తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం | Andhra Pradesh: Lalu Prasad Yadav, Family Visit Tirupati Balaji Temple - Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం

Dec 9 2023 5:02 PM | Updated on Dec 9 2023 6:38 PM

Lalu Prasad Yadav Family Offer Prayers To Lord Tirumala Balaji - Sakshi

సాక్షి, తిరుమల: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంటటేశర్వర స్వామిని దర్శించుకు​న్నారు. ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు బీహార్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా.. ‘అద్భుతమైన శిల్పకళ, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుపతి బాలాజీ ఆలయంలో నా కుటుంబంతో కలిసి పూజలు చేసి, దైవ దర్శనం చేసుకోన్నాం. వెంకటేశ్వర స్వామి నుంచి సానుకూల శక్తిని, ఆశీర్వాదాలను పొందాను’ అని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ‘ఎక్స్‌’ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజల సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. ఈ రోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement