్మక పరిశీలన అనంతరం గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించాలని నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. -
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి
తిరుమల: వడ్డికాసుల వాడికి భక్తులు సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు. టీటీడీ అధికారికంగా మంగళవారం హుండీ కానుకల లెక్కను ప్రకటించనుంది. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల కొండపై సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 37,447 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.9 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్మెంట్లు నిండాయి. చదవండి: (అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం) -
తిరుమల శ్రీవారి సేవలో పేటిఎమ్ సీఈవో
న్యూఢిల్లీ: పేటిఎమ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) విజయ్ శేఖర్ శర్మ ఈ రోజు సంస్థ భారతదేశంలోనే ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కు వెళ్లే ముందు దేవుని ఆశీర్వాదం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఐపీవో ద్వారా వన్97 కమ్యూనికేషన్స్ రూ.18,300 కోట్లు సమీకరించేందుకు సిద్ద పడుతుంది. ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో జూలైలో ప్రారంభ ఐపీఓ కింద రూ.9,375 కోట్లు సేకరించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం. పేటిఎమ్ కు చైనీస్ టైకూన్ జాక్ మా యాంట్ గ్రూప్, జపాన్ సాఫ్ట్ బ్యాంక్, వారెన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్ వే మద్దతు ఉన్నాయి. తిరుపతి ఆలయ సందర్శనలో గురించి ఈ విధంగా ట్వీట్ చేశారు. "నేను @పేటిఎమ్ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం పొందడానికి ఇక్కడకు వచ్చాను. దర్శనంలో భాగంగా తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం(#TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ జవహర్ రెడ్డిని కలిశాను" అని ఆలయ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో కలిసి శర్మ ట్వీట్ చేశారు. పేటిఎమ్ ఐపీవో సబ్ స్క్రిప్షన్ నవంబర్ 9న ప్రారంభమైంది. నవంబర్ 10న ఈ ఐపీవో ముగుస్తుంది. కంపెనీ మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద ఐపీఓ నవంబర్ 10న ముగుస్తుంది. పేటీఎం షేర్ల ధర విషయానికొస్తే.. ఒక్కో షేరుకు రూ.2,080 నుంచి రూ.2,150గా నిర్ణయించారు. పెట్టుబడిదారులు ఆరు, దాని గుణిజాల(6, 12, 18 ఇలా)లో బిడ్(bid) చేయాల్సి ఉంటుంది. దీనర్థం ఆరు షేర్లు కలిగివుండే ఒక్కొక్క లాట్(lot)ను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు కనీసం రూ. 12,840 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. Just met Sh. Jawahar Reddy Executive Officer, Tirumala Tirupati Devasthanams (#TTD) in Tirupati as I have come here to seek blessing of God for all of @Paytm family. 🙏🏼🙏🏼🙏🏼 pic.twitter.com/i7RIep8sLk — Vijay Shekhar Sharma (@vijayshekhar) November 8, 2021 -
శ్రీవారి భక్తులకు మరో శుభవార్త
దశాబ్ద కాలంగా నిలిచిపోయిన ‘కల్యాణమస్తు’కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ మహోన్నత కార్యక్రమానికి సుముహూర్తం ఖరారు చేసింది. సాక్షి,తిరుపతి: ప్రతిష్టాత్మకమైన కల్యాణమస్తు కార్యక్రమానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. అందులో భాగంగా పవిత్ర లగ్నపత్రికను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలను ఇప్పటికే పూర్తి చేసింది. అలాగే కల్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20వేల తాళిబొట్లను వినియోగించుకోనుంది. 2007లో శ్రీకారం శ్రీవారి సమక్షంలో పేద హిందువులు వివాహం చేసుకునేలా 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ కల్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కల్యాణమస్తు ఘనంగా నిర్వహించేవారు. కలియుగ ప్రత్యక్షదైవం ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములయ్యేవి. ఈ సందర్భంగా వధూవరులకు టీటీడీ తరఫున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టును అందించడమే కాకుండా 50మంది బంధువులకు భోజనాలను వితరణ చేసేవారు. 2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతలుగా కల్యాణమస్తును నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కల్యాణమస్తును పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ముహూర్తం ఖరారు కల్యాణమస్తును వైభవోపేతంగా నిర్వహించేందుకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. మే 28, అక్టోబర్ 30, నవంబర్ 17వ తేదీల్లో కళ్యాణమస్తు నిర్వహిస్తామని ఈఓ జవహర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఎక్కడ కార్యక్రమాలను జరిపించాలో పాలకమండలి సమావేశంలో నిర్ణయిస్తామని వెల్లడించారు. (చదవండి: తిరుమల దర్శన నిర్వహణ ప్రశంసనీయం: వెంకయ్య) -
