(ఫైల్ ఫొటో)
సాక్షి, తిరుమల: తిరుమనలో జనవరి 25న రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాటాట్లాడుతూ.. ధర్మ ప్రచారంలో భాగంగా మఠాధిపతులు, పిఠాధిపతులు సదస్సు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
60 నుంచి 70 మంది స్వామీజిలను సదస్సుకు ఆహ్వానిస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అన్నప్రసాదంలో వినియోగించే బియ్యాన్ని మిల్లర్లు ద్వారా కోనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి15న తిరుపతిలో గోదాదేవి కల్యాణం నిర్వహిస్తాని చెప్పారు. 16న తిరుమలలో పార్వేటీ ఉత్సవం నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.
తిరుమల: 2023 డిసెంబర్ నెలలో లక్షలాది మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనం, లడ్డులా విక్రయాలు, తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు..
దర్శనం:
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య.. 19.16 లక్షలు.
హుండీ :
హుండీ కానుకలు.. రూ.116.73 కోట్లు.
లడ్డూలు :
విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య .. ఒక కోటి 46 వేలు.
అన్నప్రసాదం :
అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య .. 40.77 లక్షలు.
కల్యాణకట్ట :
తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.. 6.87 లక్షలు.
చదవండి: రామాయపట్నం 'రెడీ'
Comments
Please login to add a commentAdd a comment