శ్రీవారి ఆలయంలో ఆధునిక టెక్నాలజీతో ‘బూందీ పోటు’
తిరుమల: తిరుమలలోని లడ్డూ ప్రసాదాల బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. థర్మోఫ్లూయిడ్ స్టవ్‌ల ఏర్పాటు ద్వారా నిప్పు లేకుండానే నెయ్యిని కరిగించి లడ్డూలు తయారు చేస్తోంది. మామూలు రోజుల్లో తిరుమలలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూలను శ్రీవారి పోటులో తయారు చేస్తారు. 2007లో బూందీ పోటును ఆలయం వెలుపలకు తరలించారు. అక్కడ బూందీ తయారు చేసి, అనంతరం దానిని ఆలయంలోకి తీసుకెళ్లి లడ్డూలు తయారు చేస్తున్నారు. అదే సమయంలో పోటులోని నెయ్యి స్టవ్‌లను వేడిచేసేప్పుడు ఆవిరి కారణంగా చిమ్నీలో ఏర్పడిన తేటకు మంటలంటుకుని తరచూ అగ్ని ప్రమాదాలు జరిగేవి. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టాక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పోటును ఏర్పాటు చేశారు. చెన్నైలోని అడయార్ ఆనందభవన్ ఏర్పాటు చేసిన థర్మోఫ్లూయిడ్ స్టవ్‌లను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రయోగాత్మకంగా రెండు స్టవ్‌లను ఏర్పాటు చేసి, పరిశీలించి ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు, ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ రూ.15 కోట్లు ఇచ్చారు. ఎలా పనిచేస్తాయంటే.. తిరుమల పోటులో మొదటి దశలో 40 థర్మో స్టవ్‌లను ఏర్పాటుచేశారు. నెయ్యి తెట్టు, ఆవిర్లు అంటుకోకుండా ఎత్తయిన అత్యాధునిక భవనంలో చిమ్నీలను ఏర్పాటు చేసి.. గోడలకు స్టీల్ పలకలను అమర్చారు. వీటివల్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే వీలు కలిగింది. దశల వారీగా 20 స్టవ్‌ల చొప్పున పెంచుకుంటూ వెళతారు. ఎక్కడా అగ్గితో పనిలేకుండా ఈ స్టవ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక బిల్డింగ్‌లో థర్మోఫ్లూయిడ్ ట్యాంకును నిర్మించి అందులో ప్లూయిడ్‌ను నింపుతారు. దానిని బాయిలర్ ద్వారా వేడి చేస్తారు. అలా వేడెక్కిన ప్లూయిడ్‌ను ఉష్ట వాహక విధానంలో పైపుల ద్వారా స్టవ్‌లకు పంపుతారు. వాటిల్లో నింపిన నెయ్యిని పైపు నుంచి వచి్చన ఫ్లూయిడ్ వేడి చేస్తుంది. పైపుల్లో ఈ వేడి ఫ్లూయిడ్ నిరంతరం వచ్చి వెళుతుండటంతో నెయ్యి పూర్తి స్థాయిలో కరిగిపోతుంది. దీంతో బూందీని తయారు చేస్తారు. ఈ ఆధునిక బూందీ పోటును త్వరలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదాల నివారణ పోటులో అగ్ని ప్రమాదాలు నివారించేలా ఆధునిక టెక్నాలజీతో థర్మోఫ్లూయిడ్ స్టవ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్లూయిడ్ టెక్నాలజీ వినియోగంతో పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమవుతోంది. – ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో -
భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 22 గంటల సమయం పడుతుందని సమాచారం. కాలిబాట దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు 93,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక స్వామివారి హుండీ రూ. 2.71 కోట్లు తెలుస్తోంది. జూన్ 7వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
బంద్ నేపథ్యంలో టీటీడీ ఉచిత బస్సులు: జిల్లా కలెక్టర్
రాష్ట్ర విభజన కు నిరసనగా 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్ నిబంధనలను సడలించారు. తిరుమల చేరుకునే విధంగా బైపాస్ మార్గం గుండా భక్తులను అనుమతించనున్నారు. రేపటి నుంచి 48 గంటల పాటు తిరుపతి బంద్ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ నిబంధనల సడలించాం. బైపాస్ మార్గం గుండా తిరుమలకు వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. తిరుమల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఉండదు. భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ఉచిత బస్సులు నడుపుతుంది. జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజు వెల్లఢించారు.